short pitch
-
సచిన్ ‘షార్ట్ పిచ్’ ఆడలేనన్నాడు!
న్యూఢిల్లీ: దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఒక దశలో ఆస్ట్రేలియా గడ్డపై షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడట! దానికి ప్రత్యామ్నాయంగా ఇతర షాట్లపై దృష్టి పెట్టి పరుగులు రాబట్టాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో గతంలో సచినే స్వయంగా తనకు చెప్పినట్లు అతను గుర్తు చేసుకున్నాడు. ‘ఆస్ట్రేలియాలో ఆట గురించి నాతో సచిన్ ఒకసారి మాట్లాడాడు. ఇక షార్ట్ పిచ్ బంతులు ఆడటం తన వల్ల కాదని అర్థమైనట్లు అతను చెప్పాడు. అందుకే వికెట్ కీపర్, స్లిప్ మీదుగా ర్యాంప్ షాట్లు ఆడతానని నాకు వివరించాడు’ అని పొలాక్ గుర్తు చేసుకున్నాడు. అయితే భారత ఉపఖండానికి వచ్చే సరికి మాత్రం సచిన్‌ను అవుట్ చేసేందుకు తమ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉండేవి కావని అతను అభిప్రాయ పడ్డాడు. ‘నాటి రోజుల్లో సచిన్‌ను అవుట్ చేయడం మన వల్ల అవుతుందా కాదా అని అనుకునేవాళ్లం. అతని కోసం ఏదైనా మంచి వ్యూహం రూపొందించే ప్రయత్నం చేయకుండా అతనే తప్పు చేస్తే బాగుండే దని కోరుకునేవాళ్లం’ అని పొలాక్ భారత స్టార్‌ను ప్రశంసించాడు. -
ఐదు రోజుల పరీక్ష!
-
ఐదు రోజుల పరీక్ష!
గురువారం తెల్లవారుజామున గం. 3.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం న్యూజిలాండ్ గడ్డపై ఎన్నో అంచనాలతో అడుగు పెట్టిన భారత జట్టు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కాస్త ప్రభావం చూపినట్లు కనిపించినా...భిన్నమైన పిచ్‌లు, బౌలర్లు ఎదురయ్యే అసలు టెస్ట్ మ్యాచ్‌తో దీనిని పోల్చలేం. మరో వైపు భారత్ బలహీనతపై గురి పెడుతూ పేస్‌తో విరుచుకు పడతామంటూ కివీస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ పరాభవంనుంచి కోలుకొని టీమిండియా రెండు టెస్టుల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఆక్లాండ్: ‘భారత జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేసినా మా షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో వారు తడబడ్డారు. పుల్ లేదా హుక్ చేయడానికి ప్రయత్నించి అవుటయ్యారు. టెస్టుల్లో ఇలాంటివి ఇంకా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో వారు పాఠాలు నేర్చుకున్నారేమో తెలీదు’...వాంగేరిలో తమతో వార్మప్ మ్యాచ్ అనంతరం కివీస్ ఎలెవన్ కెప్టెన్ ఆంటాన్ డేవ్‌సిక్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య టీమిండియా ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోంది. మరి నిజంగా భారత జట్టు పరిస్థితి అలాగే ఉందా, లేక గత పర్యటనతో పోలిస్తే మన పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా రానున్న ఐదు రోజుల్లో తేలిపోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారంనుంచి ఇక్కడి ఈడెన్ పార్క్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఫామ్‌లో కివీస్... సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఒక పెద్ద జట్టు (వెస్టిండీస్)పై టెస్టు సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఆ జట్టులో ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. దాంతో ఒక్క మార్పు లేకుండా అదే జట్టును ఈ సిరీస్ కోసం కొనసాగించారు. టేలర్, విలియమ్సన్ల ఫామ్ సానుకూలాంశం. బౌలింగ్‌లో కివీస్ కూడా ముగ్గురు పేసర్లతో పాటు సోధి రూపంలో ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగవచ్చు. ఎడమ చేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ భారత్‌కు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది మార్పుల్లేకపోవచ్చు... వార్మప్ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ముగ్గురు మరి కొంత సేపు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపించింది. వైఫల్యంగా చెప్పకపోయినా విజయ్, ధావన్, పుజారా త్వరగానే పెవిలియన్ చేరారు. రోహిత్, రహానేలకు మాత్రం ప్రాక్టీస్ లభించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పేస్ బౌలింగ్‌ను మన జట్టు సమర్థంగా ఎదుర్కోవడంపై జట్టు విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ టెస్టు ఆడిన టీమ్‌నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. భారత్ ముగ్గురు పేసర్లతో ఆడితే...స్పిన్నర్ అశ్విన్, జడేజాల మధ్య స్థానం కోసం పోటీ ఉంటుంది. ప్రస్తుతానికి ఫామ్ పరంగా మొగ్గు జడేజా వైపే ఉంది. జహీర్, షమీ ప్రధాన పేసర్లు కాగా, ఇషాంత్, ఉమేశ్‌లలో ఒకరికి చోటు దక్కవచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నా పాండేకు అప్పుడే అవకాశం దక్కకపోవచ్చు. పిచ్, వాతావరణం టైగా ముగిసిన మూడో వన్డే జరిగిన ఈడెన్ పార్క్‌లోనే ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం కూడా రెడీమేడ్ ‘డ్రాప్ ఇన్’ పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై చక్కటి బౌన్స్ ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ చివర్లో టర్న్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఎప్పుడూ ఆకాశం మేఘావృతంగానే కనిపిస్తుంది. కానీ భారీ వర్షానికి అవకాశం లేదు. ఐదు రోజులూ మ్యాచ్‌కు అడ్డంకి ఉండకపోవచ్చు. జూన్ 2011 వరుసగా 12 టెస్టుల పాటు భారత జట్టు విదేశాల్లో విజయం సాధించలేదు. ఆక్లాండ్‌లో నాలుగు టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి, 2 డ్రా చేసుకుంది. కివీస్ గడ్డపై భారత్‌కు దక్కిన 5 విజయాల్లో 2 ఇక్కడే రావడం విశేషం. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రహానే, రోహిత్ శర్మ, జడేజా, జహీర్, షమీ, ఇషాంత్/ఉమేశ్. న్యూజిలాండ్: బ్రెండన్ మెకల్లమ్, ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్, విలియమ్సన్, టేలర్, అండర్సన్, వాట్లింగ్, సౌతీ, సోధి, వాగ్నర్, బౌల్ట్. భారత్‌పై ఒత్తిడి పెంచుతాం ‘భారత బ్యాట్స్‌మన్ అటాకింగ్ తరహా ఆట ఆడతారు. చక్కటి స్వింగ్, బౌన్స్‌తో వారి బ్యాటింగ్ టెక్నిక్ బలహీనతలు బయటపెడతాం. మా వ్యూహాలతో వారిని కట్టడి చేస్తాం. అయితే అలాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌తో పోటీ పడటం మాకు కూడా సవాలే. క్రమం తప్పకుండా బౌన్సర్లు వేసేందుకు ప్రయత్నిస్తాం. విండీస్‌తో సిరీస్‌లో స్వింగ్ నా బలం. ఇప్పుడు దానినే కొనసాగిస్తా’ - ట్రెంట్ బౌల్ట్, న్యూజిలాండ్ బౌలర్ -
భారత కుర్రాళ్లు సునామీ
ఓ సినిమా హిట్టయితే సీక్వెల్ తీయడం పరిపాటి. క్రికెట్లోనూ భారత్ అదే పని చేస్తోంది. పెను విధ్వంసంతో 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ధోనిసేన... సరిగ్గా రెండు వారాల తర్వాత మరోసారి దాన్ని పునరావృతం చేసింది.351 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఛేదించింది. అప్పుడు జైపూర్... ఇప్పుడు నాగ్‌పూర్... వేదిక మారిందంతే. జామ్తాలో పరుగుల మోత మోగింది. దీపావళికి ముందే ‘హండ్రెడ్‌వాలా’ పేలింది.భారత త్రిమూర్తుల (కోహ్లి, ధావన్, రోహిత్) సంచలన ప్రదర్శనతో... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఇక ‘ఫైనల్’ వన్డే శనివారం బెంగళూరులో జరుగుతుంది. -
విధ్వంసం 2
ఓ సినిమా హిట్టయితే సీక్వెల్ తీయడం పరిపాటి. క్రికెట్లోనూ భారత్ అదే పని చేస్తోంది. పెను విధ్వంసంతో 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ధోనిసేన... సరిగ్గా రెండు వారాల తర్వాత మరోసారి దాన్ని పునరావృతం చేసింది. 351 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఛేదించింది. అప్పుడు జైపూర్... ఇప్పుడు నాగ్‌పూర్... వేదిక మారిందంతే. జామ్తాలో పరుగుల మోత మోగింది. దీపావళికి ముందే ‘హండ్రెడ్‌వాలా’ పేలింది. భారత త్రిమూర్తుల (కోహ్లి, ధావన్, రోహిత్) సంచలన ప్రదర్శనతో... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించి 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఇక ‘ఫైనల్’ వన్డే శనివారం బెంగళూరులో జరుగుతుంది. నాగ్‌పూర్: కళ్ల ముందు 351 పరుగుల భారీ లక్ష్యం.. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్... షార్ట్ పిచ్‌లతో హడలెత్తించే ప్రత్యర్థి పేసర్లు... ఇలా ఆట కంటే ఒత్తిడే ఎక్కువగా ఉన్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు సునామీ సృష్టించారు. మొదట రోహిత్, ధావన్... ఆ తర్వాత కోహ్లి.. తమ విధ్వంసాలతో కొండంత లక్ష్యాన్ని ఉఫ్‌న ఊదేశారు. బంతిని ముట్టుకుంటే బౌండరీ... క్రీజు వదిలితే సిక్సర్... ఇలా బ్యాట్‌ను మంత్రదండలా తిప్పుతూ... మంచి నీళ్లప్రాయంలా పరుగుల వరద పారించారు. దీంతో బుధవారం వీసీఏ మైదానంలో జరిగిన ఆరో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఫలితంగా ఏడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.... ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 350 పరుగులు చేసింది. బెయిలీ (114 బంతుల్లో 156; 13 ఫోర్లు, 6 సిక్సర్లు), వాట్సన్ (94 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో హడలెత్తించారు. వోజెస్ (38 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 4 వికెట్లకు 351 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (66 బంతుల్లో 115 నాటౌట్; 18 ఫోర్లు, 1 సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగితే... ధావన్ (102 బంతుల్లో 100; 11 ఫోర్లు), రోహిత్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు చక్కని సమన్వయం కనబర్చారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఏడో వన్డే శనివారం జరుగుతుంది. బెయిలీ జోరు... వాట్సన్ హోరు: ఆసీస్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో హ్యూస్ (13)ను భువనేశ్వర్ బోల్తా కొట్టిస్తే... 12వ ఓవర్లో ఫించ్ (20)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆసీస్ 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత బెయిలీ, వాట్సన్‌ల జోరుకు భారత బౌలర్లు చేతులెత్తేశారు. వాట్సన్ 93 బంతుల్లో కెరీర్లో 9వ సెంచరీ సాధించాడు. బెయిలీ 84 బంతుల్లో కెరీర్లో రెండో శతకం పూర్తి చేశాడు. మూడో వికెట్‌కు 168 పరుగులు జోడించాక... షమీ బౌలింగ్‌లో వాట్సన్ అవుట్ కావడంతో ధోనిసేన కాస్త ఊపీరి పీల్చుకుంది. కానీ బెయిలీ జోరుతో ఆఖరి ఓవర్లలోనూ స్కోరు వాయువేగంతో కదిలింది. నాలుగో వికెట్‌కు వోజెస్, బెయిలీ కలిసి 80 బంతుల్లోనే 120 పరుగులు జోడించారు. అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. ఓపెనర్ల శుభారంభం: రోహిత్, ధావన్ లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభాన్నిచ్చారు. తొలి పవర్‌ప్లేలో 56 పరుగులు రాబట్టారు. మాక్స్వెల్ వేసిన 19వ ఓవర్లో క్యాచ్ అవుట్‌ను తప్పించుకున్న ధావన్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. డోహెర్టీ బౌలింగ్‌లో వరుసగా ఫోర్లు కొట్టాడు. ఫించ్ (28వ ఓవర్), మాక్స్వెల్ (29వ ఓవర్) బౌలింగ్‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన రోహిత్... అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. తొలి వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. కోహ్లి వచ్చి రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. డోహెర్టి బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో ధావన్ అవుటైనా... భారత్ రన్‌రేట్ మాత్రం తగ్గలేదు. కెరీర్లో నాలుగో సెంచరీ చేసిన ధావన్‌ను ఫాల్క్‌నర్ వెనక్కి పంపాడు. కోహ్లి ధాటికి ఆసీస్ బౌలర్లు బిత్తరపోయారు. ఢిల్లీ ప్లేయర్ 61 బంతుల్లో కెరీర్లో 17వ సెంచరీ సాధించాడు. చివర్లో రైనా అవుటైనా... ధోని (25 నాటౌట్) నిలకడగా ఆడాడు. 18 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లి 4 వరుస ఫోర్లతో విజయాన్ని సులభం చేశాడు. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హ్యూస్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 13; ఫించ్ (బి) అశ్విన్ 20; వాట్సన్ (బి) షమీ 102; బెయిలీ (సి) కోహ్లి (బి) జడేజా 156; మాక్స్వెల్ (సి) భువనేశ్వర్ (బి) అశ్విన్ 9; వోజెస్ నాటౌట్ 44; జాన్సన్ (సి) ధావన్ (బి) జడేజా 0; హడిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: (వైడ్లు 3, నోబాల్స్ 3) 6; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 350. వికెట్లపతనం: 1-30; 2-45; 3-213; 4-224; 5-344; 6-346 బౌలింగ్: భువనేశ్వర్ 8-0-42-1; మహ్మద్ షమీ 8-1-66-1; రవీంద్ర జడేజా 10-0-68-2; అశ్విన్ 10-0-64-2; మిశ్రా 10-0-78-0; కోహ్లి 2-0-15-0; రైనా 2-0-17-0 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఫాల్క్‌నర్ (బి) ఫించ్ 79; ధావన్ (బి) ఫాల్క్‌నర్ 100; కోహ్లి నాటౌట్ 115; రైనా (సి) హడిన్ (బి) జాన్సన్ 16; యువరాజ్ (బి) జాన్సన్ 0; ధోని నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 8, వైడ్లు 7, నోబాల్స్ 1) 16; మొత్తం: (49.3 ఓవర్లలో 4 వికెట్లకు) 351. వికెట్లపతనం: 1-178; 2-234; 3-290; 4-290 బౌలింగ్: జాన్సన్ 10-0-72-2; మెక్కే 7-0-47-0; ఫాల్క్‌నర్ 9.3-0-73-1; డోహెర్టీ 6-0-40-0; వాట్సన్ 6-0-51-0; మాక్స్వెల్ 7-0-40-0; ఫించ్ 4-0-20-1. 9 వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో కోహ్లి 17 సెంచరీలతో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. 7 కోహ్లి చేసిన 17 సెంచరీల్లో ఏడుసార్లు అజేయంగా నిలిచాడు 1 తక్కువ మ్యాచ్‌ల్లో (118 వన్డేలు) 17 సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు 11 ఛేజింగ్‌లో కోహ్లికిది 11వ సెంచరీ. ఈ 11 సార్లూ భారత్ నెగ్గడం విశేషం. ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ (14) పేరిట ఉంది. ఈ మ్యాచ్ ద్వారా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.