తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస‍్కరించుకుని ప్రముఖ జ్యోతిషుడు కళానిధి రాంబాబు ఆయా పార్టీలు, వాటి అధ్యక్షుల జాతక ఫలాలను పరిశీలించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎవరు అధికారంలో వస్తారనే దానిపై రాంబాబు అంచనాలు ప్రకటించారు. ప్రముఖ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేనలకు సంబంధించి లగ్నాలు, నక్షత్రాలు, రాశులు, పార్టీ ప్రారంభించిన తేదీ గడియాలను దృష్టిలో ఉంచుకుని రాంబాబు జాతక రిపోర్టును వెల్లడించారు.