
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ - జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' (Jewel Thief: The Heist Begins) శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో, రాబీ గ్రెవాల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జైదీప్ అహ్లవత్ లైఫ్ స్టైల్, ఆస్తులపై నెట్టింట చర్చ ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడిగా ఉన్న జైదీప్ నికర విలువ ఎంత? ఇతర విలువైన ప్రాపర్టీస్ ఏంటి తెలుసుకుందామా..!
తనదైన నటనతోపాటు, ఇటీవల కాలంలో బాగా బరువు తగ్గి సత్తా చాటుకుంటున్నాడు జైదీప్ అహ్లవత్ (Jaideep Ahlawat). వరుస అవకాశాలతో ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ బాజ్‌పేయి, అశుతోష్ రాణా, రాజ్‌కుమార్ రావు, విజయ్ రాజ్, కేకే మీనన్ వంటి సినిమా దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 'జువెల్ థీఫ్'లో 'జాదు' పాటలో స్టెప్పులతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే పాతాళ్ లోక్ సీజన్ 2తో స్ట్రీమింగ్ రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో అతని నికర విలువ ఒక్కసారిగా పుంజుకుంది.
2010లో ప్రియదర్శన్ చిత్రం 'ఖట్టా మీఠా'లో అరంగేట్రం చేశాడు జైదీప్ అహ్లవత్. ప్రస్తుతం అతడు ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ అంత ఈజీగా రాలేదు. హర్యానాలోని ఖార్ఖరాలో పెరిగిన జైదీప్ భారత సైన్యంలో చేరాలని కలలు కన్నాడు. కానీ ఆ కల నెరవేరకపోవడంతో నాటకాలవైపు మళ్లాడు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, FTIIలో చదివిన తర్వాత, సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఖార్ఖరా నుండి పూణే, ముంబైకి మధ్య తిరుగుతూ నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, పాతాళ్ లోక్ లో అద్భుతమైన నటన అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది.
14 ఏళ్లకు పైగా కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తన రెమ్యూనరేషన్‌ను రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు పెంచుకోవడం అంటే మాటలు కాదు. తాజా నివేదికల ప్రకారం 'పాతాళ్ లోక్' మొదటి సీజన్ కోసం జైదీప్ రూ.40 లక్షలు వసూలు చేశాడు. పాతాళ్ లోక్ సీజన్ 2 సైన్ చేయడానికి ముందు జైదీప్ ఆస్తి రూ. 8 కోట్లు. ఈ సిరీస్‌లో 'హాథీ రామ్ చౌదరి' పాత్రను పోషించినందుకు రూ.20 కోట్లు తీసుకున్నాడట. అయితే అలాంటి వాదనలను ఖండించినప్పటికీ, జైదీప్ రెమ్యూనరేషన్ రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు చేరిందంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.
చదవండి: సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
జైదీప్ జైదీప్ బహుళ ఆస్తులను కలిగి ఉన్నాడని కూడా మీడియా కోడై కూస్తోంది. కొన్ని లగ్జరీ కార్లతో పాటు, రూ. 1.32 కోట్ల విలువైన లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ GLS SUV కూడా జైదీప్ సొంతం. ప్రొఫెషనల్ డ్యాన్సర్ జ్యోతి హుడాను 2009లో అతడు వివాహం చేసుకున్నాడు.
చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?