ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు | Summer Coaching Camps from April 25 to May 31 by GHMC | Sakshi
Sakshi News home page

Summer Coaching Camps ఆటల పండుగ వచ్చేసింది.. వివరాలివిగో!

Published Mon, Apr 28 2025 1:22 PM | Last Updated on Mon, Apr 28 2025 1:26 PM

Summer Coaching Camps from April 25 to May 31 by GHMC

45 రోజుల పాటు వేసవి క్రీడా శిక్షణ సంబురం.

  మే 31 వరకు క్రీడోత్సవం

సనత్‌నగర్‌: వేసవి సెలవుల జోష్‌ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్‌ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్‌ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా  ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్‌లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్‌ డోర్‌ గేమ్స్‌లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది.  

ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!

 

  • ఎప్పటిలాగానే అమీర్‌పేట్‌ జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, సనత్‌నగర్‌ లేబర్‌ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. 

  • క్రికెట్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్‌ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. 

  • వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాధవి తెలిపారు. 

  • వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్‌ బ్యాడ్మింటన్, క్రికెట్‌ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10  ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్‌లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్‌ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.

  • వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్‌.జీహెచ్‌ఎంసీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. 
     

స్కేటింగ్‌ 
వేదిక: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, 
అమీర్‌పేట్‌ డీకేరోడ్డు 
ఫీజు: రూ.50,  కోచ్‌: పవన్‌కుమార్‌ 
ఫోన్‌: 98665 13604 
బాక్సింగ్‌ 
వేదిక: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, 
అమీర్‌పేట్‌ డీకేరోడ్డు     ఫీజు: రూ.10,  
కోచ్‌: ప్రకాశ్‌     ఫోన్‌: 93907 65412 

జిమ్‌
వేదిక: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, అమీర్‌పేట్‌ డీకేరోడ్డు 
ఫీజు: రూ.200,  కోచ్‌: విక్రమ్‌ 
ఫోన్‌: 91772 85745 

బ్యాడ్మింటన్‌
వేదిక: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, అమీర్‌పేట్‌ డీకేరోడ్డు 
ఫీజు: రూ.50, కోచ్‌: సురేష్‌ 
ఫోన్‌: 99498 14362 
హాకీ
వేదిక: అమీర్‌పేట్‌ క్రీడామైదానం 
ఫీజు: రూ.10, 
కోచ్‌: దర్శన్‌సింగ్‌ , ఫోన్‌: 98497 21703 

కరాటే 
వేదిక: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, 
అమీర్‌పేట్‌ డీకేరోడ్డు ఫీజు: రూ.10, 
కోచ్‌: బాబు, ఫోన్‌: 96181 33057
జిమ్నాస్టిక్‌
వేదిక: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, 
అమీర్‌పేట డీకేరోడ్డు      ఫీజు: రూ.50, 
కోచ్‌: మహేష్‌ ఫోన్‌: 90002 77716  

యోగా 
వేదిక: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ 
కాంప్లెక్స్, అమీర్‌పేట్‌ డీకేరోడ్డు 
ఫీజు: రూ.50,  
కోచ్‌: మనోజ్‌ ఫోన్‌: 99639 78509 

హ్యాండ్‌బాల్‌ 
వేదిక: సనత్‌నగర్‌ లేబర్‌ వెల్ఫేర్‌ గ్రౌండ్‌ , ఫీజు: రూ.10, 
కోచ్‌: ఇమ్రాన్‌ఖాన్‌ 
ఫోన్‌: 91772 39786 

బాస్కెట్‌బాల్‌ 
వేదిక: సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీకాలనీ ఇమ్మానుయేల్‌ చర్చి సమీపంలోని గ్రౌండ్‌ 
ఫీజు: రూ.10 
కోచ్‌: నయిముద్దీన్, ఫోన్‌: 98483 96922

వాలీబాల్‌ 
వేదిక: సనత్‌నగర్‌ లేబర్‌ వెల్ఫేర్‌ గ్రౌండ్‌ ఫీజు: రూ.10, 
కోచ్‌: చిన్ని, పెద్ది ఫోన్‌ :99599 51499 

క్రికెట్‌ 
వేదిక: సనత్‌నగర్‌ లేబర్‌ వెల్ఫేర్‌ గ్రౌండ్‌ , ఫీజు: రూ.100, 
కోచ్‌: రాజ్‌కిరణ్‌ ఫోన్‌: 97041 59549 

ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement