
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు మండలాలకు అనుకు ని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, శిరడా, గురిసింగి గూడ, నేరడి గూడ పరిసరాల్లో 1,120 లీటర్ల నాటు సారా, 10,600 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు.
మలేరియాపై అవగాహన ర్యాలీ
అరసవల్లి: మలేరియాను జయించండి.. జీవితం నిలపండి అని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియాను సరైన జాగ్రత్తలు పాటించి నివారించుకోవచ్చునని, గత ఐదేళ్లలో మలేరియా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే ప్రతి ఇంట్లో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రథమ కర్తవ్యంగా మారుచకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్యశాఖ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
అరసవల్లి ఇన్‌చార్జి ఈఓగా శోభారాణి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇన్‌చార్జి ఈఓగా కె.శో భారాణిని నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈఓగా పనిచేస్తూ.. అరసవల్లి ఇన్‌చార్జి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈఓ వై.భద్రాజీ మెడికల్ లీవులో వెళ్లినందున జిల్లా దేవదాయ శాఖ అధికారి(ఏసీ) తో పాటు అరసవల్లి ఈఓ బాధ్యతలు కూడా శోభారాణి చూడనున్నారు.

సారా స్థావరాలపై దాడులు