Shaun Pollock
-
Ind Vs Sa: కోహ్లి మరీ ఇంత చెత్తగా ప్రవర్తిస్తావా.. అసలేం అనుకుంటున్నావు?
Ind Vs Sa 3rd test- Virat Kohli- Elgar DRS Call Row: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మండిపడ్డాడు. మరీ ఇంత చెత్తగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించాడు. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించాలన్న కోహ్లి సేనకు కఠిన సవాలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్, అందుకు కోహ్లి బృందం స్పందించిన తీరు ఎంతటి వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ‘‘కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు. ముందు మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి’’ అని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గౌతం గంభీర్... ‘‘కోహ్లికి ఏమాత్రం పరిణతి లేదు. భారత జట్టు కెప్టెన్ స్టంప్స్ మైక్ వద్దకు వెళ్లి ఇలా చెప్పడం నిజంగా చెత్త విషయం. ఇలా చేయడం ద్వారా యువ క్రికెటర్లకు నువ్వు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు’’ అంటూ కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు షాన్ పొలాక్ ఈ వివాదంపై స్పందిస్తూ.. వికెట్ తీయాలన్న కసితో ఉన్న టీమిండియాకు ఎల్గర్ డీఆర్ఎస్ కాల్‌తో తప్పించుకోవడం మింగుడుపడలేదని.. అందుకే ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నాడు. ఏదేమైనా ప్రసారకర్తలను ఉద్దేశించి అలా మాట్లాడటం సరికాదన్నాడు. కాగా నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు 8 వికెట్లు పడగొడితేనే విజయం సాధ్యపడుతుంది. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ pic.twitter.com/00dPXQv8sK — Addicric (@addicric) January 13, 2022 pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
Ind Vs Sa: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ భేష్: ప్రొటిస్ మాజీ సారథి
Shaun Pollock Comments On KL Rahul Captaincy: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేఎల్ రాహుల్‌ను ప్రొటిస్ మాజీ ఆటగాడు షాన్ పొలాక్ ప్రశంసించాడు. అవసరమైన సమయంలో శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దింపి వ్యూహాత్మకంగా వ్యవహరించాడని కితాబిచ్చాడు. కాగా వెన్ను నొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఇక అచ్చొచ్చిన వాండరర్స్ మైదానంలో ఎలాగైనా విజయం సాధించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతున్న వేళ కీలక పేసర్ తొలి రోజు ఆటలో భాగంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో భారత శిబిరం ఆందోళనలో మునిగిపోయింది. అయితే, రెండో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి అతడు అందుబాటులోకి వచ్చినా ఎలా రాణిస్తాడోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ రాహుల్ వ్యూహాత్మకంగా శార్దూల్ ఠాకూర్‌ను రంగంలోకి దింపాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ ఏడు వికెట్లు కూల్చి సత్తా చాటాడు శార్దూల్. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మాజీ సారథి షాన్ పొలాక్ మాట్లాడుతూ... ‘‘నిజంగా రెండో రోజు ఆటకు ముందు టీమిండియా ముంగిట కొన్ని సవాళ్లు ఉన్నాయి. సిరాజ్ గాయపడ్డాడు. కీలక బౌలర్ ఇలాంటి పరిస్థితిలో ఉండటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ సిట్యువేషన్లో ఏ కెప్టెన్ అయినా ఒత్తిడికి గురవడం సహజం. అక్కడే రాహుల్ తెలివిగా ఆలోచించాడు. ఫస్ట్ సెషన్ తర్వాత పద్ధతి మార్చాడు. బాగానే బౌల్ చేస్తున్నారు. కానీ వికెట్లు తీయకపోతే కష్టం అనుకున్నాడేమో! ఇంకా ఏం చేయాలి? అని ఆలోచించి ఉంటాడు. శార్దూల్‌ను పంపాడు. లంచ్‌కు ముందు అతడు చేసిన అద్బుతం చూశాం కదా’’ అని రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక టీమిండియా వెటరన్ దినేశ్ కార్తిక్ సైతం రాహుల్ కెప్టెన్సీ బాగా చేశాడంటూ అభినందించాడు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-5లోకి బంగ్లాదేశ్... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! -
నో బాల్స్ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది?
టెస్టుల్లో నో బాల్స్ వేయడమే అరుదు. మరి అలాంటిది దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ నో బాల్స్ విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఇప్పటివరకు 17 నో బాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలోనే రబాడ చెత్త రికార్డు నమోదు చేశాడు. సౌతాఫ్రికా తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన జాబితాలో రబాడ చోటు దక్కించుకున్నాడు. ఇంతకముందు 1997-98లో కేప్‌టౌన్ టెస్టు వర్సెస్ శ్రీలంకతో మ్యాచ్‌లో షాన్ పొలాక్ 17 నోబాల్స్ వేయగా.. ఆ తర్వాత మళ్లీ పొలాక్ 1998 నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 17 నోబాల్స్ వేశాడు. ఇక 2004-05లో పోర్ట్ ఎలిజిబెత్ టెస్టు వర్సెస్ ఇంగ్లండ్‌తో డేల్ స్టెయిన్ 16 నోబాల్స్ వేయడం విశేషం. చదవండి: Virat Kohli: రెండు ఇన్నింగ్స్‌లో ఒకేలా ఔటైన కోహ్లి.. ఫ్యాన్స్ ట్రోల్ -
Virat Kohli: దెబ్బకు హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో: ప్రొటిస్ మాజీ బౌలర్
Ind vs Sa 1st Test, Shaun Pollock About Virat Kohli: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అవుటైన తీరుపై ప్రొటిస్ మాజీ బౌలర్ షాన్ పొలాక్ స్పందించాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న సమయంలో వికెట్ పారేసుకోవడం కోహ్లికి కూడా చిరాకు తెప్పించి ఉంటుందని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత కెప్టెన్ తీవ్ర నిరాశకు గురై ఉంటాడని, దెబ్బకు హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో అని వ్యాఖ్యానించాడు. కాగా బాక్సింగ్ డే టెస్టులో భారత్‌కు శుభారంభం లభించిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీ, కేఎల్ రాహుల్ అద్భుత శతకం(నాటౌట్)తో రాణించిన సంగతి తెలిసిందే. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారా మాత్రం మరోసారి పూర్తిగా నిరాశ పరచగా.. 94 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ముఖ్యంగా రాహుల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్నాడనుకుంటున్న సమయంలో నిర్లక్ష్య ధోరణితో వికెట్ పారేసుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా టచ్ చేశాడు. ఫలితంగా పెవిలియన్ చేరాడు. ఈ విషయం గురించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ మాట్లాడుతూ... ‘‘అతడెలా అవుట్ అయ్యాడో చూడండి. టచ్‌లో ఉన్నాడు.. మంచిగా ఆడుతున్నాడు... క్రీజులో కుదురుకున్నాడు కాబట్టి భారీ స్కోరు చేస్తాడు అనుకున్న సమయంలో... 35 పరుగులకే నిష్క్రమించాడు. చూస్తున్నవాళ్లే కాదు.. తాను కూడా పూర్తిగా నిరాశకు లోనై ఉంటాడు. తను అవుట్ అయిన తీరును జీర్ణించుకోలేక కోపం, విసుగుతో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో’’అని పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(122 పరుగులు), అజింక్య రహానే(40) క్రీజులో ఉన్నారు. చదవండి: Mayank Vs Lungi Ngidi: మయాంక్ అగర్వాల్ ఔట్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో జయవర్ధనే, పొలాక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్‌లతో పాటు ఇంగ్లండ్ దివంగత మహిళా క్రికెటర్ జెనెట్టె బ్రిటిన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆరంభానికి ముందు వీరిని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో అధికారికంగా చేరుస్తారు. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్‌గా షాన్ పొలాక్ ఘనతకెక్కాడు. బ్రిటిన్ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది. -
‘అతని బౌలింగ్ అంటే ఎంతో ఇష్టం’
కేప్‌టౌన్: భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదని దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పొల్లాక్ పేర్కొన్నాడు. 1990-2000ల మధ్యలో భారత్‌కు శ్రీనాథ్ ప్రధాన బౌలింగ్ ఆయుధని పొల్లాక్ తెలిపాడు. కానీ అతని ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదని పొల్లాక్ అన్నాడు. 1991 నుంచి 2003 వరకూ భారత జట్టు తరఫున శ్రీనాథ్ 67 టెస్టులు, 229 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 236, వన్డేల్లో 315 వికెట్లు తీశారు. ('ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే') వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌరల్ మైఖేల్ హోల్డింగ్, ఇంగ్లండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్‌తో కలిసి ఓ చర్చలో పాల్గొన్న పొల్లాక్ .. ‘శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదు. మా కాలంలో చాలా మంచి బౌలర్లు ఉన్నారు. పాకిస్థాన్‌లో వసీం అక్రమ్, వకార్ యూనిస్.. వెస్టిండీస్‌లో కల్ట్రీ ఆంబ్రోస్, వాల్ష్, ఆస్ట్రేలియాలో గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతో మంది గొప్ప బౌలర్లు ఉన్నారు’’ అని అన్నారు.తన రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లలో డెయిల్ స్టెయిన్ బౌలింగ్ తనకు ఎంతో నచ్చిందని పొల్లాక్ పేర్కొన్నారు. ఎటువంటి వికెట్‌పై అయినా స్టెయిన్కి బౌలింగ్ చేసే సత్తా ఉందని చెప్పిన పొల్లాక్.. అతను ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. అతని రికార్డులే అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. (ఐపీఎల్ జరిగేలా లేదు ) -
సచిన్ ‘షార్ట్ పిచ్’ ఆడలేనన్నాడు!
న్యూఢిల్లీ: దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఒక దశలో ఆస్ట్రేలియా గడ్డపై షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడట! దానికి ప్రత్యామ్నాయంగా ఇతర షాట్లపై దృష్టి పెట్టి పరుగులు రాబట్టాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో గతంలో సచినే స్వయంగా తనకు చెప్పినట్లు అతను గుర్తు చేసుకున్నాడు. ‘ఆస్ట్రేలియాలో ఆట గురించి నాతో సచిన్ ఒకసారి మాట్లాడాడు. ఇక షార్ట్ పిచ్ బంతులు ఆడటం తన వల్ల కాదని అర్థమైనట్లు అతను చెప్పాడు. అందుకే వికెట్ కీపర్, స్లిప్ మీదుగా ర్యాంప్ షాట్లు ఆడతానని నాకు వివరించాడు’ అని పొలాక్ గుర్తు చేసుకున్నాడు. అయితే భారత ఉపఖండానికి వచ్చే సరికి మాత్రం సచిన్‌ను అవుట్ చేసేందుకు తమ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉండేవి కావని అతను అభిప్రాయ పడ్డాడు. ‘నాటి రోజుల్లో సచిన్‌ను అవుట్ చేయడం మన వల్ల అవుతుందా కాదా అని అనుకునేవాళ్లం. అతని కోసం ఏదైనా మంచి వ్యూహం రూపొందించే ప్రయత్నం చేయకుండా అతనే తప్పు చేస్తే బాగుండే దని కోరుకునేవాళ్లం’ అని పొలాక్ భారత స్టార్‌ను ప్రశంసించాడు. -
పొలాక్ మదిలో సచిన్ కానీ అతడి జాబితాలో..
హైదరాబాద్ : టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై దక్షిణాఫ్రికా మాజీ సారథి షాన్ పొలాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన తరం క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ సచిన అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకుంటాడని ప్రశంసించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలాక్ పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నాడు. ‘పరిస్థితులను ఆకలింపు చేసుకుని, జట్టు అవసరాలకు తగ్గట్లు తన ఆటను మార్చుకుంటాడు. అతడికి సంధించే షార్ట్ పిచ్ బంతులను కీపర్, స్లిప్ ఫీల్డర్ల మీదుగా ఆడే షాట్స్ అప్పట్లో ఓ వండర్ అనుకోవాలి. టెక్నికల్‌గా అతడి బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు. అందుకే ఔట్ చేయడం చాలా కష్టంగా అనిపించేది. అయితే అతడు తప్పిదం చేసేవరకు వేచి చూసేవాళ్లం’అని పొలాక్ పేర్కొన్నాడు. ఇక సచిన్ వన్డేల్లో 9 సార్లు అవుట్ చేసిన పొలాక్.. ఎక్కువ సార్లు అతడిని అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. వివి రిచర్డ్స్ పేరు చెప్పిన హోల్డింగ్ ఇక ఇదే అంశంపై వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘నేను చూసిన అప్పడు, ఇప్పుడు, ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ వివి రిచర్డ్సే. రిచర్డ్ హ్యాడ్లీ, డెన్నీస్ లిల్లీ, అబ్ధుల్ ఖాదీర్, బిషన్ బేడి, ఇయాన్ బోథమ్ వంటి అప్పటి ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లను సమర్థవంతంగా ఎలాంటి భయం, బెరుకు లేకుండా పరుగులు రాబట్టాడు. అందుకే రిచర్డ్స్ అత్యుత్తమ ఆటగాడని నా అభిప్రాయం’అని హోల్డింగ్ పేర్కొన్నాడు. -
సరికొత్త రికార్డుకు వికెట్ దూరంలో..
గాలె: దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ సరికొత్త రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లను సాధించేందుకు స్టెయిన్‌కు వికెట్ మాత్రమే అవసరం. ప్రస్తుతం 421 టెస్టు వికెట్లతో ఉన్న స్టెయిన్.. సఫారీ దిగ్గజ పేసర్ షాన్ పొలాక్ సరసన సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్లు సాధించిన స్టెయిన్ పొలాక్ సరసన నిలిచాడు. అయితే పొలాక్ కంటే 21 టెస్టులు ముందుగానే స్టెయిన్ ఈ ఫీట్‌ను సాధించడం ఇక్కడ మరో విశేషం. శుక్రవారం నుంచి కొలంబోలో జరుగనున్న రెండో టెస్టులో స్టెయిన్ తమ దేశం తరపున అత్యధిక టెస్టు వికెట్లను సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కే అవకాశం ఉంది. భుజం గాయంతో దాదాపు 13 నెలలు పాటు క్రికెట్‌కు దూరమైన స్టెయిన్.. తన చివరి టెస్టును గతేడాది జనవరిలో భారత్‌పై ఆడాడు. -
మూడు వికెట్ల దూరంలో..
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో వసీం ఆక్రమ్ తర్వాతి స్థానం ఎవరంటే దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ అని క్రికెట్ పండితులు పేర్కొంటారు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలిత్తించిన స్టెయిన్ నేడు(జూన్ 27న) 35వ ఏట అడుగుపెడుతున్నాడు. 2004లో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన స్టెయిన్ అనతికాలంలోనే జట్టులో, క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. స్టెయిన్ 14 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు సాధించాడు. ఈ మధ్య కాలంలో వరుస గాయాలతో జట్టుకు దూరమవుతూ ఇబ్బందులు పడుతున్నా.. తన బౌలింగ్ వేగం ఎక్కడా తగ్గటం లేదు. కుర్రాళ్లు ఎంతమంది జట్టులోకి వచ్చి అదరగొట్టినా, స్టెయిన్ ప్రత్యేకతే వేరు. క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఈ స్పీడ్‌గన్ మరో మూడు టెస్టు వికెట్లు సాధిస్తే దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకోల్పనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(421) సాధించిన రికార్డు ప్రొటీస్ దిగ్గజం షాన్ పొలాక్ పేరిట ఉంది. ఈ రికార్డును శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో స్టెయిన్ తిరగరాస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. ‘నా టార్గెట్ 100 టెస్టులు, 500 వికెట్లు , 2019 ప్రపంచకప్’ అంటూ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అనంతరం డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. వయసుతో సంబంధం లేకుండా తన లక్ష్యం పూర్తి చేసేవరకు క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాను సాధించాల్సిన లక్ష్యాలకు గాయాలు అడ్డంకి కాదని, గాయంతో జట్టుకు దూరమైనప్పుడు మరింత ఉత్తేజంతో తిరిగి జట్టులోకి వస్తానని ఈ ప్రొటీస్ బౌలర్ తెలిపాడు. -
'నన్ను టీమిండియా నిరాశపరిచింది'
పోర్ట్ ఎలిజబెత్:సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి సంబరాల్లో మునిగితేలుతున్న టీమిండియాపై దక్షిణాఫ్రికా బౌలింగ్ గ్రేట్ షాన్ పొలాక్ అసహనం వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ గెలిచామన్న ఆనందం టీమిండియాలో ఉంటే ఉండొచ్చుకానీ, టెస్టు సిరీస్ విజయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందనేది ఈ సందర్భంగా పొలాక్ పేర్కొన్నాడు. తమతో టెస్టు సిరీస్‌కు పర్యాటక జట్టైన టీమిండియా సరైన ప్రాధాన్యాలు లేకుండా బరిలోకి దిగడం తనను తీవ్రంగా నిరాశ పరిచిందన్నాడు.'టీమిండియా బ్యాటింగ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. భారత్ బ్యాటింగ్ లైనప్ చూస్తే దక్షిణాఫ్రికాకు కష్టమే అనుకున్నా. అయితే సీన్ రివర్స్ అయింది. టెస్టుల్లో భారత్ నిరాశ పరిచింది’ అని పొలాక్ అన్నాడు. టెస్టు సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం మరింత సమయాన్ని టీమిండియా కేటాయిస్తే బాగుండేదన్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ముందు పలువురు ఆటగాళ్లు అక్కడ కౌంటీ గేమ్స్ ఆడుతుంటారని, అప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్టుగా అలవాటుపడిపోవచ్చని అన్నాడు. కాగా, కెప్టెన్‌గా టీమ్‌లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడని పొలాక్ అన్నాడు. కోహ్లీకి జట్టులోని సభ్యుల సహకారం వల్లే వన్డే సిరీస్‌ను టీమిండియా నెగ్గిందన్నాడు. ప్రత్యర్థిని ఎలా గౌరవించాలో మాల్కం మార్షల్ తనకు నేర్పాడని, దాంతో పాటే ఆత్మ విశ్వాసమూ ఎంత ముఖ్యమో బోధించాడని పొలాక్ అన్నాడు. టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని ఎల్లవేళలా ఉంచేందుకే కోహ్లి దూకుడుగా ఉంటాడని పొలాక్ విశ్లేషించాడు. -
10 ఓవర్లు.. 5 మేడిన్లు.. 6 వికెట్లు!
షాన్ పొలాక్.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడీ దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్. తన ప్రతిభా సామర్థ్యాలతో అనేకసార్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2000 నుంచి 2003 వరకు సౌతాఫ్రికా టీమ్ కు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాదు కౌంటీ క్రికెట్ లోనూ సత్తా చాటాడు. 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో తొలి కౌంటీ మ్యాచ్ ఆడిన పొలాక్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 1996, ఏప్రిల్ 26న లీచెస్టర్ షైర్ టీమ్ తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో 6 వికెట్లు పడగొట్టి వార్విక్ షైర్ జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 10 ఓవరల్లో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి అరడజను వికెట్లు నేలకూల్చాడు. ఇందులో 5 మేడిన్ ఓవర్లు ఉన్నాయి. అంతేకాదు 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతను ట్విటర్ ద్వారా పొలాక్ గుర్తు చేశాడు. తొలి కౌంటీ మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నాడు. ఆ రోజు తాను వేసి ప్రతి బంతి, ఎమోషన్ ఇప్పటికీ తనకు గుర్తున్నాయని ట్వీట్ చేశాడు. 20 yrs on!Surreal experience-1st day County nerves, still clearly remember each ball & the emotion that went with it https://t.co/OSTYtKY1VY — Shaun Pollock (@7polly7) 26 April 2016 -
చతికిలపడ్డ సచిన్ సేన
-
చతికిలపడ్డ సచిన్ సేన
హూస్టన్: వార్న్ వారియర్స్ ముందు సచిన్ బ్లాస్టర్స్ తేలిపోయారు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ సచిన్ సేన చతికిలపడింది. ఆల్ స్టార్ క్రికెట్ టి20 సిరీస్ లో భాగంగా అమెరికాలోని హూస్టన్ లో గురువారం జరిగిన రెండో మ్యాచ్ లో షేన్ వార్న్ నాయకత్వంలోని వారియర్స్ ఘనవిజయం సాధించింది. బ్లాస్టర్స్ ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వారియర్స్ నిర్దేశించిన 263 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన సచిన్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. సెహ్వాగ్ 16, సచిన్ 33, గంగూలీ 12, లారా 19, క్లుసెనర్ 21, స్వాన్ 22 పరుగులు చేశారు. చివర్లో షాన్ పొలాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. పొలాక్ 22 బంతుల్లో 7 సిక్సర్లు, ఫోర్ తో 55 పరుగులు పిండుకున్నాడు. వారియర్స్ బౌలర్ సైమండ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. కుమార సంగక్కర 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో వారియర్స్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. న్యూయార్క్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో బాస్టర్స్ పై వారియర్స్ గెలిచింది.