
సాక్షి, కైకలూరు: ఇదేంటి.. గల్లాపెట్టె స్థానంలో ఎలక్ట్రికల్ కుక్కర్ ఉందని ఆశ్చర్యపోతున్నారా? కరోనా నేపథ్యంలో కృష్ణాజిల్లా కైకలూరులో విజయలక్ష్మి జనరల్ స్టోర్స్ యజమాని కొత్త నరసింహారావుకు వచ్చిన సృజనాత్మక ఆలోచన ఇది. దుకాణంలో వినియోగదారులు ఇచ్చిన కరెన్సీ నోట్లను ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్‌లో నీటి ఆవిరిలో ఉడికించి శానిటైజ్ చేస్తున్నారాయన. ‘నగదు వివిధ వ్యక్తుల చేతుల నుంచి బట్వాడ అవుతోంది కాబట్టి కరెన్సీ నోట్లతోనూ కరోనా వైరస్ సోకే ప్రమాదముంది. మొదట కరెన్సీ నోట్లను నేరుగా కుక్కర్‌లో ఉంచితే వేడి ఎక్కువై కాలిపోయాయి. తర్వాత కొంచెం నీటిని అడుగున వేసి, మధ్యలో రంధ్రాలున్న ప్లేటును అమర్చడంతో ప్రయోగం ఫలించింది. ఆవిరిలో ఉడకబెట్టడం వల్ల నోట్లపై ఉన్న క్రిములు చనిపోతాయి.’ అని నరసింహారావు వివరించారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం)
Comments
Please login to add a commentAdd a comment