
సినీ ఇండస్ట్రీలో పుకార్లకు లెక్కలేదు. దానికి తగ్గట్లు పెళ్లి, విడాకులు అనే విషయాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో జీవీ ప్రకాశ్ (GV Prakash Kumar) కూడా గతేడాది తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా భార్యభర్తలిద్దరూ కలిసి కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
అయితే జీవీ తన భార్య సైంధవి నుంచి విడాకులు తీసుకోవడానికి హీరోయిన్ దివ్య భారతినే(Divya Bharati) కారణమని రూమర్స్ వచ్చాయి. ఇదంతా గాసిప్స్ మాత్రమే అని జీవీ, దివ్య భారతి ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఇంకా ఈ పుకార్లు వస్తూనే ఉంది. దీంతో హీరోయిన్ దివ్య భారతి ఘాటుగా స్పందించింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్)
'జీవీ ప్రకాశ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కి నాకు సంబంధం లేదు. దీంతో పాటు మరో క్లారిటీ కూడా ఇస్తున్నా. నేను ఎప్పుడూ ఓ నటుడితో డేటింగ్ చేయలేదు. అందులోనూ పెళ్లయిన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. కాబట్టి ఆధారం లేని ఇలాంటి రూమర్స్ సృష్టించొద్దు. ఇప్పటివరకు ఈ విషయంలో మౌనంగా ఉన్నా. కానీ కొన్నిరోజులుగా మరీ ఎక్కువవుతున్నాయి. దీంతో నా పేరు దెబ్బతింటోంది. ఇలాంటి వార్తలు సృష్టించే బదులు వేరే ఏదైనా పనికొచ్చే పనిచేసుకోండి. నా ప్రైవసీని గౌరవించండి. ఈ అంశంపై ఇదే నా మొదటి, చివరి ప్రకటన' అని దివ్య భారతి చెప్పుకొచ్చింది.
గతంలో బ్యాచిలర్ అనే తమిళ మూవీలో జీవీ ప్రకాశ్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీతో పాటు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. రీసెంట్ గా కింగస్టన్ (Kingston Movie) అనే మరో మూవీతో వచ్చారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. కానీ దివ్యభారతి మళ్లీమళ్లీ క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
