Hyper
-
తడిసి ముద్దైపోయేలా చెమటలు పడుతున్నాయా..?
చెమట పట్టడం అందరిలో కనిపించే ఓ జీవక్రియ. వాతావరణంలో వేడిమి పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా దేహ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని క్రమబద్ధీకరించేందుకు చెమటలు పట్టి... అవి దేహంలోని ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరి కావడంతో దేహం చల్లబడుతుంది. ఇదే పని వ్యక్తులు శారీరక శ్రమ చేసినప్పుడూ, బాగా ఆటలాడినప్పుడూ జరుగుతుంది. అంతేకాదు... బాగా ఆందోళనకు గురైనప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది మానవ మనుగడకు ప్రకృతి చేసిన ఏర్పాటు. కొందరిలో అతిగా చెమటలు పడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో, ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు తెలిపే కథనమిది. మనుషుల్లో ఎక్రైన్ అలాగే అపోక్రైన్ గ్లాండ్స్ అనే రెండు రకాల గ్రంథులుంటాయి. వీటిల్లో ఎక్రైన్ గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు పుట్టినప్పటి నుంచీ ఒంటి నిండా వ్యాపించి ఉంటాయి. అయితే అపోక్రైన్ గ్రంథులనేవి బాహుమూలల్లోనూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉండి, కొంతకాలం తర్వాత (అంటే ముఖ్యంగా యుక్తవయసుకు వచ్చాక) అవి క్రియాశీలమవుతాయి. అందుకే చిన్నప్పుడు కాకుండా యుక్తవయసుకు వచ్చాకే బాహుమూలాల్లోనూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టడం మొదలవుతుంది. చెమటలు పట్టడం కొందరిలో మరీ ఎక్కువ...కొందరిలో చెమట పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల చాలా సమస్యలూ ఎదురవుతాయి. కొందరిలో అరికాళ్లు తేమగా అవుతుంటాయి. మరికొందరిలో అరచేతుల్లో చెమటలు ఎక్కువగా పట్టడంతో ఏది పట్టుకున్నా తడిసిపోవడం, జారిపోవడం కూడా జరుగుతుంటుంది. ‘హైపర్ హిడరోసిస్’లో మళ్లీ రెండు రకాలు. అవి... జనరలైజ్డ్ హైపర్ హిడరోసిస్ (దేహమంతటా విపరీతంగా చెమటలు పట్టడం) లోకలైజ్డ్ హిడరోసిస్ (దేహంలోని కొన్ని చోట్లలోనే చెమటలు ఎక్కువగా పట్టడం). జనరలైజ్డ్ హైపర్ హిడరోసిస్‌కి కారణాలు... చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నందున చెమటలు పట్టడం పెద్దగా జరగదు. కానీ వేసవిలో... అందునా మార్చినుంచి వాతావరణంలో వేడిమి పెరగడంతో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. చెమటలకు మరికొన్ని కారణాలు... విపరీతమైన దేహశ్రమ లేదా వ్యాయామం తర్వాత వైరల్ ఫీవర్స్, మలేరియా, క్షయ వంటి జబ్బులతో జ్వరం వచ్చి తగ్గాక గుండెకు సంబంధించిన వ్యాధుల్లో అంటే షాక్, హార్ట్ ఫెయిల్యూర్స్‌లో ఎండోక్రైన్ లేదా హార్మోనల్ డిజార్డర్స్‌లో (అంటే హైపర్ పిట్యుటరీజమ్, హైపర్‌థైరాయిడిజమ్, ఇన్కసులినోమా, డయాబెటిస్ వంటి సమస్యల్లో) లింఫోమా, కార్సినాయిడ్ సిండ్రోమ్ వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో గర్భిణుల్లో అలాగే మెనోపాజ్‌కు దగ్గరవుతున్నప్పుడు స్థూకాలయం ఉన్నవారిలో మద్యం తాగాక ఫ్లూయాక్సిటిన్ వంటి మందులు వాడుతున్నప్పుడు పార్కిన్సన్స్ జబ్బులున్నవారిలో, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్ సమస్యలున్నవారిలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి.లోకలైజ్డ్ హైపర్ హిడరోసిస్ రకాలు... ఎమోషనల్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ హిడరోసిస్ : తీవ్రమైన ఉద్విగ్నత ఉన్నప్పుడు లేదా ఉద్వేగాలు లేదా భయాలకు లోనైనవారిలో అరచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమటలు పడుతుండటం చాలామంది అనుభవంలోకి వచ్చే విషయమే యాగ్జిలరీ హైపర్ హిడరోసిస్ : బాహుమూలాల్లో చెమటలు పట్టడం ∙గస్టెటరీ హైపర్ హిడరోసిస్ : బాగా వేడివీ లేదా బాగా ఘాటైన మసాలాలతో కూడిన ఆహారాలు తీసుకుంటున్నప్పుడు కొందరిలో పెదవుల చుట్టూ లేదా ముక్కు మీద, నుదుటి మీద, తలలో విపరీతంగా చెమటలు పట్టడం పోశ్చరల్ లేదా ప్రెజర్ హైపర్ హిడరోసిస్ : కుర్చీల్లో కూర్చున్నప్పడు లేదా సీట్‌కు అనుకుని ఉన్న శరీరభాగమంతా చెమటలు పట్టడం వంటి రకాలు కూడా చూడవచ్చు ఎమోషనల్ లేదా ఎసెన్షియల్ హైపర్ హిడరోసిస్ : ఉన్నవాళ్లలోనూ కాస్త వైవిధ్యమైన లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు కొందరిలో అరచేతులు, అరికాళ్లలో మాత్రమే చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి లక్షణాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి కొందరిలో వేసవిలో అరచేతుల్లో మరీ ఎక్కువగా చెమటలు పట్టడంతో చేతుల్లోని వస్తువులు తడిసిపోవడం, జారిపోవడం జరుగుతుండవచ్చు. అలాగే కాళ్ల నుంచి చెమటలు కారుతున్నప్పుడు వాళ్ల అరికాళ్ల గుర్తులు నేల/గచ్చు మీద కనిపిస్తుంటాయి. కొందరిలో చెప్పులూ జారిపోవచ్చు ఇంకొందరిలో పగటిపూట చాలా ఎక్కువగానూ, రాత్రుళ్లు తక్కువగానూ, నిద్రలో పూర్తిగా లేకుండానూ ఉండవచ్చు. లేదా మరికొందరిలో దీనికి పూర్తి భిన్నంగా ఉండవచ్చు.ఇలా చెమట పట్టేవారిలోనూ రెండు రకాలుగా చెమటలు పట్టవచ్చు. అవి... కంటిన్యువస్ స్వెటింగ్ : చెమటలు నిరంతరమూ ధారాపాతంగా పడుతుండవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ.ఫేజిక్ స్వెటింగ్ : ఏ చిన్న పనిచేసినా లేదా ఏ చిన్నపాటి ఒత్తిడికి గురైనా అప్పడు మాత్రమే కంటిన్యువస్‌గా చెమటలు పడతాయి.అరచేతులూ... అరికాళ్లలో చెమటలతో సమస్యలిలా... పిల్లల్లో ఇలా చెమట పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమటలు ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగి΄ోయే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇలాంటి పిల్లలు సాధారణంగా చేతికింద రుమాలు పెట్టుకుని రాస్తుంటారు టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారి΄ోతుంటాయి∙ ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం లేదా నిర్భయంగా షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం కొందరిలో నడుస్తుండగానే చెప్పులు / పాదరక్షణలు జారిపోవడం (ఇలాంటివారు షూ వేసుకోవడం వల్ల కొంతవరకు మంచి ప్రయోజనమే ఉంటుంది. అయితే విపరీతమైన చెమటల కారణంగా వారి మేజోళ్లు తడిసి΄ోతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన పొడి మేజోళ్లు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటలు, మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి.. కాంటాక్ట్ డర్మటైటిస్: చర్మానికి సంబంధించిన అలర్జీలు రావడం ∙పామ్ఫోలిక్స్ : చర్మంపై చిన్న చిన్న నీటి బుడగలు వచ్చి దురదగా ఉండటం పిట్టెడ్ కెరటోలైసిస్ : చర్మానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం డర్మటోఫైటోసిస్: చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం.చికిత్సలు... చెమట పట్టే సమస్య కొందరిలో దానంతట అదే తగ్గి΄ోతుంది. తగ్గకపోతే ఈ కింది సూచనలు/చికిత్సలు అవసరమవుతాయి. యాంటీ పెర్స్పెరెంట్లు : ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఫార్మాల్డిహైడ్, గ్లూటరాల్ డిహైడ్, 20% అల్యూమినియం క్లోరైడ్ హెగ్జాహైడ్రేట్... వీటిని డాక్టర్ల సలహా మేరకే వాడాలి. యాంటీ పెర్స్పిరెటంట్లు ఎక్కువగా లేదా డాక్టర్ సలహా లేకుండా వాడటం వల్ల కాంటాక్ట్ డర్మటైటిస్ అనే అలర్జీలు వచ్చే అవకాశాలెక్కువ డియోడరెంట్లు : ఇవి చెమటను తగ్గించవు, నిరోధించవు. కానీ చెమట వల్ల దుర్వాసనను కొంత తగ్గిస్తాయి. అయాన్ ఫోరోసిస్ : ఇదికరెంట్ ద్వారా చేసే చికిత్స బొట్యులినమ్ టాక్సిన్ : ఇదో రకం విషం. ఇంజెక్షన్ సహాయంతో చేసే చికిత్స ఇది శస్త్రచికిత్స : సింపాథెక్టమీ అనే సర్జరీ. (ఇటీవల దీన్ని ఎక్కువగా సిఫార్సు చేయడం లేదు. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నందున అంతగా ప్రోత్సహించడం లేదు).జాగ్రత్తలు... రోజూ స్నానం చేయాలి. వీలైతే రోజుకు రెండుసార్లు చేస్తే ఇంకా మంచిది ∙మాయిష్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు ధరించడం మేలు ఎప్పటికప్పుడు బాగా ఉతికిన, శుభ్రమైన బట్టలనే ధరిస్తుండాలి. (చదవండి: ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?) -
మంచి మాట: అతి అనర్థమే!
‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే అతి ఎల్లవేళలా విడిచిపెట్టాలి అని పెద్దలు ఏనాడో చెప్పారు. అతి అన్న మాటకు ఎక్కువగా, అధికంగా, అవసరమైన దానికన్నా అని అర్థం. అవసరానికి మించినది ఎక్కువ ఏ విషయంలోనూ కూడదని దీని తాత్పర్యం. మన నడతలో, ఆహార్య ఆహారాదులలో, భాషణ, భూషణాది విషయాలలో ఒక హద్దు, నియమం ఒక పరిమితి ఉండాలి. అంతకుమించి పోరాదు. పరిమితి, హద్దు అనేవి ప్రకృతికే కాదు, మనిషి జీవితానికి అవసరం. అవి మనకొక క్రమాన్ని, హద్దును ఏర్పరచి జీవితం, సత్సంబంధాలు హాయిగా కొనసాగేటట్టు చేస్తాయి. మనిషి నాగరికతను, సంస్కారాన్ని సూచించేవి దుస్తులు. సభ్యతతో సమాజంలో సంచరించటానికి చక్కని వస్త్రధారణ కావాలి. అవి మనకు ఒక హుందాను, నిండుదనాన్ని ఇవ్వాలి. సరైన కొలతలతో ఉన్న దుస్తులు మన ఒంటికి చక్కగా అమరుతాయి. అందాన్నిస్తాయి. పరిమాణంలో అతి ఎక్కువగా లేదా అతి తక్కువగా ఉన్న ఉడుపులు చూపరులకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆహారం మన శరీరానికి శక్తినిస్తుంది. ఉత్సాహాన్నిచ్చి మన పనులు చేసుకునేందుకు దోహదం చేస్తుంది. ఆహారం మనకు అందించే కేలరీలు శరీరానికవసరమైన స్థాయిలో ఉంటే చక్కని ఆరోగ్యం. ఇవి అతిగా ఉంటే ఊబకాయం. పనులు చేసుకోవటం కష్టమవుతుంది. అలాగే వీటి సంఖ్య తగ్గితే అనారోగ్యమే. ఈ కేలరీలను నియంత్రించుకోవాలంటే జిహ్వను అదుపులో పెట్టుకోవాలి. ‘నాలుక కోరుతోంది కాబట్టి తింటాను’ అనే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే మితమైన లేదా సరిపడా ఆహారం తీసుకోవాలి. అలసిన శరీరం మళ్లీ శక్తిని పుంజుకుని, మరుసటి రోజు పనులకు ఆయత్తమవాలంటే నిద్ర మనకు చాలా అవసరం. సేదతీరిన కాయం కొంత సమయం తరువాత చైతన్యవంతమవుతుంది. మన దినచర్య లోకి వెళ్ళమని సూచిస్తుంది. కొంతమంది అవసరమైన సమయంకన్నా ఎక్కువసేపు నిద్రపోతుంటారు.అటు వంటివారిలో ఒక మందకొడితనం వస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గి చైతన్యం మటుమాయం అవుతుంది. ఈ దురలటువాటు మన జీర్ణ వ్యవస్థను ఛిద్రం చేస్తుంది అందుకే అతినిద్ర చేటు అని వివేకవంతులు చెప్పారు. ‘కేయురాణి న భూష యంతిం’ అన్న శ్లోక భావార్థం ఇదే. పెద్దలు, పండితులు, మహానుభావుల సమక్షంలో ఒదిగి, వినమ్రంగా ఉండాలి. వినయంతో సంచరించాలి. ఇది వారి జీవితానుభవాన్ని, విద్వత్తును, ఘనతను గుర్తెరిగి ప్రవర్తించటం. కొందరు అవసరానికి మించిన వినయాన్ని చూపిస్తారు. అది ధూర్తుల లక్షణం. వీరి అతివినయపు లక్ష్యం ఒక స్వార్థ ప్రయోజనమే. వినయాన్ని చూపుతూనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అపుడే దానికొక ఒక గౌరవం, ప్రశంస. అతిపరిశుభ్రత వల్ల సమయం, శక్తి వృథా. అతి ప్రేమ, కాముకత, అహంకారం, జాత్యహంకారం వల్ల ఎందరో, ఎన్నో దేశాలు నాశనమయ్యాయో చెప్పే చరిత్ర పాఠాలు విందాం. మనిషికి మాత్రమే ఉన్న అద్భుత ఆలోచనా శక్తి అతణ్ణి జంతుప్రపంచం నుండి విడిపడేటట్టు చేసింది. భాషను కనుగొనేటట్టు చేసింది. దీనికితోడు, సృష్టిలో ఏ ఇతరప్రాణికి లేని అతడి స్వరపేటిక, నాలుక, ఊపిరితిత్తుల కుదురైన అమరిక అతడి భావోద్వేగాలను వ్యక్తం చేసే గొప్పసాధనమైంది. సందర్భానికి కావలసిన అర్థవంతమైన మాటలను మనలో ఎంతమంది వాడగలరు? వేళ్ళమీద లెక్కపెట్టగలిగే వారే కదా! చాలామంది అధిక ప్రసంగం చేసేవారే. క్లుప్తత, ఔచిత్యత, వివేచనలతో సందర్భశుద్ధిగా భాషించే వాళ్ళు మనలో చాలా తక్కువమందే. ఈ వదరుబోతుల వల్ల కాలహరణమే కాక సంభాషణ పెడదారి పడుతుంది. అందుకే మాట్లాడటం ఒక కళ అన్నారు. అది కొందరికే అలవడుతుంది. అపుడు భాషణం గొప్ప భూషణమే అవుతుంది. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
కిశోర్కే ఓటేసిన రామ్
నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ హైపర్ తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. హైపర్ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ మీద కన్నేశాడు రామ్. అందుకే మరోసారి నేను శైలజ కాంబినేషన్ నే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముందు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని భావించినా.. ఇప్పుడే ప్రయోగం చేయటం ఇష్టం లేని రామ్ సేఫ్ గేమ్ కే మొగ్గుచూపుతున్నాడు. అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్‌కు కిక్ ఇచ్చిన, కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. నేను శైలజ తరువాత వెంకటేష్ హీరోగా ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు రామ్. ఆ సినిమా ఆగిపోవటంతో రామ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాశాడు. రామ్ హోం బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాతో పాటు ప్రైవేట్ పార్టీస్ లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న రామ్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఓ అభిమాని రామ్.., నెక్ట్స్ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నానంటూ రామ్ కు ట్విట్టర్ లో మెసేజ్ చేశాడు. ' రామ్ అన్నయ్య, ఈ రోజు నుంచి మీ నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నాను. ఇది మొదటి రోజు లవ్ యు' అంటూ తరుణ్ సాయి ప్రకాష్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. ఈ ట్విట్ పై స్పందించిన రామ్, ' ఇలాంటి కొత్త టెన్షన్స్ పెట్టకు తమ్ముడు, నేను అదే పనిలో ఉన్నా' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు రామ్. @ramsayz annaya iam going to start fasting from 2day onwards till we get an announcement of ur nxt project iam saying it for sure DAY1 loveU — tarun_sai_prakash (@starun01) 21 February 2017 Illanti kotha tensions pettaku thammudu..im on it #love https://t.co/G1xbMUXXIB — Ram Pothineni (@ramsayz) 21 February 2017 -
‘అమృత’లో హైపర్ సందడి
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని అమృత థియేటర్లో సోమవారం సాయంత్రం ‘హైపర్’ చిత్రం యూనిట్ సందడి చేసింది. ఫస్ట్ షో ఇంటర్వెల్ సందర్భంగా థియేటర్లో చిత్రం హీరో రామ్, హీరోయిన్ రాశీఖన్నా ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ‘మీరు హైపర్ సినిమా చూసేందుకు వస్తే మేము మీ హైపర్ చూద్దామని వచ్చాం.’ అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. కొంతమంది అభిమానుల కోరిక మేరకు సినిమాలోని కొన్ని డైలాగ్‌లు చెప్పారు. హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ ‘అభిమానులు లేనిదే మేము లేము. మాపై అభిమానంతో సినిమాను హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ సెల్ఫోన్లలో హీరో, హీరోయిన్ల ఫొటోలను బంధించేందుకు పోటీపడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, సుంకర అనిల్, సురక్ష ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి ప్రకాష్, థియేటర్ యాజమాన్యం ఎ.రవీందర్రావు, పాల్గుణ్, మేనేజర్ మోహన్‌రావు, కార్పొరేటర్ బోడ డిన్న పాల్గొన్నారు. -
'హైపర్' మూవీ రివ్యూ
టైటిల్ : హైపర్ జానర్ : యాక్షన్ కామెడీ తారాగణం : రామ్, రాశీఖన్నా, సత్యరాజ్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎనర్జిటిక్ స్టార్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నా.. భారీ కలెక్షన్లు సాధించే స్థాయి కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన రామ్, హైపర్ సినిమాతో మరోసారి తనలోని ఎనర్జి లెవల్స్‌ను చూపించేందుకు రెడీ అయ్యాడు. నేను శైలజ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న రామ్, తిరిగి తన పాత మాస్ జానర్లో చేసిన ఈ సినిమా.. రామ్ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసిందా..? రభస ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రామ్‌తో కలిసి హిట్ ఇచ్చాడా..? కథ : అంతా సూరి అనే పిలిచే సూర్య (రామ్) హైపర్ కుర్రాడు. ఎంతో నిజాయితీగా పనిచేసే ప్రభుత్వోద్యోగి నారాయణ మూర్తి(సత్యరాజ్) కొడుకు సూరి. సూరికి తండ్రి అంటే ఎంతో ప్రేమ.. అప్పుడప్పుడు ఆ ప్రేమ నారాయణ మూర్తిని ఇబ్బంది పెట్టే స్థాయిలో కూడా ఉంటుంది. ఉద్యోగి నారాయణమూర్తి పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్న సమయంలో మినిస్టర్ రాజప్ప( రావూ రమేష్) తన కాంప్లెక్స్‌కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఇబ్బంది పెడతాడు. అయితే నిబందనలకు విరుద్ధంగా ఉందన్న కారణంతో నారాయణ మూర్తి పర్మిషన్ ఇచ్చేందుకు అంగీకరించడు. అప్పుడు మినిస్టర్ రాజప్ప ఏం చేశాడు..? నారాయణ మూర్తి సమస్య తెలుసుకున్న కొడుకు సూరి రాజప్పను ఎలా ఎదుర్కొన్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన హై ఎనర్జీ పర్ఫామెన్స్ తో రామ్ సినిమాలో స్పీడు మరింత పెంచాడు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను బాగా పండించిన ఎనర్జిటిక్ స్టార్, అంతా తానే అయి సినిమాను నడిపించాడు. రాశీఖన్నాకు నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఇక మధ్యతరగతి తండ్రిగా నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. రామ్, సత్యరాజ్‌ల నటన సినిమాకు మేజర్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. విలన్‌గా రావూ రమేష్ నటన సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. కామెడీ పండిస్తూనే విలనిజాన్ని చూపించాడు. సాంకేతిక నిపుణులు : ఈ సారి ఎలాగైన సక్సెస్ కొట్టాలన్న కసితో సినిమా చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాను తెరకెక్కించాడు. రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్‌ను ఎంటర్టైనింగ్గా నడిపించాడు. కానీ సెకండాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు లవ్ ట్రాక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. అదే సమయంలో అనవసరమైన సిచ్యువేషన్స్‌లో పాటలు రావటం కూడా ఇబ్బందిగా మారింది. గిబ్రాన్ సంగీతం, మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 14 రీల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రదారుల నటన ఫస్ట్ హాఫ్ కామెడీ మైనస్ పాయింట్స్ : రొటీన్ లైన్ సెకండ్ హాఫ్ పాటలు ఓవరాల్‌గా హైపర్ కాస్త రొటీన్ అనిపించినా.. అలరించే కామెడీ ఎంటర్టైనర్ -
’హైపర్’ ఆడియో హైలైట్స్
-
తండ్రిని గెలిపించే కుమారుడి కథ
‘‘జీవితంలో డబ్బు సంపాదించాలంటే మైండ్‌లో, మనుషులను సంపాదించాలంటే హార్ట్‌లో కరెక్ట్‌గా ఉండాలంటారు. మైండ్‌లో ఎంత కరెక్ట్‌గా ఉన్నానో తెలీదు గానీ.. మిమ్మల్ని (అభిమానులు) చూసినప్పుడు హార్ట్‌లో కరెక్ట్‌గా ఉన్నాననిపిస్తోంది’’ అన్నారు రామ్. ఆయన హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన సినిమా ‘హైపర్’. రాశీఖన్నా హీరోయిన్. జిబ్రాన్ సంగీతమందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, హీరో నాని థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సుకుమార్ మాట్లాడుతూ - ‘‘నిర్మాతలు ముగ్గురిలో అనీల్ దర్శకుడిలా, రామ్ కథకుడిలా, గోపీ నిర్మాతలా ఆలోచిస్తారు. ‘జగడం’ నుంచి ఇప్పటివరకు రామ్‌లో ఏ మార్పూ లేదు. చాలా హైపర్’’ అన్నారు. ‘‘14 రీల్స్ సంస్థ నిర్మించిన ‘దూకుడు’ విడుదలై ఐదేళ్లయింది. ‘హైపర్’తో ‘దూకుడు’ వంటి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు హరీష్ శంకర్. రామ్ మాట్లాడుతూ - ‘‘సంతోష్ శ్రీనివాస్ గురించి తెలియనివాళ్లు.. ‘టైటిల్ బాగా పెట్టారు’ అంటున్నారు. తెలిసినోళ్లు.. ‘బాగా పెట్టుకున్నావ్’ అంటున్నారు. నాకన్నా దర్శకుడే బాగా హైపర్. డబ్బు కోసం వచ్చేవాళ్లు చేతిలో డబ్బు ఉన్నంతవరకూ ఉంటారు. ప్యాషన్‌తో వచ్చేవాళ్లు గుండెల్లో ప్యాషన్ ఉన్నంతవరకూ ఉంటారు. ప్రతి సినిమాకీ మా నిర్మాతల ప్యాషన్ పెరుగుతోంది. నాకు ఇంకో హోమ్ బ్యానర్ దొరికింది. జిబ్రాన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కమర్షియల్ సినిమాల స్టయిల్లో కాకుండా నిజాయితీగా ఏదో కొత్తగా చెప్పాలని రాసుకున్న కథే ఈ ‘హైపర్’. జీవితంలో ప్రతి వ్యక్తికీ తండ్రే హీరో. ఆ తండ్రిని గెలిపించే కుమారుడి కథ ఇది’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్, నిర్మాతలు రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట, హీరోయిన్ రాశీఖన్నా, నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, దామోదర ప్రసాద్, దర్శకులు కిశోర్ తిరుమల, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు. -
'హైపర్' ట్రైలర్ విడుదల వేడుక
-
రాశీఖన్నాకు క్రేజీ ఆఫర్
ప్రజెంట్ టాలీవుడ్లో యంగ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి లాంటి వారు వరుస అవకాశాలతో స్టార్ ఇమేజ్ కోసం పోటి పడుతున్నారు. అయితే వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోల సరసన నటిస్తూ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పుడు రాశీ కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతోంది. యంగ్ హీరో రామ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న హైపర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రస్టింగ్ ఆఫర్ రాఖీ తలుపు తట్టింది. ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తున్న ఈబ్యూటి కోలీవుడ్ ఆఫర్ వరించింది. అది కూడా సిద్దార్థ్ లాంటి సీనియర్ హీరో సరసన కావటం విశేషం. సిద్దార్థ్ హీరోగా కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సిద్దార్థ్ స్వయంగా రాశీఖన్నాను హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అభిమానులకు రామ్ సూచన
ఈ జనరేషన్ హీరోలు అభిమానుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. సినిమా వేడుకలను ఎంత గొప్పగా నిర్వహించాం అన్నదానికన్నా, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో రామ్ కూడా తన అభిమానులకు ఈ మేరకు పిలుపునిచ్చాడు. రామ్ హీరోగా తెరకెక్కుతున్న హైపర్ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి ఇబ్బంది కరంగా తయారవ్వటంతో.. 'హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అంత సురక్షితం అనిపించటం లేదు. ఏ మాత్రం రిస్క్ అనిపించినా ఫంక్షన్ కు రాకండి. టివిలో లైప్ ద్వారా చూడొచ్చు' అంటూ ట్వీట్ చేశాడు. నేను శైలజ సక్సెస్ తరువాత రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా హైపర్. గతంలో రామ్ కు కందిరీగ లాంటి సూపర్ హిట్ ను అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.My dearest fans,the roads dont seem safe.Yemaatram risk anipinchina pls Refrain from coming to the event. You can watch it Live on TV.#love pic.twitter.com/7IxgBQwcd7— Ram Pothineni (@ramsayz) 23 September 2016 -
‘హైపర్’ మూవీ స్టిల్స్
-
'నేను శైలజ' కాంబినేషన్లో మరో మూవీ
నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమాను పూర్తి చేసిన రామ్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్‌కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్‌కు కిక్ ఇచ్చిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే వెంకటేష్‌తో సినిమా కమిట్ అయిన కిశోర్, రామ్‌తో సినిమాను మొదలెట్టడానికి కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. మరి ఈ గ్యాప్ లో రామ్ మరో సినిమా చేస్తాడేమో చూడాలి. -
రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ ప్రస్తుతం ఆ ఫాంను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికతో పాటు మేకింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తనకు కందిరీగ లాంటి సూపర్ హిట్ అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమా చేస్తున్నాడు, ఈ ఎనర్జిటిక్ స్టార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు రామ్. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి లవ్ స్టోరి స్పెషలిస్ట్ కరుణాకరన్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంటే సినిమా చేసిన రామ్ ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయాడు. అయినా మరోసారి కరుణాకరన్ దర్శకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. -
దసరా హౌస్‌ఫుల్!
సినిమాలు రిలీజయ్యాక థియేటర్స్ ఫుల్ అవడం కామన్. కానీ, ఈసారి దసరా... చాలా స్పెషల్. రిలీజ్ కన్నా ముందే థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ఒకటీ రెండు కాదు... ఏకంగా డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అప్పుడే కర్చీఫ్ వేసేశాయి. పెద్ద స్టార్స్ లేరన్న మాటే కానీ, యువ హీరోల సినిమాలు సై... అంటే సై... అంటున్నాయి. ఇన్ని సినిమాలకు థియేటర్స్ దొరకడం మాటేమో కానీ, ఈసారి ఆడియన్స్‌కి వినోదం దొరకడం మాత్రం ఖాయమనే అనిపిస్తోంది. బాక్సాఫీస్ దసరాకి... ఇది ‘సాక్షి ఫ్యామిలీ’ టీజర్... హైపరున్నోడు.. తండ్రిపై ప్రేమున్నోడు! చిత్రం: హైపర్, నటీనటులు: రామ్, రాశీఖన్నా, సత్యరాజ్, నరేశ్... దర్శకుడు: సంతోష్ శ్రీనివాస్, నిర్మాతలు: అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, విడుదల తేదీ: సెప్టెంబర్ 30. ‘బాబోయ్.. నా కుమారుడి ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు’ అని ఓ తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమనుకున్న ఆ తండ్రి కుమారుడి అతి ప్రేమను తట్టుకోలేకపోతాడు. కొడకు అంత హైపర్. ఈ హైపర్ యాక్టివ్ కుర్రాడి కథ ఏంటి? అన్నదే ‘హైపర్’ చిత్రం. ‘కందిరీగ’ తర్వాత హీరో రామ్, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రమిది. ఈ తండ్రీకొడుకుల కథకు రామ్ ఎనర్జీకి తగ్గట్టు ఫైట్స్, కామెడీ, హీరోయిన్‌తో ప్రేమాయణం జోడించి పసందైన విందు భోజనం లాంటి కమర్షియల్ సినిమా సిద్ధం చేశామని దర్శకుడు చెబుతున్నారు. విజయదశమికి బోణీ కొడుతున్న చిత్రమిదే. అక్టోబర్ 1న అమ్మవారి నవరాత్రులు మొదలు. అంతకు ఒక రోజు ముందే సెప్టెంబర్ 30న ‘హైపర్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. లవ్.. లైఫ్.. ఫీల్.. చిత్రం: ప్రేమమ్, నటీనటులు: నాగచైతన్య, శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా, దర్శకుడు: చందు మొండేటి, నిర్మాత: ఎస్.నాగవంశీ, విడుదల తేదీ: అక్టోబర్ 7 రియల్ లైఫ్‌లోనైనా.. రీల్ లైఫ్‌లోనైనా.. ప్రేమకథలకు ముగింపు ఉంటుంది కానీ ప్రేమకు లేదు! ఆ ఫీలింగ్ ఎప్పుడూ మనల్ని పలకరిస్తుంది. ఓ యువకుడి జీవితంలో ఇదే జరిగింది. మూడుసార్లు ప్రేమలో పడ్డాడు. ఓ ప్రేమకథకు ఫుల్స్టాప్ పడిన తర్వాత మరో కథ మొదలైంది. లైఫ్‌లో లవ్ అనే ఫీలింగ్ ఏం మ్యాజిక్ చేసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘ప్రేమమ్’. ముగ్గురు హీరోయిన్లతో నాగచైతన్య నటించిన తొలి చిత్రమిది. దర్శక, నిర్మాతలతోనూ చైతూకి ఇది ఫస్ట్ మూవీ. ఆల్రెడీ రిలీజైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. ఎవర్గ్రీన్ కాన్సెప్ట్ లవ్. ఏ భాషలోనైనా తిరుగుండదు. మలయాళంలో ‘ప్రేమమ్’ సూపర్ డూపర్ హిట్. ఈ తెలుగు రీమేక్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. బీడీ ఫ్రెండ్స్.. యాక్షన్ గురూ! చిత్రం: ఇజం, నటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, జగపతిబాబు, అదితీ ఆర్య, దర్శకుడు: పూరి జగన్నాథ్, నిర్మాతలు: నందమూరి కల్యాణ్‌రామ్, విడుదల తేదీ: అక్టోబర్ 7 వ్యవస్థను గౌరవించే హీరోలు ఎవరైనా మాఫియా డాన్లతో ఫ్రెండ్షిప్ చేస్తారా? పూరి జగన్నాథ్ హీరోలు చేస్తారండీ! ‘పోకిరి’ చూడలేదా! పూరి తాజా సినిమా ‘ఇజం’లో హీరో కల్యాణ్‌రామ్ జర్నలిస్ట్‌గానూ, జగపతిబాబు జావేద్ భాయ్గానూ కనిపించనున్నారు. జర్నలిస్ట్‌కి, జావేద్ భాయ్‌కి బీడీల దగ్గర ఫ్రెండ్షిప్ కుదిరింది. ఈ బీడీ ఫ్రెండ్స్ కహానీ ఏంటి? జర్నలిస్ట్ ఏం చేశాడనేది ‘ఇజం’లో చూడమంటున్నారు. ఆల్రెడీ రిలీజైన పూరి మార్క్ టీజర్, కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాయి. హీరోయిజమ్‌ను ఎలివేట్ చేయడంలో పూరి స్పెషలిస్ట్ కావడంతో ఈ ఫిల్మ్‌తో కల్యాణ్‌రామ్‌కి యాక్షన్ ఇమేజ్ వస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. వన్.. టు.. త్రీ... హారర్ ప్లస్ కామెడీ! చిత్రం: అభినేత్రి, నటీనటులు: ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, దర్శకుడు: ఏ.ఎల్.విజయ్, నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ, విడుదల తేదీ: అక్టోబర్ 7. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఏ సినిమా సక్సెస్ అయితే ఆ ఫార్ములాను ఫాలో అవడం కామన్. హారర్ ప్లస్ కామెడీ.. ప్రస్తుతం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఫార్ములా. దీన్ని ఫాలో అవుతూ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దర్శకుడు ఏఎల్ విజయ్ తీసిన సినిమా ‘అభినేత్రి’. హీరోయిన్ కావాలని ముంబయ్ వెళ్లిన ఓ అమ్మాయి మరణిస్తుంది. అదే ఇంట్లో కొత్తగా పెళ్లైన జంట (ప్రభుదేవా, తమన్నా) అద్దెకు దిగుతారు. మరణించిన అమ్మాయి ఆత్మ తమన్నాలో ప్రవేశించి ఏం చేసిందనేది చిత్రకథ. హారర్, కామెడీలతో పాటు ప్రభుదేవా, తమన్నాల డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ముగ్గురూ మూడు భాషల్లోనూ మంచి పేరున్న నటీనటులు కావడం ఈ మూడు భాషల సినిమాకు ప్లస్ పాయింట్. కనులారా వినుకోండి.. చిత్రం: మన ఊరి రామాయణం, నటీనటులు: ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, సత్య, దర్శకుడు: ప్రకాశ్‌రాజ్, నిర్మాతలు: రాంజీ, ప్రకాశ్‌రాజ్ విడుదల తేదీ: అక్టోబర్ 7. ‘‘మనలో లోపాలు వదిలేసి ఏవేవో చూస్తుంటాం. పనికొచ్చే విషయం తప్ప, ఏవేవో మాట్లాడతాం. మనసారా చెబుతాన్నా. చెవులారా వినుకోండి. కనులారా చూడండి. ఇది ‘మన ఊరి రామాయణం’. మనలోని రామాయణం. ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు ఉంటారు. అలాంటి వ్యక్తి కథ ఇది’’ అంటూ ప్రకాశ్‌రాజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. టీజర్, ట్రైలర్లను బట్టి ఇది ఫ్యామిలీ సినిమా. అందులోనూ సస్పెన్స్ డ్రామా అని అర్థమవుతోంది. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహించిన గత చిత్రాలు ఆయన దర్శకత్వ అభిరుచికి అద్దం పట్టాయి. దాంతో ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించనున్నారు. దస్ కా దమ్! ఒకట్రెండు కాదు.. దసరాకి ఏకంగా ‘దస్’ (పది) సినిమాలకు పైనే విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలా? మరి థియేటర్ల సంగతేంటి? ప్రతి సినిమాకీ సరిపడా థియేటర్లు దొరుకుతాయా? థియేటర్లను పక్కన పెడితే.. ప్రేక్షకుల సంగతేంటి? అన్ని సినిమాలనూ చూస్తారా? ఈ ప్రశ్నలకు సినీ ప్రముఖులు, విశ్లేషకులు చెబుతున్న సమాధానం ఒక్కటే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలను వారు గుర్తు చేస్తున్నారు. ఈ నాలుగూ సంక్రాంతికి విడుదలై మంచి విజయాలు, వసూళ్లు సాధించాయి. మంచి సినిమాలు ఒకే వారంలో విడుదలైనా, ప్రేక్షకాదరణ లభిస్తుందనడానికి ఇంత కంటే మంచి ఉదాహరణ ఏముంటుందంటున్నారు! అయినప్పటికీ.. సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లలో కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే.. ఈనెల 23న అంటే దసరాకు రెండు వారాల ముందు నాని ‘మజ్ను’ విడుదలవుతోంది. విజయదశమికి తప్పకుండా ఎన్నో కొన్ని థియేటర్లలో ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘నిర్మలా కాన్వెంట్’, ‘సిద్ధార్థ’ సహా ఈ శుక్రవారం దాదాపు పది సినిమాలు విడుదలవుతున్నాయి. మంచి పేరొస్తే పాతిక రోజులు థియేటర్లలో ఉండడం ఖాయం. మరి.. తదుపరి విడుదలయ్యే సినిమాలకు థియేటర్లు ఎలా సర్దుబాటు అవుతాయో? అని కొందరు ఆలోచిస్తున్నారు. మనసుంటే మార్గముంటుంది.. పెద్దలందరూ కలిసి అన్ని సినిమాలకూ థియేటర్లు అందేలా చేస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మరి.. దసరాకు ‘దస్’కు పైనే విడుదలయ్యే సినిమాల్లో ‘దమ్ము’న్నవి ఎన్ని? అనేది వేచి చూడాలి. బరిలో... చాలానే! ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’, సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’, ‘లక్ష్మీదేవి సమర్పించు.. నేడే చూడండి’తో పాటు మరి కొన్ని సినిమాలు సైతం ఈ దసరాకు బాక్సాఫీస్ బరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ సినిమాల తర్వాత దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం..’తో హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. అల్లరోడు నటించిన ఫస్ట్ హారర్ మూవీ ఇది. ‘ఈడు గోల్డ్ ఎహే’ విషయానికి వస్తే - ఇందులో సునీల్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. వీరు పోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇక మరో సంచలనం - రూ. 75 కోట్ల ‘జాగ్వార్’. ఒక కొత్త హీరోతో ఇంత బడ్జెట్‌తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. తనయుడు నిఖిల్‌కుమార్ కోసం కర్ణాటక మాజీ సీయం హెచ్.డి. కుమారస్వామి ఈ భారీ చిత్రం ‘జాగ్వార్’ను నిర్మిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించగా, శిష్యుడు మహదేవ్ దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్నారు. - సత్య పులగం -
రామ్ ’హైపర్’ టీజర్ వచ్చేసింది
-
విజయదశమికి హైపర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘కందిరీగ’ మంచి విజయం అందుకుంది. ఆ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హైపర్’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ‘శివమ్’ చిత్రంలో రామ్‌తో జతకట్టిన రాశీఖన్నా మరోసారి ఈ చిత్రంలో జోడీ కడుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇటీవల వైజాగ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమేరా: సమీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి. -
సూపర్ ఫాస్ట్ గా 'హైపర్'
'నేను శైలజ' సినిమాతో సంవత్సరం ప్రారంభంలో సూపర్ హిట్ కొట్టిన రామ్ కొంత గ్యాప్ తరువాత.. తాజాగా 'హైపర్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హైపర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది. కొన్ని రోజులుగా వైజాగ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ షురూ చేసింది. సెప్టెంబరు 30 వ తేదీన 'హైపర్'ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా అలరించనుంది. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరా సీజన్లో 'హైపర్' సందడి చేయనుంది. -
ప్రతి ఇంట్లో..!
రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న సినిమా ‘హైపర్’. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అనేది ఉపశీర్షిక. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ విశాఖలో శరవేగంగా జరుగుతోంది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. యాక్షన్‌తో పాటు లవ్, కామెడీ అంశాలు ఉంటాయి. వచ్చే నెల 9కి చిత్రీకరణ పూర్తవుతుంది. సెప్టెంబర్ రెండో వారంలో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సత్యరాజ్, రావు రమేశ్, మురళీశర్మ, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: గౌతమ్ రాజు, కెమేరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, సంగీతం: జిబ్రాన్. -
రామ్ హైపర్ ఫస్ట్ లుక్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ హైపర్. నేను శైలజ సినిమాతో ఫాంలోకి వచ్చిన రామ్.. మరోసారి మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడు. రామ్ ఎనర్జిలెవల్స్కు పర్ఫెక్ట్గా సరిపోయే కథను రెడీ చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో రూపొందిన కందిరీగ మంచి విజయం సాధించటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న హైపర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్టైలిష్‌గా కనిపిస్తున్న రామ్ లుక్స్ యూత్‌కు బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న హైపర్‌కు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రతి ఇంట్లో ఒకడుంటాడు!
‘‘రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కి, సినిమాలో క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్లుండే టైటిల్. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ‘హైపర్’గా ఉండేవారు ఒకరుంటారు. అలాంటి కుర్రాడి కథ ఇది’’ అన్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘హైపర్’ టైటిల్ పరిశీలనలో ఉందన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అనేది ఉపశీర్షిక. ఆగస్టు 3న ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘కుటుంబ నేపథ్యంలో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర.