car price
-
ఏప్రిల్ నుంచి కార్ల ధరలు అప్
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ నుంచి తమ ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా.. వంటి కంపెనీలు పెరుగుతున్న ఇన్పుట్, నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి కార్ల ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించాయి. ముడి సరుకు వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సతమతమవుతున్నందున తయారీ సంస్థలు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి.మారుతీ సుజుకి 4 శాతం పెంపుదేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన మొత్తం శ్రేణి వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి 4% ధరల పెంపును అమలు చేయాలని యోచిస్తోంది. మార్కెట్లో కంపెనీ పోటీతత్వాన్ని కొనసాగిస్తూనే వ్యయ పెరుగుదలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ధరల పెంపు నిర్ణయంతో ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో సహా పాపులర్ మోడళ్లపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.హ్యుందాయ్, ఎం అండ్ ఎంహ్యుందాయ్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహనాలపై 3 శాతం వరకు ధరల పెంపును ప్రకటించాయి. క్రెటా, ఐ20 వంటి మోడళ్లను కలిగి ఉన్న హ్యుందాయ్ లైనప్ ధరను సవరించనుంది. అదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 సహా ఎస్యూవీ కూడా మరింత ఖరీదవనున్నాయి.ఇతర బ్రాండ్లు ఇలా..కియా, హోండా, రెనాల్ట్, బీఎండబ్ల్యూ వంటి ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ ధరల సర్దుబాట్లకు సంబంధించి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పరిశ్రమలో ఏకీకృత ప్రతిస్పందన వస్తుంది. ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావితం చూపుతుందనే వాదనలున్నాయి.పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుఉక్కు, అల్యూమినియం, సెమీకండక్టర్ చిప్స్ వంటి ముడి పదార్థాలపై చేస్తున్న ఖర్చులు పెరగడంతో ఆటోమోటివ్ రంగం అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. అదనంగా లాజిస్టిక్స్, ఇంధనానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు ధరలు సవరించేందుకు కారణమయ్యాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి నాణ్యత లేదా సృజనాత్మకతలో రాజీపడకుండా వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు చెబుతున్నాయి.వినియోగదారులపై ప్రభావంధరల పెరుగుదల స్వల్పకాలంలో విక్రయాలను ప్రభావితం చేసినప్పటికీ, వాహన తయారీదారులు తమ వాహనాలలో అధునాతన ఫీచర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొనుగోలుదారులపై ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి, వారి ఉత్పత్తులకు నిరంతర గిరాకీ ఏర్పడేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ సమీపిస్తున్న కొద్దీ కారు కొనుగోలుదారులు తమ నిర్ణయాలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలున్నాయో నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఏప్రిల్లోపే కొనుగోలుఇప్పటికే వాహనాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్న కొందరు వినియోగదారులు ఏప్రిల్‌లో ధరల పెంపు అమల్లోకి రాకముందే తమ కొనుగోళ్లను ఖరారు చేయడానికి పరుగులు తీస్తున్నారు. దీంతో మార్చి నెలాఖరు నాటికి కార్ల అమ్మకాలు తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంది.బడ్జెట్ వాహనాలపై దృష్టిధరల పెరుగుదల వల్ల కొనుగోలుదారులు తమ ఎంపికలను పునఃపరిశీలించవచ్చు. గతంలో నిర్ణయించుకున్న మోడల్‌ను కాకుండా బడ్జెట్లో మరో మోడల్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి బదులుగా సెడాన్ కేటగిరీ కారును ఎంచుకోవచ్చు.యూజ్డ్ కార్లకు డిమాండ్కొత్త కార్ల ధరలు పెరుగుతుండటంతో ప్రీ ఓన్డ్ కార్ల(ఇది వరకే ఉపయోగించిన కార్లు) మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కొత్త వాహనాలపై అధిక ఖర్చులను నివారించాలని చూస్తున్న కొనుగోలుదారులు మరింత చౌకైన ప్రత్యామ్నాయంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు మొగ్గు చూపవచ్చు.ఇదీ చదవండి: అపార్ట్మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్రుణాలపై ఆధారపడటంవాహన ధరలు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది కస్టమర్లు తాము చేయాలనుకుంటున్న కొనుగోళ్ల కోసం ఫైనాన్సింగ్ లేదా రుణాలపై ఆధారపడవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు లేదా ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లను అందించే వాహన తయారీదారులు ఈమేరకు ప్రయోజనం చూడవచ్చు. -
బెంజ్, కియా కార్ల ధరలు పెంపు
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరోసారి కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. యూరో మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగితే ఏప్రిల్ నుంచి తమ మోడల్ కార్ల ధరలను పెంచే వీలుందని కంపెనీ ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘యూరో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90 స్థాయి వద్ద ఉన్నప్పుడు కార్ల ధరలు నిర్ణయించాం. ఇప్పుడు యూరో 95 స్థాయికి చేరుకుంది. గణనీయంగా పెరిగిన మారకపు విలువ ఏప్రిల్ నుంచి కార్ల ధరల పెంపునకు దారి తీయోచ్చు’ అన్నారు.ఇప్పటికే ఈ జనవరిలో మెర్సిడెస్ కార్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. టెస్లా రాకపై అయ్యర్ స్పందిస్తూ.. కొత్త సంస్థ రాక ఎప్పుడూ మార్కెట్ వృద్ధికి తోడ్పడుతుంది. డిమాండ్ పెంచే సంస్థలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది మెర్సిడెస్ బెంజ్ ఇండియా రికార్డు స్థాయిలో 19,565 కార్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది(2023)లో 17,408 యూనిట్లను అమ్మింది.ఇదీ చదవండి: పూనావాలా ఫిన్ వాణిజ్య వాహన రుణాలుఅదే బాటలో కియా ఇండియాకియా ఇండియా సైతం కారు ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. అధిక కమోడిటీ ధరలు, ఇన్పుట్ వ్యయాలు, సప్లై సంబంధిత ఖర్చుల కారణంగా అన్ని మోడళ్ల వాహన ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘‘పెరిగిన వ్యయ భారం కస్టమర్లపై పడకుండా ఉండేందుకు వీలైనంత వరకు ప్రయత్నం చేసినప్పటికీ.. కొంత భారాన్ని మాత్రం కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తోంది. అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. -
పెరగనున్న కార్ల ధరలు: ఎప్పటి నుంచి అంటే?
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఏప్రిల్ 2025 నుంచి తన వాహనాల ధరలను 4 శాతం పెంచే ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ధరలు, నిర్వహణ ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.మోడల్‌ను బట్టి ధరల పెంపు జరుగుతుంది. అయితే కొత్త ధరలు వచ్చే నెలలో అధికారికంగా వెల్లడవుతాయి. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి.. వినియోగదారులపై ప్రభావాన్ని పరిమితం చేయడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. కొన్ని తప్పని పరిస్థితులలో పెరుగుతున్న ధరల ప్రభావం కొంత వినియోగదారులపై కూడా పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..మారుతి సుజుకి తమ వాహన ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడల్ ధరలను రూ. 1500 నుంచి రూ. 32,000 వరకు పెంచింది. ఈ సారి కూడా ఈ స్థాయిలోనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. పెరిగిన ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
సామాన్యుడి జేబుకి చిల్లు!: రేపటి నుంచి కొత్త రూల్స్..
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌తో అనేక మార్పులు జరగనున్నాయి. అవి మాత్రమే కాకుండా ప్రతి నెలా పలు విభాగాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు వంటివాటితో పాటు మారుతి సుజుకి కంపెనీ తన వాహనాల ధరలను కూడా పెంచనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సిలిండర్ ధరలలో జరిగే మార్పులు నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రేపు (శనివారం) సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.యూపీఐ లావాదేవీలుఫిబ్రవరి 1వ తేదీన యూపీఐ నిబంధలనలకు సమందించిన కీలక మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్దిష్ట UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ కూడా విడుదలైంది. కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కార్ల ధరలుదిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), తన వాహన ధరలను గణనీయంగా పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచనున్నట్లు.. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా మొదలైన కార్ల ధరలను పెంచనుంది.బ్యాంకింగ్ రూల్స్కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ సర్వీస్.. చార్జీలలో మార్పులు తీసుకురానుంది. ఈ మార్పుల గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. కాబట్టి కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ఉచిత ఏటీఎమ్ లావాదేవీల పరిమితికి తగ్గించడం.. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన చార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!ఏటీఎఫ్ ధరలుఫిబ్రవరి 1 నుంచి విమాన ఇంధనం, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 1వ తేదీన ధరలలో మార్పు జరిగితే, అది నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. -
జనవరి 1 నుంచి బెంజ్ కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది జనవరి 1 నుంచి తన అన్ని రకాల కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జీఎల్సీ మోడల్ నుంచి టాప్ఎండ్(ఖరీదు శ్రేణి) మేబాక్ ఈక్యూఎస్ 680 మోడల్ వరకు కారు ధరను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల మేర ఈ పెంపు ఉంటుందని పేర్కొంది.‘‘అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ పెరుగుదల వ్యాపార కార్యకలాపాలపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, రవాణా ఖర్చులతో గత మూడు త్రైమాసికాల నుంచి నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో ధరల పెంపు నిర్ణయం తప్పలేదు’’ అని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకునే వాహనాలకు మాత్రం పెంపు వర్తించదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు -
వోల్వో కార్ ప్రియులకు షాక్.. జనవరి నుంచి ప్రైస్ హైక్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడిష్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) 2024 ప్రారంభం (జనవరి) నుంచి తమ బ్రాండ్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి రెండు శాతం ధరలను పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా.. అస్థిర విదేశీ మారకపు రేట్లు కారణంగా ధరలను పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. ధరల పెరుగుల ప్రకటించిన కంపెనీలలో వోల్వో మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ సంస్థలు ఉన్నాయి. వోల్వో కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్లో సీ40 రీఛార్జ్, XC40, XC40 రీఛార్జ్ వంటి ఎలక్ట్రిక్ కార్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేస్తున్న కార్లు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వాహన ప్రియులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: మహమ్మారిలా వ్యాపిస్తున్న డీప్ ఫేక్.. మొన్న రతన్ టాటా.. నేడు నారాయణ మూర్తి ధరల పెరుగుదల గురించి వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'జ్యోతి మల్హోత్రా' మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులకు భరించడానికి ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. -
సిట్రోయెన్ సి3 కొత్త ధరలు.. వాహన ప్రియులకు షాక్
భారతదేశంలో ఇప్పటికే మంచి అమ్మకాతో ముందుకు సాగుతున్న ఫ్రెంచ్ బ్రాండ్ కారు 'సిట్రోయెన్ సి3' ధరలు తాజాగా మళ్ళీ పెరిగాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ లైవ్, ఫీల్ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లో విడుదలైంది. ప్రారంభంలో వీటి ధరలు రూ. 5.71 లక్షల నుండి రూ. 8.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. కాగా ఇప్పుడు వీటి ధరలు రూ. 45,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత సి3 రూ. 6.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. 2023 ప్రారంభంలో కూడా దీని ధరలు పెరిగాయి. మార్కెట్లో మొదటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ఈ హ్యాచ్‌బ్యాక్ నాలుగు మోనోటోన్, ఆరు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. సిట్రోయెన్ సి3 మంచి డిజైన్ పొందుతుంది. ముందు భాగంలోని బంపర్లపై కలర్-కోడెడ్ ఇన్సర్ట్లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్, బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్, మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉన్నాయి. (ఇదీ చదవండి: రతన్ టాటా గురించి తెలుసు, 'మాయా టాటా' గురించి తెలుసా?) సిట్రోయెన్ సి3 రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 81 బిహెచ్పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 108 బిహెచ్పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
టాటా వాహనాల ధరలు పెంపు..ఈ ఏడాది వరుసగా మూడో సారి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వాహనాల ధరల్ని మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు కార్ల ధరల్ని పెంచిన టాటా.. తాజాగా మరోసారి పెంపు నిర్ణయంపై వాహన దారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపుకు ప్రధాన కారణం వాహనాల్ని తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువుల (ఇన్పుట్స్) ధరల పెరగడమేనని టాటా తెలిపింది. కంపెనీ ప్రకారం, ఈ ఏడాది జూలైలో తన ప్యాసింజర్ వాహనాల ధరల్ని 0.55 శాతం ధరల్ని పెంచగా..అంతకంటే ముందు జనవరిలో టాటా మోటార్స్ సగటున 0.9 శాతం ధరల్ని పెంచుతూ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై కస్టమర్ల నుంచి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ రావడంతో .. ప్రతిస్పందనగా కంపెనీ నిర్దిష్ట వేరియంట్లపై రూ .10,000 వరకు తగ్గించింది. వాణిజ్య వాహనాల గురించి మాట్లాడుతూ, కంపెనీ ఇప్పటికే ధరలను 1.5 - 2.5 శాతం పెంచింది. పెంచిన ధరలు జూలై 1, 2022 నుండి అమల్లోకి వచ్చాయి. కార్ల ధరల పెంపుకు పెరిగిన కార్ల తయారీకి వినియోగించే వస్తువుల ధరలతో పాటు ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు పెరగడమేనని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
మరోసారి, కార్ల ధరల్ని భారీగా పెంచిన కియా!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా కార్ల ధరల్ని భారీగా పెంచింది. సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్ల ధరల్ని ఒకే సారి రూ.34వేలు పెంచింది. ఈ ఏడాది క్యూ1 ఫలితాల సందర్భంగా జనవరిలో కార్ల ధరల్ని పెంచిన కియా ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కియా సోనెట్ సిరీస్‌లో హెచ్‌టీఈ,హెచ్టీకే, హెచ్టీకే ప్లస్, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్,జీటీఎక్స్ప్లస్తో పాటు ఇతర యానివర్సరీ ఎడిషన్ వేరియంట్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌టీఈ 1.2 పెట్రోల్ వేరియంట్ కార్ల ధరల్ని అత్యధికంగా రూ.34వేలకు పెంచింది. ఇతర వేరియంట్లపై రూ.10వేలు, రూ.16వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్లలో అదిరిపోయే ఫీచర్లు కియా ఇండియా మై2022పేరుతో సోనెట్ వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కార్లలో సైడ్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ స్టేబులిటీ కంట్రోల్ ఫీచర్లను అప్డేట్ చేసింది. ఇంపీరియల్ బ్లూ, స్పార్క్లింగ్ సిల్విర్ కలర్ ఆప్షన్‌తో న్యూ బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది. ఇక ఈ కియా సోనెట్‌లో మొత్తం మూడు ఇంజిన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి 1.2లీటర్ల నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0లిటర్ల టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సౌకర్యం ఉండగా.. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఐఎంటీ, సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ వంటి గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. -
అంబానీ కారూ ఖరీదే..
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో అత్యంత సంపన్నుడు. మరి ఆ స్థాయి వ్యక్తి వినియోగించే కారు ఖరీదు మామూలుగా ఉంటుందా? తాజాగా అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆయన కొనుగోలు చేశారు. దీని కోసం ఏకంగా రూ.13.14 కోట్లు ఖర్చు చేశారట. భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. 2018లో విడుదలైనప్పుడు ఈ కారు బేస్ ధర రూ.6.95 కోట్లు. కస్టమైజేషన్ కారణంగా కారు ధర భారీగా పెరుగుతుందని వాహన పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఆర్ఐఎల్ పేరిట కారు రిజిష్టర్ అయింది. రూ.12 లక్షలు చెల్లించి 0001 నంబరును కంపెనీ సొంతం చేసుకుంది. ఆర్ఐఎల్/ముకేశ్ ఖాతాలో ఇది మూడవ కలినన్ మోడల్ కావడం విశేషం. 6.7 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ పొందుపరిచారు. టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. -
హోండా కార్ల ధరలు పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కార్ల ధరలను రూ.10,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన డబ్ల్యూఆర్–వీ మోడల్ ధరలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ముడిపదార్థాల ధరలు ఎగియడం వంటి పలు కారణాల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కార్ల ధరలు పెంచుతున్నామని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. హెచ్‌సీఐఎల్ రూ.4.69 లక్షలు–రూ.37 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా ఇటీవలే జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ కూడా ఏప్రిల్ నుంచి కార్ల ధరలను దాదాపు 2% పెంచుతున్నట్లు ప్రకటించింది.