
కాజీపేట రైల్వే సమస్యలను ప్రస్తావించిన ఎంపీ కావ్య
కాజీపేట రూరల్/హన్మకొండ చౌరస్తా : కాజీపేట లోకోరన్నింగ్ డిపో సిబ్బంది కొరత, పోస్టుల తరలింపుపై పార్లమెంట్‌లో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రస్తావించారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై అధికారులు పక్షపాత ధోరణి చూపుతున్నారని, లోకోరన్నింగ్ స్టాఫ్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ప్రస్తుతం కాజీపేటలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, దీంతో కాజీపేటలో ఉన్న ఉద్యోగులపై అధిక పనిభారం పడుతుందని ప్రస్తావించారు. రైల్వేమంత్రి సానుకూలంగా పరిశీలించి లోకోరన్నింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు వివిధ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై వినతిపత్రం అందజేశారు. భూపాలపల్లి పట్ణణానికి బైపాస్‌రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని నిడిగొండ, రఘునాథపల్లి, ఛాగల్లు, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల్లో ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి వెంటనే డీపీఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎంపీ కావ్య తెలిపారు.
నవోదయ
విద్యాలయాలు ఇవ్వండి..
● ఎంపీ పోరిక బలరాంనాయక్
మహబూబాబాద్ రూరల్ : తమ గిరిజన, ఆదివాసీలకు మూడు నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ కోరారు. పార్లమెంట్‌లో జీరో అవర్ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ గురువారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. తన నియోజకవర్గంలో గిరిజన, ఆదివాసీలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ ఉంటారని, వారు విద్యకు దూరంలో ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన, ఆదివాసీ ప్రజలు అభివృద్ధి చెందాలంటే చదువుకోవడం అవసరమన్నారు. అందుకు అనుగుణంగా మూడు కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసి గిరిజన, ఆదివాసీ, ఏజెన్సీ ప్రజలను చదువుకు దగ్గర చేసి వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

కాజీపేట రైల్వే సమస్యలను ప్రస్తావించిన ఎంపీ కావ్య

కాజీపేట రైల్వే సమస్యలను ప్రస్తావించిన ఎంపీ కావ్య