చతికిలపడ్డ సచిన్ సేన | Warne's Warriors won by 57 runs | Sakshi
Sakshi News home page

చతికిలపడ్డ సచిన్ సేన

Published Thu, Nov 12 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

చతికిలపడ్డ సచిన్ సేన

చతికిలపడ్డ సచిన్ సేన

హూస్టన్: వార్న్ వారియర్స్ ముందు సచిన్ బ్లాస్టర్స్ తేలిపోయారు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ సచిన్ సేన చతికిలపడింది. ఆల్ స్టార్ క్రికెట్ టి20 సిరీస్ లో భాగంగా అమెరికాలోని హూస్టన్ లో గురువారం జరిగిన రెండో మ్యాచ్ లో షేన్ వార్న్ నాయకత్వంలోని వారియర్స్ ఘనవిజయం సాధించింది. బ్లాస్టర్స్ ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
 

వారియర్స్ నిర్దేశించిన 263 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన సచిన్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. సెహ్వాగ్ 16, సచిన్ 33, గంగూలీ 12, లారా 19, క్లుసెనర్ 21, స్వాన్ 22 పరుగులు చేశారు. చివర్లో షాన్ పొలాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. పొలాక్ 22 బంతుల్లో 7 సిక్సర్లు, ఫోర్ తో 55 పరుగులు పిండుకున్నాడు. వారియర్స్ బౌలర్ సైమండ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. కుమార సంగక్కర 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.

ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో వారియర్స్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. న్యూయార్క్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో బాస్టర్స్ పై వారియర్స్ గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement