నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే లక్ష్యం | rajesh mohan launches Rice Cookers, Mixe | Sakshi
Sakshi News home page

నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే లక్ష్యం

Published Sun, Dec 21 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే లక్ష్యం

నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే లక్ష్యం

గ్రైఫొన్ ఎండీ రాజేష్ మోహన్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రముఖ డిస్ట్రిబూషన్ కంపెనీ గ్రైఫొన్ అప్లయెన్సెస్ ఎండీ రాజేష్ మోహన్ తెలిపారు. యూకేలో బ్రాండ్ ఉత్పత్తులుగా పేరుగాంచిన కంపెనీలు బ్లాక్ అండ్ డెక్కర్, రస్సెల్ హాబ్స్, రెమింగ్‌టన్ వస్తుత్పత్తులకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు సన్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ డీలర్‌షిప్‌ను దక్కించుకున్న సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజేష్ మోహన్ మాట్లాడుతూ ఇటీవల కొత్తగా రైస్ కుక్కర్స్, మిక్సీ తదితర ఆరు వస్తువులను మార్కెట్‌లోకి తెచ్చినట్లు తెలిపారు.ఈ ఏడాది 10 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సమావేశ ప్రాంగణంలో కొత్త ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్య క్రమంలో సన్ ఎంటర్‌ప్రైజెస్ పార్టనర్స్ ఎండీ హమ్జద్ అలీ, అయిజాజ్ హుస్సేన్, ఎండీ, జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement