Pithapuram
-
నాగబాబు కుమారపురం పర్యటనలో జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు
-
నాగబాబు రాక.. పిఠాపురంలో మళ్లీ ఉద్రిక్తత
కాకినాడ, సాక్షి: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu) పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కాకరేపింది. వర్మ పేరిట ఆయనకు తెలుగు తమ్ముళ్లు మరోసారి షాక్ ఇచ్చారు. జై వర్మ(Jai Varma) నినాదాలతో నాగబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో పసుపు జెండాలతో టీడీపీ బలప్రదర్శనకు దిగగా.. జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలో తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కల్యాణ్‌ను గెలిపించారని టీడీపీలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్పీఎస్ఎన్ వర్మ మీద సానుభూతి ఏర్పడింది. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు మండిపడుతున్నారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయింది. దీని వెనక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వాళ్లలో బలంగా ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న గొల్లప్రోలులోనూ అన్నాక్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో రసాభాసా సృష్టించారు. తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్ధతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: వర్మ అవుట్.. ఇక పిఠాపురం జమీందార్‌గా కొణిదెల నాగబాబు -
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతల ఓవరాక్షన్
-
పిఠాపురం జనసేన నేతపై వర్మ అనుచరుల దాడి
-
అపరిచితుడికి నెక్ట్స్ లెవల్లో జనసేనాని!
రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు సాధారణంగా తాము సాధించిన విజయాల గురించి లేదా.. చేయబోయే పనుల గురించి కార్యకర్తలకు, అభిమానులకూ వివరించే వేదికలుగా ఉపయోగించుకోవడం కద్దు. అయితే ఇటీవలే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భవ సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా ఏం చెప్పదలచుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్.. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చెప్పిందేమిటి? పది నెలలుగా అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఒకరకంగా చూస్తే పవన్ మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బోలెడన్ని అబద్ధాలు చెప్పుకొచ్చారు. స్వోత్కర్ష, ఇతరులు పొగడం బాగానే ఉన్నా.. తన సినిమా గబ్బర్‌సింగ్‌లోని డైలాగ్ మాదిరి ఎవరి డబ్బు వారే కొట్టుకున్నట్లుగా ఈ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను దూషించడం కోసం కూడా ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటిలోకి కీలకమైన పాయింట్ ఒకటి మాత్రం ఉంది. నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్ ప్రకటించడం. ఇందులో కొంత వాస్తవం, మరికొంత అవాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్‌ను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సపోర్టు పొందగలిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో(Pithapuram Public meeting) చేసిన వ్యాఖ్య టీడీపీ శ్రేణులలో మంట పుట్టించింది. కొందరు టీడీపీ, అభిమానులు పవన్‌ను ఎద్దేవా చేస్తూ, దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా.. ‘‘క్వింటాల్ వడ్లు తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి. కాని ఆ కొన్ని వడ్లవల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా.. సేనాధిపతి?’’ అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ లేదా ఆయన సోదరుడు నాగబాబు సమాధానం చెబుతారా? 👉.. అదే సమయంలో టీడీపీ(TDP) లేకుండా అసలు పవన్‌కు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ విజయం సాధించారంటే అది టీడీపీ పుణ్యమే అనే సంగతి గుర్తుంచుకోవాలని వారు చెబుతున్నారు. పవన్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని జనసేన వారి వాదన. ఈ రకంగా ఒకరినొకరు దుయ్యబట్టుకుంటున్నా, ఇద్దరూ కలిసి సాగడానికి పెద్ద ఇబ్బంది పడడం లేదు. పవన్ కేవలం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కే కాకుండా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌కు కూడా విధేయత కనబరుస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు వైపులా ఆత్మాభిమానం అన్నది పెద్ద సమస్య కాకపోవడం కూడా వీరికి కలసి వచ్చే పాయింట్. 👉పవన్ కళ్యాణ్ ఈ సభలో సూపర్ సిక్స్ గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని అంశాల గురించి కాని ప్రస్తావించకుండా తన గొప్ప గురించి, తన కుటుంబం గొప్ప గురించి చెబితే ఆయన అభిమానులు అమాయకంగా చప్పట్లు కొట్టవచ్చు. ప్రజలకు ఒరిగేదీ ఉండదు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎక్కాలు చదివి మరీ ప్రచారం చేశారే! వలంటీర్ల కడుపు కొట్టనంటూ, రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని కథలు చెప్పారే. నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని అన్నారే. పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారందరిని అభివృద్ది చేసేస్తామని గప్పాలు కొట్టారే. వీటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తాను గెలవడమే గొప్ప అనుకోండని అంటున్నారు. జనసేనకు సిద్దాంత బలం ఉందని చెబుతుంటే నవ్వు వస్తుంది. ఏ సిద్దాంతం ఉందో ఎవరికి అర్థం కాదు. చెగువేరా నుంచి సనాతని వరకు రకరకాల వేషాలు మార్చి నట జీవితంలోనే కాదు.. రాజకీయ జీవితంలో కూడా బహురూపి అన్న విధంగా వ్యవహరించిన పవన్ సిద్దాంతం ఎలాగైనా అధికారంలోకి రావడమే అన్నది అర్థమవుతూనే ఉంది. పిఠాపురంలో వర్మే తనను గెలిపించాలని చేతులు పట్టుకుని అర్థించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వర్మను ఎంతలా అవమానిస్తున్నారు? నాగబాబు సభలో అంతగా వర్మను అవమానించవలసిన అవసరం ఉందా? దానిని పవన్ కూడా సమర్థిస్తున్నట్లే కదా! ఈ ఒక్కటి చాలదా! పవన్ నైజం ఏమిటో తెలుసుకోవడానికి. సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని చెప్పి ప్రజలను మాయ చేసే యత్నం చేస్తున్నారు. అంత సనాతని అయితే తన ఇంటిలోనే అన్య మతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్నది హిందూ ధర్మవాదుల ప్రశ్న. ఒకసారి కులం లేదు.. మతం లేదు.. అంటూ గంభీర ప్రసంగాలు చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సనాతని అంటూ కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మాలన్నమాట. నిజంగానే ధర్మం, సత్యం ఆచరించేవారైతే ఇప్పుడు కూడా నిత్యం అసత్యాలే చెబుతున్నారే? అదేనా ధర్మం చెప్పేది. తిరుమల లడ్డూ పట్ల అపచారం చేసిన పవన్ దానిని బుకాయించి నిందితులు అరెస్టు అయ్యారని అంటున్నారే. పవన్ ఆనాడు చెప్పిందేమిటి? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను భుజాన వేసుకుని హడావుడి చేశారే. దానికి తోడు అయోధ్యకు కల్తీ నెయ్యి వాడిన లడ్డూలు పంపారని నింద మోపారే! లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదే! కల్తీ నెయ్యి ఉండడం వేరు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం వేరు. తగు ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ వెనక్కి పంపించింది కదా! అయినా పవన్ అబద్దం ఆడుతున్నారంటే ఆయనకు సనాతన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. 👉రాజకీయం కోసం ఏ వేషం అయినా కట్టవచ్చన్నది ఆయన నమ్మిన ధర్మం అన్న భావన కలగదా! దీపారాధన చేసే దీపంతో తన తండ్రి సిగెరెట్ వెలిగించుకునేవారని గతంలో చెప్పి.. ఇప్పుడు తమ ఇంటిలో అంతా రామ జపమే చేస్తారని చెబితే వినేవాళ్లను వెర్రివాళ్లను చేయడం కాదా! అసలు ఆయన తండ్రి గురించి ఎవరు అడిగారు. ఆ విషయాలతో జనానికి ఏమి సంబంధం. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదవింది అన్న విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడారో వీడియో సహితంగా కనిపిస్తుంటాయి. 👉వైఎస్ జగన్(YS Jagan) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేసింది, ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన మనసుకు తెలియదా! గతంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ గొంతు చించుకుని అరచి మరీ మాట్లాడిన పవన్ కు సడన్ గా జ్ఞానోదయం అయిందని అనుకోవాలా? హిందీ గురించి కూడా మాట్లాడారు. దానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బదులు ఇస్తూ ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please అని కామెంట్ చేశారు. ఏపీలో ఆంగ్ల మీడియం ను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ బీజేపీ వారి మెప్పుకోసం హిందీ గాత్రం అందుకున్నారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని ఆయన ప్రశ్నించారు. నిజమే.. అసలు సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, సినీ నటుడుగా ప్రజలను ఆకర్షించి, ఈ పదేళ్లలో అనేక మార్లు మాట మార్చి, రంగులు మార్చి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచారన్నంత వరకు ఓకే గాని, మిగిలినవాటిలో అసత్యాలు, అసంబద్ధ విషయాలే ఉన్నాయని చెప్పాలి. ప్రజలను ఏమార్చడం వరకు సఫలం అయ్యారని ఒప్పుకోవచ్చు. దానికి ఆయన సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి మనసు ఉప్పొంగిపోవచ్చు. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన బాసలు మర్చిపోవడమే కాకుండా నిత్యం కలుషిత రాజకీయాలు చేస్తున్న తీరు మాత్రం మాత్రం ప్రజల మనసులను కకావికలం చేస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. ఏ దేశమేగినా..అన్న గేయం రాసింది గురజాడ అప్పారావు అని చెప్పడం. అది రాసింది రాయప్రోలు సుబ్బారావు అన్న సంగతి వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని పవన్‌కు తెలియదా? లేక ఆయన ఉపన్యాసం రాసిన వ్యక్తికి తెలియదా! శ్రీ శ్రీ నవ సమాజం కోసం రాసిన గేయాన్ని సనాతన ధర్మానికి వాడుకోవడం కూడా హైలైటే!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంతోటిదానికి పవన్ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్‌గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్‌లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.నాదెండ్ల స్వయంగా ప్రకటించి..తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. -
వర్మకు ఎమ్మెల్సీ దక్కకుండా పవనే అడ్డుకున్నారనే టాక్
-
అసలు విషయం మర్చిపోయిన వీరమల్లు.. అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి
-
SVSN Varma: నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆరు నెలలు సావాసం చేస్తే వారు, వీరవుతారంటారు. కూటమిగా జత కట్టి.. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి.. నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల విషయంలో ఈ మాట నిజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరానికి వాడుకుని, పని అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసే తత్వం ఇంత కాలం చంద్రబాబుకే సొంతమనుకునే వారు. ఇప్పుడు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. ఆ మాటలకు అర్థాలే వేరని ఆ సభలోనే జనసేన అభిమానులు, కార్యకర్తలు గుసగుసలాడటం వినిపించింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించినవేనని ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.పొగిడిన నోటితోనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో, స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పని చేసిందనేది జగమెరిగిన సత్యం. పరాజయాల నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి, గెలుపొందే వరకూ వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేయడంలో మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు పోటీ పడ్డారు. ‘ఈ విజయం జనసైనికులది. ఈ విజయం వర్మది’ అంటూ స్వయంగా పవన్ కల్యాణ్ పలు సభల్లో వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో భాగస్వామ్యులై, పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక అసలు స్వరూపం బయటపడిందని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి ప్రయతి్నస్తున్నారని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది.విస్తృతంగా చర్చ నేడు మెగాబ్రదర్స్ వ్యాఖ్యలు చూస్తూంటే ‘ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న’ సామెతను తలపిస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలయ్యేంత వరకూ వర్మను వేనోళ్ల పొగడిన మెగా సోదరులు ఇంతలోనే ఇంతలా మారిపోతారని ఊహించలేదని తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పిఠాపురంలో జరిగిన ఒక సభలో వర్మను ఆకాశానికెత్తేస్తూ మెగా బ్రదర్స్ పొగుడుతున్న వీడియో, శుక్రవారం రాత్రి చిత్రాడ సభలో నాగబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కూటమి పారీ్టల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తరచూ మార్పు రావాలంటున్నారని, చివరకు చిత్రాడ సభలో సైతం ఇదే విషయాన్ని ఊదరగొట్టారని, మార్పు అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు మొండిచేయి పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎర వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనకే ఇస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుమూడు దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు మాత్రం మొండిచేయే చూపించారు. పని అయ్యే వరకూ బుజ్జగించడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ ఉంది. అయితే, అదే వాస్తవమని వర్మకు ఎమ్మెల్సీ పదవి విషయంలో మరోసారి రుజువైందని అంటున్నారు. అయితే, వర్మకు జెల్ల కొట్టడానికి వేరే కారణముందనే చర్చ కూడా నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్మ అనుచరులు పిఠాపురంలో చంద్రబాబు, లోకేష్ దిష్టి ొమ్మలు, పార్టీ జెండాలు దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్ లను బూతులు తిట్టారు. దీనిని మనసులో పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్‌లు వ్యూహాత్మకంగానే వర్మను తొక్కేస్తున్నారని, మెగాబ్రదర్స్ ద్వారా పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది.లేకుంటే వర్మను నాగబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నా అధినేతలు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు మధ్య ఎన్నికల సమయంలో రగిలిన చిచ్చు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా.. ఆయనను నిత్యం విభేదించే మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. నాగబాబును రేపోమాపో మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. -
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది. -
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన గూండాల అరాచకం
-
మేం ‘పిఠాపురం’ తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది!
సాక్షి, కాకినాడ: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించగా.. ఇంకోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు.పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో ‘జయకేతనం’(JSP JayaKethanam Sabha) పేరిట సభ నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి చేష్టలకు దిగాయి. ‘‘పిఠాపురం డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది?’’ అంటూ నినాదాలు చేస్తూ.. దారినపోయేవాళ్లను దుర్భాషలాడుతున్నారు.ఈ క్రమంలో.. జనసేన స్టికర్లు, జెండాలతో ఉన్న బైకులు, కార్లతో రోడ్లపై హల్ చల్ చేశాయి. కత్తిపూడి-కాకినాడ 216 జాతీయ రహదారిపై జనసైనిక్స్ బైక్‌లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు.ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరాడతను. ఈలోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు. సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే పిఠాపురంలో ఎర్ర టవల్ బ్యాచ్ ఇంత చేస్తున్నా.. అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం -
పవన్ ఇలాకాలో ఎగిరిన YSRCP జెండా
-
‘వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. కానీ’: నాదెండ్ల మనోహర్
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్. -
కుటుంబానికి అన్నీ తానే అయిన పిఠాపురానికి చెందిన వెంకటలక్ష్మి
-
పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకు నోటు
-
ఓటుకు 3000.. పిఠాపురంలో ప్రలోభాల పర్వం!
సాక్షి, పిఠాపురం: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2000-3000 ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.కాకినాడ నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయి ఓటుకు నోటుకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే, మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3000 రూపాయలను ఓట్లరకు పంచుతున్నారు. ఓట్లరకు డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కృష్ణా జిల్లాలో సైతం ఇలాగే జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ఓట్లరను ప్రలోభాలు గురిచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. ఓట్లుకు 2000 అంటూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు ఇచ్చారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ నగదును ఓటర్లు అందిస్తున్నారు.విశాఖలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈసీ ఆంక్షలు లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలలో నాయకులతో కలిసి హడావిడి చేస్తున్నారు. చంద్రపాలెం స్కూల్లోకి నేరుగా వాహనంతో వెళ్లిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కానీ, అధికారులు మాత్రం ఆయనకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.ఎన్టీఆర్ జిల్లాలో ఇలా..ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గుంటూర్ ఆక్స్ ఫర్డ్ స్కూల్ యాజమాన్యం. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యం. 144 సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోని వైనం. ఓటు వేయకుండా ఉపాధ్యాయులను నిర్బంధించిన యాజమాన్యం. ఇదేమిటని ప్రశ్నించిన మీడియాకు పొంతలేని సమాధానం చెప్పిన సిబ్బంది. పుట్టినరోజు వేడుకలు కోసమే ఉపాధ్యాయులను పిలిచినట్లు సమాధానం. చివరకు మీడియా అక్కడికి చేరుకోవడంతో ఉపాధ్యాయులను వదిలిపెట్టారు. -
పిఠాపురం జనసేనలో ‘కోడ్ చిచ్చు’
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ రచ్చ.. జనసేన పార్టీలో చిచ్చు రాజేసింది. స్థానిక జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్‌ను వేదిక మీదకు సిబ్బంది అనుమతించకపోవడంతో మొదలైన గొడవ.. అప్పటికే వేదిక మీద ఉన్న జనసేన కోఆర్డినేటర్ వైశాలి వివరణతో మరింత ముదిరింది. పాదగయ క్షేత్రంలో(Pada Gaya Temple) సోమవారం రాత్రి కుక్కటేశ్వర స్వామివారి దివ్యకల్యాణం జరిగింది. ఈవో జగన్మోహన్ ఆహ్వానం మేరకు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ సతీసమేతంగా ఆలయానికి వచ్చారు. అప్పటికే కల్యాణ వేదికపై ఈవో దంపతులు కూర్చుని ఉన్నారు. అయితే మర్రెడ్డి దంపతులు స్టేజ్ ఎక్కబోతుండగా.. ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి వేదిక ఎక్కేందుకు అనుమతించమని చెప్పారు. దీంతో ఆయన వర్గీయులు ఆలయంలో ఆందోళనకు దిగారు.ఈవో భార్య వైశాలి(EO Wife Vishali) స్థానిక జనసేన పార్టీ కోఆర్డినేటర్. దీంతో ఆమెను ఎలా కూర్చోనిచ్చారంటూ జనసేన నేతలు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాను పార్టీపరంగా కాకుండా.. ఈవో భార్యగానే వేదిక మీద ఉన్నానంటూ ఆమె చెప్పారు. దీంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ జరుగుతుండగానే.. ఈవో దంపతులు లేచి స్వామివారి కల్యాణం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో.. అపచారం జరిగిందంటూ భక్తులు చర్చించుకున్నారు. మరోవైపు మర్రెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది అవమానించారంటూ కాసేపు హల్చల్ చేసి.. కాసేపు అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
అప్పుడు చెత్త పన్ను అంటూ ఏడ్చాడు ఇప్పుడు పిఠాపురంలో అదే చేస్తున్నాడు
-
లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి: పిఠాపురం వర్మ
సాక్షి,కాకినాడజిల్లా: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు వర్మ ఆదివారం(జనవరి 19) మీడియాతో మాట్లాడారు.‘నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది. పార్టీ పూర్తిగా పోయిందని,టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువ గళంతో సమాధానం చెప్పారు.ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి.లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు.అలాంటిది పార్టీని బలోపేతం చేసి, టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి?కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్‌ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా.ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.టీడీపీ కార్యకర్తల మనసులో మాట.ఏదేమైనా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం’అని వర్మ అన్నారు. కాగా, లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు.మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. ఈ నేతల జాబితాలో పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరడం పొటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన మధ్య సంబంధాలపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పిఠాపురం పవన్ కల్యాణ్ సభలో వీర మహిళ లక్ష్మీకి తీవ్ర అవమానం
-
పవన్ పర్యటన.. జనసేన మహిళా నేతకు అవమానం!
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ జనసేన మహిళా నేత చల్లా లక్ష్మీకి చేదు అనుభవం ఎదురైంది. సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చల్లా లక్ష్మీని బయటకు పంపారు. దీంతో, తోపులాట జరిగి ఆమె కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అనంతరం, ఆమె విలవిల్లాడిపోయింది.సంక్రాంతి సందర్బంగా పిఠాపురం మండలం కుమారపురంలో మినీ గోకులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, స్థానికులు వచ్చారు. అలాగే, జనసేన ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆమెకు అనుమతి లేదంటూ చల్లా లక్ష్మీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు. దీంతో, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో విలవిల్లాడిపోయారు.ఈ నేపథ్యంలో జనసేన నేతలు, పోలీసులపై జనసేన వీర మహిళలు మండిపడుతున్నారు. పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, గాయపడిన చల్లా లక్ష్మీ అక్కడే ఉన్న మహిళలు సాయం చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా పిఠాపురంలో జనసేన వీర మహిళలకు అవమానం జరిగింది. పవన్ పాల్గొంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న వీర మహిళలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. వీరంతా.. పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుందామని అక్కడికి వచ్చినట్టు చెప్పారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గత ఎన్నికల్లో మండుటెండల్ని లెక్క చేయకుండా.. కుటుంబాన్ని వదిలి పవన్ గెలుపు కోసం పని చేశామని వీర మహిళలు గుర్తు చేశారు. ఇద్దరు నేతలే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. -
పిఠాపురంలో మరోసారి టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు
-
పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు చేదు అనుభవం
-
పులిహోర ప్రసాదంలో పురుగులు
-
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
హోమగుండం లో దేవుని ఫోటోలు
-
పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
-
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా? -
అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల పాత్రలో పరస్పరం సహకరించుకుంటూ అనేక రాజకీయ డ్రామాలను రక్తి కట్టించిన చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ ద్వయం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను అనుసరిస్తోంది! కూటమి ప్రభుత్వంపై కొద్ది నెలల్లోనే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సరికొత్త డ్రామాకు తెర తీసింది!! రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు దారుణ వైఫల్యాలపై సామాన్య ప్రజలతో పాటు అధికార పక్షంలోనూ వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం విదితమే. శాంతి భద్రతల వైఫల్యంపై టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రతరమవుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నాల్లో నిమగ్నమయ్యారు. దీనిపై ఆయన నిజంగానే నిజాయితీగా వ్యవహరించదలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి. లేదంటే మంత్రివర్గంలో తనూ భాగమే కాబట్టి.. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా.. శాంతి భద్రతలను నేరుగా పర్యవేక్షించే ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా.. దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై నెపాన్ని నెట్టేసే విధంగా పవన్ మాట్లాడటాన్ని చూస్తుంటే.. కొత్త డ్రామాను రక్తి కట్టిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం పిఠాపురం పర్యటన సందర్భంగా గొల్లప్రోలు సభలో పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు మితిమీరిపోయాయి. పోలీసులు శాంతి భద్రతలను గాలికొదిలేసి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బయటకెళ్లాలంటే ప్రజలు ఏం ప్రశ్నిస్తారో అని భయమేస్తోంది. మమ్మల్ని తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక బయటకు వెళ్లలేకపోతున్నాం. మూడేళ్ల బాలికపై హత్యాచారం జరిగితే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఆడబిడ్డల మాన, ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు చెబుతున్నా స్పందన కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఇసుకలో లాభాలు చూసుకుంటున్నారేగానీ అరాచకాలను ప్రశ్నించడం లేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆడపిల్లలను ఇబ్బందులు పెడుతుంటే కూటమి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పట్టించుకున్నారా?’ అని తాజాగా పవన్ వ్యాఖ్యలు చేశారు. అయితే శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకుగానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు గానీ ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా.. హోంమంత్రి అనిత ఇందుకు బాధ్యత వహించాలంటూ పవన్‌కళ్యాణ్ ఆ సభలో డిమాండ్ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందుకు బాధ్యత బాబుదే కదా..! హోంమంత్రి అనిత అయినప్పటికీ వాస్తవానికి శాంతి భద్రతల విభాగం పూర్తిగా ముఖ్యమంత్రి ఆ«దీనంలో కొనసాగుతుంది. మూడేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరిగినా, ఆడబిడ్డలపై లైంగిక దాడులు, హత్యాచారాలు చోటు చేసుకున్నా అవన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కిందకే వస్తాయి. అలాంటప్పుడు ఉప మఖ్యమంత్రి మాట్లాడిన మాటల ప్రకారమే.. శాంతి భద్రతల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలి. ఇందుకు విరుద్ధంగా మహిళా మంత్రి, పైపెచ్చు దళిత మంత్రి అయిన హోంమంత్రి అనిత వీటికి బాధ్యత తీసుకోవాలని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘హోంశాఖ మంత్రిగా మీరు బాధ్యత వహించండి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, హత్యలను పట్టించుకోండి. నేను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తోడుదొంగల డ్రామాను బహిర్గతం చేస్తున్నాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు భీషణ ప్రతిజ్ఞలు.. ఇప్పుడు భయమేస్తోందంటూ! ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి కూటమిగా పోటీ చేసిన పవన్‌కళ్యాణ్ పలు సభల్లో ఆయన తరపున కూడా తానే హామీలిచ్చేశారు. ‘రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఏ ఆడ్డబిడ్డపైనా అఘాయిత్యం జరగకుండా బలమైన చట్టాలు తెస్తాం..’ అని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై వరుసగా అఘాయిత్యాలు, చిన్నారులపై అకృత్యాలు జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ కనీసం ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇవ్వలేదని సర్వత్రా విమర్శలున్నాయి. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తమను తిడుతున్నారని.. జనంలోకి వెళ్లాలంటే భయమేస్తోందని పవన్ స్వయంగా పిఠాపురం సభలో చెప్పారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతను హోంమంత్రి పైకి మళ్లించి వైఫల్యాల నుంచి చంద్రబాబు, తాను బయట పడే వ్యూహాన్ని పవన్‌కళ్యాణ్ ఎంచుకున్నారు. ప్రభుత్వమంటే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మొత్తానిది ఉమ్మడి బాధ్యత అని గుర్తులేదా? పవన్‌కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందంటే.. మంత్రివర్గం మొత్తం వైఫల్యం కిందకే వస్తుందని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
జంతువుల కొవ్వుతో ఆయిల్ పవన్ ఇలాకాలో కల్తీ దందా
-
నకిలీ నెయ్యి కలకలం
పిఠాపురం: జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కాæసమాచారం మేరకు పిఠాపురంలో శుక్రవారం ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పిఠాపురంలోని రెండవ రోడ్డులోని పద్మావతినగర్‌లో బండారు ఫణి ప్రసాద్ ఇంట్లో సుమారు 400 కేజీల నకిలీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తయారీ దారులు కమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. రానున్న కార్తీకమాసాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా నకిలీ నెయ్యి తయారు చేసి ఆలయాల వద్ద విక్రయించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కమిషనర్ సైతం ధ్రువీకరించారు. ఇదే పిఠాపురంలో ఇలాంటి కేంద్రాలు ఇంకా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు దొంగలను పట్టుకోరా? ఇదిలా ఉండగా, ఈ విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ.. చాలా మందికి తెలియడంతో విషయాన్ని బయట పెట్టక తప్పలేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చెందుర్తి, కొడవలి, తాటిపర్తి తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో అనధికార కబేళాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ యథేచ్చగా గోవధ జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నెయ్యికి ఉపయోగించే జంతు కొవ్వు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలిసింది. గోవులను చంపి, అందులో కావాల్సిన మాంసాన్ని తీసుకుని.. మిగిలిన వ్యర్థ పదార్థాలను, ఎముకలను కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి, దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే నకిలీ నెయ్యిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిని పలు ఆలయాల్లో పూజలు, ప్రసాదాల తయారీ, దీపారాధనకు వినియోగిస్తున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి దందా వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు తెలిసింది. ఇంత జరిగినా అధికారులు అసలు వ్యక్తులను వదిలేసి.. వీళ్లే నిర్వాహకులంటూ కొందరిపై నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
పిఠాపురం మైనర్ బాలిక ఘటనపై పవన్ కళ్యాణ్ పై వంగగీత షాకింగ్ వ్యాఖ్యలు
-
ఏపీలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువు: వంగా గీత
సాక్షి, కాకినాడ: ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరాు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. అలాగే, పిఠాపురంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పిఠాపురంలో అఘాయిత్యానికి గురైన దళిత బాలికను వంగా గీత బుధవారం పరామర్శించారు. కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలితో మాట్లాడారు. అనంతరం, వంగా గీత మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం సెంటర్లో మిట్ట మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము’ అంటూ కామెంట్స్ చేశారు. -
బాధిత బాలికకు న్యాయం జరిగేనా?
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు. నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
పిఠాపురంలో కత్తుల కూటమి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటినుంచి టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో వారి మధ్య వైషమ్యాలు ముదురుపాకాన పడ్డాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ రూ.50 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నడుస్తోంది.మొత్తం 2,011 ఖాతాదారులున్న ఈ బ్యాంక్‌లో ఐదుగురు డైరెక్టర్ల పదవులకు రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఇరు పార్టీల నుంచి ఐదు స్థానాలకు నామినేషన్లు వేయడంతో కూటమి పార్టీల మధ్య పొత్తు చిత్తయింది. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మధ్యవర్తిత్వం వహించి.. టీడీపీ రెండు, జనసేన మూడు స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిర్చారు.టీడీపీ ఒక స్థానంతో సరి!ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి టీడీపీ ఒక స్థానానికే పరిమితమైంది. పొత్తును చిత్తు చేస్తూ జనసేన బలపరిచిన వ్యక్తులు మూడు (2, 4, 5) స్థానాలు దక్కించుకోగా.. సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు బాలిపల్లి రాంబాబు 1వ వార్డు నుంచి గెలుపొంది డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన తీరుపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.టీడీపీ వర్గాల మండిపాటుసార్వత్రిక ఎన్నికల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా సొసైటీ ఎన్నికల్లో జనసేన నేతలు దొంగ దెబ్బ తీయడాన్ని వర్మ, టీడీపీ నేతలకు పుండుపై కారం చల్లినట్టయింది. వర్మ ప్రాధాన్యం తగ్గించి, దెబ్బకొట్టే వ్యూహంతోనే పవన్ డైరెక్షన్లో జనసేన నేతలు పొత్తు ధర్మాన్ని తుంగలోకి తొక్కారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం చైర్మన్ జనసేనకు, టీడీపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కాలి. దీనికి జనసేన నేతలు తూట్లు పొడిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ఏ ఒక్కటీ దక్కకుండా చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సోమవారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో జనసేన బలపరిచిన చెల్లుబోయిన ప్రమీలా నాగేశ్వరరావు చైర్మన్, మేళం రామకృష్ణ వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. -
పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు.ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి అక్కడ మహిళను కాపలాగా పెట్టి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే వారు జాన్‌ను, మహిళను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జాన్‌ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వాళ్లకి సన్న బియ్యం.. దళితులకు కోటా బియ్యం.. పవన్ ఎంత మోసం చేశాడు...!
-
పవన్ సినిమా ఆర్టిస్ట్, బాబు డ్రామా ఆర్టిస్ట్.. జగన్ దెబ్బకు నోరు మూసుకున్న లోకేష్..
-
ఏపీలో రైతులను నిండా ముంచిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
అతడే ఒక ధైర్యం
-
వైఎస్ జగన్ పిఠాపురం పర్యటనలో భద్రతా లోపం
-
పథకాలు పోయాయ్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజలకు ప్రతి ఒక్కటీ డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు ఏది కావాలన్నా టీడీపీ నాయకులను, జన్మభూమి కమిటీలను వేడుకోవాల్సిన దుస్థితి నెలకొందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘ఎన్నికల ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పిల్లలు కనిపిస్తే చాలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని వారినీ మోసగించారు. 50 ఏళ్లు దాటిన అమ్మలు కనిపిస్తే చాలు.. జగన్ మీకు రూ.18,000 మాత్రమే ఇస్తాడు! చంద్రన్న రూ.48 వేలు ఇస్తాడంటూ వారినీ మోసం చేశాడు. మరి ఎక్కడైనా రూపాయి ఇచ్చాడా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 వంతున ఏటా రూ.36 వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్నాడు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలైనా ఒక్కటీ అమలు కాలేదు. అమ్మఒడి లేదు.. సున్నా వడ్డీ పోయింది.. చేయూత లేదు! ఇంత అన్యాయంగా అందరినీ మోసం చేస్తూ బడి పిల్లల గోరుముద్దను సైతం నిర్వీర్యం చేశాడు. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా అసలే లేదు. 108, 104 సిబ్బందికి జీతాలు లేవు. మూడు త్రైమాసికాలు గడిచిపోయినా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదు. వసతి దీవెన లేదు’ అని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లోనే సచివాలయ సిబ్బంది పింఛన్లు పంచుతున్నారని, ఎవరైనా అలా వెళ్లి తీసుకోకుంటే కట్ చేస్తున్నారన్నారు. కూటమి సర్కారు పాలనలో ఎవరైనా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వారిపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని, పాలన అస్తవ్యస్థంగా మారిందని ధ్వజమెత్తారు. ‘ఇలాంటి దారుణ పాలన పోవాలి. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. వారు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. చంద్రబాబు మోసాలకు కోపం వస్తోంది. ఆ భయంతోనే రెడ్‌బుక్ పాలనకు తెర తీశారు. అయినా ఏమీ చేయలేరు. ప్రజలు భరించే పరిస్థితి లేదు’ అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అయితే సీఎం చంద్రబాబు ఫొటోలకే పరిమితమై డ్రామా ఆర్టిస్టుగా మారారని, పవన్ కంటే బాగా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్న అనంతరం రమణక్కపేటలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...బాబు ఇచ్చింది ఏమిటి? 2014–19 మధ్య 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే చంద్రబాబు పంటల బీమా కింద ఇచ్చారు. అదీ కూడా ప్రీమియం రైతులు కడితేనే వచ్చాయి. మరి ఆయన ఇచ్చింది ఏమిటి? అదే జగన్ హయాంలో రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు ఉచిత పంటల బీమా కింద అందాయి. మా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. చంద్రబాబు పెట్టిన రూ.715 కోట్ల బకాయిలను కూడా నాడు మా ప్రభుత్వమే చెల్లించింది. ఒక్క రైతు భరోసా కిందే 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. రైతులు నష్టపోతే ఆదుకునేందుకు గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా అన్ని విధాలా తోడుగా నిలిచాం. ఇప్పుడు అవేవీ లేకపోవడం, వ్యవస్థలను అస్తవ్యస్థంగా మార్చేయటంతో అన్నదాతలు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. సున్నా వడ్డీ, పంట రుణాలు ఏమయ్యాయి? పెట్టుబడి సాయం ఏమైంది? ఈ–క్రాపింగ్ జరగడం లేదు. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యం అయిపోయాయి. వలంటీర్ల వ్యవస్థ కనుమరుగైపోయింది. ఉచిత పంటల బీమాను గాలికొదిలేశారు. రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు? అదే ఇవాళ మీ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే రైతన్నకు రైతు భరోసా రూ.13,500 వచ్చి ఉండేది. ఎకరాకు రూ.7 వేలు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగా వచ్చి ఉండేది. ఉచిత పంటల బీమా పథకం కింద రూ.24 వేల నుంచి రూ.29 వేల వరకూ పంటల బీమా రైతులకు అందేది. సున్నా వడ్డీ కింద రైతులకు ఎకరాకు కనీసం రూ.4 వేలు వచ్చేవి. అన్నీ కలిపి రైతులకు ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అందేది. పంట నష్టం జరిగితే మేం హెక్టారుకు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో కేవలం రూ.15 వేలు మాత్రమే అందేది. పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు ఇంతవరకు కనీసం ఈ–క్రాప్ కూడా చేయించలేదు. గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీల కోసం జాబితాలు ఎందుకు ప్రదర్శించడం లేదు? మళ్లీ రైతులు టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. పారదర్శకత ఎక్కడా లేదు. 2023–24 ఖరీఫ్‌లో వచ్చిన కరవుకు సంబంధించి రూ.1,278 కోట్ల ప్రీమియంను ఈ ప్రభుత్వం కట్టాలి. కానీ చంద్రబాబు డబ్బులు కట్టకుండా, రైతులకు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు.జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం...సాక్షి ప్రతినిధి, కాకినాడ / గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భదత్ర పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. బుధవారం గుంటూరు జిల్లాలో, శుక్రవారం కాకినాడ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా లోపాలు ఆందోళన కలిగించాయి. ఈ రెండు పర్యటనల్లో వైఎస్ జగన్‌కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంలో ప్రభుత్వం, పోలీసు అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదు. కేవలం ఒక్కో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, అరకొరగా కానిస్టేబుళ్లను భద్రతకు వినియోగించారు. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో వైఫల్యాలపై ఇప్పటికే వైఎస్సార్సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయస్థానంలో కేసు కూడా వేసింది. అయినా ప్రభుత్వం పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా స్పందించడంలేదు. ప్రభుత్వ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గుంటూరులో కనీస భద్రతా లేదు టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డి గుంటూరు జైలులో ఉన్నారు. వారిని ములాఖత్‌లో పరామర్శించేందుకు వైఎస్ జగన్ బుధవారం అక్కడికి వెళ్లారు. తాడేపల్లిలోని నివాస గృహం నుంచి బయల్దేరిన ఆయనకు సాధారణ భద్రత మాత్రమే కల్పించారు. గుంటూరు అమరావతి రోడ్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి లాడ్జి సెంటర్, తాలుకాసెంటర్ మీదుగా జిల్లా జైలుకు చేరే వరకూ దారి పొడుగునా పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. భారీగా తరలివచ్చిన వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించనే లేదు. దాంతో పలువురు గోడలు, గేట్లు వైఎస్ జగన్ ఉన్న ప్రదేశానికి వచ్చేశారు. అక్కడక్కడ గుంపులుగా పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక జైల్లో ములాఖత్ ముగిసి, బయటకు వచ్చిన జగన్ వద్ద పోలీస్ భద్రతే కనిపించలేదు. అక్కడే చెట్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వద్దకు చేరుకునేందుకు ఆయనకు చాలా కష్టమైంది.హెలిపాడ్ దగ్గరా నిర్లక్ష్యంగా పోలీసులు శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద కూడా కనీస భద్రత లేదు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత హెలిపాడ్ ఉన్న కాలేజీ గేటును పోలీసులు తెరవడంతో ఒకేసారి పెద్ద సమూహం జగన్‌ను చుట్టుముట్టింది. అక్కడే ఉన్న రోప్ పార్టీ, పది మంది పోలీసు కానిస్టేబుళ్లు ఆ గుంపును నియంత్రించేందుకు కూడా ప్రయత్నించలేదు. ఎవరు పార్టీ కార్యకర్తలో ఎవరు విద్రోహ శక్తులో కూడా గుర్తించే పరిస్థితి లేదు. మాధవపురం వద్ద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు పైకి కొందరు యువకులు ఎక్కి హల్చల్ చేయడం కలకలం రేపింది. వారిని అడ్డుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నించలేదు. నాగులాపల్లి, ఇసుకపల్లి, రమణక్కపేట వద్ద జనం పెద్దఎత్తున జగన్ కాన్వాయ్‌ను చుట్టుముట్టిన సందర్భంలో రోప్ పార్టీ తగిన రీతిలో స్పందించ లేదు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇలాగే అరకొరగా ఉంటే అభిమానుల ముసుగులో విద్రోహ శక్తులు ప్రవేశించినా అడ్డుకునే పరిస్థితే లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు జగన్‌పై జరిగిన దాడులను గుర్తుకు తెస్తున్నారు. ఒక మాజీ సీఎంకు భద్రతపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. -
జగన్ పిఠాపురం పర్యటనలో భద్రతా లోపం
సాక్షి, పిఠాపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో మరోసారి భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఆయన భద్రత అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు జిల్లాల పర్యటనల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది.కాగా, వైఎస్ జగన్‌కు కల్పిస్తున్న భద్రత సరిపోలేదని ఇది వరకే పలుమార్లు వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ జగన్‌కు భద్రతను కుదించింది. ఇక, వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా భద్రతా లోపం బయటపడుతున్నప్పటికీ కూటమి సర్కార్‌కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.తాజాగా వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కారుపైకి కొందరు యువకులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు యువకులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. అలాగే ఈరోజు ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అయిన సందర్భంలో కూడా హెలిపాడ్ కిక్కిరిసిపోయింది. ఇక్కడ తగినంత భద్రతను పోలీసులు కల్పించలేదు. అయితే, వైఎస్ జగన్ అంటే గిట్టని వారు అభిమానుల ముసుగులో ఏదైనా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ జగన్‌పై జరిగిన దాడులను గుర్తు చేస్తున్నారు. -
నీకు 15వేలు.. నీకు 15వేలు ఎక్కడ?
-
ధైర్యంగా ఉండండి నేనున్నా.
-
రైతులకు జగన్ భరోసా..
-
జగన్ అమలు చేసిన పథకాలు ఇప్పుడు లేవు.. బాగా నష్టపోతున్నాం
-
పిఠాపురంలో వైఎస్ జగన్‌కు జననీరాజనం
-
వరదబాధితులకు జగన్ పరామర్శ.. పిఠాపురంలో జననేతకు జన నీరాజనం (ఫొటోలు)
-
పిఠాపురంలో జగన్ కు అడుగడుగునా జన నీరాజనం
-
జగన్ పాలనలో ఇంత ఘోరం చూడలేదు
-
వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
YS జగన్ పిఠాపురం టూర్.. భారీగా తరలివచ్చిన జనం..
-
పిఠాపురంలో జగన్.. హెలికాప్టర్ దృశ్యాలు..
-
Watch Live: పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన
-
కాసేపట్లో పిఠాపురం పర్యటనకు వైఎస్ జగన్
-
ఏలేరు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: పవన్‌కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్ ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. -
నేడు పిఠాపురంకు వైఎస్ జగన్
-
‘పవన్.. నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావ్’
సాక్షి, కాకినాడ: ఏపీలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో భారీగా పంట నష్టం జరిగింది. ఇక, కూటమి ప్రభుత్వం నిర్లక్క్ష్యం కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. కాగా, వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ప్రజలను, రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏదో అరకొరగా సాయం అందించి ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కాకినాడ రైతులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్నారు.తాజాగా చంద్రబాబు ప్రకటించిన వరద నష్టపరిహారంపై పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లి మండలంలో రమణక్కపేటకు చెందిన రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..‘ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహరం ఎందుకూ పనికి రాదు. ఎకరాకు రూ.30 వేలు ఇస్తేనే రైతు ఆర్ధికంగా గట్టెక్కగలడు. ఏలేరు వరదతో సర్వం కోల్పోయాం. ఐదు రోజులుగా నీట మునిగిన పంట ఎందుకు పనికి రాదు. ఇప్పటికే నీటిలో మునిగిన పంట కుళ్ళిపోయి వరద నీటిలో పైకి తేలుతుంది.ఎకరాకు రూ.10వేలు ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనపై మాకు నమ్మకం లేదు. గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నష్టపోయిన రైతులకు పరిహరం అందించాడా?. డిప్యూటీ సీఎం, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇంత వరకు నష్టపోయిన రైతులను పలకరించ లేదు. ఎన్నికల సమయంలో ఏ చిన్న కష్టం వచ్చినా మీకు నేను ఉన్నాను అంటూ లేనిపోని హామీలు ఇచ్చాడు. ఇప్పుడు కనీసం మావైపు కూడా చూడటం లేదు. ఇదేనా మామీద పవన్‌కు ఉన్న బాధ్యత. ఆయనను నమ్మి గెలిపించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు.ఇది కూడా చదవండి: చంద్రబాబు పర్యటనకు జనసేన ఎమ్మెల్యేలు డుమ్మామా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన పిఠాపురంలో ఉన్నాడో.. హైదరాబాద్‌లో ఉంటున్నాడో మాకు తెలియదు. ఓట్లు వేయించుకున్న ఎంపీ ఉదయ్ ఎక్కడ ఉన్నారు. మా బాధలు ఎందుకు పట్టించుకోరు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి వచ్చి జబర్ధస్ ఆర్టిస్టులు వచ్చి ఏదోదో చెప్పారు. పిఠాపురాన్ని మలేషియా చేస్తాం. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. మాకు ఇంత నష్టం జరిగినా కనీసం ఏ ఒక్కరూ వచ్చి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతుకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు కోసం వచ్చారు కానీ కష్టంలో ఉంటే ఎవరూ కనబడడం లేదు!!పవన్ కళ్యాణ్ ,ఎంపీ ఉదయ పై పిఠాపురం రైతులు ఫైర్. pic.twitter.com/5eFox9Drjn— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) September 11, 2024 -
వరదల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న వంగా గీత
-
నిండా మునిగిన పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం
-
పిఠాపురానికి అండగా నేనున్నా..
-
మీటింగ్ లోనే కొట్టుకున్న కమిషనర్, ఇంజనీర్
-
పూజా సామగ్రిలో సగం వస్తువులు బి చివాట్లు పెట్టిన మహిళలు
-
పవన్ కళ్యాణ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్
-
పిఠాపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
నీకు ఓటేసినందుకు ఇల్లు కూల్చేస్తావా బాబూ.. జగన్ ఉన్నా బాగుండేది...
-
కాళ్లు పట్టుకున్నాడని గెలిపిస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు
-
"డ్రైనేజ్ టు డైమండ్.." పవన్ కొత్త ప్రాజెక్ట్
-
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్‌ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
పిఠాపురంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు
-
వైఎస్ జగన్ ను కలిసిన తర్వాత వంగా గీత రియాక్షన్
-
టీడీపీ Vs జనసేన.. పిఠాపురంలో మరో రచ్చ..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. -
పిఠాపురంలో వర్మపై దాడి చేసిన జనసైనికులు
-
పిఠాపురం వర్మపై జనసేన దాడి
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్‌లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
పిఠాపురం: మామిడిలో రారాజుగా పేరొందిన కొత్తపల్లి కొబ్బరి మామిడికి ఎక్కడాలేని గిరాకీ పలుకుతోంది. మామిడి ప్రియుల మనసు దోచుకున్న ఒకే ఒక్క మధుర ఫలం ఇది. రుచిలో అతి మధురంగా ఉండడంతో ఈ మామిడి పండ్ల రేటు పైపైకి ఎగబాకి పండ్ల ప్రియులను ఊరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మామిడిలో ఎన్నో రకాలున్నప్పటికీ వాటిలో గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడికి ఉన్న డిమాండ్ వేరు. మామిడి రకాల్లో ఈ రెండింటినీ హిడెన్ జెమ్స్‌గా భావిస్తారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించి, సంరక్షించిన గ్రామాల పేరిటే ఇవి ప్రసిద్ధి చెందాయని ఆ ప్రాంతవాసులు అంటున్నారు.ఉత్తమ లక్షణాలున్న పండ్లుగా ఇవి గుర్తింపు పొందడంతో రాజుల కాలం నుంచే వీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని, ఆ రుచిని తాము ఆస్వాదించడంతోపాటు మిత్ర రాజులకు కానుకలుగా పంపేవారట. అందుకే ఒకప్పుడు రాజ సంస్థానాల్లో మాత్రమే ఈ పండ్లు ఉండేవని, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండేవి కావనే ప్రచారం కూడా ఉంది.ఇప్పటికీ ఈ రకం మామిడి పండ్లను తమ స్నేహితులకు, బంధువులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు బహుమతిగా పంపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏటా గోదావరి జిల్లాల నుంచి సుమారు 20 టన్నుల వరకూ కొత్తపల్లి కొబ్బరి, కాకినాడ రూరల్ మండలంలోని పండూరు మామిడి రకాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కవ కాలం నిల్వ ఉండకపోవడంతో ప్రస్తుతం దూర ప్రాంతాలకు ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు. కొత్తపల్లి కొబ్బరి గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన మామిడి రకాల్లో కొత్తపల్లి కొబ్బరిదే ప్రథమ స్థానం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి ప్రాంతంలో లభించే అమోఘమైన రుచి కలిగిన మామిడి పండు ఇది. కొబ్బరి కాయలో మాదిరిగా పీచు అధికంగా ఉండటంతో ఈ రకాన్ని కొత్తపల్లి కొబ్బరిగా పిలుస్తారు. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ సువాసనలు వెదజల్లుతుంటుంది. పూదోటలో మాదిరిగా ఈ రకం మామిడి పండ్లు ఉన్నచోట సువాసనలు వెదజల్లుతుంటాయి.ఈ మామిడి పండులో కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి. ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి సైజు చిన్నగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండటంతో పచ్చి మామిడి తినలేరు. కానీ పండు మాత్రం అతి మధురం. ఇవి మామిడి సీజన్లో మాత్రమే పండుతాయి. పీచు ఎక్కువగా ఉండటంతో ఆవకాయ, ఊరగాయలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మామిడితో పెట్టిన ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ చెట్ల కాపు తక్కువగా ఉంటుంది. పండు చిన్నదే కానీ ధర మాత్రం అదరగొడుతుంది.పండూరు మామిడి ఇది అత్యంత పురాతనమైన మామిడి రకం. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగి, నిండా కాయలుంటాయి. చూడటానికి పప్పులో వేసుకునే చిన్న మామిడి కాయల్లా మాత్రమే ఉంటాయి. పండ్లు కూడా ఆకుపచ్చగానే ఉండటం వీటి ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలగదూరు గ్రామ పరిసరాల్లోని సంస్థానంలో పూర్వం కొందరు దొంగలు మామిడి పండ్లను దొంగిలించి, తిని, వాటి టెంకలను కోట అవతల పారేశారని, వాటిని తీసి నాటగా వచి్చన చెట్టు ద్వారా ఈ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది.దిగుబడి తగ్గి.. డిమాండ్ పెరిగి.. గత ఏడాదికంటే దిగుబడి తగ్గడంతో కొబ్బరి మామిడికి డిమాండ్ అమాంతం పెరిగింది. గత ఏడాది 100 కొబ్బరి మామిడి కాయలు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయించగా ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముడవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పంపడానికి స్థానిక నేతలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు కొని తినే అవకాశం లేకుండా పోయింది. గతంలో దిగుబడి ఎక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండేవి.కానీ ఈ ఏడాది కొబ్బరి మామిడి చెట్లు పూత రాలిపోయి తక్కువగా కాశాయి. దీంతో దిగుబడి చాలా తక్కువ వస్తోంది. కాయ సైజు కూడా చిన్నదిగా ఉంటోంది. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి మామిడి ప్రియులు ఎగబడటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 2 టన్నుల కాయలు విక్రయించాం. మరికొద్ది రోజులు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. – కండేపల్లి సురేన్, మామిడి వ్యాపారి, కొత్తపల్లి వీటి గిరాకీ వేటికీ ఉండదు కొత్తపల్లి కొబ్బరి రకానికి ఉన్న గిరాకీ మరే మామిడి పండుకూ ఉండదు. పీచు అధికంగా ఉండటంతో ఊరగాయలకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండడంతో వీటికి ఎనలేని గిరాకీ పెరిగింది. దీంతో కాయ పెద్దది కాకముందే కోసేస్తున్నాం. మామిడి సీజన్లో మొదటిగా ఇవి అందుబాటులోకి వస్తాయి. కాయ టెంక కట్టగానే పండించడానికి వీలుంటుంది. వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇది తొందరగా ముగ్గిపోతుంది. కాయ బాగా ముదిరితే మంచి నాణ్యత ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా ఉండటంతో ఇవి ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. – ఓరుగంటి నాగబాబు, మామిడి రైతు, చేబ్రోలు -
పిఠాపురం ప్రజలంతా సీఎం జగన్ వైపు..
-
పిఠాపురంలో జోరుగా పోలింగ్
-
జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు
-
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
-
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
-
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
-
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
-
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
-
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
-
దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ జిల్లా: సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కూటమి మోసాలను ఎండగట్టారు. ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే..‘‘చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నాం. గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా..‘‘2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశాం. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు చూశారా. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం. జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచాం’’ అని సీఎం పేర్కొన్నారు.మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే‘‘స్వయం ఉపాధికి గతంలో ఈ పథకాలు ఉన్నాయా?. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. మన మేనిఫెస్టోను నేరుగా ఇళ్లకే పంపి ఆశీస్సులు తీసుకున్నాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే’’ అని సీఎం చెప్పారు.మీ ఇద్దరినీ అడుగుతున్నా..‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరి వెళ్లి భూములు కొన్నాడు.. బాలకృష్ణ మొన్ననే విశాఖలో రిషికొండలో భూమలు కొన్నాడు.. మీ ఇద్దరినీ అడుగుతున్నా.. మీకు ఒరిజినల్ డీడ్స్ ఇచ్చారా? జిరాక్స్ ఇచ్చారా?. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మందికి ఒరిజినల్ డీడ్స్ ఇచ్చాం’’ అని సీఎం జగన్ వివరించారు.దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?‘‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి.. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’’ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. -
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
-
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు. -
వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్.. దద్దరిల్లిన పిఠాపురం
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పిఠాపురం (కాకినాడ జిల్లా)
-
పిఠాపురంలో ప్రచారం.. చిరంజీవి అందుకే వెనకడుగు వేశారా?
జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎందుకని ప్రచారం చేయడం లేదు? ఆయన పిఠాపురం వస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా తన తమ్ముడు మంచి వాడని చెబుతూ చిరంజీవి ఒక వీడియా క్లిపింగ్ ను విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆయన పిఠాపురం వచ్చి ఎందుకని ప్రచారం చేయడం లేదన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్న సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి నేరుగా వచ్చి ప్రచారం చేయడానికి జంకారని అంటున్నారు.2019 ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుండి పోటీ చేశారు. రెండు నియోజక వర్గాల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జనసేన కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అటు పవన్ కల్యాణ్ కూడా రెండింట్లో గెలిచిన తర్వాత ఏ నియోజక వర్గానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసి పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్ ప్రభంజనంలో పవన్ కు ఎదురు గాలి తగిలేసింది. పోటీచేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు. దాన్ని జనసేన నేతలు అవమానంగా భావించారు. ఓటమిని చాలా కాలం పాటు పవన్ జీర్ణించుకోలేకపోయారు. చాలా పెద్ద షాకే కొట్టింది పరాజయం.తన ఓటమికి కారణాలపై పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని శ్రేయోభిలాషులు అప్పట్లోనే సలహా ఇచ్చారు. రెండు చోట్ల ఓడినా పవన్ కల్యాణ్ కొంతకాలానికే కేంద్రంలోని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత జనసేన-బిజెపిల జట్టులోకి టిడిపిని తీసుకురావడానికి బిజెపి అగ్రనేతలతో పదే పదే చర్చలు చేశారు.ఈ సందర్భంగానే ఆయన ఆ పార్టీ అగ్రనేతల నుండి తిట్లు తినాల్సి వచ్చింది కూడా. వాటన్నింటినీ భరిస్తూనే మొత్తానికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. టిడిపి,బిజెపిలతో జట్టు కట్టడంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి తీరాలని పవన్ పంతంగా ఉన్నారు.ఈ సారి కూడా భీమవరం నుండి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకో కానీ ఆయన దాన్ని వదులుకున్నారు. తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే నామినేషన్ వేశారు. పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆమెకు మంచి పేరు ఉండడంతో పాటు ఇంటింటా పరిచయాలు ఉన్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కు గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురంపైనే దృష్టి సారించారు. తనకు మద్దతుగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లచేత ప్రచారం చేయించారు. అదే విధంగా జబర్దస్త్ టీం కూడా పవన్ తరపున ప్రచారం చేస్తోంది.అందరూ చేస్తున్నారు కానీ పవన్ కల్యాణ్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలే అన్నాయి. ఈ నెల 5న ప్రచారానికి వస్తారని ముందుగా అన్నారు. ఆ తర్వాత లేదు లేదు 10 తేదీన వస్తారని అన్నారు. అయితే చివరకు చిరంజీవి పిఠాపురం వచ్చి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగని పూర్తిగా ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్ ఫీల్ అవుతారు కాబట్టి పవన్ గెలిస్తే మంచి చేస్తాడంటూ ఒక వీడియోలో చిరంజీవి తన సందేశాన్ని రికార్డు చేసి విడుదల చేశారు. అదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి ఎందుకు డ్రాప్ అయ్యారన్న అంశంపై చర్చ జరుగుతోంది.విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం చిరంజీవి పిఠాపురం వచ్చి రోడ్ షో నిర్వహించి పవన్ కల్యాణ్ గెలుపు కోసం విస్తృతంగానే ప్రచారం చేయాలని ముందుగా అనుకున్నారట. అయితే ఆ తర్వాత పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఆరా తీస్తే వంగా గీత విజయం ఖాయమని తేలిందట. తాను నేరుగా వచ్చి ప్రచారం చేసినా పవన్ గెలిచే పరిస్థితి లేదని తేలడంతోనే ఊరికే ప్రచారం చేసి తన పరువు తీసుకోవడం ఎందుకని చిరంజీవి భావించారని అంటున్నారు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ పార్టీ కోసం తిరిగారు కాబట్టి.. పవన్ కల్యాణ్ పార్టీ కోసం తాను ప్రచారం చేయకపోతే బాగుండదని అందరూ అనడంతో ప్రచారం చేద్దామనుకున్నారట. కనీసం పవన్ పోటీ చేసే నియోజక వర్గానికే ప్రచారాన్ని పరిమితం చేయాలనుకున్నారట. తీరా పవన్‌కు విజయవకాశాలు లేవని సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి ప్లాన్ మార్చి వెనకడుగు వేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీన్ని మెగా అనుచరులు కొట్టి పారేస్తున్నారు. చిరంజీవి వీడియో క్లిపింగ్‌కే పరిమితం కావడంతో పవన్ కల్యాణ్‌లోలోన గుర్రుగా ఉన్నారని అంటున్నారు -
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
-
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
-
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
-
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
-
పవన్ పై ఏపీ NRIలు కౌంటర్
-
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్‌గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్‌పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్‌లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్‌ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్‌పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్‌పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్‌ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్‌కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!
-
పవర్ స్టార్ కు ఓటమి భయం..! వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
-
చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్
-
పిఠాపురంలో పవన్ పరిస్థితిపై విజయ్ బాబు విశ్లేషణ ...!
-
పిఠాపురంలో పవన్ అష్టకష్టాలు
-
ఆ ఎంపీ టికెట్‌తో పిచ్చెక్కిపోతున్న పవన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తలపోటుగా ఉన్నప్పుడు ఓ కప్పు స్ట్రాంగ్ టీ తాగితే ఉపశమనం కలుగుతుందంటారు. ఆ టీలో అల్లం వేసుకుంటే మరింత రుచికరంగా, తలపోటుకు తక్షణ పరిష్కారంగా ఉంటుంది. అటువంటి టీ తాగినా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలపోటు ఎక్కువైపోతోందే తప్ప తగ్గడం లేదనే చర్చ కాకినాడ జిల్లా జనసేన సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. టీ టైమ్ అవుట్లెట్లతో తనకు అత్యంత సన్నిహితుడైన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఏరికోరి మరీ కాకినాడ ఎంపీ అభ్యర్థిని చేశారు పవన్ కల్యాణ్. ఇప్పుడా అభ్యర్థిత్వమే పవన్‌కు పెద్ద తలపోటుగా మారింది. ఊరించి ఊరించి.. శ్రీనివాస్‌కు జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ నుంచి వారాహి యాత్ర వరకూ అన్నీ తానై చూసుకున్న శ్రీనివాస్‌కు పవన్ కల్యాణ్ తొలుత జనసేన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ప్రమోషన్ అన్నట్టు.. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్‌ను బరిలోకి దింపుతామని సంకేతాలు అందించారు. ఈ మేరకు శ్రీనివాస్, ఆ పార్టీ నేతలు ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. నాలుగు రోజులు గడిచేసరికి పవన్ కల్యాణ్ నాలుక మడత పెట్టేశారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఓసారి.. కాదు కాదు.. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రోజుకో మాట చెబుతూ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేశారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఆయన కూడా చాలా కాలం మీమాంసలో పడ్డారు. చివరకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి శ్రీనివాస్‌కు జెల్ల కొట్టారు. అయితే, ఆ నొప్పి ఆయనకు తెలియనివ్వకుండా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. పిఠాపురంలో అంతా టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతోందని, తమను కాదని పవన్ ఇక్కడ ఏ నిర్ణయమూ తీసుకోలేరని పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ తొలి నుంచీ బాహాటంగానే చెబుతూ వచ్చారు. సరిగ్గా ఉదయ్ శ్రీనివాస్ విషయంలో అదే జరిగింది. వ్యతిరేకిస్తున్న టీడీపీ జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్‌ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం టీడీపీ సరికొత్త రాజకీయానికి తెర తీసింది. ఆయనను ఆ స్థానంలో కూడా ఉండే అవకాశం లేకుండా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు శ్రీనివాస్‌కు పొగ పెడుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ స్థానంలో పట్టుమని పది మందితో కూడా పరిచయం లేని శ్రీనివాస్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిని చేసేయడమేమిటని టీడీపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులు వాదన తీసుకువస్తున్నారు. పారీ్టలోని సీనియర్లతో మాట వరసకైనా సంప్రదించకుండా పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వారికి రుచించడం లేదు. అలాగని నేరుగా బయట పడకుండా, శ్రీనివాస్‌ను సాగనంపేందుకు చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తోంది. అవి మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉదయ్ శ్రీనివాస్‌ను మార్చాలని గట్టిగా పట్టు పడుతున్నారు. సానా సతీష్‌కు కట్టబెట్టేందుకు.. ఉదయ్ శ్రీనివాస్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడైన సానా సతీష్‌ను తెర మీదకు తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పేరు పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకుని వస్తున్నారు. అటు టీడీపీ, ఇటు జనసేనలకు సమదూరం పాటిస్తూ, చారిటబుల్ ట్రస్టు పేరుతో కాకినాడ పార్లమెంటరీ స్థానాన్ని ఆశిస్తున్న స్థానికుడైన సతీష్ పేరు పరిశీలించాలని టీడీపీ అగ్ర నేతలు ఇటీవల చంద్రబాబును కోరారు. తద్వారా ఎంపీ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా ఉంది. కాకినాడ ఎంపీ సీటు ఆశించి భంగపడిన జ్యోతుల నవీన్ కుమార్ వర్గీయులు కూడా ఉదయ్ శ్రీనివాస్‌తో విభేదిస్తున్నారు. ఒక దశలో నవీన్ కుమార్ తండ్రి, జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సైతం ‘సూట్‌కేసులతో వచ్చే వారికి సీట్లు ఇచ్చేస్తే.. ఇక్కడ పారీ్టనే నమ్ముకుని కష్టపడి చేస్తున్న నాయకులు ఏమైపోవాలి’ అంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఆ సమయంలోనే పవన్ పట్టుబట్టి మరీ ఉదయ్ శ్రీనివాస్‌ను ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు.దీనిపై టీడీపీ అభ్యర్థులు కన్నెర్ర చేస్తున్నారు. పార్లమెంటరీ అభ్యర్థిని ప్రకటించే ముందు ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న వారిని సంప్రదించాలనే కనీస సంప్రదాయం కూడా పాటించలేదనే సాకుతో శ్రీనివాస్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముక్కూ మొహం తెలియని ఉదయ్ శ్రీనివాస్‌ను ఏ ప్రాతిపదికన కాకినాడ ఎంపీ అభ్యరి్థని చేశారని వారు ప్రశి్నస్తున్నారు. తంగెళ్లకు చెక్ పెట్టేందుకు చాప కింద నీరులా టీడీపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు పవన్‌కు తలపోటుగా మారాయి. టీడీపీ ఖాతాలో వేసుకునేందుకేనా.. అయితే, ఇదంతా చంద్రబాబు వ్యూహమేనని జనసేన నాయకులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తమ పారీ్టకి కేటాయించిన కాకినాడ ఎంపీ స్థానాన్ని లాక్కునేందుకే ఉదయ్ శ్రీనివాస్‌పై వ్యతిరేక ప్రచారం నడుపుతున్నారని మండిపడుతున్నారు. ఏ పారీ్టలోనూ చేరకుండా గోడ మీద.. సామెత చందంగా ఉన్న సతీ‹Ùను ఎందుకు ప్రతిపాదిస్తున్నారని ఇటీవల జరిగిన టీడీపీ, జనసేన పారీ్టల సమన్వయ సమావేశంలో ఉదయ్ శ్రీనివాస్ వర్గీయులు గట్టిగా ప్రశ్నించారని తెలిసింది. ఇదిలా ఉండగా కాకినాడ ఎంపీ బరిలో నిలిచేందుకు ఉదయ్ శ్రీనివాస్ చివరి వరకూ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన బుధవారం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, చివరి నిమిషం వరకూ కూడా అభ్యర్థులను తనకు నచ్చిన రీతిలో మార్చేసిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఏ తీరానికి చేరుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఖర్చులు ఇవ్వడం లేదని.. ఉదయ్ శ్రీనివాస్‌ను మారి్పంచేందుకు టీడీపీ అభ్యర్థులు గట్టిగా పట్టు పట్టడానికి మరో కారణం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న వారికి అవుతున్న ఖర్చులు కనీసంగా భరించడానికి కూడా ఉదయ్ శ్రీనివాస్ సహకరించడం లేదని అంటున్నారు. ఇది కూడా ఆయనపై టీడీపీ నేతల వ్యతిరేకతకు కారణమని చెబుతున్నారు. తన వెనుక పవన్ ఉన్నారనే ధైర్యంతో.. మితిమీరిన విశ్వాసంతో ఉదయ్ శ్రీనివాస్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని టీడీపీ అభ్యర్థులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. -
ఎన్నికల వేళ.. పవన్ సంపద సృష్టి
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం. ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. ఇదిలా ఉంటే.. అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్‌కళ్యాణ్ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ (పవన్‌కళ్యాణ్–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. చదివింది పదో తరగతే.. ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) రద్దయి, దాని స్థానంలో ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదవడం గమనార్హం. ఇంటర్లో మేథమేటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్.. అవన్నీ హంబక్ అని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్ బూత్ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు. పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్ వివరాలు లేవు. చరాస్తులు.. ► పవన్‌కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు. ► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్‌తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్ రోవర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్ ట్రక్ వాహనాలున్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి. ► పిల్లలు దేశాయి అకీరా నందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్ శంకర్ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్‌కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్తులు.. ► హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. ► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు. ► హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్ జూబీహిల్స్‌లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్ శంకర్ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్ పేర్కొన్నారు. పవన్‌కళ్యాణ్ నామినేషన్ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు. అక్కడ నినాదాలూ చేశారు. బీజేపీ నేతలకు పరాభవం.. కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్‌కళ్యాణ్.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. -
పవన్ విద్యార్హతపై పూటకో మాట.. పిఠాపురం నామినేషన్లో తేటతెల్లం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా పిఠాపురం అసెంబ్లీకి నామినేషన్ వేశాడు. అందులో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివారలను పొందుపరిచి అందరి సందేహాలకు ఫుల్స్టాప్ పెట్టాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి 15 ఏళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో ఆయన చదువుకు సంబంధించిన వివరాలు అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా నామినేషన్ పత్రంలో ఆ వివరాలను పవన్ పొందుపరిచాడు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే పెద్దగా విద్యార్హత ఉండాలనే నిబంధనంటూ ఏమీ లేదు.. దానిని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. కానీ ఇక్కడ పవన్ మాత్రమే విద్యార్హత విషయంలో ఎందుకు ట్రోల్ అవుతున్నాడంటే.. గతంలో తనకు వచ్చిన మార్కులకు సీట్ రాకపోవడంతో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో చెప్పాడు. కొద్దిరోజుల గ్యాప్‌లోనే తను అనుకున్న సీట్ రాకపోవడంతో వేరే గత్యంతరం లేక ఎమ్ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పాడు. అంతటితో పవన్ చదువు ఆగిపోలేదు ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌కు వెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు. ఇలా ఆయన పొంతన లేని మాటలు చెప్పడంతో అసలు పవన్ ఇంటర్మీడియట్ చదివాడా లేదా..? ఒకవేళ చదివితే ఏ గ్రూప్ చదివాడో తెలుసుకోవాలని నెటిజన్లు కూడా ఆరాటపడేవారు. సీఈసీ , ఎమ్ఈసీ,ఎంపీసీ ఇలా ఇంటర్మీడియట్లోని దాదాపు అన్నీ గ్రూపుల పేర్లు పవన్ చెప్పడంతో ప్రజల్లో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. పవన్ ఏం చదివారంటే.. పిఠాపురం అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నాడు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 1984లో పదోతరగతి పూర్తి చేసినట్లు పవన్ తెలిపాడు. చదువు గురించి గతంలో పవన్ ఇలా కూడా చెప్పుకొచ్చాడు. ఒకసారి చదవంటే ఇష్టం అంటాడు.. కానీ నాకు చదవు పెద్దగా రాదని మరోకసారి అంటాడు. ఇంకోసారి అయితే ఇంగ్లీష్ రాదు అంటాడు.. మళ్లీ ఇంగ్లీష్‌లో తాను ఫస్ట్ అంటాడు. ఎలక్ట్రానిక్ డిప్లొమా చేశానంటాడు.. మళ్లీ ఇంతలోనే కంప్యూటర్స్‌లో డిప్లొమా చేశాను అంటాడు. ఆపై డాక్టర్‌ను అవ్వాలని గట్టిగా ప్రయత్నం చేశాను అంటాడు. ఇలా ఆయన నుంచే తన చదువు గురించి పలు సందర్భాల్లో పొంతన లేని వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లలలో కూడా పవన్ విద్యార్హత గురించి ఆసక్తి నెలకొంది. ఫైనల్‌గా ఆయన ఏం చదువుకున్నాడో పిఠాపురం చెప్పేసింది. -
భారీ ర్యాలీతో పిఠాపురంలో నామినేషన్ వేసిన వంగ గీత
-
పిఠాపురంలో వంగా గీత ప్రచార జోరు
-
పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్...పిఠాపురంలో జనసేన ఖాళీ
-
పిఠాపురం:ఫలితం ఏదైనా వర్మకు వేదనే
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ పడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు రాజకీయంగా సమాధే అనే అభిప్రాయం ఆయన అనుచరవర్గం నుంచే వినిపిస్తోంది. ఒకవేళ విజయం సాధిస్తే అదంతా తన బలమేనని పవన్ గొప్పలు పోవడం గ్యారంటీ. ఓటమి పాలైతే వర్మ వెన్నుపోటు పొడిచారనే నెపం నెట్టేస్తారు. ఫలితం ఏదైనా తమ నాయకునికి రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోందని వర్మ వర్గీయులు బలంగా భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పవన్, వర్మల మధ్య సఖ్యత వీధుల్లో మాత్రమే కనిపిస్తోందని, అంతర్గతంగా ఎన్నెన్నో ఉన్నాయని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులైన టీసీ నాగిరెడ్డి (గాజువాక) చేతిలో 16,753 ఓట్లు, గ్రంధి శ్రీనివాస్ (భీమవరం) చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు చివరి నిమిషం వరకు కలరింగ్ ఇచ్చారు. టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళుతుండటం, తన సామాజిక వర్గీయులైన కాపు ఓటర్లు అధికంగా ఉన్నందున పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానాన్నిఎంచుకుని పోటీకి దిగారు. ఇక్కడి నుంచి 2014లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారీ్టతో గెలుపొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వర్మను పొత్తుల మాటున పక్కకు నెట్టి పవన్ కల్యాణ్ సీటు చేజిక్కించుకున్నారు. మాటపై నిలబడతారా? అసెంబ్లీ సీటు చేజారడంతో జనసేనకు సహకరించే ప్రసక్తే లేదని, అనుయాయుల సహకారంతో మళ్లీ ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతానని బీరాలు పోయిన వర్మతో బాబు మంతనాలు జరిపి.. పవన్‌కు సహకరించేందుకు సమ్మతింపజేసిన సంగతి విదితమే. అన్యమనస్కంగానే ప్రచారంలోకి దిగిన తమ నేతతో ఎనలేని సఖ్యతను నటిస్తూ ఎన్నికల వరకూ సర్వం నీ చేతుల మీదుగానే సాగాలని అభిలíÙస్తున్నట్లుగా పవన్ పోకడలు ఉంటున్నాయని వర్మ అనుచరగణం అంటోంది. వాస్తవంగా జనసేన, టీడీపీ వ్యవహారాలు ఆ దిశగా లేవనేది క్షేత్ర స్థాయిలో పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు మిత్రపక్షంలోని బీజేపీది పిఠాపురంలో నామమాత్రపు పాత్రేనని అంటున్నారు. ఈ పరిస్థితిలో వర్మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. పవన్ గెలుపు ఓటముల్లో ఏదైనా సరే తనకు సంకట స్థితేనని ఈ మాజీ ఎమ్మెల్యే తన ముఖ్య అనుయాయుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. పవన్‌ది మాటపై నిలబడే తత్వం కాదని అనేక అంశాల్లో ఇప్పటికే నిర్ధారణయ్యింది. నాగిని నృత్యంలా ఆయన నాలుక ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది. అవసరానికి వాడుకుని ఎన్నికలయ్యాక తూచ్.. నీకూ నాకూ చెల్లు అనడన్న గ్యారంటీ ఏమిటి? అనే ప్రశ్నను విజయవాడలో టీడీపీ ముఖ్య నాయకుని వద్ద వర్మ వ్యక్తం చేశారు. తర్వాత పిఠాపురం వైపు చూస్తారా? ఎన్నికలయ్యాక పవన్ పిఠాపురం వైపు చూస్తారా అనే అనుమానాలు జనసేనతో పాటు టీడీపీ క్యాడర్‌లోనూ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత రెండు పర్యాయాలు మాత్రమే ఆయన గాజువాక వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు ఓసారి, పార్టీ నాయకులతో సమావేశానికి మరోసారి వచ్చారు. భీమవరానికి కూడా అంతే. పార్టీ నాయకులతో సమావేశానికి ఓ రోజు, వారాహి యాత్రలో భాగంగా మూడు రోజులు ఉంటానని చెప్పి, రెండు రోజులకు పరిమితమయ్యారు. నామమాత్రంగా పార్టీ సమావేశం కానిచ్చేసిన పవన్.. తక్కిన సమయాన్ని బ్రో సినిమా ట్రైలర్ డబ్బింగ్ పనికి వినియోగించుకున్నారు. 2023లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జనసేన అధినేత.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 21న ముఖ్య నాయకులను కలుసుకునేందుకు మరోమారు వచ్చారు. పోటీ అంత సేఫ్ ఏమీ కాదు పోటీకి పిఠాపురాన్ని ఎంచుకున్నప్పటికీ అదంత సేఫ్ సీటేమీ కాదనే అనుమానాలు పవన్ వర్గంలో లేకపోలేదు. ఇదివరకే సొంత జిల్లాలోని భీమవరం నుంచి పవన్ ఓటమి చెందగా, ఆయన సోదరుడు చిరంజీవి సైతం సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో బి.ఉషారాణి చేతిలో పరాభవం చవిచూశారు. మరో సోదరుడైన నాగబాబు సైతం నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా ఓడారు. వీటన్నింటినీ పరిశీలిస్తే గోదావరి జిల్లాలు కొణిదెల కుటుంబానికి సానుకూలం కాదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాగా, పవన్ కల్యాణ్ ధోరణికి పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా యాక్టర్, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పవన్‌ను కలవాలనుకునే వారికి ఏమాత్రం సాధ్యపడటం లేదు. ఈ విషయమై కొందరు నచ్చజెప్పగా ముందుగా నిర్ణయించిన వారిలో రోజుకు 50–60 మందికి సెల్పీలు దిగే అవకాశం ఇస్తానని సెలవిచ్చారట. ఈ లెక్కన రానున్న 30 రోజుల్లో గరిష్టంగా 1500–1800 మందిని కలుసుకోగలరన్న మాట. అదీ ఆయన నెల రోజుల పాటు నియోజకవర్గంలో నిలకడగా ఉన్న పక్షంలోనే. లేదంటే అదీ లేదు. ఇప్పుడే ఇలాగైతే ఎన్నికల తర్వాత తమ పరిస్థితి ఏమిటని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గీత.. పక్కా లోకల్ పవన్‌కు పోటీదారైన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత విద్యాభ్యాసం అనంతరం టీడీపీలో చురుకుగా ఉంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యే (ప్రజారాజ్యం)గా, లోక్‌సభ సభ్యురాలిగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వంగా గీతను ‘మా అమ్మాయి’ అని చెప్పుకునేంతగా అందుబాటులో ఉంటూ కలిసిపోతారని, ఆమెతో పోటీ పడటం అంత సులువు కాదని టీడీపీ, జనసేన పారీ్టల ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాం వంగా గీత విజయం తథ్యం
-
పిఠాపురంలో ఎగిరేది జగన్ జెండానే..
-
'పేదలపై చంద్రబాబుది కపట ప్రేమ'
-
బాబు మళ్లీ మభ్యపెడుతున్నారు
కాకినాడ రూరల్: ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొత్త హామీలతో గ్యారంటీలు, వారంటీలంటూ వస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మబోరని మాజీమంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ–జనసేన–బీజేపీలు 2014లో కూడా కలిసే ఉన్నాయన్నారు. నాటి మేనిఫెస్టోలో చంద్రబాబు సుమారు 650 హామీలిచ్చారని కన్నబాబు గుర్తుచేశారు. ఇందులో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తామన్నారని, అక్కచెల్లెమ్మల బంగారం తానే విడిపిస్తానన్నారని.. అలాగే, అప్పట్లో ఆయనిచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.15 వేల కోట్లు మాత్రమే చేశారని కన్నబాబు చెప్పారు. ఇక రూ.14,502 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని.. ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.25 వేలు జమ చేస్తామన్నారని, ఏ ఒక్కరికైనా చేశారా అని కన్నబాబు ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి 2014 నుంచి ఐదేళ్ల కాలంలో రూ.1.20 లక్షలు ఇచ్చి ఉండాలని.. కానీ ఎక్కడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కన్నబాబు చెప్పారు. వలంటీర్ వ్యవస్థపై బాబు, పవన్‌ల అవహేళన.. ఇక వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ గతంలో చులకనగా మాట్లాడారని, ఇప్పుడు మాటమార్చి వారికి హామీలిస్తున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించి, వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని ఆపించి ఏం సాధించారని ప్రశ్నించారు. ఇంటింటికీ పింఛన్లు అందక సుమారు 35 మంది చనిపోయారన్నారు. పింఛన్ల లబి్ధదారుల బాధలను గుర్తించే సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా జగన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కూటమి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకులేదని కన్నబాబు స్పష్టంచేశారు. బాబు సెంటు స్థలమైనా ఇచ్చారా మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల ఇళ్ల స్థలాలిచ్చారని, ఐదేళ్ల కాలంలో చంద్రబాబు సెంటు స్థలమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు నాటి మేనిఫెస్టోనే టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించారని చెప్పారు. ఆ రోజులేని నిబద్ధత, నైతికత ఈరోజు ఎలా వస్తుందని..రూ.4 వేల పింఛను ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే, నాడు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయించలేని వారు ఇప్పుడెలా చేయించగలరని కూటమి పారీ్టలను ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం మీడియా బలంతో వ్యవహారం నడుపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు బాగు కోసమే పవన్ పార్టీ
తణుకు అర్బన్: చంద్రబాబు బాగుకోసమే పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ కళ్యాణ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కమ్మ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన తణుకు నియోజకవర్గ కాపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని తప్పుపడుతున్న పవన్ కాపులకు ఏం చేశారని నిలదీశారు. ప్రజలను డబ్బులకు అమ్ముడుపోయే వారిలా చిత్రీకరిస్తూ పిఠాపురంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటుకు రూ.లక్ష ఇచ్చి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారనడం బాధాకరమన్నారు. ‘క్లబ్బులు నడిపే వారితో సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తున్నావు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రెస్‌మీట్ ద్వారా నేరుగా నన్ను తిట్టవచ్చు. అప్పుడు నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ ముద్రగడ సవాల్ విసిరారు. 21 అసెంబ్లీ సీట్లకు పరిమితమై త్యాగపురుషుడిగా కీర్తి సాధించావంటూ ఎద్దేవా చేశారు. వాటిలో కూడా టీడీపీ నుంచిజనసేనకు వచ్చినవారి సంఖ్యే అధికమని తెలిపారు. ముద్రగడ భార్య చనిపోయిందని, కొడుకు చనిపోయాడని నీచాతి నీచంగా పోస్టులు పెట్టిస్తున్న నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తోందని చెప్పారు. నీచాతినీచంగా నాణ్యమైన లిక్కర్ ఇస్తామంటూ రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చారని విమర్శించారు. పవన్‌ను ఇంటికి పంపించండి ఈ ఎన్నికల్లో పవన్‌ను రాజకీయంగా ప్యాక్ చేసి ఇంటికి పంపించాలని కాపు నాయకులకు ముద్రగడ పిలుపునిచ్చారు. పేదల పెన్నిధిగా నిలబడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి అండగా నిలబడతామని, జగన్ చేసిన మంచే ఆయనకు రక్షగా ఉంటుందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని నిన్ను తొక్కేస్తా అంటూ ఊగిపోవడం, ఉక్రోషంగా, ఉద్రేకంగా మాట్లాడే పవన్ తీరు ఏ రాజకీయ నాయకుడికీ లేదని, రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
పెన్షన్లు ఆపేస్తారా.. మీకు ఓటు అడిగే హక్కు లేదు
-
ఉత్తర కుమారుడి ఆల్ టైమ్ రికార్డ్..
-
అను‘మతి’ లేని పవన్ కళ్యాణ్ పర్యటన
పిఠాపురం: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరి. అలాంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటిస్తూ.. అధికారులు అడ్డుకుంటే ప్రభుత్వంపై నెపాన్ని నెడుతూ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన నాలుగో రోజు మంగళవారం నిబంధనలకు విరుద్ధంగా సాగడంతో ఎన్నికల అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు. పవన్ తొలుత పిఠాపురం ఏబీసీ చర్చిలో ప్రార్థనలకు వచ్చారు. ఆ చర్చి పాస్టర్లు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో మొక్కుబడిగా ప్రార్థనలు పూర్తిచేసుకున్న పవన్ అక్కడి నుంచి కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు బషీర్‌బీబీ దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం రోడ్డు షోగా బయలుదేరి యు.కొత్తపల్పిలోని ఒక ఫంక్షన్ హాలులో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఇంతలోనే అక్కడికి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకొని సమావేశం నిర్వహణకు అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. దీంతో జనసేన నేతలు నీళ్లు నమిలారు. అధికారులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక త్వరలోనే మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి అక్కడి నుంచి పవన్ వెళ్లిపోయారు. తోసేస్తున్నది బౌన్సర్లే తన పైన, తన సెక్యూరిటీ పైన కొందరు అల్లరి మూకలు బ్లేడ్లతో దాడి చేస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ సోమవారం వ్యాఖ్యానించారు. అయితే పవన్ పర్యటనలో అడుగడుగునా ఆయన అనుచరులు, బౌన్సర్లు జనంతో తీవ్ర ప్రతిఘటనకు దిగుతూ బలవంతంగా తోసేస్తున్నారు. దీంతో పలువురు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాగా, పవన్ మంగళవారం పర్యటన వివరాలు అంటూ జనసేన అధికారికంగా షెడ్యుల్ ప్రకటించింది. దీని ప్రకారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గంటగంటకూ మార్పులు చేసుకుంటూ అసలు ఆయన ఎక్కడ ఆగుతారో.. ఎక్కడకు వెళతారో తెలియని అయోమయ పరిస్థితులు సృష్టించారు. దీంతో పోలీసులు అవస్థలుపడ్డారు. పగలు పిఠాపురం.. రాత్రి హైదరాబాద్ పవన్ నాలుగు రోజుల పర్యటన పగలు పిఠాపురం.. రాత్రి హైదరాబాద్ అన్నట్టుగా కొనసాగడం చర్చనీయాంశమైంది. ప్రతి రోజూ మధ్యాహ్నం వరకూ మాత్రమే పిఠాపురంలో ఉండి, రాత్రికి హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లి వస్తున్నారు. కాగా, పవన్‌కళ్యాణ్‌ను సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, డ్యాన్స్ మాస్టర్ జానీ తదితరులు పిఠాపురంలో కలుసుకున్నారు. వారితో కలసి ఆయన మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు.ప్లాన్ ప్రకారమే..సమావేశం ఉన్నట్టు జనసేన పార్టీ ముందు రోజే అధికారికంగా ప్రకటించింది. అటువంటప్పుడు దీనికి అనుమతి కోసం ఎందుకు దరఖాస్తు చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే అనుమతి తీసుకోకుండా సమావేశం ఉన్నట్లు ప్రచారం చేసుకుని.. తీరా జనం ఉండగా సమావేశం ఆగిపోతే ఆ నెపం ప్రభుత్వం మీదకు నెట్టి సానుభూతి పొందేందుకు ప్రణాళిక ప్రకారమే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. ఏదైనా ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలనుకుంటే 24 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని, కానీ ఈ సమావేశం కోసం జనసేన నేతలెవరూ తమకు దరఖాస్తు చేయలేదని పిఠాపురం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వరప్రసాద్, వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ టీవీ విలేకరిపై దాడికి యత్నం పవన్ పర్యటనలో ఆయన బౌన్సర్లు జనసేన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. పిఠాపురం చర్చిలో ప్రార్థనలకు పవన్ హాజరు కాగా, అక్కడకు వచ్చిన జనసేన ఉభయ గోదావరి జిల్లాల నాయకురాలు చల్లా లక్షి్మని బౌన్సర్లు అడ్డుకుని తోసేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ భూషణంపై దాడి చేయడానికి బౌన్సర్లు ప్రయత్నించగా.. స్థానిక మీడియా ప్రతినిధులు అడ్డుకుని, ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని బౌన్సర్లను అక్కడి నుంచి పంపించేశారు. పవన్‌కళ్యాణ్ పర్యటనకు వర్మ డుమ్మా ‘నా గెలుపు బాధ్యత అంతా వర్మదే. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడుచుకోండి..’ అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పి ఒక్క రోజు కూడా కాలేదు. రెండోరోజే పవన్ పిఠాపురం పర్యటనకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ డుమ్మా కొట్టారు. పవన్ పిఠాపురం, కొత్తపల్లి పర్యటనల్లో వర్మతో పాటు టీడీపీ నేతలెవరూ పాల్గొనలేదు. దీంతో ఇక్కడ పొత్తు మళ్లీ చిత్తయిందని పలువురు పేర్కొంటున్నారు. అయితే పవన్ పర్యటన వివరాలు, సమాచారం తనకు తెలియజేయకపోవడం వల్లే తాను రాలేదని పిఠాపురం జనసేన ఇన్చార్జి, ఆ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌పై వర్మ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై ఉదయ్‌శ్రీనివాస్ తన అనుచరులకు క్లాస్ పీకి ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగకుండా చూసుకుంటామని వర్మను బతిమలాడుకున్నట్లు చెబుతున్నారు. -
నాలుక మడతేసి అడ్డంగా దొరికిపోయాడు
-
లెక్కలేనంత తిక్క.. పవన్ రోజుకో మాట.. పూటకు వ్యాఖ్య
-
పిఠాపురం నుండి పోటీ చేస్తే కాపులే గెలిపిస్తారని పవన్ భావన
-
పిఠాపురం అంటే పవన్ కు ఎందుకంత భయం..?
-
టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. పిఠాపురం జనసేన నేతలతో పవన్
పిఠాపురం: ‘టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. వాళ్లను ఫాలో అవ్వండి’ అని తన పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సూచించారు. పిఠాపురం పర్యటనను ఆదివారం అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన.. సోమవారం మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన నేతలందరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరుతో ఫొటో దిగాలని ఉందని, పరిస్థితులు అనుకూలించగానే రోజుకు 200 మందితో ఫొటోలు దిగాలని భావిస్తున్నట్టు తెలిపారు. తన విజయం కోసం స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మెజారిటీ ఎంత తీసుకురావాలనేది వారిపైనే వదిలేస్తున్నానని, వారు పడే కష్టం మీదే తన మెజారిటీ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్, పాలకొండకు చెందిన నిమ్మక జయకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. సాయంత్రం పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతా టీడీపీ నేతలతోనే అని పవన్ అంటుంటే.. ఇక తామెందుకు అంటూ జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి పనిచేస్తుంటే ఎవరి కిందో పని చేయాలనడం ఎంత వరకూ సమంజసమంటూ పవన్ తీరుపై వారు రుసరుసలాడుతున్నారు. -
పవన్ ఇలా చేశావేంటి?.. పిఠాపురంలో జనసైనికులకు అవమానం
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం ఎదురైంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ ప్రయాణం అయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు పడిగాపులు కాశారు. హోటల్ లోపలికి రానివ్వకుండా పవన్ బౌన్సర్లు గేటు మూసేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకుని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు. పార్టీ కోసం సేవ చేసిన తమను చులకనగా చూస్తున్నారని తమ ఆవేదనను వాట్సాప్ గ్రూపులో జనసేన కార్యకర్తలు షేర్ చేశారు. పిఠాపురానికి ఎవరెవరో వస్తున్నారు.. వారిని భుజంపై మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాహి వాహనం అనుమతి తీసుకోలేక పోయారని ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన కార్యకర్తలు తిట్టుపోసుకుంటున్నారు. ఇదీ చదవండి: జనసేనను చిదిమేసిన చంద్రబాబు -
పిఠాపురంలో పవన్ గెలవడు: ముద్రగడ
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా గ్లామర్ వల్లే పవన్ రాజకీయ ఉనికి ఇంకా కొనసాగగలుగుతోందని ముద్రగడ కుండబద్ధలు కొట్టారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడ పలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌కు సినీ గ్లామర్ మాత్రమే ఉంది. అందుకే యువకులు ఆయన వెంటపడుతున్నారు. కానీ, ఏరకంగా చూసుకున్నా పవన్ కంటే ఆయన అన్న చిరంజీవి ఎంతో బెటర్. రాజకీయాలు పక్కనపెట్టి పవన్ చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు. అసలు పిఠాపురంలో ఎట్టిపరిస్థితుల్లో పవన్ గెలిచే ప్రసక్తే లేదు అని ముద్రగడ చెబుతున్నారు. ఇక తనపై పోలీసుల దాడి అప్పట్లో నారా లోకేష్ ఆదేశాల మేరకే జరిగిందని ముద్రగడ సంచలన ఆరోపణ చేశారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ పాలనపై ముద్రగడ ప్రశంసలు గుప్పించారు. సీఎం జగన్ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. వైఎస్ జగన్ మాదిరిగా ఏ సీఎం ఇంత స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించలేదు. అందుకే జ్యోతిబసు(పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) కంటే ఎక్కువ కాలం జగన్ ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేయాలి అని ముద్రగడ ఆకాంక్షించారు. ఇక వైఎస్సార్సీపీలో చేరిన తాను.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. -
జనసేన నేతలకు పవన్ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: జనసేన నుంచి టికెట్లు దక్కని వారికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సరికొత్త ఆఫర్ ఇచ్చారు. అలా సీట్లు రాని ఆశావహులు తన గెలుపు కోసం కృషి చేయాలని వర్తమానం పంపారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఇచ్చిన పిలుపు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారుతోంది. భంగపడ్డ జనసేన నేతలకు పార్టీ ముఖ్య నేతలతో ఈ తరహా ఫోన్లు చేయిస్తున్నారు. పవన్ గెలుపు కోసం పని చేయడం ఓ గొప్ప అవకాశంగా భావించాలని ఉచిత సలహా కూడా ఇస్తుండడంతో నిరాశావహులంతా విస్తుపోతున్నారు. ఇలా ప్రచారం చేస్తే ఆయన దృష్టిలో పడతారని, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యతనిస్తారని మరో ఆశ కల్పిస్తున్నారు. ఎందుకిలా... మేం ఉండే నియోజకవర్గాలను వదిలి పిఠాపురం ఎందుకు రా.. రమ్మంటున్నారన్న సందేహం ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. తాము ఇక్కడుంటే టికెట్ రాలేదన్న అసంతృప్తితో టీడీపీకి సహాయనిరాకరణ చేస్తామనే అపనమ్మకమా? అక్కడ మా వల్ల ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం నిజంగా ఆయనకు ఉందా? అని వారిలో వారు చర్చించుకుంటున్నారు. ఏదైతేనేం. అధినేత పిలుస్తున్నారు కదా.. ఓ సారి వచ్చిపోదామని బయల్దేరుతున్నారు. ♦ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భీమిలి జనసేన సీటును పంచకర్ల సందీప్ ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. ఊరించి ఊరించి ఆయనకు ఆఖరికి ‘సారీ’ చెప్పేశారు. తీవ్ర ఆవేదనతో ఉన్న ఆయనకు పిఠాపురం వచ్చేయాలని కబురొచ్చింది. దీంతో ఆయన పిఠాపురం బయల్దేరి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ♦గాజువాక సీటును ఆశించి భంగపడ్డ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు కోన తాతారావుకు కూడా పిఠాపురం రావాలని పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఇప్పటికే పిఠాపురం వెళ్లారు. అక్కడ ప్రచారంలో పాల్గొనడంతోపాటు జనసేన ఎన్నికల ప్రణాళికలు, వ్యూహాల్లో పాలుపంచుకున్నారు. ♦చోడవరం అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్న పీవీఎస్ఎన్ రాజుకు కూడా పిలుపు వచ్చింది. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, అక్కడ టీడీపీ సీటును ఆశిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మకు పీవీఎస్ఎన్ రాజు సమీప బంధువు. దీంతో రాజు పిఠాపురం వెళ్లి వర్మ అభిమతానికి భిన్నంగా, పవన్‌కు అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది. 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ ఈనెల 30న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రచారాన్ని ఆరంభించి, మూడు విడతలుగా ప్రచారం కొనసాగిస్తారని సోమవారం జనసేన పార్టీ పేర్కొంది. ఇదీ చదవండి: ‘దేశం’లో కమలం కల్లోలం -
కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది: వంగా గీత
-
జనసేన ఆఫర్ పై పవన్ కళ్యాణ్ కు వంగా గీత సూచన
-
పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ప్రజలు నమ్మొద్దని భీమవరం వాసుల విజ్ఞప్తి
-
పిఠాపురంలో పవన్ ఎదురీత.. గెలుపు కోసం నానా తంటాలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్న పవన్‌కల్యాణ్ ఈ సారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, బరిలోకి దిగకుండానే పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. మిత్ర పక్షాలనుంచి సహకారం కరువు అవ్వడంతో పిఠాపురంలో పవన్ ఎదురీదుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు భగ్గుమన్నారు. పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో టీడీపీ, జనసేన క్యాడర్ అయోమయంలో పడింది. పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే.. దీంతో పిఠాపురంలో గెలుపు కోసం పవన్ కల్యాణ్ నానా తంటాలు పడుతున్నారు. వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయించారు. పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నా గెలుపుపై గ్యారెంటీ కనిపించకపోవడంతో వెతికి వెతికి చివరికి పిఠాపురం ఎంచుకున్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు, పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీత క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన గీత గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాద్యతలు నిర్వహించిన వంగా గీతకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో పవన్ తన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అనుకుంటున్నప్పటికీ అక్కడ అంతే బలంగా ఉన్న వంగా గీతను ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: జేపీ కొత్త రంగు.. అదీ అసలు సంగతి! -
పిఠాపురం లేఖ..పవన్ ను నమ్మొద్దు..!
-
మహిళల శక్తి.. ఈ ముగ్గురికి మూడినట్టే
-
పిఠాపురంలో పవన్ పోటీ.. డౌటే
-
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తానన్నారు. ‘‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’’ అని వర్మ అన్నారు. కాగా, పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందన్న పవన్.. మరోవైపు, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఒక వేళ అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదీ చదవండి: చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం -
"నన్ను మోసం చేయవు కదా..!"
-
వంగా గీతను బ్రతిమిలాడినా పవన్ కొమ్మినేని షాకింగ్ విషయాలు
-
వంగా గీత ఎవరికీ భయపడే వ్యక్తికాదు..పవన్ కళ్యాణ్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తా
-
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ వైఎస్సార్సీపీలోకి జనసైనికులు
-
పవన్ తర్జనభర్జన.. ఇంతకీ పిఠాపురంలో పోటీ చేస్తారా?
సాక్షి, కాకినాడ: ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందన్న పవన్.. మరోవైపు, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఒక వేళ అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీపై స్పష్టత లేకపోవడంతో జనసేన వర్గాలు టెన్షన్ పడుతున్నారు. ఇదీ చదవండి: నారా లోకేష్‌పై టీడీపీలో కొత్త చర్చ.. అసలేం జరుగుతోంది? -
పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏమిటో?
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ప్రకటించారు. రాష్ట్రం అంతా దుర్భిణీ వేసి వెతికి చివరికి పిఠాపురం ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నా గెలుపుపై గ్యారెంటీ కనిపించడంలేదు. పిఠాపురం అనుకున్నప్పటినుంచీ అక్కడ నాన్ లోకల్ వివాదం మొదలైంది. మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలంటూ అక్కడ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నియోజకవర్గానికి గెస్ట్‌గా వచ్చే నేత వద్దంటూ అక్కడివారు నినదిస్తున్నారు. మరి అక్కడ పవన్ పరిస్థితి ఏంటో చూద్దాం. గత ఎన్నికల్లో తనను ఓడించినందుకు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోని ప్రజల్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిందించారు. ఒక్క చోట కూడా గెలిపించకపోవడం వల్లే తన పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని వాపోయారు. పదేళ్ళుగా చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్న పవన్‌కల్యాణ్ ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ ఫోబియా పవన్‌ను వెంటాడుతోంది. అందుకే నియోజకవర్గం ఎంచుకోవడానికి ఇంత ఆలస్యం చేశారు. తనకు కులం లేదని చెప్పుకుంటూనే నిరంతరం కాపుల జపం చేస్తున్నారు. అందుకే కాపులు మెజారిటీగా ఉండే పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుకున్నా అక్కడి పరిస్థితులు సానుకూలంగా లేవని అర్థమైంది. దీంతో కాకినాడ జిల్లా పిఠాపురం అయితే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేత తమ అనుచరులతో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు జనసేనలో కలకలం రేపాయి. లోకల్ ..నాన్ లోకల్ అనే అర్ధం వచ్చేలా పిఠాపురం నియోజకవర్గంలో దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. పిలిస్తే పలికేవాడే మాకు కావాలంటూ వెలిసిన ఆ ఫ్లెక్సీలు పవన్‌ను అక్కడ పోటీ చేయవద్దనే ఏర్పాటు చేసి ఉంటారని..అది కూడా టీడీపీ ఆశావహుడు వర్మ ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడ ఎప్పటినుంచో పనిచేసుకుంటున్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ మాత్రం జనసేనకు ఇవ్వడానికి వీల్లేదని గట్టిగా పట్టుపడుతున్నారు. చదవండి: పవన్‌కు షాక్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు పొత్తులో భాగంగా పిఠాపురం జనసేన ఖాతాలో చేరుతుందనే ప్రచారంతో టీడీపీ శిబిరంలో అసమ్మతి రాజుకుంది. సీటు జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమని కొద్ది రోజుల క్రిందట టీడీపీ నేత వర్మ అనుచురులు చంద్రబాబుకు హెచ్చరికలు పంపారు. ఆ మధ్య వర్మ నిర్వహించిన పలు సమావేశాల్లో.. పిలిస్తే పలికే వాడికే ఓటు వేయ్యాలి కానీ.. ఎక్కడో దూరంగా ఉంటూ..అప్పుడప్పుడు వచ్చేవాళ్ళకు ఓటు వేసి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పిలిస్తే పలికే వ్యక్తి వర్మ.. లోకల్ వ్యక్తి వర్మ అని పలువురు బాహటంగానే ప్రచారాలు మొదలు పెట్టారు. దీంతో పిఠాపురంలో వెలసిన ప్లెక్సీలు టీడీపీ పనే అని అందరు చర్చించుకుంటున్నారు. పిఠాపురానికి నాన్ లోకల్ అయిన పవన్ కళ్యాణ్‌కు అడ్డుకట్ట వేసేలా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. పవన్ పోటీ చేస్తే మాత్రం సహకరించరాదని టీడీపీ నేత వర్మ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీత క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన గీత గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాద్యతలు నిర్వహించిన వంగా గీతకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో పవన్ తన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అనుకుంటున్నప్పటికీ అక్కడ అంతే బలంగా ఉన్న వంగా గీతను ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. -
పవన్ కళ్యాణ్ పోటీపై వంగా గీత అదిరిపోయే రియాక్షన్
-
ఇలా అయితే పవన్ గెలవడం కష్టం
-
పిఠాపురం రచ్చ.. వర్మ దారెటు?
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండానే సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు నుంచి అనుచరులు రావాలని వర్మ స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి వర్మ మొగ్గుచూపుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీలో రచ్చ మొదలైంది. ఇప్పటికే వర్మకు పార్టీ పెద్దలనుంచి పిలుపు రాగా, కార్యకర్తలతో సమావేశం తర్వాత వస్తానని వర్మ చెప్పినట్లు సమాచారం. కాగా, కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించిన పది నిమిషాలకే అక్కడ టీడీపీలో అసమ్మతి అగ్గి రగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్టు నిరాకరించడంపై ఆ పార్టీ వర్గాలు పిఠాపురంలో గురువారం తీవ్ర స్థాయి ఆందోళనకు దిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద వర్మ అనుచరులు, ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రికలు తగులబెట్టారు. వర్మకు టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి, రెబల్‌గా పోటీ చేయిస్తామని గతంలోనే వారు ప్రకటించారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలు సైతం పట్టుకోబోమని ఇటీవల చెప్పారు. తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనతో భగ్గుమన్న టీడీపీ నేతలు చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. ఇప్పటి వరకూ సీటు వర్మదే అంటూ నమ్మబలికిన చేతకాని లోకేశ్ ఇప్పుడు మాట మార్చి తమను మోసం చేశాడంటూ పలువురు మహిళా నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యాడర్‌తో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు. పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకూ సేవ చేస్తే తనకు కాకుండా ఎవరో స్థానికేతరుడికి సీటు కేటాయించడం దారుణమంటూ పవన్ కల్యాణ్‌ను స్థానికేతరుడని పరోక్షంగా విమర్శించారు. తాను స్థానికుడినని పవన్ స్థానికేతరుడని చెబుతూ ఎవరి కోసమో తన సీటును బదలాయించడం చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. -
పవన్ కళ్యాణ్ కు టీడీపీ మహిళా లీడర్లు వార్నింగ్
-
పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం: KSR
-
పొత్తు మంటలు..
-
పిఠాపురం నుంచి పవన్ పోటీ.. టీడీపీలో అసంతృప్తి సెగలు
-
Pithapuram Protest Photos: భగ్గుమన్న పిఠాపురం (ఫొటోలు)