ethnic indian
-
ప్రయాణికులకు మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆఫర్
కౌలాలంపూర్:ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న రెండు వరుస దుర్ఘటనలు మలేషియన్ ఎయిర్ లైన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఎంహెచ్17 కుప్పకూలడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న మలేషియన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కసరత్తులు ఆరంభించింది. ఇక నుంచి ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మార్పు చేసుకున్నా.. రద్దు చేసుకున్నా టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నడుంబిగించింది. దీనికి సంబంధించి మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కేవలం ఇది సాధారణ టికెట్లకే కాదు.. నాన్ రిఫెండబుల్ టికెట్లు కూడా వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని గురువారం నుంచి బుక్ చేసుకున్న ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశం జూలై 18 మొదలుకొని డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని ఎయిర్స్ లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. గత మూడు రోజుల క్రితం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరుతూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 237 మంది గల్లంతయ్యారు. -
విధి ఆడిన వింత నాటకం!
విధి చాలా విచిత్రమైంది. మనుషుల జీవితాలతో అది చిత్రమైన విన్యాసాలాడుతుంది. ఊహించని పరిణామాలతో మనిషిని ఉక్కిరిబక్కిరి చేస్తుంది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. విధిలీలా విన్యాసంలో స్టివార్డు సంజిద్ సింగ్ సంధు ఆయన భార్యకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఉక్రెయిన్ లో మలేసియా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో భారత సంతతికి సంధు ఉన్నాడు. సెలవు రోజున ఇంటిలో ఉండ్సాలిన అతడిని విధి వెంటాడించింది. గురువారం వారంతపు సెలవుకావడంతో ఇంట్లో ఉన్న సందు... తోటి ఉద్యోగి అభ్యర్థన మేరకు ఎంహెచ్-17 విమానంలో విధులకు వెళ్లి విగతజీవిగా మారిపోయాడు. విధి విచిత్రం ఏంటంటే షిఫ్టు మార్చుకోవడం వల్లే అతడి భార్య నాలుగు నెలల క్రితం మృత్యువు నుంచి తప్పించుకుంది. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్‌లైన్స్‌లో స్టివార్డెస్గా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్-370 విమానంలో సంధు విధి నిర్వహణకు వెళ్లాల్సివుండగా చివరి నిమిషంలో ఆమె షిప్ట్ మార్చుకుంది. తన బదులు వేరే ఉద్యోగిని సర్దుబాటు చేసి సెలవు తీసుకుంది. ఈ విమానం ఏమైందో ఇప్పటివరకు తెలియలేదు. ఇక రెండు విమాన ప్రమాదాల్లోనూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ కుటుంబం నలుగురు సభ్యులను కోల్పోయింది. మొన్న కొడుకు, కోడలు.. నిన్న మనవరాలు, ఆమె భర్త మృత్యువాత పడ్డారు. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో! -
ఎంహెచ్ 17 : తప్పు మీదంటే మీదంటూ..
-
విమానం కూల్చివేత వాళ్ల పనేనా?!
-
ఎవరిదీ పాపం.. ఎవరికీ శాపం?
-
'ఎంత ఘోరం... మాటలు కూడా రావడం లేదు'
వాషింగ్టన్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనపై దర్యాప్తులో సహాయం అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. విమానం పేల్చివేతపై అంతర్జాతీయ దర్యాప్తులో సహాయం చేసేందుకు సిద్దమని అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. ఎంహెచ్ 17 విమాన పేల్చివేతను అత్యంత ఘోరమైన ఘటనగా ఆయన వర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు కూడా మాటలు రావడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో మలేసియా, నెదర్లాండ్స్ ప్రభుత్వాలకు సానుభూతితో కూడిన సహాయం చేస్తామని జాన్ కెర్రీ తెలిపారు. మృతుల కుటుంబాలకు కూడా సహాయం అందించేందుకు సిద్దమని ప్రకటించారు. -
'కూల్చిన వారిని చట్టం ముందు నిలబెట్టాలి'
కౌలాలంపూర్/కీవ్: ఉక్రెయిన్ గగనతలంపై ఎయిర్ లైన్స్ విమానం పేల్చివేతపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై తీవ్ర ఆందోళన తెలిపింది. విమానం కూల్చివేతపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, ఈ నరమేధానికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. కాగా సంఘటనా స్థలంలో సహాయక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు సాగిస్తున్నారు. పొద్దుతిరుగుడు తోటల్లో ఛిద్రమైన స్థితిలో చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 181 మృతదేహాలు బయటకు తీశారు. మృతి చెందిన వారిలో 173 మంది నెదర్లాండ్స్ చెందిన వారున్నారు. మృతుల్లో దాదాపు 100 మంది ఎయిడ్స్ పరిశోధకులున్నారు. -
చైనా విమానాల దారి మళ్లింపు
బీజింగ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనతో ఉక్రెయిన్ మీదుగా వెళ్లే విమానాలు రద్దవుతున్నాయి. ఇప్పటికే భారత్- ఉక్రెయిన్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది. చైనా కూడా ఉక్రెయిన్ మీదుగా వెళ్లే తమ విమానాలను మళ్లించింది. ఉక్రెయిన్ మీదుగా వెళ్లే అన్ని విమాన సర్వీసులను వేరే మార్గాల్లో నడపాలని నిర్వహించినట్టు చైనా పౌర విమానయాన శాఖ తెలిపింది. తూర్పు ఉక్రెయిన్ మీదుగా చైనా విమానాలు వారానికి 28 రౌండ్ల ట్రిప్పులు వేస్తాయని చైనా పౌర విమానయాన పరిపాలన విభాగం(సీఏఏసీ) వెల్లడించింది. అయితే చైనా, ఉక్రెయిన్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు లేవని తెలిపింది. ఉక్రెయిన్ లో తలెత్తిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి తమ విమానాలను మళ్లిస్తున్నట్టు చైనా ప్రకటించింది. -
ఎంహెచ్ 17 ప్రమాదం జరిగిందిలా..
-
విమానాన్ని కూల్చివేసింది వారే: ఎస్‌బీయూ
కీవ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేసింది తామేనని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారని ఎక్రెయిన్ భద్రతా విభాగం(ఎస్‌బీయూ) తెలిపింది. రష్యా సైనిక నిఘా విభాగం అధికారులకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ద్వారా తమకీ విషయం తెలిసిందని ఎస్‌బీయూ వెల్లడించింది. విమానం కూలిపోయిన 20 నిమిషాల తర్వాత రష్యా సైనిక నిఘా అధికారి ఇగోర్ బెజ్లర్.. రష్యా భద్రతాధికారి వాసిలి జెరానిన్ కు ఫోన్ చేశారని పేర్కొంది. 'దొనెస్క్ ప్రాంతంలో విమానాన్ని ఇప్పుడే కూల్చివేశాం' అని జెరానిన్ కు బ్లెజర్ ఫోన్ తెలిపాడని వెల్లడించింది. స్వయం ప్రకటిత దొనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ సంస్థకు బ్లెజర్ కమాండర్ గా ఉన్నాడు. మేజర్, గ్రీక్ పేరుతో ఇద్దరు తీవ్రవాదులు జరిపిన సంభాషణను కూడా ఎస్‌బీయూ విడుదల చేసింది. -
ఎంహెచ్-17: షిఫ్టు మార్చుకున్నాడు.. ప్రాణం పోయింది
అమ్మ కమ్మగా వండిపెడుతుంది.. వెళ్లి తినాలంటూ షిఫ్టు మార్చుకున్నాడు. అదే అతడి ప్రాణాలు తీసింది. అతడెవరో కాదు.. భారత సంతతికి చెందిన సంజిద్ సింగ్ సంధు. ఆయన విమానంలో స్టివార్డుగా పనిచేస్తున్నారు. స్వతహాగా పంజాబీ అయిన సంధు నిజానికి ఎంహెచ్-17 విమానంలో వెళ్లాల్సిన వాడు కాదు. కానీ, వేరే సహచరుడితో షిఫ్టు మార్చుకుని మరీ ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానం ఎక్కాడు. సంధు మలేషియాలోని పెనాంగ్ నగరంలో ఉన్న తమ ఇంటికి రాగానే అతడికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలని ఆయన తల్లి భావించినట్లు తండ్రి జిజర్ సింగ్ తెలిపారు. విమానం ఎక్కడానికి కొద్ది సేపటి ముందే తనతో ఫోన్లో మాట్లాడాడని, అదే తమ అబ్బాయితో చిట్టచివరి సంభాషణ అని అన్నారు. ఎందుకిలా జరిగిందంటూ ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్‌లైన్స్‌లో స్టివార్డెస్గా పనిచేస్తున్నారు. ఆమె ద్వారానే అత్తమామలకు ఈ విషయం తెలిసింది. జిజర్ సింగ్ దంపతులకు సంజిద్ ఒక్కడే కుమారుడు.