Gopichand Achanta
-
ఇరవైఅయిదు కథలు విన్నా...ఇదొక్కటే నచ్చింది : అర్జున్
‘‘నటుడిగా నా కెరీర్ మొదలై 30ఏళ్లు పైనే అయింది. ప్రతి సినిమాని ఓ పాఠంలానే భావిస్తాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు చేశాను. ఇప్పుడు ఒప్పుకున్న ఈ సినిమాలో కూడా నాది మంచి పాత్ర. ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 25 కథలు విన్నాను. ఈ కథ మాత్రమే నన్ను ఎగై్జట్ చేసింది. తెలివి, లౌక్యం.. ఇలా అన్నీ ఉన్న పాత్ర కావడంతో నటుడిగా నాకు మంచి స్కోప్ ఉంది’’ అని యాక్షన్ కింగ్ అర్జున్ అన్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన తెలుగులో ఓ సినిమాలో స్పెషల్ రోల్ చేయడానికి అంగీకరించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలు. సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అనీల్ సుంకర మాట్లాడుతూ – ‘‘స్పెషల్ రోల్‌కి అర్జున్‌గారైతే బాగుంటుందనిపించింది. ఆయన అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్త కాదు. కాకపోతే ఆయన కెరీర్లో మరో మంచి క్యారెక్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘అర్జున్‌గారు ఈ సినిమా అంగీకరించినప్పుడు.. సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఎంత ఆనందపడ్డారో నేనూ అంతే ఆనందపడ్డా’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడే షూటింగ్ జరిపి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అమెరికాలో 60 రోజులపాటు చిత్రీకరణ జరుపుతాం’’ అని గోపీచంద్ ఆచంట తెలిపారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా. -
విజయదశమికి హైపర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘కందిరీగ’ మంచి విజయం అందుకుంది. ఆ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హైపర్’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ‘శివమ్’ చిత్రంలో రామ్‌తో జతకట్టిన రాశీఖన్నా మరోసారి ఈ చిత్రంలో జోడీ కడుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇటీవల వైజాగ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమేరా: సమీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి. -
ప్రతి ఇంట్లో..!
రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న సినిమా ‘హైపర్’. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అనేది ఉపశీర్షిక. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ విశాఖలో శరవేగంగా జరుగుతోంది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. యాక్షన్‌తో పాటు లవ్, కామెడీ అంశాలు ఉంటాయి. వచ్చే నెల 9కి చిత్రీకరణ పూర్తవుతుంది. సెప్టెంబర్ రెండో వారంలో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సత్యరాజ్, రావు రమేశ్, మురళీశర్మ, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: గౌతమ్ రాజు, కెమేరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, సంగీతం: జిబ్రాన్. -
నచ్చే ప్రేమగాథ
చిత్రం: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, తారాగణం: నాని, మెహరీన్, ‘మిర్చి’ సంపత్, మాటలు: జై కృష్ణ, పాటలు: కృష్ణకాంత్, కెమేరా: యువరాజ్,యాక్షన్: విజయ్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హను రాఘవపూడి ఈ మధ్య చూసిన సినిమాల్లో కథ గురించి, టేకింగ్ గురించి, ప్లాట్ గురించి, కెమెరా వర్క్ గురించి మాట్లాడడం సహజంగా జరుగుతోంది. ఈ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ దర్శకుడు హను.. మంతుడు... అంటే పనిమంతుడు అని చెప్పాలనిపిస్తుంది. దర్శ కత్వ ప్రతిభ ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కృష్ణగాడి (నాని) వీర ప్రేమగాథ చిన్నప్పుడే మొదలైంది. పదేళ్ల వయసులో మహాలక్ష్మిని (మెహరీన్) ప్రేమిస్తాడు. కానీ చెప్పుకోలేడు. చెబితే వాళ్ల అన్న రామరాజు కుళ్లబొడుస్తాడేమోనని భ యం. కాదు ప్యాంటు తడుపుకునేంత భయం. ఎందుకంటే మహాలక్ష్మి అన్న రాయలసీమలోని ముఠా నాయకుడు రాజన్నకు నమ్మినబంటు. చాలా పరాక్రమశాలి. ఓ ఇరవైమందిని ఒంటి చేతితో మట్టి కరిపించగల శక్తిమంతుడు. ఇతని ప్రత్యర్థి అప్పిరెడ్డి... రాజన్నను చంపాలనే ప్రయత్నంలో తన ఐదుగురు కొడుకులను పొగొట్టుకుంటాడు. అతణ్ణి ఎప్పుడె ప్పుడు చంపుదామని చూస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్‌కి కూడా అన్నకు తగ్గట్టు కాస్త తెగువ ఎక్కువే. దాని వల్ల హీరో నానికి కష్టాలు కావాల్సినన్ని. చిన్నతనం నుంచి పెకై ప్పుడూ దెబ్బలాడు కునే హీరో, హీరోయిన్లు ఎవరికీ తెలియకుండా ప్రేమించేసుకుం టారు. ‘మా అన్నకు చెప్పి ముహూర్తం పెట్టమ’ని హీరోయిన్ ఒత్తిడి చేస్తుంది. కానీ ‘మీ అన్నే వచ్చి నన్ను అడగాలి’ అని తప్పించుకునే పిరికివాడు హీరో. రాజన్నకు ఓ తమ్ముడు. పేరు శ్రీకాంత్ (‘మిర్చి’ సంపత్). హైదరాబాద్‌లో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. ఎవరికీ భయపడని నీతిమంతుడు. అరెస్ట్ చేస్తే జాబ్ చేస్తున్నట్టు ఉంటుందని, ఎన్కౌంటర్ చేస్తే జాబ్ ‘బాగా’ చేస్తు న్నట్టుంటుందని అతని నమ్మకం. క్రిమినల్స్‌ని అతను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్నట్టు, వదిలేస్తే మిస్సింగ్ న్యూస్‌లో ఉంటారు. ఎంతటి మూర్ఖుడంటే డీఎస్పీని కూడా ఎన్కౌంటర్ చేసే టైప్. ఇంతలో దుబాయ్ నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డాన్ సింగపూర్ నుంచి డేవిడ్ ఇబ్రహీం(మురళీశర్మ) హైదరాబాద్‌లోకి ఎంటరవుతాడు. వాళ్ల అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో చాదర్ సమర్పించుకోవడానికి వస్తాడు. ఆ సమయం లోనే ర్యాష్ డ్రైవింగ్ కేసులో మురళీశర్మను ‘మిర్చి’ సంపత్ అరెస్ట్ చేస్తాడు. ఇక ‘మిర్చి’ సంపత్కున్న ఎన్కౌంటర్ ఇమేజ్‌కు భయ పడి, తమ భాయ్‌ని విడిపించుకోవడం కోసం రాజన్న దగ్గరకొ చ్చిన అతని పిల్లల్ని కిడ్నాప్ చేయాలని యత్నిస్తారు భాయ్ అను చరులు. ఈ ప్రయత్నాన్ని హీరోయిన్ అన్న విఫలం చేసి పిల్లల్ని హీరో నానికి అప్పగిస్తాడు. ఈ పిల్లల్ని జాగ్రత్తగా హైదరాబాద్‌కు తీసుకువెళితే తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. చావడానికి కాదు బ్రతకడానికి ఓ ధైర్యం కావాలి అన్న ఫిలాసఫీ వెనక దాక్కునే పరమ పిరికి క్యాండిడేట్ మన హీరో. శుద్ధ పిరికివాడైన హీరోగారి నాన్న ఎవరి పిల్లవాడినో కాపాడ బోయి తన ప్రాణాల్ని పోగొట్టుకుంటాడు. అందుకే తండ్రిని మూర్ఖుడనుకుంటాడు హీరో. ఇంతలో హీరోయిన్ అన్న ఇచ్చిన ఆఫర్‌కి ఉబ్బిత బ్బిబై, పిల్లల్ని హైదరాబాద్ చేర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సెకండాఫ్‌లో కావాల్సినంత కామెడీ, అంతకంటే ఎక్కువ ట్విస్టులతో కథ సుఖాంతమవుతుంది. పిరికి హీరో- వాళ్ల నాన్న చేసిన త్యాగాన్ని గౌరవించడమే కాక ధైర్యవంతుడిగా ఎలా మారతాడనేది డెరైక్టర్ తెరపై క్రియేట్ చేసిన రెండున్నర గంటల ప్రయాణం. ప్రేమ హీరోతో ఏమైనా చేయిస్తుందనేది మనందరికీ తెలిసిన విషయం. సినిమా మీద ప్రేమతో ఈ టీమ్ చేసిన ప్రయత్నం మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. సినిమా సెకండ్ హాఫ్ అంతా ప్రధానంగా ముగ్గురు చిన్నపిల్లల చుట్టూరా నడపడం తెలివైన ఎత్తు. సినిమాను ఫ్యామిలీలకు సన్నిహితం చేసి, ఆడి యన్స మార్కెట్ సైజ్ పెంచడానికి ఉపకరించే బాక్సాఫీస్ వ్యూహం. పాత్రలకు నటుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హీరో ఫ్రెండ్‌గా ‘సత్యం’ రాజేశ్, అలాగే మురళీశర్మ, బ్రహ్మాజీ, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి, ‘ప్రభాస్’ శ్రీను నవ్విస్తారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీజీ, డీఐ, విజయ్ యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ తీయగా ఉన్నాయి ఏదీ అతిగా లేదు. కెమేరామన్ యువరాజ్ విజువల్స్, ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే ‘నువ్వంటే నా నవ్వు...’ పాట, ఆ లొకేషన్లు, చిత్రీకరణ తాజా అనుభూతినిస్తాయి. సాహిత్యమూ బాగుంది. నానీని పట్టుకోలేము అన్నంత బాగా పెర్ఫార్మ్ చేశాడు. స్ప్లిట్ సెకండ్లో హావభావాల్ని మార్చాల్సిన సన్నివేశాలు ఎన్నో స్క్రిప్ట్‌లో ఉన్నాయి. అన్నీ పట్టువిడుపులతో ఆడుకున్నాడు. హను రాఘవపూడి, నాని - ఇద్దరూ ఇద్దరే. ఇది వీళ్లిద్దరి వీరగాథ. - ప్రియదర్శిని రామ్ -
బాలకృష్ణను గుర్తు తెచ్చుకుని తొడ కొట్టా!
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి ఘనవిజయాల తర్వాత నాని నటించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. నాని, మెహరీన్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. నాని పంచుకున్న ముచ్చట్లు... ♦ ఈ చిత్రానికి ముందే ‘అందాల రాక్షసి’, మరో రెండు కథలను హను నాకు వినిపించాడు. అయితే అవి నాకు నప్పవని చేయలేదు. ఆ తర్వాత నన్ను దృష్టిలో పెట్టుకునే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ రాశారు. సినిమా కథ, షూటింగ్, రిజల్ట్ విషయంలో మేము టెన్షన్ పడలేదు. అయితే సినిమా టైటిల్ విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడ్డాం. ఏ టైటిల్ పెడితే బాగుంటుందని చర్చించుకుని నా పాత్ర పేరు కృష్ణ కాబట్టి, ఫైనల్‌గా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ యాప్ట్ అవుతుందని పెట్టాం. ♦ ఈ కథలో నాయకుడు కృష్ణ బాగా పిరికివాడు. అయినా పైకి గంభీరంగా, ధైర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. నాకు తెలిసి పైకి ధైర్యవంతుల్లా కనిపించే వాళ్లందరూ పిరికివాళ్లే. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ఇందులో ఇంగ్లీష్ రాదు కానీ, వచ్చినట్టు మేనేజ్ చేస్తుంటా. రియల్ లైఫ్‌లో నాకు బాగా ఇంగ్లీష్ వచ్చు. ‘టైటానిక్’ సినిమా చాలాసార్లు చూడటంతో ఇంగ్లీష్ పరీక్షల్లో ఆ చిత్రం స్టోరీ రాసేవాణ్ణి. అయినా ఒక్కసారి కూడా నేను ఇంగ్లీష్‌లో ఫెయిల్ కాలేదు. ♦ రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. హీరో బోర్లు వేసే కాంట్రాక్ట్ తీసుకుని వేయిస్తుంటాడు. ఉదయం నుంచి ఆ పనిలో ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఫ్రెండ్స్‌ను కలవడం, సరదాగా ఎంజాయ్ చేయడం చేస్తుంటాడు. నేను రియల్ లైఫ్‌లో కమల్‌హాసన్‌గారి అభిమానిని. ఇందులో బాలకృష్ణగారి అభిమానిగా నటించా. అనంతపురం, హిందూపురాలకు స్టోరీతో లింక్ ఉంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్లోనే బాలకృష్ణగారి పేరు చెప్పుకుని బయటపడే సీన్ ఉంటుంది. ప్రతి సీన్ కథలో కనెక్ట్ అయి ఉంటుంది. ఓ సీన్లో విలన్లను కొట్టేందుకు అవసరమైన ధైర్యం కోసం బాలకృష్ణ గారిని గుర్తుకు తెచ్చుకుని తొడ కొట్టే సీన్ కూడా ఉంది. ♦ ఆడియో రోజున జూ. ఎన్టీఆర్, మహేశ్‌బాబు మాటలు విన్నప్పుడు ఇగో లేకుండా మాట్లాడారనిపించింది. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’ విజయాలతో ఈ చిత్రం గురించి టెన్షన్ పోయింది. అంతకు ముందు ఫ్లాపులు వచ్చినప్పుడు టెన్షన్ ఉండేది. ‘జెండాపై కపిరాజు’ చిత్రం కోసం రెండేళ్లకుపైగా కష్టపడ్డా ఆశించిన ఫలితం రాలేదు. ‘భ లే భలే మగాడివోయ్’ని ఆరే నెలల్లో పూర్తి చేసినా ఘన విజయం సాధించింది. ♦ రెమ్యునరేషన్ పెంచానంటున్నారు. పెంచక తప్పదు. ఎందుకంటే నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన మొదటి చిత్రానికి రూ. 2500, రెండో సినిమాకు 3500 తీసుకున్నా. ఇప్పుడు హీరో అంటే తప్పదుగా. నేనే కాదు.. ఎవరైనా సినిమా సినిమాకు పెంచుతారు. ♦ ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నా. ఆ చిత్రం తరు వాత ఆనంది ఆర్ట్స్‌లో ఓ చిత్రం చేస్తా. ఇకపై గ్యాప్ లేకుండా సిన్మాలు చేస్తా. -
లెజండ్ మూవీ సక్సస్ మీట్
-
బాలకృష్ణ 'లెజెండ్' మూవీ స్టిల్స్
-
ఓ ఫెమినిస్ట్‌గా చెబుతున్న మాటలివి..!
‘‘గతంలో యాడ్స్‌లో నటించాను. ఇప్పుడు ఉన్నట్టుండి హీరోయిన్ అయిపోయాను. కథానాయికగా నటించిన తొలి సినిమానే సూపర్‌స్టార్ మహేష్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘1’ చిత్రానికి కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోందని తెలిసింది. ఇంతమంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని కృతి సనన్ అన్నారు. మహేష్‌బాబు కథానాయకునిగా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కృతి సనన్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘తెలుగుతెరపై హాలీవుడ్ స్థాయిలో తీసిన ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా సోలో హీరోయిన్గా పరిచయం అవ్వడం గర్వంగా ఉంది. మహేష్‌తో నటించడం నిజంగా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. సెట్లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయన... ఒక్కసారి కెమెరా ముందుకెళితే.. పాత్రలా మారిపోతారు. నిజంగా అమేజింగ్ అనిపించింది. జర్నలిస్ట్ పాత్ర పోషణ విషయంలో... ఎంతో హోమ్‌వర్క్ చేశాను. ఈ విషయంలో సుకుమార్‌గారి సహకారం మరచిపోలేను’’ అన్నారు. ఈ సినిమా పోస్టర్‌పై వచ్చిన వివాదం గురించి మాట్లాడుతూ -‘‘అది కేవలం పాటలో భాగమే. సినిమా మొత్తం అలా ఉండదు. ఈ పోస్టర్ విషయంలో ప్రతి ఒక్కరూ నన్నే టార్గెట్ చేశారు. స్త్రీల మనోభావాలు దెబ్బతినేలా నేను ప్రవర్తించను. ఓ స్వతంత్య్రభావాలు కలిగిన స్త్రీగా, ఓ ఫెమినిస్ట్‌గా నేను చెబుతున్న మాటలివి’’ అని చెప్పారు కృతి. తన హైట్ అయిదడుగు తొమ్మిది అంగుళాలని, తన శారీరక భాషకు తగ్గ పాత్రలు లభిస్తే చేస్తానని, త్వరలో ఆమిర్‌ఖాన్‌తో ఓ సినిమా చేయబోతున్నానని కృతి తెలిపారు.