సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రచారపర్వంలో భాగంగా జిల్లాలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ గమాగమవుతున్నట్లు ఆ నియోజకవర్గంలో వివిధ వర్గాల్లో కథలు చెప్పుకున్న మాదిరిగా చర్చ జరుగుతోంది. టికెట్ ఖరారుతో ముందుగానే ప్రచారం ప్రారంభించిన సదరు ఎమ్మెల్యే మొదటి విడతలో ఒక తరహాలో వెళ్లారు. గ్రామాల్లో సమస్యల విషయమై ప్రశ్నిస్తే దాడులు కూడా చేయాలని తన అ నుచరులకు సూచించిన సదరు సిట్టింగ్ ఎన్నికల కౌంట్‌డౌన్ అవుతున్నాకొద్దీ వైఖరి మార్చుకుంటూ వస్తున్నారు. సదరు సిట్టింగ్ అభ్యర్థి వ్యవహార శైలి పై ఇప్పటికే సాధారణ ఓటర్లతో పాటు సదరు పా ర్టీకే చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదనతో ఉన్నారు. ఆగ్రహంగానూ ఉన్నారు. ఈ క్ర మంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలియడంతో సదరు సిట్టింగ్ మదిలో గాభరా మొదలైంది.
రైస్ కుక్కర్ల పంపిణీ..
ఇప్పటికే పలు గ్రామాల్లో కారు గుర్తు స్టిక్కర్లతో కూ డిన రైస్ కుక్కర్లు పంపిణీ చేయించారు. ఈ కుక్కర్లు కొన్ని చోట్ల సరిపోకపోవడంతో ఆయా గ్రామా ల్లో పలువురు తమకూ ఇ వ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇక ప్రతిరోజూ ఆ నియోజకవర్గ కేంద్రంలో క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల నిబంధనలు బే ఖాతరు చేస్తూ సదరు అభ్యర్థి మటన్‌తో విందులు ఏర్పాటు చేయిస్తుండడం గమనార్హం. రాత్రి సమయాల్లో మద్యం దావత్‌లు కూడా చేస్తున్నారు. మ రోవైపు దసరా నేపథ్యంలో ఆయా సంఘాలకు సద రు సిట్టింగ్ మేకలను విచ్చలవిడిగా ఇస్తుండడం గ మనార్హం.
ఈ క్రమంలో వివిధ కులసంఘాల సమావేశాలు ఏర్పాటు చేయించి ప్రచారానికి వెళ్తున్నాడు. అయితే ఆయా సంఘాల్లోని సభ్యులందరూ సమావేశాలకు రావాల్సిందేనని తీర్మానాలు కూడా ముందుగానే చేయించడంతో కొందరు సభ్యులు, తటస్తులు మాత్రం ఇలా ఒత్తిడి చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సిట్టింగ్ త మ ఊర్లలోకి రావద్దంటూ గతంలో పలు గ్రామాల్లో అమలు కానీ హామీలతో కూడిన ఫ్లెక్సీలు కూడా ప్ర దర్శించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గ్రామా ల్లో హామీలపై నిలదీసిన విషయాలకు సంబంధించి పలువురు వీడియోలు తీస్తే ఆ వీడియోలను పోలీసులు డిలీట్ చేయించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు యువకులు మాత్రం ప్రజా సమస్యల విషయ మై సోషల్ మీడియా వేదికగా సె టైర్లు వేస్తుండడం గమనార్హం.
సర్పంచ్‌లకు బంగారు కానుకలు
కొన్ని నెలల క్రితం వరకు తమతో దురుసుగా వ్యవహరించిన నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న సర్పంచ్‌లు దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న సిట్టింగ్ వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు సర్పంచ్‌లకు తులం చొప్పున బంగారం, ఉప సర్పంచ్‌లకు నగదు, సొసైటీ చైర్మన్‌లకు బంగారం తదితర తాయిలాలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి భయంతోనే ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చర్చించుకోవడం విశేషం.
కాగా ప్రచారంలో భాగంగా కుక్కర్లు పంచిన అభ్యర్థి గరంగరంగా వండుకుని తిన్నారా అని పలుచోట్ల వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు చేస్తున్నారు. చివరకు ఆలయాల వద్ద సై తం ప్రచారానికి వెళ్లడంతో ఒక గ్రామంలో సిట్టింగ్ అభ్యర్థి వర్గీయులకు భవానీ దీక్షాపరులకు మధ్య ఘర్షణ కూడా చో టుచేసుకుంది. ఈ క్రమంలో సదరు అభ్యర్థి పలాయనం చిత్తగించడం విశేషం. ఇలాంటి ప్రలోభాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment