
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి పూజా హెగ్డే (Pooja Hegde). వరుసగా సినిమాలతో టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పూజా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను షేర్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది. తాజాగా అందమైన చీరలో, నుదిటిన, బొట్టు, మల్లెపూలు పెట్టుకొని దర్శనమిచ్చింది. 70 ఏళ్ల కాంజీవరం ( Kanjivaram ) చీర ధరించినఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
బుట్టబొమ్మగా పాపులర్ అయిన పూజా హెగ్డే సంప్రదాయ లుక్‌లో ఫొటో షూట్ చేసింది. పాతకాలపు బీరువా.. 70 ఏళ్ల నాటి అద్భుతమైన చీర.. నా అందమైన అజ్జీ (అమ్మమ్మ) కంజీవరంలో రోజు గడుపుతున్న దృశ్యాలు, పెళ్లికి వెళ్ళే ముందు ఇంట్లో ఉండే మల్లెలతాజా వాసన, తొలి చినుకుల తర్వాత తడిసిన మంగళూరు బురద వాసనలు... ఓహ్, చిన్న విషయాల్లో అందం’’ అనే కాప్షన్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. సాంప్రదాయ చీరలొ అద్భుతంగా కనిపించిన నటి, మ్యాచింగ్ బ్లౌజ్‌తో సంతోషంగా పోజులిచ్చింది.
చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!
ఇటీవల తన లేటెస్ట్ మూవీ రెట్రోకు సంబంధించి పూజా హెగ్డే రెండు నిమిషాల టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, "ఈ పాత్రలో నా హృదయంలో ఒక భాగం. భావోద్వేగాల హెచ్చు తగ్గులు 'రెట్రో' వచ్చేసింది" అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఈ మూవీలో నటి ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషిస్తోంది. ఆమె సూర్య మణికట్టుపై స్నేహితురాలిగా రక్ష సూత్రాన్ని కట్టింది. దీని తర్వాత, సూర్య టీజర్‌లో, "నేను నా కోపాన్ని అదుపు చేసుకుంటాను, ఈ క్షణం నుండి నేను ప్రతిదీ వదిలివేస్తాను. నేను నవ్వడానికి,సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా జీవిత ఉద్దేశ్యం స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే." కాగా 'రెట్రో' ఈ సంవత్సరం మే 1న థియేటర్లలో విడుదల అవుతుంది. హెగ్డే 'రెట్రో' తో పాటు అనేక ఇతర ప్రత్యేక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పూజా 'దళపతి 69' 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' వంటి అనేక ఇతర ఉత్తేజకరమైన ప్రాజెక్టులను కలిగి ఉంది.చెన్నైలో 'దళపతి 69' షూటింగ్ ప్రారంభం గురించి చెబుతూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.
ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!