విజయదశమికి హైపర్ | Ram Pothineni Hyper Movie release on September 30 | Sakshi
Sakshi News home page

విజయదశమికి హైపర్

Published Fri, Aug 26 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

విజయదశమికి హైపర్

విజయదశమికి హైపర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కందిరీగ’ మంచి విజయం అందుకుంది. ఆ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హైపర్’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ‘శివమ్’ చిత్రంలో రామ్‌తో జతకట్టిన రాశీఖన్నా మరోసారి ఈ చిత్రంలో జోడీ కడుతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇటీవల వైజాగ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చింది.
 
  ప్రస్తుతం హైదరాబాద్  పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమేరా: సమీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement