
ముంబై: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ఫ్రెషర్లకు భారీగా కొలువులు రానున్నాయి. 2030 నాటికి 4 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. హెచ్ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం ఫస్ట్మెరీడియన్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.
డిజిటల్ సామర్థ్యాలున్న నిపుణుల లభ్యత, వ్యయాలపరంగా అనుకూల పరిస్థితులు తదితర అంశాల కారణంగా భారత్లో జీసీసీ వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. 2030 నాటికి ఇది 110 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని ఫస్ట్మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో సునీల్ నెహ్రా తెలిపారు.
ఈ వృద్ధితో 2030 నాటికి జీసీసీల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 30 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. ఇందులో సుమారు ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు గణనీయంగా ఉంటాయని వివరించారు. జీసీసీ సిబ్బందిలో మహిళల వాటా 40 శాతానికి చేరవచ్చని పేర్కొన్నారు.