ఎర్రచందనం దుంగలు స్వాధీనం | AP Police seize red sandal logs in Sri Sathya Sai District | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Mon, Jul 15 2024 4:39 AM | Last Updated on Mon, Jul 15 2024 4:39 AM

AP Police seize red sandal logs in Sri Sathya Sai District

నల్లచెరువు:  శ్రీసత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలం, పెద్దయల్లంపల్లి వద్ద శనివారం రాత్రి 13 ఎర్ర­చందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర­రెడ్డి ఆదేశాల మేరకు పెద్దయల్లంపల్లి జాతీయరహదారిపై అటవీశాఖ అధికారులు వాహ­నాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మదనపల్లి నుంచి కదిరి వెళ్తున్న కారును గుర్తించారు.

అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని గమనించిన ఇద్దరు దుండగులు కొద్దిదూరంలో కారు ఆపి పరార­య్యారు. అధికారులు కారును తనిఖీ చేయగా.. 13 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలిపారు. వాహనం నంబర్‌ ఆధారంగా నిందితులను పట్టు­కు­నేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో డిప్యూటీ రేంజ్‌ అధికారి రామచంద్ర నాయక్, సెక్షన్‌ అధికారి రామచంద్రారెడ్డి, ఎఫ్‌బీఓలు నాగరాజు, హరిప్రసాద్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement