Rice Cookers
-
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
మధుమేహ బాధితులూ ఇకపై మీరంతా అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని నిశ్చింతగా తినేయొచ్చు. ఊబకాయులు సైతం కార్బొహైడ్రేట్స్‌ను ఎంత కావాలంటే అంత లాగించేయొచ్చు. అవును.. మీరు వింటున్నది నిజమే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)ను అదుపులో ఉంచే స్మార్ట్ కుక్కర్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన ఈ వినూత్న ఆవిష్కరణ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కుక్కర్‌గా పేటెంట్ సైతం దీనికి లభించింది.గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) మనం తీసుకునే ఆహారంలో 55% కంటే తక్కువగా ఉంటే రక్తంలో సుగర్ అత్యంత నిదానంగా పెరుగుతాయి. జీఐ 56–70% మధ్య ఉంటే నెమ్మదిగా.. 70% పైబడి ఉంటే వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర పాళ్లు పరిమితికి మించి పెరిగితే క్లోమ గ్రంధి (పాంక్రియాస్)పనితీరు మందగించి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిని తగ్గించడమే లక్ష్యంగా..ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దల్లోనేకాదు.. పిల్లల్లోనూ టైప్–1 డయాబెటిస్ విపరీతంగా పెరగడానికి కారణమవుతున్న ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను నియంత్రించాలన్న సంకల్పంతో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త డి.సందీప్రాజా నేతృత్వంలో డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, వి.వాసుదేవరావు, ఎల్.ఏడుకొండలుతో కూడిన శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు చేసిన పరిశోధన ఎట్టకేలకు ఫలించింది. ఎలాంటి వరి రకమైనా సరే ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాటిలోని జీఐ స్థాయిలను తగ్గించి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా అభివృద్ధి చేసిన స్మార్ట్ కుక్కర్ ఆహార రంగంలో విప్లవమే.ఇదెలా పనిచేస్తుందంటే..ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా జీఐను తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో బియ్యాన్ని స్టీమింగ్ ప్రక్రియ ద్వారా ఉడికిస్తారు. గంజిని సోలనాయిడ్ వాల్వ్ ద్వారా వేరు చేస్తారు. తర్వాత అన్నం వేగంగా చల్లబడే (ర్యాపిడ్ కూలింగ్) చాంబర్లోకి పంపి 1–2 డిగ్రీల సెల్సియస్‌లో ప్రాసెస్ చేస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే.. బియ్యాన్ని రీట్రో గ్రేడ్ చేయడం (అన్నేలింగ్, హీట్ మాయిశ్చర్ ట్రీట్మెంట్ (హెచ్ఎంటీ) ద్వారా అన్నంలో ఉండే స్టార్చ్ (పిండి పదార్థం)లో 20 నిమిషాల్లో జీర్ణమయ్యే పదార్థం (ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్–ఆర్డీఎస్)ను 90 నిముషాల్లో నెమ్మదిగా జీర్ణయ్యే పదార్థం (స్లో డైజెస్టబుల్ స్టార్చ్–ఎస్డీఎస్)గా మారుస్తుంది. దీంతో పాటు అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది అసలు జీర్ణ మవకుండా డైటరీ ఫైబర్‌లా ప్రవర్తించేలా ఒక రకమైన పిండి పదార్థం. బియ్యాన్ని వండే సమయంలో అదనపు పానీడు తీసేయడంతో కొంత స్టార్చ్ తగ్గిపోతుంది. ఈ స్మార్ట్ కుక్కర్లో వండితే 45% ఆర్డీ ఎస్‌ను ఎస్డీఎస్గా మార్చి ఆర్ఎస్ను 121% శాతానికి పెంచుతుంది. ఫలితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 22% వరకు తగ్గిపోతుంది. ఇలా వండిన అన్నం సాధారణ అన్నంలాగే ఉంటుంది. సాధారణంగా వండే అన్నా నికి ఉన్నట్టుగానే రంగు, రుచి, వాసనలు పాడవకుండా ఉంటుంది.ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్ఇది పూర్తిగా స్మార్ట్ కంట్రోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇంటిగ్రేషన్‌తో పనిచేస్తుంది. ఐవోటీ కంట్రోల్ రిమోట్ (మొబైల్ యాప్) ద్వారా ఎంతదూరం నుంచైనా దీనిని నియంత్రించవచ్చు. కేవలం ఒక కమాండ్ ఇస్తే చాలు ఇంట్లో అన్నం నిర్ణయించిన సమాయనికి రెడీ అయి ఉండేలా సెట్ చేసుకోవచ్చు. రైస్ వేరియంట్, బియ్యం–నీరు నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, స్టీమింగ్ సమయం వంటి వాటిని మొబైల్ ద్వారానే సెట్ చేసేలా ఏర్పాటు చేశారు. మనం పెట్టే బియ్యం రకం ఆధారంగా దానికి అవసరమైన నీటి నిష్పత్తి, ఉడికే ఉష్ణోగ్రత, ఉడికే సమయం, చల్లబడే ఉష్ణోగ్రత, చల్లబడే కాలం, స్టీమింగ్కు అవసరమైన సమయం, వంటి అంశాలను కూడా ప్రత్యేక ఆల్గారిథం ద్వారా స్వయం చాలకంగా నియంత్రిచబడతాయి. 2022లో ప్రారంభమైన ఈ పరిశోధనకు మూడేళ్ల సమయం పట్టింది. ఈ పరిశోధన పూర్తిగా బాపట్లలోనే జరిగింది. ఫ్యాబ్రికేషన్ కోసం కోయంబత్తురులోని ఓ కంపెనీ సహకారం తీసుకున్నారు. ఈ వినూత్నమైన రైస్ కుక్కర్‌కు గత నెలలోనే భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు(405194–001) లభించింది.డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగంస్మార్ట్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల రక్తంలోని సుగర్ స్థాయిలను పూర్తిగా నియంత్రించవచ్చు. నిధానంగా జీర్ణమవడం వల్ల మళ్లీ ఆకలి వేయడానికి సమయం పడుతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని శక్తి పెరగడమే కాకుండా అలసట తగ్గుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. త్వరలోనే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం ఒక కంపెనీతో ఎంవోయూ చేసుకోబోతున్నాం. గతంలో నేను అభివృద్ధి చేసిన ఆప్లాటాక్సిన్ను కనుగొనే ఒక రాపిడ్ కిట్‌తో పాటు అతి తక్కువ ధరలోనే గైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించేలా తయారు చేసిన కిట్‌కు పేటెంట్ హక్కులు లభించాయి. వరుసగా మూడో ఆవిష్కరణకు పేటెంట్ హక్కు రావడం ఆనందంగా ఉంది.– డాక్టర్ దోనేపూడి సందీప్ రాజా, బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల(చదవండి: ఇంటిని కూల్‌గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?) -
డబ్బులు కాదు, ఏకంగా బంగారం పంచనున్నారు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రచారపర్వంలో భాగంగా జిల్లాలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ గమాగమవుతున్నట్లు ఆ నియోజకవర్గంలో వివిధ వర్గాల్లో కథలు చెప్పుకున్న మాదిరిగా చర్చ జరుగుతోంది. టికెట్ ఖరారుతో ముందుగానే ప్రచారం ప్రారంభించిన సదరు ఎమ్మెల్యే మొదటి విడతలో ఒక తరహాలో వెళ్లారు. గ్రామాల్లో సమస్యల విషయమై ప్రశ్నిస్తే దాడులు కూడా చేయాలని తన అ నుచరులకు సూచించిన సదరు సిట్టింగ్ ఎన్నికల కౌంట్‌డౌన్ అవుతున్నాకొద్దీ వైఖరి మార్చుకుంటూ వస్తున్నారు. సదరు సిట్టింగ్ అభ్యర్థి వ్యవహార శైలి పై ఇప్పటికే సాధారణ ఓటర్లతో పాటు సదరు పా ర్టీకే చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదనతో ఉన్నారు. ఆగ్రహంగానూ ఉన్నారు. ఈ క్ర మంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలియడంతో సదరు సిట్టింగ్ మదిలో గాభరా మొదలైంది. రైస్ కుక్కర్ల పంపిణీ.. ఇప్పటికే పలు గ్రామాల్లో కారు గుర్తు స్టిక్కర్లతో కూ డిన రైస్ కుక్కర్లు పంపిణీ చేయించారు. ఈ కుక్కర్లు కొన్ని చోట్ల సరిపోకపోవడంతో ఆయా గ్రామా ల్లో పలువురు తమకూ ఇ వ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇక ప్రతిరోజూ ఆ నియోజకవర్గ కేంద్రంలో క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల నిబంధనలు బే ఖాతరు చేస్తూ సదరు అభ్యర్థి మటన్‌తో విందులు ఏర్పాటు చేయిస్తుండడం గమనార్హం. రాత్రి సమయాల్లో మద్యం దావత్‌లు కూడా చేస్తున్నారు. మ రోవైపు దసరా నేపథ్యంలో ఆయా సంఘాలకు సద రు సిట్టింగ్ మేకలను విచ్చలవిడిగా ఇస్తుండడం గ మనార్హం. ఈ క్రమంలో వివిధ కులసంఘాల సమావేశాలు ఏర్పాటు చేయించి ప్రచారానికి వెళ్తున్నాడు. అయితే ఆయా సంఘాల్లోని సభ్యులందరూ సమావేశాలకు రావాల్సిందేనని తీర్మానాలు కూడా ముందుగానే చేయించడంతో కొందరు సభ్యులు, తటస్తులు మాత్రం ఇలా ఒత్తిడి చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సిట్టింగ్ త మ ఊర్లలోకి రావద్దంటూ గతంలో పలు గ్రామాల్లో అమలు కానీ హామీలతో కూడిన ఫ్లెక్సీలు కూడా ప్ర దర్శించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గ్రామా ల్లో హామీలపై నిలదీసిన విషయాలకు సంబంధించి పలువురు వీడియోలు తీస్తే ఆ వీడియోలను పోలీసులు డిలీట్ చేయించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు యువకులు మాత్రం ప్రజా సమస్యల విషయ మై సోషల్ మీడియా వేదికగా సె టైర్లు వేస్తుండడం గమనార్హం. సర్పంచ్‌లకు బంగారు కానుకలు కొన్ని నెలల క్రితం వరకు తమతో దురుసుగా వ్యవహరించిన నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న సర్పంచ్‌లు దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న సిట్టింగ్ వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు సర్పంచ్‌లకు తులం చొప్పున బంగారం, ఉప సర్పంచ్‌లకు నగదు, సొసైటీ చైర్మన్లకు బంగారం తదితర తాయిలాలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి భయంతోనే ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చర్చించుకోవడం విశేషం. కాగా ప్రచారంలో భాగంగా కుక్కర్లు పంచిన అభ్యర్థి గరంగరంగా వండుకుని తిన్నారా అని పలుచోట్ల వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు చేస్తున్నారు. చివరకు ఆలయాల వద్ద సై తం ప్రచారానికి వెళ్లడంతో ఒక గ్రామంలో సిట్టింగ్ అభ్యర్థి వర్గీయులకు భవానీ దీక్షాపరులకు మధ్య ఘర్షణ కూడా చో టుచేసుకుంది. ఈ క్రమంలో సదరు అభ్యర్థి పలాయనం చిత్తగించడం విశేషం. ఇలాంటి ప్రలోభాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా.. అధికారుల నిర్లక్ష్యమే!
మరిపెడ రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గ్రామమంతా షార్ట్‌సర్క్యూట్ వస్తుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. వెరసి కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్జేజితండా పరిధిలోని బుడ్డతండా(మెగ్యాతండా)లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్‌సర్క్యూట్ వల్ల కొద్ది రోజులుగా తండాలోని ఇళ్లలో గల గృహోపకరణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. సమస్యను పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తండాకు చెందిన భూక్యా సునీత(25) ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తన భార్య మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త భూక్యా సంతోష్ ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఏడాదిన్నర పాప ఉంది. తల్లి కోసం రోదిస్తున్న చిన్నారిని చూసి పలువురు కన్నీటి పర్యాంతమైయ్యారు. (చదవండి: అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం.. ముగ్గురు కొడుకులు రోడ్డు ప్రమాదాల్లోనే..) -
గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు
Man Marries Rice Cooker: పెళ్లి కోసం అతగాడికి సంబంధాలు వెతకాల్సిన అవసరం రాలేదు. అమ్మాయి తరపున ఏడు తరాల్ని తిప్పేయలేదు. కనీసం వధువు బ్యాక్‌గ్రౌండ్ కూడా పట్టించుకోలేదు. అందంగా, అణకువగా ఉందని, తనతో ప్రేమగా ఉండడమేకాదు రోజూ వండిపెడుతోందని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ, నాలుగు రోజులకే ఆ పెటాకులైంది. విచిత్రమైన ఈ పెళ్లికానీ పెళ్లి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. వైట్ డ్రెస్సులో ధగధగ మెరిసిపోతూ వరుడు.. తల మీద ఓ గుడ్డ కప్పిన వధువు సంప్రదాయ పద్దతుల్లో మతపెద్దల మధ్య ఒక్కటయ్యారు. వివాహనంతరం వధువును వరుడు ముద్దాడిన ఫొటోలూ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. వరుడు సంతోషంగా ఉన్నా.. అదేం చిత్రమే చూసేవాళ్లకే ఆ పెళ్లి కొంచెం విడ్డూరంగా, ఎబ్బెట్టుగా అనిపించింది. కారణం.. అతగాడు పెళ్లి చేసుకుంది ఓ రైస్ కుక్కర్‌ను. నాలుగు రోజులకే పెటాకులు మనిషిలా గోల చేయదని, పైగా రోజూ వండిపెడుతోందన్న కారణంతో ప్రేమించి మరీ ఫిలిప్స్ కంపెనీకి చెందిన ఆ రైస్‌కుక్కర్‌ను పెళ్లి చేసుకున్నాడట ఇండోనేషియాకు చెందిన అనమ్ అనే వ్యక్తి. అయితే ఎవరి కళ్లు పడ్డాయో తెలియదుగానీ.. నాలుగు రోజులకే ఆ పెళ్లి పెటాకులు అయ్యింది. కేవలం రైస్ మాత్రమే వండిపెడుతోందని, మిగతావేవీ చేయలేకపోతుందనే ఫ్రస్టేషన్‌తో నాలుగు రోజులకే విడాకులు ఇచ్చేశాడు ఆ నవ వరుడు. దీంతో పెళ్లి-విడాకుల కథ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్ మీడియాహౌజ్లకు చేరుకుంది. అయితే.. అసలు విషయం ఏంటంటే.. ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ అనమ్ సోషల్ మీడియా సెలబ్రిటీ. ఫన్నీ కంటెంట్‌ను పోస్ట్ చేయడం అతనికి ముందునుంచి అలవాటే. అందులో భాగంగానే ఇలా ‘రైస్ కుక్కర్ పెళ్లి-విడాకుల’ డ్రామా ఆడాడు. ఆ డమ్మీ పెళ్లిలో ఉంది కూడా మత పెద్దలు కారు.. అతని స్నేహితులే. సో.. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే సరదాగా చేశాడు. సీరియస్‌గా తీస్కోకండి.. సుఖీభవ! చదవండి: ఒక కుర్చీ.. ఏడువేల కిలోమీటర్ల ప్రయాణం!! -
అమేజింగ్ బేబీ మల్టీ ఫంక్షన్ కుకర్
అన్నం తినడం మొదలుపెట్టిన పిల్లలకు మెత్తటి, రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టడం పెద్ద టాస్కే మోడర్న్ మదర్స్‌కి. ఆకలితో బిడ్డ కేర్‌మనే క్షణానికల్లా వేడివేడిగా వండిచ్చే గాడ్జెట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బేబీ ఫుడ్ ప్రాసెసర్ మల్టీ ఫంక్షన్ కుకర్ అలాంటిదే. ఈ మేకర్ పైభాగంలో డిజిటల్ డిస్ప్లే టచ్ ప్యానెల్ పైన డీఫ్రాస్ట్, స్టీమ్, ఆన్/ఆఫ్, మాన్యువల్ బ్లెండర్, ఆటోమేటిక్ బ్లెండర్, స్టెరిలైజ్ వంటి ఆప్షన్ తో టెంపరేచర్ కంట్రోల్ కోసం ప్లస్ మైనెస్లూ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. పళ్లు, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏ ఫుడ్ కావాలన్నా నిమిషాల్లో ఉడికించి పేస్ట్‌లా చేస్తుంది పిల్లలు తినగలిగేలా. ఇది జ్యూసర్, బ్లెండర్, మీట్ గ్రైండర్, కౌంటర్ టాప్ బ్లెండర్ ఇలా చాలా రకాలుగానూ పని చేస్తుంది. ముందుగా కుకర్ ఎడమవైపునున్న వాటర్ ట్యాంక్‌లో వాటర్ పోసుకొని మూత(డిస్ ప్లేకి పక్కనే ఉంటుంది) పెట్టుకోవాలి. తర్వాత ఎడమవైపు పెట్టుకుని.. ఉడికించి మెత్తగా చెయ్యడానికి ఆప్షన్ లు ఇస్తే సరిపోతుంది. స్టీమింగ్ బౌల్, మిక్సీ బౌల్ వేరు వేరుగా ఉంటాయి. ధర 99 డాలర్లు (రూ.7,182). చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
కుక్కర్లో కరెన్సీ.. కరోనాకు చెక్!
సాక్షి, కైకలూరు: ఇదేంటి.. గల్లాపెట్టె స్థానంలో ఎలక్ట్రికల్ కుక్కర్ ఉందని ఆశ్చర్యపోతున్నారా? కరోనా నేపథ్యంలో కృష్ణాజిల్లా కైకలూరులో విజయలక్ష్మి జనరల్ స్టోర్స్ యజమాని కొత్త నరసింహారావుకు వచ్చిన సృజనాత్మక ఆలోచన ఇది. దుకాణంలో వినియోగదారులు ఇచ్చిన కరెన్సీ నోట్లను ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్లో నీటి ఆవిరిలో ఉడికించి శానిటైజ్ చేస్తున్నారాయన. ‘నగదు వివిధ వ్యక్తుల చేతుల నుంచి బట్వాడ అవుతోంది కాబట్టి కరెన్సీ నోట్లతోనూ కరోనా వైరస్ సోకే ప్రమాదముంది. మొదట కరెన్సీ నోట్లను నేరుగా కుక్కర్లో ఉంచితే వేడి ఎక్కువై కాలిపోయాయి. తర్వాత కొంచెం నీటిని అడుగున వేసి, మధ్యలో రంధ్రాలున్న ప్లేటును అమర్చడంతో ప్రయోగం ఫలించింది. ఆవిరిలో ఉడకబెట్టడం వల్ల నోట్లపై ఉన్న క్రిములు చనిపోతాయి.’ అని నరసింహారావు వివరించారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం) -
నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే లక్ష్యం
గ్రైఫొన్ ఎండీ రాజేష్ మోహన్ సాక్షి, హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రముఖ డిస్ట్రిబూషన్ కంపెనీ గ్రైఫొన్ అప్లయెన్సెస్ ఎండీ రాజేష్ మోహన్ తెలిపారు. యూకేలో బ్రాండ్ ఉత్పత్తులుగా పేరుగాంచిన కంపెనీలు బ్లాక్ అండ్ డెక్కర్, రస్సెల్ హాబ్స్, రెమింగ్టన్ వస్తుత్పత్తులకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు సన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ డీలర్‌షిప్‌ను దక్కించుకున్న సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజేష్ మోహన్ మాట్లాడుతూ ఇటీవల కొత్తగా రైస్ కుక్కర్స్, మిక్సీ తదితర ఆరు వస్తువులను మార్కెట్లోకి తెచ్చినట్లు తెలిపారు.ఈ ఏడాది 10 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సమావేశ ప్రాంగణంలో కొత్త ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్య క్రమంలో సన్ ఎంటర్ప్రైజెస్ పార్టనర్స్ ఎండీ హమ్జద్ అలీ, అయిజాజ్ హుస్సేన్, ఎండీ, జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.