సచిన్ టెండూల్కర్, షాన్ పొలాక్
న్యూఢిల్లీ: దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఒక దశలో ఆస్ట్రేలియా గడ్డపై షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడట! దానికి ప్రత్యామ్నాయంగా ఇతర షాట్లపై దృష్టి పెట్టి పరుగులు రాబట్టాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో గతంలో సచినే స్వయంగా తనకు చెప్పినట్లు అతను గుర్తు చేసుకున్నాడు. ‘ఆస్ట్రేలియాలో ఆట గురించి నాతో సచిన్ ఒకసారి మాట్లాడాడు. ఇక షార్ట్ పిచ్ బంతులు ఆడటం తన వల్ల కాదని అర్థమైనట్లు అతను చెప్పాడు. అందుకే వికెట్ కీపర్, స్లిప్ మీదుగా ర్యాంప్ షాట్‌లు ఆడతానని నాకు వివరించాడు’ అని పొలాక్ గుర్తు చేసుకున్నాడు. అయితే భారత ఉపఖండానికి వచ్చే సరికి మాత్రం సచిన్‌ను అవుట్ చేసేందుకు తమ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉండేవి కావని అతను అభిప్రాయ పడ్డాడు. ‘నాటి రోజుల్లో సచిన్‌ను అవుట్ చేయడం మన వల్ల అవుతుందా కాదా అని అనుకునేవాళ్లం. అతని కోసం ఏదైనా మంచి వ్యూహం రూపొందించే ప్రయత్నం చేయకుండా అతనే తప్పు చేస్తే బాగుండే దని కోరుకునేవాళ్లం’ అని పొలాక్ భారత స్టార్‌ను ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment