మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. దీని అనంతరం బడ్జెట్పై సుధీర్ఘ చర్చ జరగనుంది. నాలుగు రోజులపాటు బడ్జెట్పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. దీని అనంతరం బడ్జెట్పై సుధీర్ఘ చర్చ జరగనుంది. నాలుగు రోజులపాటు బడ్జెట్పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ శాసనసభలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం రూ.1,30,415 కోట్లతో బడ్జెట్ ప్రకటించారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.67,630 కోట్లుకాగా, ప్రణాళికేతర వ్యయం 62,785.14 కోట్లుగా ఉంది. వీటిల్లో సాగునీరు, ఆతర్వాత సంక్షేమ రంగానికే అధిక వాటాదక్కింది.