
సాక్షి,తాడేపల్లి: వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్(ట్విటర్)లో బుధవారం(డిసెంబర్11) ఒక పోస్టు చేశారు.‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు.
ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024