
రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఖరీదైన చేనేత పట్టుచీరలు, కోట్ల విలువచేసే డైమండ్ ఆభరణాలు అనగానే ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు రాక మానరు అంటే అతిశయోక్తికాదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా , ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, గొప్ప దాతగా ఎపుడూ ఆకర్షణీయంగా ఉంటారు. తాజాగా జియో వరల్డ్ ప్లాజాలో స్టైలిష్‌గా మెరిశారు.
ఆరుపదుల వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉంటారు. వ్యాయామం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన స్నేహితులకు టైం కేటాయించడంలో ముందుంటారు. ఏప్రిల్ 16న నీతా అంబానీ తన ప్రాణ స్నేహితులు అబు జాని , సందీప్ ఖోస్లా స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనారు. ఈ సందర్భంగా నీతా అంబానీ అద్దాలతో అలంకరించిన చీరలో అద్భుతంగా కనిపించి అందరి కళ్లూ తమవైపు తిప్పుకున్నారు.

తెల్లని ఛాయలో మెరిసి నీతా అంబానీకి బ్లాక్ కలర్ శారీకి మిర్రర్-వర్క్ అలంకరణ హైలైట్‌గా నిలిచింది. దీనికి సీక్విన్డ్ గోల్డెన్ బ్లౌజ్ మరింత అందాన్నిచ్చింది. ఈ చీరకు తగ్గట్టు లేయర్డ్ ముత్యాల నెక్లెస్ మ్యాచింగ్ చెవిపోగులు , డైమండ్ బ్యాంగిల్స్ మరింత స్టైల్‌గా నప్పాయి. బంగారు పొట్లీ బ్యాగ్ సొగసుగా అమిరింది. మరోవైపు, డిజైనర్ ద్వయం అబు జాని , సందీప్ ఖోస్లా తెల్లటి దుస్తులు, ముత్యాల నగలతో రాయిల్‌లుక్‌తో అలరించారు. (రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్)

అంతకుముందు పారిస్‌లో జరిగిన ఫెసిలిటేషన్ డే కోసం నీతా అంబానీ అబు జాని , సందీప్ ఖోస్లాద్వజం డిజైన్ చేసిన వింటేజ్ దుస్తులను ఎంచుకున్నారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ఒక్కో సందర్భానికి ఒక్కోలా ముస్తాబై తనదైన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకున్నారు. నీతా అంబానీ. ఎపుడూ చీరలకు ప్రాధాన్యత ఇచ్చే నీతా నూతన సంవత్సర వేడుకల కోసం, కేప్ స్టైల్ డిటైలింగ్‌తో సీక్విన్డ్ వర్క్ ఫ్లోర్ లెంత్ గౌను, గ్రే షాల్, డైమండ్ చెవిపోగులు , రింగ్, తన లుక్‌ను స్టైల్ చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్‌లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన