west bengal governor
-
అన్ని విధాలుగా అండగా నిలుస్తాం
కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్ల బాధితులను గవర్నర్ ఆనందబోస్ పరామర్శించారు. సాధ్యమైనంత మేర అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. అల్లర్ల సమయంలో దుండగులు షంషేర్‌గంజ్ ప్రాంతం జఫ్రాబాద్‌లో ఓ ఇంట్లో ఉన్న తండ్రి హర గోవింద్ దాస్, అతని కుమారుడు చందన్ దాస్‌లను కత్తితో పొడిచి చంపారు. వీరి కుటుంబీకులు శనివారం తమ ఇంటికి వచ్చిన గవర్నర్ కాళ్లపై పడి, న్యాయం చేయాలని వేడుకున్నారు. ‘వీరి అభ్యర్థనలను పరిశీలిస్తాం. బాధితుల నుంచి మూడు, నాలుగు సూచనలందాయి. స్థానికంగా బీఎస్ఎఫ్ పోస్టులను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ఈ అంశాన్ని సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తా. సానుకూల చర్యలను కచ్చితంగా తీసుకుంటాం. రాజ్‌భవన్‌లో అందుబాటులోకి తెచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌ను వారికి అందజేశా’అని గవర్నర్ మీడియాకు తెలిపారు. అనంతరం ధులియన్ బజార్ ప్రాంతంలో బాధితులను కలుసుకున్నారు. బాధితులు కోరిన ప్రకారం న్యాయం దక్కేలా చూస్తామన్నారు. జఫ్రాబాద్‌లోని బెట్బోనా గ్రామం వద్ద స్థానికులు రోడ్డుపై అడ్డంకులు ఏర్పాటు చేయగా గవర్నర్ ఆగి, వారిని శాంతపరిచారు. అంతకుముందు, ఫరక్కాలోని అతిథి గృహం వద్ద కూడా గవర్నర్ అల్లర్ల బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగిన అల్లర్లలో తండ్రి, కుమారుడు సహా ముగ్గురు చనిపోవడంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించిన ఘటనలపై పోలీసులు 274 మందిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గవర్నర్ ఆనందబోస్ మాల్డా జిల్లాలో తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న అల్లర్ల బాధిత ముర్షిదాబాద్ వాసులను పరామర్శించడం తెల్సిందే. బాధితుల గోడు విన్న మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయా రాహత్కర్ శనివారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ధులియన్ తదితర వక్ఫ్ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బెట్బోనా గ్రామంలో దుండగులు తమను భయభ్రాంతులకు గురి చేశారంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, దాడులపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి అంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. హింసాత్మక ఘటనల తీవ్రత అనూహ్య స్థాయిలో ఉందని తెలిసిందని అనంతరం రాహత్కర్ మీడియాకు తెలిపారు. బాధితుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చామన్నారు. ఇక్కడి బాధిత మహిళల డిమాండ్లపై హోం మంత్రి అమిత్ షాకు నివేదిక అందజేస్తామని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా మజుందార్ తెలిపారు. శుక్రవారం మాల్డాలో అల్లర్ల బాధితులను రాహత్కర్ సారథ్యంలోని బృందం కలుసుకోవడం తెల్సిందే. రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్‌పీ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్‌లో చోటుచేసుకున్న అల్లర్లను నిరసిస్తూ శనివారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలను నిర్వహించింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. బెంగాల్లో హిందువులకు రక్షణ కలి్పంచాలని, ముర్షిదాబాద్ అల్లర్ల బాధితులకు తగు పరిహారం అందజేయాలని కోరింది. బెంగాల్లో బంగ్లాదేశీ–రొహింగ్యా చొరబాటుదార్లను గుర్తించి, వెళ్లగొట్టాలంది. సోమవారం కూడా నిరసనలు తెలుపుతామని తెలిపింది. -
అల్లర్ల బాధితులను కలిసిన బెంగాల్ గవర్నర్
మాల్డా/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్తోపాటు, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ బృందాల సభ్యులు శుక్రవారం మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితులను కలుసుకున్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిం మెజారిటీ ఉన్న షంషేర్‌గంజ్, సుటి, ధులియన్, జంగీపూర్ ప్రాంతాల్లో ఈ నెల 11,12వ తేదీన చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు చనిపోవడం తెల్సిందే. హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. భీతిల్లిన సామాన్యులు వందలాదిగా పొరుగునే ఉన్న మాల్దా జిల్లాకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. వీరి కోసం మాల్దాలోని పర్ లాల్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతత కొనసాగేందుకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఎం మమతా బెనర్జీ చేసిన సూచనను గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. అక్కడికెళ్లి స్వయంగా పరిస్థితులను స్వయంగా పరిశీలించి, కేంద్రానికి నివేదిక అందజేస్తానంటూ ఆయన శుక్రవారం రైలులో పర్ లాల్పూర్ చేరుకుని బాధితులతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. కొందరు దుండగులు తమ ఇళ్లపై దాడులు చేసి, సర్వస్వం దోచుకుని, బయటకు గెంటేశారని బాధిత మహిళలు చెప్పారని అనంతరం గవర్నర్ ఆనందబోస్ మీడియాకు తెలిపారు. సహాయక శిబిరాల్లో వసతుల లేమిపై యంత్రాంగం నుంచి సవివర నివేదిక కోరానన్నారు. ఆయన వెంట ఉన్న రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. పార్ లాల్పూర్లో ఉద్రిక్తతలు ప్రాణభయంతో పారిపోయి వచ్చిన తమను జిల్లా అధికారులు తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని బలవంతం చేస్తున్నట్లు పార్ లాల్పూర్లో ఆశ్రయం పొందుతున్న ముర్షిదాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ వద్దకు వచ్చిన జిల్లా అధికారులను వారు చుట్టుముట్టారు. ఎండిన రొట్టెలు, అరటి పండ్లు, ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారన్నారు. శిబిరాల్లో పరిస్థితులు జైలు కంటే దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. తమ సొంతూళ్లో పరిస్థితులు ఏమంత సురక్షితంగా లేవన్నారు. తమ నివాసప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు క్యాంపులను ఏర్పాటు చేసేదాకా తిరిగి వెళ్లేది లేదన్నారు. పోలీసులు తమను మీడియాతోను, చివరికి బంధువులతో సైతం మాట్లాడవద్దని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) శుక్రవారం మాల్దాలోని పర్ లాల్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాల సహాయ శిబిరాన్ని సందర్శించింది. కమిషన్ సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వీరు మూడు వారాల్లోగా ఎన్‌హెచ్చార్సీకి నివేదికను సమరి్పంచాల్సి ఉంది. ముర్షిదాబాద్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎన్‌హెచ్చార్సీ ప్రకటించింది. అదేవిధంగా, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయా రాహత్కర్ తన బృందంతో శుక్రవారం మాల్డాలోని తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. శిబిరాల్లో మహిళలు, చిన్నారులకు కల్పించిన సౌకర్యాలను చూసి షాక్‌కు గురైనట్లు ఆమె తెలిపారు. మహిళలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టి, అనూహ్యమైన ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్ మాదిరిగా మార్చాలని టీఎంసీ ప్రభుత్వం అనుకుంటోందా? అని ప్రశ్నించారు. శనివారం ఈ బృందం ముర్షిదాబాద్‌కు వెళ్లనుంది. అనంతరం కోల్‌కతాలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీతో భేటీ అవుతారు. కాగా, గవర్నర్ ఆనంద బోస్, ఎన్‌హెచ్చార్సీ, ఎన్సీడబ్ల్యూ బృందాల పర్యటనలు రాజకీయ ప్రేరేపితమని, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రయతి్నస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. -
ఆర్జీకర్ కేసులో కీలక మలుపు
కోల్‌కతా ఆర్జీకర్ హత్యాచార కేసులో న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో దోషి సంజయ్‌కు సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడికి ఈ శిక్ష సరిపోదని, మరణశిక్ష విధించాలనే అభ్యర్థన ఉన్నతన్యాయస్థానం ఎదుటకు చేరింది. అయితే సంజయ్‌కు ఉరిశిక్ష పడడం తమకు ముఖ్యం కాదని, ఈ నేరంలో భాగమైన వాళ్లందరి పేర్లు బయటకు రావాలని అభయ(బాధితురాలి) తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.అభయ తల్లిదండ్రులు గురువారం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కలిశారు. తమ ఆవేదనను(ఫిర్యాదును) రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అందుకు అంగీకరించిన ఆయన.. అవసరమైతే వాళ్ల అప్పాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సైతం అభయం తల్లిదండ్రుల్ని కలిసి.. వాళ్ల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు.అభ్యంతరాలు దేనికి?..ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరుపై అభయ తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఈ కేసులో ఆధారాలను కోల్‌కతా పోలీసులు నాశనం చేశారని ఆరోపించారు. ఇటు.. సీబీఐ జరిపిన దర్యాప్తుపైనా తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. ఈ నేరంలో సంజయ్ ఒక్కడే భాగం కాదని, ఇంకా బయటకు రావాల్సిన పేర్లు ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. కోల్‌కతా పోలీసులు ఆస్పత్రి నిర్వాహకులతో కలిసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా.. తొలి ఐదురోజులు దర్యాప్తు జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని అంటున్నారు.సుప్రీంలో పిటిషన్ వెనక్కిఆర్జీకర్ కేసులో మళ్లీ విచారణ జరిపించాలని అభయ తల్లిదండ్రులు సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ చేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను వాళ్లు వెనక్కి తీసుకున్నారు. కిందటి ఏడాది ఆగష్టులో సుప్రీం కోర్టు ఈ ఘటనను సుమోటోగా విచారణకు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణలో తమను భాగం చేయాలని Intervention Application ద్వారా అభయ తల్లిదండ్రులు అభ్యర్థించారు. కానీ, ఈ కేసులో సంజయ్‌కు శిక్షపడక ముందే కలకత్తా హైకోర్టులో ‘ఫ్రెష్ విచారణ’ కోరుతూ ఓ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయం తమ పరిశీలనలో గుర్తించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్ తరఫు మహిళా న్యాయవాదిని హెచ్చరించింది. సత్వరమే పిటిషన్ వెనక్కి తీసుకుని.. కావాలనుకుంటే కొత్తగా పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో.. అభయ తల్లిదండ్రులు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.ఇక ఆర్జీకర్ కేసులో.. సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. అయితే ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ల విచారణకు స్వీకరించే అంశంపై విచారణ జరిపి.. తీర్పును కలకత్తా హైకోర్టు రిజర్వ్ చేసింది. -
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు. -
బెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్ సీవీ ఆనంద బోస్(71)ను నియమించింది రాష్ట్రపతి భవన్. ఈ మేరకు గురువారం ఆనంద బోస్ నియామకాన్ని ధృవీకరించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ పేరిట విడుదలైన సర్క్యులర్ వెల్లడించింది. గతంలో బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మణిపూర్ గవర్నర్ లా గణేశన్ అయ్యర్ ప్రస్తుం అదనపు బాధ్యతలు చేపట్టారు. అయితే.. గవర్నర్ గణేశన్, బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడంపై ప్రతిపక్ష బీజేపీ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో బెంగాల్‌కు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన బోస్ కేరళలోని కొట్టాయంకు చెందినవారు. జవహార్‌లాల్ నెహ్రూ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు ఆయన. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రచయితగా ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో 40 పుస్తకాలు రాశారు. ఎన్నో నవలలు, లఘు కథలు, పద్యాలు, ఉపన్యాసాలు రచించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతోనూ ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి కోసం ఏర్పాటైన ఓ సంస్థలో ఆయన చైర్మన్‌గా పని చేశారు. అంతేకాదు.. ఆయన రూపొందించిన ‘అందరికీ సరసమైన గృహాలు’ అనే భావన కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందింది కూడా. -
అధికార పార్టీతో అంటకాగుతూ.. బీజేపీకి చుక్కలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజ్‌భవన్ పంచాయితీలు రసవత్తరమైన రాజకీయాలకు వేదిక అవుతున్నాయి. జగదీప్ ధన్కర్ ఉప రాష్ట్రపతి కావడంతో ఆయన స్థానంలో బెంగాల్‌కు గవర్నర్‌గా(అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు లా గణేశన్ అయ్యర్. అయితే ఆయన తీరు ఇప్పుడు బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న గవర్నర్ గణేశన్.. బీజేపీ నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మణిపూర్ గవర్నర్‌గా ఉన్న ఆయన.. బెంగాల్‌కు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా చెన్నైలో జరిగిన తన సోదరుడి పుట్టినరోజుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఆహ్వానించారాయన. ఇక మంగళవారం నాటి పరిణామం అయితే ప్రతిపక్ష నేత సువేందు అధికారికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తోటి ప్రతినిధులతో కలిసి రాజ్ భవన్‌కు ర్యాలీగా వెళ్లగా.. ఆ సమయంలో గవర్నర్ నగరంలో లేరనే సమాచారం తెలుసుకుని సువేందు అధికారి అసంతృప్తిగా కనిపించారు. అంతకు ముందు రోజు బీజేపీ ప్రతినిధులంతా గవర్నర్‌ను కలిసి ఓ మెమోరాండం ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బెంగాల్ మంత్రి అఖిల్ గిరి భర్తరఫ్ కోసం సీఎం మమతా బెనర్జీకి సిఫార్సు చేయాలని గవర్నర్‌ను కోరాలనుకున్నారు. కానీ, ఆ సమయంలో రాజ్‌భవన్‌లో ఆయన లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మంగళవారం రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన సువేందు అధికారి.. ‘‘తాము రాజ్‌భవన్‌కు అభ్యర్థన చేయడానికి రాలేదని, గట్టి డిమాండ్‌తోనే వచ్చామని, గవర్నర్ కార్యదర్శితో టీ తాగడానికి రాలేదంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. ఆయన(మంత్రి అఖిల్) కామెంట్లు చేసి 72 గంటలు గడుస్తున్నా.. సీఎం ఆయన్ని తొలగించలేదని, కనీసం గవర్నర్‌కు సిఫార్సు కూడా చేయలేదని సువేందు ఆగ్రహం వెల్లగక్కారు. శనివారం రాజ్‌భవన్‌కు తాము మెయిల్ చేశామని, గవర్నర్ ఢిల్లీ, చెన్నై, ఇంపాల్.. ఇలా ఎక్కడున్నా ఒక మంత్రిని తొలగించేలా ముఖ్యమంత్రికి సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధమైన హక్కును కలిగి ఉంటారని, మా సందేశం గవర్నర్‌కు చేరే ఉద్దేశంతోనే తాము వచ్చామని సువేందు అధికారి మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇక ధన్కర్ లేనిలోటుపై బీజేపీ నేత అగ్రిమిత్ర పాల్ స్పందించారు. జగ్దీప్ ధన్కర్ బెంగాల్‌కు గవర్నర్‌గానే కాకుండా.. తమకు సంరక్షకుడిగానూ వ్యవహరించారని వ్యాఖ్యానించారు. అన్నిరకాలుగా ఆయన మమ్మల్ని చూసుకునేవారన్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన్ని భావించామని, ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. ఇక గవర్నర్ గణేశన్పై బీజేపీ చేసిన వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ నుంచి కనెక్షన్లు లేకపోతే ఆయన(సువేందు అధికారిని ఉద్దేశించి..) జీరో అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేవలం ఢిల్లీ నుంచి ఉన్న రాజకీయ పలుకుబడిని ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడని, రేపు కేంద్రంలో అధికారం దూరమైతే ఆయన ఏమైపోతారో అని వ్యాఖ్యానించారామె. మరోవైపు కేరళలో గవర్నర్‌తో వైరం నడుపుతున్న వామపక్ష సైతం.. బెంగాల్ గవర్నర్ రాజకీయాలపై స్పందించాయి. గవర్నర్ అంటే ఒకప్పుడు రాజ్యాంగబద్ధమైన హోదా. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్‌గా వ్యవహరించే పరిస్థితులు వచ్చాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాళ్లను నియమిస్తోంది కాబట్టి.. బీజేపీ నేతలు గవర్నర్ భవనాలను తమ పూర్వీకుల ఆస్తులుగా భావిస్తున్నారు అని విమర్శించారు సీపీఐ(ఎం) నేత మహమ్మద్ సలీం. గతంలో గవర్నర్‌గా ఉన్న సమయంలో జగదీప్ ధన్కర్.. దీదీ సర్కార్‌కు ట్రబుల్ మేకర్‌గా ఉండేవారు. రాజకీయ అంశాలపై బీజేపీ ప్రతినిధులతో తరచూ చర్చించేవారు. అంతేకాదు.. దీదీ ప్రభుత్వంపై వచ్చే ప్రతీ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునేవారు కూడా. కానీ, అందుకు భిన్నంగా ఉన్న ప్రస్తుత గవర్నర్ తీరు బీజేపీని ఇబ్బందికి గురి చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత, తమిళనాడుకు చెందిన లా గణేశన్ అయ్యర్.. ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడం బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఆయన్ని తప్పించాలనే డిమాండ్ బెంగాల్ బీజేపీ నుంచి కేంద్రానికి బలంగా వినిపిస్తోంది. ::ఇంటర్నెట్ డెస్క్, సాక్షి -
Presidential election 2022: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్, జాట్ నాయకుడు జగదీప్ ధన్‌ఖడ్(71)ను బరిలోకి దించనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. ధన్‌ఖడ్ అచ్ఛమైన రైతు బిడ్డ అని ప్రశంసించారు. ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో విస్తృత సంప్రదింపుల అనంతరం ధన్‌ఖడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రధాని మోదీ అభినందనలు భారత రాజ్యాంగంపై జగదీప్ ధన్‌ఖడ్‌కు అపార పరిజ్ఞానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చట్టసభల వ్యవహారాలపై మంచి పట్టు ఉందన్నారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా చైర్మన్ హోదాలో రాజ్యసభను చక్కగా ముందుకు నడిపిస్తారంటూ అభినందనలు తెలియజేశారు. ఉప రాష్ట్రపతిగా తన పేరును ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ధన్‌ఖడ్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి. అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు. అంచలంచెలుగా ఎదుగుతూ... జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్ సైనిక్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు. రాజస్తాన్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు. -
దీదీ పాలన హింసాత్మకమంటూ గవర్నర్ సీరియస్
కోల్‌కతా: బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బేనర్జీ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బెంగాల్లో హింసాత్మకమైన పాలన సాగుతోంది. భయంకరమైన హింసాత్మక ఘటనలు, సజీవ దహనాలు చూస్తుంటే అదే సత్యమనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఓ నివేదికను అడిగాను. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్విటర్లో విడుదుల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో సోమవారం బర్షల్ గ్రామ పంచాయితీ డిప్యూటీ చీఫ్ తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత బాదు షేక్ బాంబు దాడిలో మరణించారు. అదేరోజు అర్ధరాత్రి చెలరేగిన హింసలో అల్లరి మూకలు 10 ఇళ్లకు నిప్పంటించారు. ఈ హింసాత్మక ఘటనలో 8 మంది మృతి సజీవ దహనమయ్యారు. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Horrifying violence and arson orgy #Rampurhat #Birbhum indicates state is in grip of violence culture and lawlessness. Already eight lives lost. Have sought urgent update on the incident from Chief Secretary. My thoughts are with the families of the bereaved. pic.twitter.com/vtI6tRJcBX — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) March 22, 2022 -
బీజేపీ నేతలకు కనీస మర్యాద, సభ్యత లేదు: మమతా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రారంభ ఉపన్యాస సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ఉపన్యాసం అనంతరం ఆయనకు సీఎం మమతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం మమతా బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ నుంచి రాజనాథ్సింగ్ వంటి నేతలను చూశానని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు కనీసం సభా గౌరవ మర్యాదలు, సభ్యత లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులకు సంబంధించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు యత్నించారు. -
గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
కోల్‌కతా: తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్లో పర్యటించారని మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడు. 1996 నాటి జైన్ హవాలా కేసు చార్జీషీట్లో ఆయన పేరు ఉంది. అవినీతి మకిలి అంటిన ఇలాంటి గవర్నర్‌ను ఇంకా ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’అని మమత డిమాండ్ చేశారు. గవర్నర్‌ను› తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా స్పందించలేదని విమర్శించారు. ఆ ఆరోపణలు నిరాధారం: గవర్నర్ సీఎం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని గవర్నర్ ధన్కర్ దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి తరహాలో మమత వ్యవహరించడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాను చేయాల్సిన ప్రసంగంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తానని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైన్ హవాలా కేసుకు సంబంధించిన ఏ చార్జిషీట్లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని చెప్పారు. -
గవర్నర్‌గా ధన్కర్ వద్దంటూ ప్రధానికి మూడుసార్లు లేఖ రాశా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ధన్కర్ను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని మోదీకి ఇప్పటి వరకు మూడుసార్లు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ‘చిన్న పిల్లాడైతే బుజ్జగించవచ్చు కానీ, ఒక వృద్ధుడిని అలా చేయలేం కదా. ఈ విషయంలో మాట్లాడకుండా ఉండటమే మంచిది’అంటూ మమత వ్యాఖ్యానించారు. గవర్నర్ ధన్కర్ను తొలగిస్తారంటూ వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా ఆ విషయాలేవీ తనకు తెలియవన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ధన్కర్ను కేంద్రం నియమించింది. ఆయన్ను వెనక్కి తీసుకోవాలని మోదీకి లేఖలు రాశా’అని తెలిపారు. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వంతో గవర్నర్ ధన్కర్ మధ్య విభేదాలు మొదట్నుంచీ కొనసాగుతున్నాయి. అమిత్ షాను కలిసిన ధన్కర్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ధన్కర్.. గురువారం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ధన్కర్ హోం మంత్రికి వివరించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం కోల్‌కతాలో గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. -
West Bengal: కొలువుదీరిన మమత జంబో కేబినెట్
కోల్‌కత: ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎంగా మమత ప్రమాణ స్వీకారం చేయగా తాజాగా ఆమె జంబో కేబినెట్ కొలువుదీరింది. 43 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు సోమవారం మంత్రులుగా ప్రమాణం చేశారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ రాజ్‌భవన్‌లో వీరితో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమత పాల్గొన్నారు. కరోనా కారణంగా అతి తక్కువ మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం చేసిన 43 మందిలో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు. మమత కేబినెట్లో చాలా మంది పాతమంత్రులు మళ్లీ బెర్తులను దక్కించుకోగా.. బంకిమ్ చంద్ర హజ్రా, రతిన్ ఘోష్, పులక్ రాయ్, బిప్లబ్ మిత్రాను పదవులు వరించాయి. ఇక 2011 నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న అమిత్ మిత్రా సైతం మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి హుమాయున్ కబీర్, రత్న దే నాగ్ని సైతం మంత్రి (స్వతంత్ర) పదవులు వరించాయి. అలాగే రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ మనోజ్ తివారీ సైతం మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నాడు. కాగా, ఇటీవల వెలువడిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ జయభేరీ మోగించింది. తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకోగా బీజేపీ 77 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ.. ఓటమి తప్పలేదు. అయితే, గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం గమనార్హం. (చదవండి: Tamil nadu: శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే పోస్టర్లు) -
మమత X గవర్నర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో గవర్నర్ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మమత మండిపడ్డారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అధికారిక ప్రకటనలను, లోగోలను వాడరాదని గవర్నర్‌ను కోరారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తూ గవర్నర్ ధన్కర్ గత వారం ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు. వీటికి బదులిస్తూ సీఎం మమతా బెనర్జీ శనివారం గవర్నర్‌కు 14 పేజీల లేఖ రాశారు. ‘ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ రాసిన లేఖ, అందులో వాడిన భాష, భావం, తీరు అనూహ్యం. నాపైన, మా మంత్రులు, అధికారులనుద్దేశించి మీరు వాడిన భాష ఏమాత్రం తగినది కాదు’అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ఆచరించకుండానే ఆయన రాజ్యాంగ విలువలను బోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమకు బలం ఉన్నంత వరకు ఇలాంటివి చేయడం మినహా గవర్నర్‌కు అధికారాలేవీ లేవన్నారు. సంక్షోభ సమయంలో అధికారం చెలాయించేందుకు ఆయన చేస్తున్న యత్నాలను అడ్డుకుంటామన్నారు. -
గవర్నర్ వస్తే.. అసెంబ్లీకి తాళం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్) ప్రభుత్వం, గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గురువారం ధన్కర్ అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించగా అధికారులు గవర్నర్ ప్రత్యేక గేటుకు తాళం వేసి, ఎటో వెళ్లిపోయారు. ఈ పరిణామంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మధ్యాహ్నం ధన్కర్ నంబర్3 ప్రత్యేక గేటు గుండా అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించారు. అయితే, ఆ గేటుకు తాళం వేసి ఉంది. అధికారులు అందుబాటులో లేరు. దీంతో మీడియా సిబ్బందికి కేటాయించిన నంబర్–2 గేటు ద్వారా లోపలికి ప్రవేశించారు. ‘నేను వస్తున్నట్లు తెలిసినా మూడో నంబర్ గేటును ఎందుకు మూసేశారు? ఈ చర్య మన ప్రజాస్వామిక చరిత్రలో దుర్దినం. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసే ప్రయత్నం జరుగుతోంది’అని అన్నారు. తనను భయపెట్టేందుకు ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను సాగనివ్వబోనన్నారు. ఈ విమర్శలపై టీఎంసీ నేత పార్థా బెనర్జీ స్పందించారు. ‘అధికార బంగళా కోసం రూ.7 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాక ప్రజాస్వామ్యంపై గవర్నర్ మాట్లాడాలి’అని అన్నారు. కాగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున రెండ్రోజులు సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం స్పీకర్ ప్రకటించడం గమనార్హం. -
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలీకాప్టర్ ఒప్పందం కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనను సాక్షిగా విచారించారు. 3600 కోట్ల రూపాయిలకు సంబంధించి ముడుపుల వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. సీబీఐ అధికారులు శుక్రవారం నారాయణన్ విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నారాయణన్ బాధ్యతుల చేపట్టకుముందు జాతీయ భద్రత సలహాదారుగా వ్యవహరించారు. హెలికాప్టర్లను కొనుగోలు చేసేముందు 2005లో జరిగిన సమావేశాల్లో నారాయణన్ పాల్గొన్నారు. గోవా గవర్నర్ బీవీ వాంఖూ కూడా నారాయణన్‌తో పాటు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే ఎస్పీజీ ఆ సమయంలో వాంఖూ ఉన్నారు. అగస్టా కేసులో వాంఖూను కూడా ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. అగస్టా ఒప్పందంలో 360 కోట్ల రూపాయిలు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో గతేడాది రద్దు చేశారు. భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు. -
నేనింకా రాజీనామా చేయలేదు
తానింకా గవర్నర్ పదవికి రాజీనామా చేయలేదని పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తెలిపారు. అయితే రాజీనామా చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఏమైనా వర్తమానం వచ్చిందా లేదా అన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. యూపీఏ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్లను సాగనంపాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో.. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణన్‌ను విలేకరులు ఈ విషయమై ప్రశ్నించారు. దానికి ఆయన తానింకా రాజీనామా చేయలేదని, ఇప్పటికీ తానే బెంగాల్ గవర్నర్‌నని అన్నారు. తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాల్సిన అవసరం లేదని కూడా నారాయణన్ చెప్పారు. అధికారికంగా ఇప్పటివరకు ఏమీ చెప్పకపోయినా.. రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం కోరిన గవర్నర్ల జాబితాలో నారాయణన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.