
ఫిషర్ మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
సాక్షి, హైదరాబాద్: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనగా, సీఎల్పీ నేత భట్టి తన నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా గ్యాస్ సిలిండర్లకు దం డలు వేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాం గ్రెస్, ఫిషర్ మెన్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.