జలియన్ వాలాబాగ్ నేపథ్యంగా కేసరి-2.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లంటే? | Akshay Kumar Kesari Chapter 2 Box Office Collections On Day 4 | Sakshi
Sakshi News home page

Kesari Chapter 2 Box Office: అక్షయ్ కుమార్‌ కేసరి-2.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published Tue, Apr 22 2025 1:08 PM | Last Updated on Tue, Apr 22 2025 1:23 PM

Akshay Kumar Kesari Chapter 2 Box Office Collections On Day 4

బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్ నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్-2. ఈ మూవీలో లైగర్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఇటీవల గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 18న బిగ్‌ స్క్రీన్‌పైకి వచ్చిన కేసరి-2.. వసూళ్లపరంగా రాణించలేకపోతోంది. తొలి రోజు ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.7.84 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. శని, ఆదివారాల్లో బాగానే కలెక్షన్స్‌ రాబట్టిన ఈ సినిమా.. సోమవారం వచ్చేసరికి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కేవలం రూ.4.50 కోట్లకే పరిమితమైంది.

ఈ లెక్కన కేసరి-2 విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.34.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ధైర్యవంతుడైన భారతీయ న్యాయవాది సి శంకరన్ నాయర్‌ పాత్రలో నటించారు. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సన్నీ డియోల్ 'జాట్' నుంచి బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. థ్రిల్లర్ సినిమా కావడంతో వసూళ్ల పరంగా నిలకడగా రాణిస్తోంది. కాగా.. ఈ సినిమాలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు.

కాగా..'కేసరి చాప్టర్ 2' చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కరణ్ జోహార్ నిర్మించారు. ఏప్రిల్ 13, 1919న జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా న్యాయవాది సి శంకరన్ నాయర్‌ చూపించిన ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement