
ప్రతీకాత్మక చిత్రం
రాయ్‌పూర్: ఇటుకలు కాల్చేందుకు రాజేసిన అగ్గి చివరకు వారి ప్రాణాలమీదకు తెచ్చింది. ఇటుక బట్టీ వద్ద ఐదుగురు కార్మికులు ఊపిరి ఆడక మరణించిన దుర్ఘటన ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాసముంద్ జిల్లాలోని గంధ్‌ఫూలీగఢ్ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక ఇటుకల బట్టీ కర్మాగారం కొనసాగుతోంది.
మంగళవారం రాత్రి ఎండిన బురదమట్టి ఇటుకలను క్రమపద్ధతిలో పేర్చి వాటి అంతర్భాగంలో నిప్పుపెట్టి పైభాగంలో ఆరుగురు కార్మికులు నిద్రించారు. మిగతా కార్మికులు ఉదయం బట్టీ దగ్గరకు వచ్చేసరికి ఆ ఆరుగురు చలనం లేకుండా పడిఉన్నారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా ఐదుగురు అంతకుముందే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. విషపు పొగ పీల్చడంతో ఊపిరాడక మరణించారని భావిస్తున్నారు.
చదవండి: సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరిస్తే డబ్బులు ఆఫర్ చేశాడు: గ్యాంగ్‌స్టర్