ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్‌ బాబు | Mahesh Babu seeks time for ED investigation | Sakshi
Sakshi News home page

ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్‌ బాబు

Published Mon, Apr 28 2025 5:09 AM | Last Updated on Mon, Apr 28 2025 5:54 AM

Mahesh Babu seeks time for ED investigation

ఈడీ విచారణకు సమయం కోరిన మహేష్‌ బాబు

సాక్షి, హైదరాబాద్‌: సాయిసూర్య డెవలపర్స్‌పై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే­ందుకు కొంత సమయం ఇవ్వాలని నటుడు మహేశ్‌ బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను కోరారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌లకు హాజ­రు­కావాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ నెల 22న ఈడీ ఇచ్చిన సమన్ల ప్రకారం సోమవారం బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావా­ల్సి ఉంది. 

కాగా, సాయి సూర్య డెవలపర్స్‌ వెంచర్స్‌ ప్రాజెక్టు ప్రమోషన్‌ కోసం మహే­­శ్‌­­బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నట్టు అధికా­రులు ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత లోతుగా విచారించేందుకు మహేశ్‌బాబుకు సమన్లు జారీ చేశారు. సురానా గ్రూప్‌ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదా­లు చేసిన విషయం తెలి­సిందే. ఈ సోదాల్లో మహేశ్‌బాబు­కు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement