అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే రైతు కమిటీ వేసి.. కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలను కల్పిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.