ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్‌ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ | telangana congress candlelight protest against Pahalgam Terrorist Attack in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్‌ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ

Published Fri, Apr 25 2025 7:04 AM | Last Updated on Fri, Apr 25 2025 7:04 AM

telangana congress candlelight protest against Pahalgam Terrorist Attack in Hyderabad

హైదరాబాద్,సాక్షి: జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది.

కాశ్మీర్ ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరేలా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ క్యాండిల్‌ ర్యాలీకి పిలుపునిచ్చింది. 

పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో  సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు ,ఎమ్మెల్యేలు , భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement