సరికొత్త రికార్డుకు వికెట్‌ దూరంలో.. | Steyn now needs only one more scalp to make the record | Sakshi
Sakshi News home page

సరికొత్త రికార్డుకు వికెట్‌ దూరంలో..

Published Sun, Jul 15 2018 4:01 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

Steyn now needs only one more scalp to make the record - Sakshi

గాలె: దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ సరికొత్త రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లను సాధించేందుకు స్టెయిన్‌కు వికెట్‌ మాత్రమే అవసరం. ప‍్రస్తుతం 421 టెస్టు వికెట్లతో ఉన్న స్టెయిన్‌.. సఫారీ దిగ్గజ పేసర్‌ షాన్‌ పొలాక్‌ సరసన సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో ఇక‍్కడ జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్లు సాధించిన స్టెయిన్‌ పొలాక్‌ సరసన నిలిచాడు.

అయితే పొలాక్‌ కంటే 21 టెస్టులు ముందుగానే స్టెయిన్‌ ఈ ఫీట్‌ను సాధించడం ఇక్కడ మరో విశేషం. శుక‍్రవారం నుంచి కొలంబోలో జరుగనున్న రెండో టెస్టులో స్టెయిన్‌ తమ దేశం తరపున అత్యధిక టెస్టు వికెట్లను సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కే అవకాశం ఉంది.  భుజం గాయంతో దాదాపు 13 నెలలు పాటు క్రికెట్‌కు దూరమైన స్టెయిన్‌.. తన చివరి టెస్టును గతేడాది జనవరిలో భారత్‌పై ఆడాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement