ఓటేయండి.. రాయితీ పొందండి | Sakshi
Sakshi News home page

ఓటేయండి.. రాయితీ పొందండి

Published Sun, May 12 2024 12:35 PM

-

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలూ నడుం బిగించాయి. రకరకాల ఆఫర్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కమ్యూనిటీ యాప్‌ ర్యాపిడో ఓటర్లను పోలింగ్‌ రో జున ఉచితంగా సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఓటర్లు ర్యాపిడో యాప్‌లో ‘ఓట్‌ నౌ’ కోడ్‌ను ఉపయోగించి ఉచితంగా బైక్‌, ఆటో, క్యాబ్‌ సేవలను అందుకోవచ్చు. తాజాగా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వండర్‌లా ఓటర్లకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వేలిపై సిరా చుక్కను చూపిస్తే వండర్‌లా టికెట్‌పై 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 15 తేదీల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వండర్‌లా హాలిడేస్‌ ఎండీ అరుణ్‌ చిట్టిలపిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రముఖ డైనింగ్‌ ఔట్‌ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ డైన్‌ఔట్‌ భోజన ప్రి యులకు భలే ఆఫర్‌ను ప్రకటించింది. ఓటర్లు వేలి పై సిరా చుక్కను చూపించి స్విగ్గీ డౌన్‌ఔట్‌లోని ఎంపిక చేసిన రెస్టారెంట్ల బిల్లులో 50 శాతం తగ్గింపు ఆఫర్‌ను అందిస్తుంది. అంతేరా కిచెన్‌ అండ్‌ బార్‌, పపాయ, ఎయిర్‌ లైవ్‌, ఫుడ్‌ ఎక్స్‌ఛేంజ్‌–నోవాటెల్‌, రెడ్‌ రీనో, కాఫీ కప్‌ వంటి పలు రెస్టారెంట్లలో ఈ ఆఫర్‌ను అందుకోవచ్చని స్విగ్గీ డౌన్‌ఔట్‌ హెడ్‌ స్వప్నిల్‌ బాజ్‌పాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పోలింగ్‌ శాతం పెంచేందుకుస్పెషల్‌ ఆఫర్లు

Advertisement
 
Advertisement
 
Advertisement