Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

When Raj Thackeray Quit Shiv Sena What He Had Responded1
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!

‘నేను పార్టీ నుంచి ఏం కోరుకున్నాను.. గౌరవం, మర్యాద కోరుకున్నాను. కానీ నాకు అవి అక్కడ దొరకలేదు. పార్టీ నుంచి ఏమీ ఆశించలేదు. చాలా అవమానించారు. మానసికంగా చాలా హింసించారు. నా బద్ధ శత్రువుకు కూడా ఇటువంటి రోజు రాకూడదు’. ఇవి ఒకనాడు రాజ్ ఠాక్రే చెప్పిన మాటలు. 20 ఏళ్ల క్రితం రాజ్ ఠాక్రే ప్రెస్ కాన్పరెన్స్ లో చెప్పిన మాటలు. శివసేన నుంచి బయటకొచ్చి ఎమ్మెన్నెస్ పార్టీ పెట్టడానికి ముందు అన్న మాటలు. 2005, డిసంబర్‌ 18వ తేదీన మీడియా సాక్షిగా రాజ్‌ ఠాక్రే అన్న మాటలివి. ఆ రోజు ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. బాలాసాహెబ్‌ ఠాక్రే కలలో కూడా ఊహించని పరిణామం. 2005లో శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్ ఠాక్రే.. మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. అప్పట్నుం‍చి ఇప్పటివరకూ శివసేనతో ఎటువంటి సంబంధాలు కొనసాగించలేదు. ‘మీరు వేరు- మేము వేరు’ అన్నట్లుగానే సాగింది ఈ ఇరు పార్టీల వైరం. కానీ ఇప్పుడు శివసేనతో కలవడానికి ఆసక్తి చూపిస్తున్న సమయంలో ఆనాడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రే కారణంగానే ఆనాడు తాను బయటకొచ్చానని రాజ్ ఠాక్రే పరోక్షంగా చెప్పారు. పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రేతో రాజ్ ఠాక్రే జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ఎమ్మెన్నెస్ అవతరించింది. ఇన్నాళ్లకు శివసేనతో మళ్లీ జట్టు కట్టాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. మహారాష్ట్ర ప్రజల ఆశయం కోసం ముఖ్యంగా మరాఠీల రక్షణ కోసం తాము కలిసి అడుగేయాలని తాజాగా రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. దీనికి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ కూడా సానుకూలంగా స్పందించడంతో వారి బంధం రెండు దశాబ్దాల తర్వాత పట్టాలెక్కడానికి తొలి అడుగు పడింది. ఇదీ చదవండి:రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!

IPL 2025, PBKS VS RCB: Virat Kohli Became The Highest 50 Plus Run Scorer In IPL, Surpassed David Warner2
PBKS VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. మరో భారీ రికార్డు సొంతం

పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 20) పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో విరాట్‌ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్‌ వార్నర్‌ పేరిట ఉంది. వార్నర్‌ 66 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్‌ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన టాప్‌-5 బ్యాటర్స్‌..విరాట్‌- 67 (59 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్‌- 66 (62, 4)శిఖర్‌ ధవన్‌- 53 (51, 2)రోహిత్‌ శర్మ- 45 (43, 2)కేఎల్‌ రాహుల్‌- 43 (39, 4)ఏబీ డివిలియర్స్‌- 43 (40, 3)మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్‌ అజేయ అర్ద శతకంతో (73) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జితేశ్‌ శర్మ (11) సిక్సర్‌ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (61) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. సాల్ట్‌ (1), రజత్‌ పాటిదార్‌ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, చహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (33) టాప్‌ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్‌ ఆర్య 22, శ్రేయస్‌ అ‍య్యర్‌ 6, జోస్‌ ఇంగ్లిస్‌ 29, నేహల్‌ వధేరా 5, స్టోయినిస్‌ 1, శశాంక్‌ సింగ్‌ 31 (నాటౌట్‌), జన్సెన్‌ 25 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్‌ను కిందికి దించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్‌, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్‌, లక్నో తలో 10 పాయింట్లతో టాప్‌-5లో ఉన్నాయి.

Mla Adinarayana Reddy Threatens Ultratech Cement Factory Once Again3
ఆది అరాచకం.. అల్ట్రాటెక్‌కు మరోసారి బెదిరింపులు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మరోమారు అల్ట్రాటెక్ సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై బెదిరింపులకు దిగారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్స్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు.అక్కడి కాంట్రాక్టులన్నీ తనకే కావాలంటూ ఉత్పత్తి అడ్డుకున్నారు. ముడిసరుకు, ఉత్పత్తి బయటకు వెళ్లకుండా బస్సు అడ్డుగా పెట్టీ మరీ బెదిరింపులకు దిగారు. అదినారాయణరెడ్డి దౌర్జన్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫ్యాక్టరి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసు బందోబస్తుతో తిరిగి ఉత్పత్తి పునరుద్ధరించారు. అయినా తన తప్పేమీ లేదంటూ ఆదినారాయణరెడ్డి బుకాయించారు. పైగా సీఎంతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ మరోసారి బెదిరింపులకు దిగారు.కాగా, చిలంకూరులోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మల­మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో గత రెండు రోజుల క్రితం కూడా ఉత్పత్తి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదు­ర్కొం­టున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చ­నీయాంశంగా మారాయి.మొన్న అదాని హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.

Can Divorce Impact Your Credit Score Check The Details4
విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఏదైనా విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. డివోర్స్ తీసుకుంటే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఈ కథనం చదివితే.. తప్పకుండా మీకే అర్థమవుతుంది.భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు (ఉద్యోగం చేసే వారైతే).. జాయింట్ అకౌంట్స్ మీద హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి తీసుకుని ఉంటే.. విడాకులు తరువాత ఈ ఖాతాలను క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎలా అంటే.. జాయింట్ అకౌంట్స్ కింద తీసుకున్న లోన్‌కు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఆలా కాకుండా అకౌంట్ క్లోజ్ చేస్తే లేదా లోన్ చెల్లింపులు ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.కలిసి ఉన్నప్పుడు ఇద్దరి సంపాదన తోడవుతుంటుంది. విడాకుల తరువాత ఎవరి దారి వారిదే. అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.ఇదీ చదవండి: ఫుడ్‌ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్‌ పంచుతున్న డెలివరీ బాయ్‌.. అందులో ఏముందంటే?విడాకులు మంజూరు చేసే సమయంలో లోన్స్ క్లియర్ చేయాల్సిన బాద్యతను మీ భాగస్వామికి కోర్టు అప్పగించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్స్ మీద ఇద్దరి సంతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో మీ భాగస్వామి చెల్లింపులను ఆలస్యం చేస్తే.. ఆ ప్రభావం ఇద్దరిపైన పడుతుంది. ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.జాయింట్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డులను విడాకులు తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకున్నట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలాంటి ఆర్ధిక సంబంధ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు.

Vijay Kumar Says Doubts About Praveen Pagadala Postmortem Report5
‘ప్రవీణ్‌ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’

సాక్షి, తాడేపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో పిల్ వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్‌ మార్టం రిపోర్టులో స్పష్టత లేదన్నారు. ట్రావెల్ చేసింది.. ఆగింది.. మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ కుమార్ అని ఎక్కడా నిరూపణ కాలేదు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేది తప్ప పోలీసులు చూపిన వీడియోల్లో అతను ప్రవీణ్ కుమార్ అని నిర్ధారణ కాలేదు’’ అని విజయ్‌ కుమార్‌ వివరించారు.‘‘నాకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉంది. మద్యం సేవించడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుంది. మద్యం తాగడం వల్లే చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఇంతమంది ఎలా బతికున్నారు?. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రవీణ్ కడుపులో 120 ఎంఎల్‌ ఫ్లూయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్‌లో అనుమానాస్పదమైన ఎలాంటి ఆల్కహాల్ లేదని ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన వైద్యులు.. ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని ఇవ్వడం చిత్రంగా ఉంది. ఎందుకు ఆల్కహాల్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు మొదట చెప్పిన ప్రెస్ మీట్‌లో ఎక్కడా ఆల్కహాల్ గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఒక స్టోరీని అల్లడం కోసం ఆల్కహాల్‌ను వాడుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి’’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘పనిగట్టుకుని ఆల్కహాల్ ఉందని రిపోర్టులో రాశారని అనిపిస్తోంది. మొహం రాళ్లకు గుద్దుకున్నందుకు గాయాలయ్యాయన్నారు. మరి తలవెనుక గాయం ఎలా అయ్యింది?. వెల్లకిలా పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ ఎలా పడింది?. అనేక సందేహాలున్నాయి వాటికి ఎక్కడా సమాధానం లేదు. హర్షకుమార్ అరెస్టును మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఏపీలో అసలు మానవహక్కులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు లేదా?. రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వేధించడం పద్ధతేనా?. ముందస్తు అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న కొద్ది ప్రవీణ్ కుమార్‌ది హత్యేనేమోనని అనుమానాలు బలపడుతున్నాయ్. ప్రవీణ్ మృతిపై మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ద్రోహులెవరో తెలిసిపోతారని ప్రభుత్వం ఉలిక్కిపడుతుందనే అనుమానం కలుగుతోంది. ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. పేదల ఓట్లు మీకు కావాలి?. పేదల భావాలతో మీకు పనిలేదా?’’ అంటూ విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

UP Techie Ends His Life  Accuses Wife6
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!

నేటి కాలంలో భార్యా భర్తల సంబంధాల్లో ఆస్తులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేసిన బంధాల్ని చిదిమేస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వేట మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అబ్బాయికి ఎంత ఉంది(ఆస్తి).. అమ్మాయి ఎంత స్త్రీ ధనం(కట్నం) తెచ్చుకుంటుందనే తతంగం మరీ ఎక్కువైపోయింది. అసలుకంటే కొసరు ముద్దు అనే చందంగా తయారైంది. అది చివరకు వైవాహిక బంధాలు నాశనం కావడానికి కూడా కారణమవుతోంది. తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త. భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎటావాలో 33 ఏళ్ల ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య నుంచి ఎలా వేధింపులకు గురయ్యాడో వీడియో రికార్డ్ చేసి మరీ తనువు చాలించాడు. మోహిత్ యాదయ్‌కు ప్రియా అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఏడేళ్ల పాటు రిలేషనలో ఉన్న వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచీ అమ్మాయి తల్లి.. వీరి కాపురాన్ని శాసిస్తూ వస్తోంది. చివరకు భార్య ప్రియ గర్బవతి అయినా కూడా అబార్షన్ చేయించిందట అత్త. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన అత్త తీసుకెళ్లిపోయిందని మోహిత్ రికార్డు చేసిన వీడియో ద్వారా తెలిసింది.చనిపోయి ముందే మోహిత్ చెప్పిన మాటలు..‘ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని నా భార్య తరచు వేధింపులకు గురిచేస్తోంది. ఇల్లు, ఆస్తి అంతా తన పేరునే రాయాలట. మా అమ్మా‍, నాన్నలపై కూడా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆమె తండ్రి చేత ఒక తప్పుడు కేసు పెట్టించింది. నా భార్య సోదరుడు నా బావమరిది నన్ను చంపుతానని పదే పదే బెదిరిస్తున్నాడు. రోజూ ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంది నా భార్య, ఆమె తల్లి దండ్రులకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.అమ్మా నాన్న క్షమించండి.. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లి పోతున్నా. నాకు న్యాయం జరిగాలి. నా చావుతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా బూడిదను డ్రైన్ లో కలిపేయండి’ అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు.ఇదీ చదవండి: నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు

Priyadarshi Pulikonda about His Worst Decision is Doing This Movie7
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి

ప్రియదర్శి (Priyadarshi Pulikonda).. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొమ్మిదేళ్లలోనే తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మొదట్లో హీరో స్నేహితుడిగా చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ పోయిన అతడు ప్రస్తుతం కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నాడు. కోర్ట్‌తో సంచలన విజయాన్ని సాధించిన ప్రియదర్శి సారంగపాణి జాతకం (Sarangapani Jathakam Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఎంజాయ్‌ చేస్తున్నానంతే..ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రియదర్శి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రియదర్శి మాట్లాడుతూ.. నా తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని చూసి నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఇంకా కూడా ఏదో చేయాలన్న తపన ఉంది. కాకపోతే ఈ జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఏమవ్వాలో తెలియదు కానీ ఎలా ఉండకూడదో మాత్రం బాగా తెలుసు.నేను కమెడియన్‌ కాదుఅయితే నన్ను నేను కమెడియన్‌ (Comedian) అనుకోలేను. ఎందుకంటే సత్య, వెన్నెల కిశోర్‌లా కామెడీ చేయలేను. ఆ విషయం నాకు తెలుసు. నేను కమెడియన్‌ అవుతానని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌లను చూసి వీళ్లలా యాక్టింగ్‌ చేయాలనుకువాడిని. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను తీసుకున్న మంచి నిర్ణయం కోర్ట్‌ సినిమా ఒప్పుకోవడమే! మిఠాయి సినిమా (Mithai Movie) చేయడం చెత్త నిర్ణయంగా భావిస్తాను.(చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్‌ రష్మీకి ఆపరేషన్‌)పొరపాట్ల నుంచే నేర్చుకోగలంఎందుకంటే ఈ సినిమాను నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. అటు దర్శకుడు కూడా పూర్తిగా మనసు పెట్టి తీయలేదు. సినిమాలు ఎలాంటివి చేయాలి? ఎలాంటివి చేయకూడదు? అన్న విషయం నేర్పించింది మిఠాయి సినిమానే.. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఎంతో నేర్చుకోగలం. ఉదాహరణకు గతంలో నేను చాలా సిగరెట్లు తాగేవాడిని. దానివల్ల వచ్చే ఇబ్బందులు తెలుసుకున్నాను కాబట్టే మానేశాను అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.సినిమాప్రియదర్శి.. 2016లో వచ్చిన టెర్రర్‌ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. తొమ్మిదేళ్ల ప్రయాణంలో 50కు పైగా సినిమాలు చేశాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. పెళ్లిచూపులు, బలగం, మల్లేశం, 35:చిన్న కథ కాదు, మంగళవారం, కోర్ట్‌ వంటి పలు హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.చదవండి: సౌత్‌లో ఆ పిచ్చి అలాగే ఉంది.. నన్నెంత దారుణంగా తిట్టారో!

Pithapuram Rural Village Pallam Expulsion of Dalits8
AP: ఊరి పెద్దల హుకుం.. దళితుల గ్రామ బహిష్కరణ!

కాకినాడ: దళితులు గ్రామ బహిష్కరణకు గురైన ఘటన తాజాగా ఏపీలో వెలుగుచూసింది. పిఠాపురం రూరల్ గ్రామం పల్లంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు. దళితులకు వస్తువులు విక్రయించవద్దనే ఊరి పెద్దల ఆదేశాలతో వారికి ఎటువంటి వస్తు విక్రయాలను చేయడం లేదు.. గ్రామ పెద్దల ఆదేశాలో నిన్నటి(శనివారం) నుండి దళితులకు వస్తు విక్రయాలు ఆపేశారు వ్యాపారులు.ఇటీవల ఓ ఇంట్లో విద్యుత్ పని చేస్తుండగా పల్లపు సురేష్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రెండు క్రితం దళితులు ఆందోళన తెలిపారు. దాంతో దళితులపై కక్ష గట్టారు. వారిపై బహిష్కరణ వేటు వేయాలని ఊరి పెద్దల సమక్షంలో నిర్ణయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే ఈ తరహా ఘటనలు ఇప్పుడు ఏపీలో కనిపించడం రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దం పడుతోంది. ఏపీలో పరిస్ధితులు ప్రస్తుత పాలకుల చేతుల్లో, చేతల్లో రోజు రోజూకి దిగజారిపోవడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

Jammu And Kashmir flash floods And landslides Roads Cut off9
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. వరద బీభత్సంతో భయానక వాతావరణం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్‌ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025

Mukesh AmMukesh Ambani BirthDay Bash Rangoli highlite Hosted By Nita Ambani10
Mukesh Ambani Birthday ముఖేష్‌ అంబానీ బర్త్‌డే బాష్‌, ఇదే హైలైట్‌!

భారతీయ వ్యాపార దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్‌గా, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్‌ 19న 68వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్‌ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.ముఖేష్ అంబానీ బర్త్‌డే (Ambani birthday) వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. అంబానీ అప్‌డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్‌గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్‌, నీతా అంబానీ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda) ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలయన్స్ బాస్‌కి చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్‌కర్‌ మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్‌ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్‌తో అలంకరించింది. కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19, యెమెన్‌లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు. ఆయిల్‌ నుంచి జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్‌ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్‌గా ఎదిగారు. ముఖేష్‌ సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్‌ అంబానీ కూడా కుటుంబ వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ నాటికి ముఖేష్‌ అంబానీ ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement