ఉత్కంఠ పోరు.. వారియర్స్ జోరు | Warne's Warriors cleansweep All Stars T20 series | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరు.. వారియర్స్ జోరు

Published Sun, Nov 15 2015 11:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

ఉత్కంఠ పోరు.. వారియర్స్ జోరు

ఉత్కంఠ పోరు.. వారియర్స్ జోరు

లాస్ ఏంజెలెస్: ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ ను షేన్ వార్న్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఉత్యంఠభరితంగా జరిగిన చివరి మ్యాచ్ లో సచిన్ బ్లాస్టర్స్ పై వార్న్ వారియర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్లాస్టర్స్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని మరొక బంతి మిగులుండగానే చేరుకుంది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది.

చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో షేన్ వార్న్ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. సంగక్కర 42 (21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కల్లిస్ 47 (23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), పాంటింగ్ 43 (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. సైమండ్స్ 31, హేడన్ 12, జాంటి రోడ్స్ 17 పరుగులు చేశారు. స్వాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆంబ్రోస్, హూపర్, సెహ్వాగ్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. సచిన్ 56, గంగూలీ 50 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement