అమెరికా ఎంక్యూ–9 డ్రోన్‌ పేల్చివేత | Houthi forces shoot down US military drone | Sakshi
Sakshi News home page

అమెరికా ఎంక్యూ–9 డ్రోన్‌ పేల్చివేత

Published Sat, Nov 11 2023 6:09 AM | Last Updated on Sat, Nov 11 2023 6:09 AM

Houthi forces shoot down US military drone - Sakshi

సనా: ఇప్పటికే ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఘర్షణలతో పశి్చమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు అమెరికా సైన్యంపై దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను హౌతీ మిలిటెంట్లు పేలి్చవేశారు.

యెమెన్‌ ప్రాదేశిక జలాల్లో బుధవారం ఈ సంఘటన జరిగిందని అమెరికా సైన్యం వెల్లడించింది. హౌతీ దుశ్చర్య నేపథ్యంలో పశి్చమాసియాలో అమెరికా సేనలు అప్రమత్తమయ్యాయి. హౌతీకి ఇరాన్‌ ప్రభుత్వం అండగా ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement