
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్‌గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.
ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే కాన్సెప్ట్‌తో 'షణ్ముఖ' చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆహా తెలుగు ఓటీటీ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. . ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్( Avika Gor) గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.

షణ్ముఖ కథేంటంటే..
చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు.
ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్‌లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్‌లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.
A cop, a scholar, and an ancient mystery!
Dive into the forgotten tales, hidden treasures, and secrets buried deep in the forest.#Shanmukha Premieres from April 11 only on #aha #AadiSaikumar #Avikagor #Shanmukha pic.twitter.com/YvnuUBU6P3— ahavideoin (@ahavideoIN) April 10, 2025