Divorce
-
Michelle Obama: ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.నటి సోఫియా బుష్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 3వ తేదీన హమిల్టన్ కాలేజీలో ఓ ఈవెంట్‌కు హాజరైన బరాక్ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు. -
'అలాంటి వారు కుక్కలతో సమానం'.. గోవింద భార్య ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు గోవింద పేరు గత కొన్ని నెలలుగా ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని ఇప్పటికే చాలాసార్లు వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని తనపై వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. అప్పట్లో బాలీవుడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న గోవింద.. సునీతా అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా సైతం స్పందించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె మరోసారి వీటిపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరైన సునీతా అహుజా తన వివాహం గురించి జరుగుతున్న ఉహాగానాలు చూస్తుంటే కలతగా ఉందని తెలిపింది. ఇలాంటి నిరాధారమైన వాటిని వ్యాప్తి చేసేవారిని నమ్మవద్దని అభిమానులను కోరింది.సునీతా మాట్లాడుతూ..'అది పాజిటివ్ అయినా..నెగెటివ్ అయినా.. నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. మాపై ఇలాంటివీ సృష్టించేవారు కుక్కలతో సమానం. అందుకే అవి మొరుగుతాయి." అని కాస్తా గట్టిగానే ఇచ్చిపడేసింది. కాగా.. ఫిబ్రవరిలో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని గోవింద తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. కానీ వీరికి అత్యంత సన్నిహితుడు కుటుంబ స్నేహితుడై లలిత్ బిందాల్ అనే వ్యక్తి సునీతా అహుజా దాదాపు ఆరు నెలల క్రితమే విడాకుల కోసం దాఖలు చేశారని చెప్పారు. ఆ తర్వాతే విడాకుల రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.కాగా.. సునీతా అహుజాను మార్చి 1987లో గోవింద వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే కుమార్తె టీనాకు ఆ జంట స్వాగతం పలికారు. వీరికి యశ్వర్ధన్ అనే కుమారుడు 1997లో జన్మించాడు. -
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
విడాకులు అనే పదం ఈ రోజుల్లోనే కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెళ్లైన కొన్నేళ్లలోనే పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ బుల్లితెర నటి తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ బుల్లితెర నటి ముగ్ధా చాఫేకర్ విడాకులు తీసుకున్నట్లు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రవీశ్ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత భర్త రవీశ్ దేశాయ్‌తో విడిపోయింది.రవీశ్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "చాలా ఆలోచనల తర్వాత, ముగ్ధ , నేను మా సొంత మార్గాల్లో ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నాం. అందుకే భార్య,భర్తలుగా విడిపోవాలని డిసిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టింది. ఇప్పటివరకు పరస్పరం ప్రేమ, స్నేహం, గౌరవంతో కలిసి ప్రయాణించాం. ఆమెతో ఉన్న రోజులు జీవితాంతం గుర్తుంటాయి." అని పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కావాలని అభిమానలను అభ్యర్థించాడు. అభిమానులు, మీడియా మాపై దయతో మద్దతుగా ఉండాలని.. ఎటువంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని నటి భర్త కోరారు.కాగా.. రవీశ్ దేశాయ్, ముగ్ధా చాఫేకర్ 2014లో సత్రంగి ససురల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సీరియల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత డిసెంబరు 2016లో ముంబయిలో జరిగిన గ్రాండ్ వేడుకలో వీరి వివాహం జరిగింది. ప్రముఖ టీవీ సీరియల్ కుంకుమ భాగ్య సీరియల్లో ప్రాచీ మెహ్రా కోహ్లి పాత్రకు గానూ ముగ్ధా చాఫేకర్ బాగా ఫేమస్ అయింది. అలాహే రవీశ్ దేశాయ్ మేడ్ ఇన్ హెవెన్, షీ (సీజన్ 2), స్కూప్ లాంటి వెబ్ సిరీస్‌ల్లో కనిపించారు. చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా విజయ్ 69లో కనిపించారు. -
అప్పుడు మనస్పర్ధలొచ్చాయి
వాషింగ్టన్: రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు. భార్య మిషెల్‌తో జీవనప్రయాణంపై ఒబామా మీడియాతో మాట్లాడారు. హాలీవుడ్ నటి జెన్నీఫర్ అనీస్టన్తో వివాహేతర సంబంధం వంటి వార్తలను వదంతులుగా కొట్టిపారేశారు. భార్య మిషెల్ నుంచి విడాకులు తీసుకోబోతున్నారనేవి కూడా పూర్తిగా వదంతులేని స్పష్టంచేశారు. జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లోనూ, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భార్య మిషెల్‌తో రాకుండా ఒంటరిగా ఒబామా కనిపించిన నేపథ్యంలో మీడియా ఆయన విడాకుల అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో తాజాగా హామిల్టన్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాలేజీ అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్ అడిగిన ప్రశ్నలకు ఒబామా సమాధానాలిచ్చారు. ‘‘2020 నవంబర్‌లో నా ఆత్మకథ ఏ ప్రామిస్ట్ ల్యాండ్ మొదటి భాగాన్ని మార్కెట్లోకి తెచ్చాం. ఇప్పుడు రెండో భాగం పూర్తిచేసే పనిలో ఉన్నా. రోజూ పేజీల కొద్దీ రాస్తున్నా’’ అని అన్నారు. రాయడం ఇష్టపడతారా అన్న ప్రశ్నకు ‘‘అస్సలు ఇష్టంలేదు. కానీ రాయడం పూర్తయ్యాక మాత్రం రాశానన్న ఆనందంలో మునిగితేలుతా’’అని సరదాగా అన్నారు. ‘‘అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో విధి నిర్వహణలో పడిపోయా. దాంతో సతీమణితో మనస్పర్ధలొచ్చాయి. ఇప్పుడు పరిస్థితి అంతా కుదుటపడింది. నాటి విబేధాల లోయలోంచి బయటపడ్డా’’అని చెప్పారు. 1980వ దశకంలో ఒక న్యాయసేవల సంస్థలో కొన్నాళ్లు కలిసి పనిచేసిన కాలంలో మిషెల్‌తో ఒబామాకు పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారి 1992లో పెళ్లికి దారితీసింది. ఒబామా అధ్యక్షుడయ్యాక కొంతకాలం వాళ్ల మధ్య బేధాభిప్రాయాలు పొడచూపాయి. తమ వైవాహిక బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మిషెల్ చెప్పారు. అప్పట్నుంచి వీళ్ల వివాహబంధంపై మీడియాలో ఎన్నో కథలు షికార్లు చేశాయి. అమెరికాలో ప్రఖ్యాత జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ సైతం ఇదే విషయం అంచనావేశారు. ఒబామా దంపతులకు జూలై, ఆగస్ట్ నెలలు అత్యంత విషమకాలమని ఆమె అంచనా వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని అమీ ట్రిప్ చెప్పిన జోక్యం నిజం కావడం తెల్సిందే. పెళ్లి పెటాకులు అవుతుందన్న పుకార్లు పెరగడంతో ఒబామా జంట ఫిబ్రవరి 14న జంటగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టింది. వేలంటైన్స్‌డే గ్రీటింగ్స్ చెప్పి విమర్శించే వాళ్ల నోరు మూయించారు. -
మొదటి భార్యకు విడాకులపై నాటకం
కర్ణాటక: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ దాఖలాలను సృష్టించిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా రెండో భార్య వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకొని పరారైన సంఘటన నగరంలోని కువెంపునగర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసకారి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని వంచనకు గురైన బాధితురాలు రోజా ఆనే మహిళ కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని కువెంపు నగరలో లేడీస్ పీజీని నిర్వహిస్తున్న రోజా ఆనే మహిళ మొదటి భర్త నుంచి కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి అండగా ఉండటం కోసం రెండో పెళ్లి చేసుకోడానికి డైవర్స్ మ్యాట్రిమోనిలో యాప్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళకు చెందిన త్రిశూర్‌లో నివాసం ఉంటున్న శరత్ రామ్ రోజాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి అయిందని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చానని నకిలీ దాఖలాలు రోజాకు చూపించాడు. దాంతో శరత్రామ్ను నమ్మిన రోజా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే షికార్లు ఇద్దరు కలిసి పెళ్లికి ముందు షికార్లు తిరిగారు. శారీరకంగాను కలిశారు. పెళ్లి ఘనంగా వద్దని రిజిస్టర్ పెళ్లి చెసుకుందామని ఆనుకున్నారు. ఈ సందర్బంగా తనకు వ్యాపారం కోసం అని విడతల వారీగా రోజా వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నగదును తీసుకున్నాడు. అనంతరం లేడీడిస్ పీజీలో వచ్చిన డబ్బు కూడా తీసుకున్నాడు. రోజా పేరుతో రెండు కంపెనీలు పెట్టి ఆందులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి వారిని కూడా మోసం చేశారు. పెళ్లి చేసుకుందామని కోరుతున్నా వాయిదా వేస్తూ వచాచడు. దాంతొ ఆనుమానం పెంచుకున్న రోజా ఆతని విడాకులు నిజమా, కాదా? అని న్యాయవాది ద్వారా విచారిందగా అవి నకిలీ అని, అతను విడాకులు తీసుకోలేదని మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని రోజా ప్రశ్నించడంతో తననే ఎదిరిస్తావా? ఆని రోజా పైన దాడి చేసి కొట్టి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి
సినీ ఇండస్ట్రీలో పుకార్లకు లెక్కలేదు. దానికి తగ్గట్లు పెళ్లి, విడాకులు అనే విషయాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో జీవీ ప్రకాశ్ (GV Prakash Kumar) కూడా గతేడాది తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా భార్యభర్తలిద్దరూ కలిసి కోర్టులో పిటిషన్ కూడా వేశారు.అయితే జీవీ తన భార్య సైంధవి నుంచి విడాకులు తీసుకోవడానికి హీరోయిన్ దివ్య భారతినే(Divya Bharati) కారణమని రూమర్స్ వచ్చాయి. ఇదంతా గాసిప్స్ మాత్రమే అని జీవీ, దివ్య భారతి ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఇంకా ఈ పుకార్లు వస్తూనే ఉంది. దీంతో హీరోయిన్ దివ్య భారతి ఘాటుగా స్పందించింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్)'జీవీ ప్రకాశ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కి నాకు సంబంధం లేదు. దీంతో పాటు మరో క్లారిటీ కూడా ఇస్తున్నా. నేను ఎప్పుడూ ఓ నటుడితో డేటింగ్ చేయలేదు. అందులోనూ పెళ్లయిన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. కాబట్టి ఆధారం లేని ఇలాంటి రూమర్స్ సృష్టించొద్దు. ఇప్పటివరకు ఈ విషయంలో మౌనంగా ఉన్నా. కానీ కొన్నిరోజులుగా మరీ ఎక్కువవుతున్నాయి. దీంతో నా పేరు దెబ్బతింటోంది. ఇలాంటి వార్తలు సృష్టించే బదులు వేరే ఏదైనా పనికొచ్చే పనిచేసుకోండి. నా ప్రైవసీని గౌరవించండి. ఈ అంశంపై ఇదే నా మొదటి, చివరి ప్రకటన' అని దివ్య భారతి చెప్పుకొచ్చింది.గతంలో బ్యాచిలర్ అనే తమిళ మూవీలో జీవీ ప్రకాశ్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీతో పాటు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. రీసెంట్ గా కింగస్టన్ (Kingston Movie) అనే మరో మూవీతో వచ్చారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. కానీ దివ్యభారతి మళ్లీమళ్లీ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
భార్య అలా బెదిరించినా సరే విడాకులు తీసుకోవచ్చు!
విడాకులు తీసుకోవడానికి సంబంధిత చట్టాలు.. అందులోని సెక్షన్లు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇచ్చాయి. అయితే సందర్భం దొరికినప్పుడల్లా ఆ సెక్షన్ల విస్తృత పరిధిపై తమ తీర్పులు.. ఆదేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాయి న్యాయస్థానాలు. ఈ క్రమంలోనే తాజాగా విడాకులకు సంబంధించిన బాంబే హైకోర్టు ఓ సంచలన తీర్పు వెల్లడించింది.ముంబై: జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవరైనా సరే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించినా.. లేదంటే అలాంటి ప్రయత్నం చేసినా.. అది హింస కిందకే వస్తుందని, హిందూ వివాహ చట్టం, 1955 లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం విడాకులు మంజూరు చేయొచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది.తన భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోందని.. తనను,తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇక ఆమెతో కలిసి కాపురం చేయలేనని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. అక్కడి అతనికి ఊరట దక్కగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది.ఆమె కేవలం తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని మాత్రమే బెదిరించడం లేదు.. బలవన్మరణానికి పాల్పడతానని చెబుతోంది కూడా. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది అవతలి వాళ్లను హింసించడమే అవుతుంది. కాబట్టి విడాకులు మంజూరు చేయొచ్చు అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ న్యాయమూర్తి ఆర్ఎం జోషి తీర్పు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన సదరు వ్యక్తికి 2009లో వివాహం జరిగింది. ఆ జంటకు ఓ పాప. అయితే భార్య తరఫు బంధువుల రాకతో తమ కాపురం కుప్పకూలిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడతను. గర్భంతో ఉన్న భార్య తనను వీడి వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి తిరిగి రాలేదు. అయితే కొంతకాలం తర్వాత తప్పుడు కేసులతో ఆమె అతన్ని బెదిరించసాగింది. ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకుని.. ఆ నేరాన్ని భర్త కుటుంబంపై నెట్టేస్తానని బెదిరించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టుకు సమర్పించిన భర్త చివరకు ఫ్యామిలీ కోర్టు నుంచి కిందటి నెలలో విడాకులు పొందగలిగాడు. భార్య ఆ తీర్పును సవాల్ చేయగా.. బాంబే హైకోర్టు తాజాగా ఆ తీర్పును సమర్థించింది. -
శంకర్-దివ్య విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్
ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్ ప్రసన్న శంకర్ నారాయణ ఇంటి వ్యవహారం.. మొత్తంగా రచ్చకెక్కింది. అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న ఆయన.. సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశారు. అది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రచ్చ కాస్త శాంతించింది. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ(Prasanna Sankar Narayana).. ప్రముఖ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు. అంతేకాదు.. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. అయితే.. .. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు హఠాత్తుగా సీన్ చెన్నైకి మారింది. భారత్‌కు వచ్చిన దివ్యఅమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు(Prasanna Sankar) ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించాడు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని.. పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ ఆరోపించారు. చివరకు.. పోలీసుల హామీతో ఆయన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు.దివ్య ఏమన్నారంటే..ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని వివరించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని ఆరోపించారు. English Translation of @myprasanna 's video:"My name is Prasanna. I was born and brought up in Chennai. I went to US and founded a 10B dollar company. I'm a Tech Entrepreneur. Recently me and my wife got divorced and we had 50/50 custody of our son after signing a MOU.." https://t.co/uxSvgS1Xar— 7y913.acc (@aayeinbaigan) March 23, 2025అయితే.. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని... అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని వివరించారు. అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్‌లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. -
విడాకుల కేసు.. ఒకే కారులో వచ్చివెళ్లిన సెలబ్రిటీ జంట
ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar).. గతేడాదే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దాదాపు 11 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పాడు. తాజాగా భార్యతో కలిసి విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ ఒకే కారులో వచ్చి వెళ్లడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.తెలుగు, తమిళంలో అడపాదడపా సినిమాలకు సంగీతమందిస్తున్న జీవీ.. మధ్య మధ్యలో హీరోగానూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. కెరీర్ పరంగా బాగానే ఉంది. మరి ఏమైందో ఏమో గానీ గతేడాది మేలో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చాడు. చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని (Saindhavi) జీవీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అన్వీ అనే కూతురు కూడా ఉంది.(ఇదీ చదవండి: నెల క్రితం గాయం.. 'మన్మథుడు' హీరోయిన్ కి ఏమైంది?)విడాకులు కారణాలేంటనేది బయటపెట్టలేదు గానీ గతేడాది ప్రకటించిన తర్వాత నుంచి వేర్వేరుగానే నివసిస్తున్నారట. కానీ తాజాగా సోమవారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకి మాత్రం ఒకే కారులో వచ్చారు. విడాకుల కోసం అర్జీ దాఖలు చేశారు. కానీ వాయిదా పడటంతో తిరిగి ఒకే కారులో వెళ్లిపోయారు. సాధారణంగా విడాకులు తీసుకుంటున్నారంటేనే ఎవరికి వారు యుమునా తీరే అన్నట్లు విడివిడిగా వస్తుంటారు. కానీ జీవీ-సైంధవి మాత్రం ఒకే కారులో వెళ్లిరావడం అక్కడున్న వాళ్లని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)இசையமைப்பாளர் ஜி.வி பிரகாஷ் - பாடகி சைந்தவி ஆகியோர் பரஸ்பரம் விவாகரத்து கோரி குடும்ப நல நீதிமன்றத்தை நாடிய நிலையில், வழக்கு விசாரணையை நீதிபதி செல்வ சுந்தரி ஒத்திவைப்பதாக அறிவித்தார். இதையடுத்து நீதிமன்றத்திலிருந்து ஒரே காரில் இருவரும் புறப்பட்டுச் சென்றனர். #GVPrakash #Saindhavi pic.twitter.com/kOp7QyVoM6— Idam valam (@Idam_valam) March 24, 2025 -
మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో
ప్రేమలో విఫలమైతే జీవితమే అయిపోయినట్లు డీలా పడిపోతారు. పెళ్లి పెటాకులైతే అంతా శూన్యమైపోయినట్లు దిగులు చెందుతారు. అందుకు తాను కూడా అతీతుడిని కాదంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు ఆ బాధ భరించలేకపోయానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. రీనా దత్తా (Reena Dutta), నేను విడిపోయినప్పుడు దాదాపు మూడేళ్లపాటు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయా..ఏ స్క్రిప్టు కూడా వినలేకపోయాను. సినిమాలపై శ్రద్ధ పెట్టలేకపోయాను. ఏడాదిన్నరపాటు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాను. మందు ముట్టని నేను విపరీతంగా తాగడం మొదలుపెట్టాను. అసలేం చేయాలో అర్థం కాలేదు. రాత్రిళ్లు సరిగా నిద్రపట్టేది కాదు. అందుకే తాగుడుకు అలవాటుపడ్డాను. మద్యం తాగడం అంటేనే గిట్టని నేను ఒక ప్రతి రోజు ఒక బాటిల్ లేపేసేవాడిని. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. దేవదాసులా మారిపోయాను.రెండు పెళ్లిళ్లు- విడాకులుకానీ మనకు నచ్చిన వ్యక్తులు మనతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోవాలి. వాళ్లు తిరిగొచ్చే అవకాశం లేనప్పుడు మిస్ అవుతాం.. అయినా తప్పదని ముందుకు వెళ్లాలి అని చెప్పుకొచ్చాడు. ఆమిర్ ఖాన్, రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్ ఖాన్, కూతురు ఇరా ఖాన్ సంతానం. ఆమిర్-రీనా 2002లో విడాకులు తీసుకున్నారు. 60 ఏళ్ల వయసులో డేటింగ్2005లో ఆమిర్.. కిరణ్ రావు (Kiran Rao)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా ఆజాద్ జన్మించాడు. ఈ దంపతులు కూడా పెళ్లయిన 15 ఏళ్లకు విడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల తన 60వ బర్త్‌డే వేడుకల్లో.. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రేయసిగా పరిచయం చేశాడు. వీరిద్దరూ ఏడాదిన్నర కాలంగా డేటింగ్లో ఉన్నారు.చదవండి: ఓటీటీలో 'మజాకా'.. స్ట్రీమింగ్ వైరల్ -
‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి మెలిందా గేట్స్(Melinda Gates) విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత తన మాజీ భర్త ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎల్లే మ్యాగజైన్‌తో మాట్లాడిన 60 ఏళ్ల మెలిందా గేట్స్ తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ‘విడాకులు బాధాకరమైనవి. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.మెలిందా, బిల్ గేట్స్ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2021 మేలో విడాకులు తీసుకున్నారు. తర్వాత మూడు నెలలకు అధికారికంగా వీరు విడిపోయారు. ఇటీవల తమ బ్రేకప్‌పై బిల్‌గేట్స్ టైమ్స్ ఆఫ్ లండన్‌తో మాట్లాడుతూ.. విడాకుల వ్యవహారం తనకు, మెలిందాకు కనీసం రెండేళ్ల పాటు బాధను మిగిల్చిందని అన్నారు. తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని తమ విడాకులేనన్నారు. తాను ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని నెలల తర్వాత మెలిందా తాజాగా స్పందించడం గమనార్హం. తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు మెలిందా తెలిపారు. విడాకులు బాధాకరమైనవని చెప్పారు. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విడాకులు తీసుకోవాలనే నిర్ణయం కష్టమైనప్పటికీ జీవితాన్ని స్వతంత్రంగా పునర్నిర్మించగల సామర్థ్యం తనకు ఉందని ఆమె అన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ బ్రాండ్ ప్రచారకర్తలుగా మహేష్, సితార2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్ల భరణం: ఇందులో ట్యాక్స్ ఎంతంటే?
టీమిండియా క్రికెటర్ 'యజువేంద్ర చహల్', సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ 'ధనశ్రీ వర్మ' పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో చహల్.. ధనశ్రీకు భరణం కింద రూ. 4.75 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే భరణం డబ్బులో.. ట్యాక్స్ ఏమైనా చెల్లించాలా?, చెల్లిస్తే ఎంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.విడాకులు తీసుకోవడానికి ముందే చహల్.. ధనశ్రీకి రూ.2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన డబ్బు త్వరలోనే ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక దీనిపై ట్యాక్స్ ఎంత చెల్లించాల్సి ఉంటుందా? అనే విషయానికి వస్తే.. భరణం ఒకేసారి చెల్లించినట్లయితే.. ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దీన్ని నాన్ ట్యాక్సెసిబుల్ అసెట్‌గా పరిగణిస్తారు. ఇలాంటి వాటిపైన పన్నులు ఉండవు.భరణం అనేది నెలవారీ లేదా ఏడాదికి చెల్లించినట్లయితే.. దాన్ని రెవెన్యూ రెసిప్ట్గా పరిగణిస్తారు. ఈ విధానంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే భరణం పొందిన వ్యక్తి వీటిని ఆదాయపు పన్ను రిటర్న్‌లో ప్రకటించాలి. ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాలి.భరణం కాకుండా.. ఆస్తులను బదిలీ చేస్తే, అలాంటి వాటిపైన ట్యాక్స్ పడుతుంది. ఈ పన్నును భరణం పొందిన వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడానికి ముందే, ఆస్తుల బదిలీ జరిగి ఉంటే.. దానిని గిఫ్ట్ కింద పరిగణిస్తారు. అప్పుడు మీరు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.భరణం అంటే ఏమిటి?భార్య భర్తలు విడిపోయిన తరువాత.. జీవిత భాగస్వామి (భార్య) ఆర్థిక అవసరాలకు అందించే సహాయాన్ని భరణం అంటారు. భారతదేశంలో భరణం పొందటానికి.. హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ డివోర్స్ యాక్ట్, ముస్లిం ఉమెన్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ వంటి అనేక చట్టాలు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!భరణం ఇవ్వడానికి ముందు.. న్యాయస్థానం కూడా, అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో వివాహం సమయంలో వారి లైఫ్ స్టైల్, ఖర్చులు, వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది?, పిల్లలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం చేసే భార్య జీతం.. భర్త జీతంతో సమానంగా ఉంటే, అప్పుడు భరణం తగ్గే అవకాశం ఉంటుంది. -
Dhanashree Verma: సరిగ్గా అదే టైంకి ధన శ్రీ పాట రిలీజ్
యూట్యూబర్ ధనశ్రీ వర్మ ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణం విడాకులు. టీమిండియా క్రికెటర్ చాహల్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. గత కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది. తాజాగా కోర్ట్ వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కానీ ఇదే టైంలో ధనశ్రీ.. గృహహింసపై చేసిన ఓ పాట రిలీజ్ కావడం చర్చనీయాంశమైంది.2020 డిసెంబరులో చాహల్- ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. ఐపీఎల్ తన భర్త ఆడే ప్రతి మ్యాచ్ కి ధనశ్రీ వచ్చేది. మరి ఏమైందో ఏమో కొన్నాళ్ల క్రితం వీళ్లిద్దరూ ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అదే టైంలో ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్ల ఇస్తారనే రూమర్స్ వినిపించాయి. వీటిని ధనశ్రీ కుటుంబం ఖండింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి కొత్త సినిమా)మరోవైపు చాహల్.. ఆర్జే మహ్ వశ్ అనే అమ్మాయితో కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఇవన్నీ పక్కనబెడితే తాజాగా న్యాయస్థానం చాహల్-ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది. భరణంగా రూ.4.75 కోట్లు ఇస్తాడని తేలింది. ఇదంతా గురువారం జరగ్గా.. అదే టైంలో ధనశ్రీ నటించిన ఓ ఆల్బమ్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.'దేఖా జీ దేఖా మైనే' అని సాగే ఈ పాటంతా గృహహింస నేపథ్యంగా తీశారు. ధనశ్రీ.. గృహహింస బాధితురాలు, భర్త చేతిలో మోసపోయిన మహిళగా కనిపించింది. భర్తను ఎంతగానో ప్రేమించినప్పటికీ.. అతడు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండటం.. అడిగినందుకు దాడి చేయడం, చివరకు విడాకులు తీసుకోవడం లాంటి సీన్స్ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే చాహల్ పై ప్రతీకారంగా ధనశ్రీ ఈ పాట తీసిందా అనే సందేహం వచ్చింది.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?) -
ఇకపై భార్యాభర్తలు కారు.. బంధం ముగిసిపోయింది (ఫొటోలు)
-
రూ.4 కోట్ల 75 లక్షలు!
ముంబై: భారత క్రికెట్ జట్టు లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహ బంధం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. వీరిద్దరు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నా ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా చెబుతారు.అయితే తాము రెండున్నరేళ్లకు పైగా విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నాం కాబట్టి ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని చహల్, ధనశ్రీ కోరారు. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్ కారణంగా తాను కనీసం మూడు నెలలు అందుబాటులో ఉండలేనని కూడా చహల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన హైకోర్టు...ఈ నిబంధన నుంచి వీరిద్దరికి సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విడాకులకు సంబంధించి గురువారమే తుది తీర్పు ఇవ్వాలని కూడా సూచించింది. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి చహల్ రూ. 4 కోట్ల 75 లక్షలు భరణం రూపంలో చెల్లించనున్నాడు.ఇందులో అతను ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ఇచ్చేశాడు. యూట్యూబర్, కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చహల్‌కు డిసెంబర్, 2020లో పెళ్లి జరగ్గా... 18 నెలల తర్వాత జూన్ 2022 నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు. -
మీ కోసం నా భర్త ఫోటోలు షేర్ చేయాలా?.. విడాకులపై మహాత్మ హీరోయిన్
తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ భావన. శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ చిత్రంలో ఆడియన్స్‌ను మెప్పించింది. కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన 2018లో కన్నడ నిర్మాత నవీన్ రమేశ్‌ను పెళ్లాడింది. గతేడాది 'నడికర్' అనే మలయాళ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భావన తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. ఇంతకీ ఆ ముచ్చట ఏంటో తెలుసుకుందాం పదండి.ఈ మలయాళీ భామ త్వరలోనే తన భర్త నవీన్ రమేశ్‌తో విడిపోనుందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో తమపై వస్తున్న వార్తలపై భావన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. అలాగే తన భర్తతో దిగిన ఫోటోలను కూడా తాను షేర్ చేయకపోవడం వల్లే ఇలా మాట్లాడుకుంటున్నారని భావన వెల్లడించింది.భావన మాట్లాడుతూ..' నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు ఇష్టముండదు. అందుకే మేము విడాకులు తీసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తా. నేను యాదృచ్ఛికంగా ఫోటోలు పోస్ట్ చేసినా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తారు. అలా అని మా బంధం నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా?" అంటూ విడాకులపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. భావన తన సినీ కెరీర్‌ను మలయాళ చిత్రం నమ్మల్ (2002)తో ప్రారంభించింది. తరువాత చితిరం పెసుతడితో తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది. తమిళంలో అజిత్ కుమార్ సరసన కూడా నటించింది. ఆ తర్వాత ఒంటరి మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ తెలుగులో ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆమె ప్రస్తుతం కన్నడ చిత్రం పింక్ నోట్, తమిళ చిత్రం ది డోర్ సినిమాలో కనిపించనుంది. -
బెడ్‌కు జై.. భాగస్వామికి బై..
అంటూ అటూ ఇటూ కదులుతుండటంతో పక్కనే ఉన్న నాకు కూడా నిద్ర పట్టలేదు’ పొద్దున్నే ఆఫీస్‌లో తాను పడుతున్న కునికిపాట్ల కారణాన్ని కొలీగ్‌తో పంచుకున్నాడు నగరవాసి తరుణ్.. ‘మా భర్త నైట్ అంతా గురకపెడతారు.. దాంతో నాకు నిద్రే ఉండటం లేదు’ అంటూ ఫ్రెండ్ దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది ఓ వివాహిత. ఇలాంటి సమస్యలతో నిద్రలేమికి గురవుతున్న కొందరు నగరవాసులు దీనికో పరిష్కారాన్ని ఎంచుకున్నారు. దాని పేరే స్లీప్ డివోర్స్.. పరస్పర అంగీకారంతో దూరదూరంగా నిద్రించడమే నిద్ర విడాకులు.. నాణ్యమైన రాత్రి నిద్ర కోసం దేశంలో 78% జంటలు ‘నిద్ర విడాకులు’ను ఎంచుకుంటున్నాయి. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం పురస్కరించుకుని నిద్రలేమి సమస్యకు పరిష్కారాలను అందించే రెస్‌మెడ్.. నగరంతో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన స్లీప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి జంటలు వేర్వేరు బెడ్లు/ బెడ్రూమ్లలో నిద్రించే ఈ పద్ధతి ఒకప్పుడు నిషిద్ధంగా లేదా వైవాహిక అసమ్మతికి సంకేతంగా పరిగణించేవి. అయితే ఇప్పుడు ఈ ధోరణి మెరుగైన ఆరోగ్యం, సంబంధాల సామరస్యానికి దోహదపడేదిగా గుర్తింపు పొందుతోంది. మంచి నిద్రతోనే.. మెరుగైన జీవనం.. ‘మనం ఏది సాధించాలన్నా తగినంత నిద్ర ఉండాలి. అది జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది’ అని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ సతీష్ సి రెడ్డి అంటున్నారు. ‘ఒక వైద్యుడిగా, రోగుల ఆరోగ్యం, ఉత్పాదకత మాత్రమే కాదు సంబంధాలపై కూడా నిద్రలేమి చూపించే దు్రష్పభావాలను నగరంలో పలువురిలో చూస్తున్నాను. చాలా మంది ప్రతిరాత్రి దాదాపు 7 గంటల పాటు నిద్రపోతున్నా, వారు వారానికి నాలుగు రాత్రులు మాత్రమే అధిక–నాణ్యత కలిగిన నిద్రను పొందుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతను గుర్తించినా 22% మంది తమ నిద్ర సమస్యలకు సహాయం తీసుకోవాలని అనుకోరు’అని ఆయన చెప్పారు.నిద్ర విడాకులకు కారణాలు జంటల్లో ఇద్దరికీ ఉండే భిన్నమైన అలవాట్లు, స్క్రీన్ టైమ్, విభిన్న అవసరాలు, నిద్ర విధానాలు, గురక, గదిలోని ఉష్ణోగ్రత ప్రాధాన్యతలు, అతిగా కదిలే చంచలత్వం, నిద్ర రుగ్మతలు.. శారీరక సౌలభ్యం వంటి వివిధ కారణాలతో జంటలు ఈ విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే మానసిక ఆరోగ్య సంబంధిత కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక భాగస్వామి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లయితే లేదా దీర్ఘకాలిక నొప్పితో ఉన్నట్లయితే, విడివిడిగా నిద్రపోవడం వల్ల మరొకరి విశ్రాంతికి అంతరాయం కలగకుండా సహకరించినట్లు అవుతుందనే ఆలోచన.బలపడుతున్న బంధం.. ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్, డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, (పల్మోనాలజీ–గోల్డ్ మెడల్) మాట్లాడుతూ జంటలు వ్యక్తిగత స్థలం, వ్యక్తిగత నిద్ర అవసరాలు సంబంధాల మధ్య సమతుల్యం చేయడానికి నిద్ర విడాకులను ఎంచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. నిద్ర నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వాస్తవానికి, చాలా మంది జంటలకు, తమ సాన్నిహిత్యాన్ని మెరుగుపరచే ఒక మంచి మార్గంగా పయోగపడుతుందనీ ఇద్దరూ తమకు అవసరమైన విశ్రాంతిని పొందేలా సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. గతంలో భావించినట్లు నిద్ర విడాకులు ఆప్యాయత లేదా ప్రేమ లేకపోవడాన్ని సూచించడానికి బదులు, ఇది ఒకరి వ్యక్తిగత విశ్రాంతికి మరొకరు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తుందన్నారు.ప్రయోజనాలూ.. ప్రతికూలతలూ.. మెరుగైన నిద్ర నాణ్యత, తగ్గిన నిద్ర అంతరాయాలు, మెరుగైన సాన్నిహిత్యం, ఎక్కువ వ్యక్తిగత స్థలం, బలమైన రోగనిరోధక వ్యవస్థ, మెరుగైన మానసిక స్థితి, మెరుగైన పనితీరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడం వంటివి నిద్ర విడాకుల ద్వారా పొందే ప్రయోజనాలు. కాగా.. కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ‘చాలా మంది జంటలు నిద్ర విడాకుల నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఇది కొన్నిసార్లు మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అలాగే దూరంగా నిద్రపోవడాన్ని ఇప్పటికీ సంబంధాల సమస్యకు సంకేతంగా చూస్తారు. కాబట్టి సామాజిక ఆక్షేపణలకు దారితీస్తుంది. ‘ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలకు గురవడం కన్నా.. నిద్ర విడాకులు, ఆరోగ్యకరమైన, ఆచరణాత్మక ఎంపిక’ అని డాక్టర్ బాలసుబ్రమణియన్ స్పష్టం చేశారు. -
‘భార్య అలా చేస్తే భర్తకు ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదు’ :హైకోర్టు
భోపాల్ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో అసభ్యకరమైన ఫోన్ ఛాటింగ్‌లు చేయకూడదని, తన భార్య ఆ తరహా చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించలేడని పేర్కొంది. దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఫోన్ ఛాటింగ్‌పై వ్యాఖ్యానించింది. నా భార్య చాటింగ్ చేస్తోందిమధ్యప్రదేశ్కు చెందిన భార్య,భర్తల గొడవ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చర్చకు దారితీసింది. 2018లో దంపతులకి వివాహమైంది. అయితే, ఆ ఇద్దరి దంపతుల మధ్య పొరపొచ్చలొచ్చాయి. అప్పుడే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ‘విచారణలో నా భార్య వివాహం తరువాత కూడా ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. అందుకు వాట్సప్ చాటింగే నిద్శనం. పైగా ఆ చాటింగ్ అసభ్యంగా ఉందని ఆధారాల్ని అందించారు.లేదు.. నా భర్తే నాకు రూ.25లక్షల భరణం ఇవ్వాలికానీ పిటిషనర్ భార్య మాత్రం భర్త చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. నా భర్త చెప్పినట్లుగా నేను ఎవరితోను సాన్నిహిత్యంగా లేను. చాటింగ్ చేయడం లేదు.నా భర్త కావాలనే నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాడు. నా ఫోన్ హ్యాక్ చేసి మరి మరో ఇద్దరు పురుషులతో చాటింగ్ కూడా చేశారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించనందుకు రూ.25లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు ఆరోపణలు చేసింది.భార్యే నిందితురాలుఅంతేకాదు, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్య-భర్త ఏపిసోడ్ భర్త చెప్పేవన్నీ నిజాలేనని నిర్ధారించింది. వాటిని నివృత్తి చేసుకునేందుకు భార్య తండ్రిని సైతం విచారించింది. విచారణలో ఆమె తండ్రి కూడా అంగీకరించారు. తన కుమార్తె పరాయి మగాడితో చాటింగ్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లు కోర్టుకు చెప్పారు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.నాకు విడాకులొద్దు.. భర్తతోనే కలిసుంటాఫ్యామీలి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జస్టిస్ వివేక్ రష్యా, జస్టిస్ గజేంద్ర సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో పిటిషనర్ తన ప్రియుడితో సె* లైఫ్ గురించి చాటింగ్ చేసినట్లు గుర్తించింది. భార్య పరాయి పురుషుడితో ఈ తరహా చాటింగ్ చేస్తే ఏ భర్త సహించలగడనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదువివాహం తర్వాత, భర్త మరియు భార్య ఇద్దరూ తమ స్నేహితులతో మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ.. సంభాషణ స్థాయి సౌమ్యంగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా, మహిళ.. పురుషుడితో.. పురుషుడు స్త్రీతో మాట్లాడితే జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా ఉండకూడదు’ అని కోర్టు పేర్కొంది. ఒక భాగస్వామి ఇలా అసభ్యకరమైన చాటింగ్ చేస్తే.. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదని తెలిపింది. చివరగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
జాగ్రత్త పడకుంటే విడాకులే..!
అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుబడిన జేమ్స్ శాక్స్ట్టన్. విడాకులు పెరగడానికి కారణం ‘స్లిప్పేజ్ అన్నాడు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోక చూపే లెక్కలేనితనాలే ఒకనాటికి ‘విడాకులు’గా మారుతున్నాయని హెచ్చరించాడు. ‘నా ఉద్యోగం, పిల్లలు, సంపాదన...వీటన్నింటి కన్నా ముందు నువ్వే నాకు ముఖ్యం’ అని భార్య/భర్త ఒకరికొకరు తరచూ చెప్పుకోకపోతే చర్యలతో చూపకపోతే విడాకులకు దగ్గరపడ్డట్టే అంటున్నాడు. స్లిప్పేజ్ లక్షణాలు మీలో ఉన్నాయా..?ఒకరోజు ఉదయాన్నే మీరు బట్టలు ధరిస్తుంటే అవి బిగుతుగా కనబడతాయి. వేసుకోవడానికి పనికి రానట్టుగా ఉంటాయి. ఏమిటి... ఇంత లావై΄ోయానా అనుకుంటారు. ఈ లావు రాత్రికి రాత్రి వచ్చిందా? కాదు. సంవత్సరాలుగా మీరు నిర్లక్ష్యంగా తిన్నది, వ్యాయామాన్ని పట్టించుకోనిది పేరుకుని ఇప్పుడు ఇలా బయటపడింది. మీ జీవన భాగస్వామి ఒక ఉదయాన వచ్చి మనం విడాకులు తీసుకుందాం అనంటే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యాల ఫలితం’ అంటున్నాడు జేమ్స్ శాక్స్టన్. అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుగడించిన ఈయన ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ‘స్లిప్పేజ్’ అనే మాట వాడాడు. పెళ్లయ్యాక ఏది ముఖ్యమో, ఏది అక్కడ అవసరమో అది వయసు గడిచేకొద్దీ ‘స్లిప్’ చేసుకుంటూ వెళితే ఎదురయ్యేది విడాకులే అంటాడతను. ఇతని మాటల ఆధారంగా వివిధ మ్యారేజ్ కౌన్సిలర్లు తమ వ్యాఖ్యానం వినిపిస్తున్నారు.మీ పెళ్లయ్యాక ఇలా చేస్తున్నారా?అతడు/ఆమె ఇష్టాఇష్టాలను ‘ఏం పర్లేదులే’ అనే ధోరణిలో ఖాతరు చేయకపోవడం.చిన్న చిన్న కోరికలు పట్టించుకోకపోవడంతగిన సమయం ఇవ్వకపోవడంసంభాషించకపోవడంమాటల్లేని రోజులను పొడిగించడంఅసంతృప్తులను బయటకు చెప్పకుండా కప్పెట్టి రోజులు వెళ్లబుచ్చడం..ఇలాంటివి జరుగుతుంటే త్వరలోనే వివాహ బంధం బ్రేక్ కానుందని అర్థం.ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?మీరు కేవలం రోజువారి పైపై మాటలే మాట్లాడుకుంటున్నారా?లోతైన, ఆత్మీయమైన సంభాషణలే చేసుకోవడం లేదా?సన్నిహితమైన సమయాలే ఉండటం లేదా?సమస్యాత్మక విషయాలను చర్చకు పెట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా?ఇలా ఉన్నా మీ వివాహం ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.మంచి తల్లిదండ్రులైతే సరిపోదుచాలామంది దంపతులు తాము మంచి తల్లిదండ్రులుగా ఉండటం ముఖ్యమనే దశకు వెళతారు. పిల్లలతో అనుబంధం గట్టిగా ఉంటే భార్యాభర్తల బంధం కూడా గట్టిగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇలా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ‘నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంపాదన ఆ తర్వాతే జీవిత భాగస్వామి అనుకుంటారు చాలామంది. వాస్తవానికి జీవిత భాగస్వామి ముందు ఉండాలి. మనం చేస్తున్నదంతా భార్య/భర్త కోసమే అనుకుని నిర్లక్ష్యం వహిస్తే భార్య/భర్త దూరమవుతారు. పిల్లలు, కెరీర్ కంటే ముందు భార్యాభర్తలుగా మన బంధం ముఖ్యం అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి... ఆ విధంగా రిలేషన్‌ను కాపాడుకోవాలి’ అంటున్నారు నిపుణులు.ఇలా చేయండి..మీ జీవిత భాగస్వామి పట్ల అక్కరగా ఉండండి.తరచూ ఎక్కువగా మాట్లాడండి. మంచి సమయాన్ని గడపండి.ఆర్థిక విషయాలు దాచకుండా చర్చిస్తూ ఇష్టాఇష్టాలు గమనించండి.మీ భార్య/భర్త ఒక గట్టి పాయింట్ లేవదీసి మిమ్మల్ని నిలదీస్తే తప్పించుకోకుండా దానిపై ఇవ్వాల్సిన వివరణ ఇచ్చి ముగించండి. లేకుంటే అది పెరుగుతూనే ఉంటుంది.మీరు భార్య లేదా భర్త. అంటే వివాహ బంధంలో మీవంటూ కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ బాధ్యతలను మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ బంధం గట్టిగా ఉంటుందని భావించండంలో లాజిక్ లేదు.పెళ్లి తనకు తానుగా నిలబడదు. కాని మీరు నిర్లక్ష్యం చేస్తే తనకు తానుగా విఫలమవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. (చదవండి: ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్‌కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
సీక్రెట్‌గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!
బాలీవుడ్లో నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత సహజమో..విడిపోవడం అంతే సహజం. ఇలా పెళ్లి చేసుకోని అలా విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో జంట విడిపోయింది. బాలీవుడ్ బుల్లితెర నటి,అపోలీనా(ఫేమస్ సైన్స్ డ్రామా సిరిస్) ఫేం అదితి శర్మ తన భర్త అభిజిత్ కౌశిక్‌తో విడిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగు నెలల కూడా కలిసి కాపురం చేయలేకపోయింది.నాలుగేళ్లుగా సహజీవనం.. సీక్రెట్‌గా పెళ్లిబాలీవుడ్ బుల్లితెరపై అదితి శర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియళ్లతో పాటు పలు షోలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె అభిజిత్ కౌశిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ విషయం బాలీవుడ్ మొత్తానికి తెలుసు. సోషల్ మీడియాలోనూ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసేవారు. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత గతేడాది నవంబర్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. తన కెరీర్‌కి ఇబ్బంది కలుగొద్దని ఇలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆమె ప్రవర్తన నచ్చక విడిపోయామని ఆమె భర్త అభిజిత్ కౌశిక్ చెప్పారు. అదితి ఒత్తిడితోనే పెళ్లి!తాజాగా ఆయన తన న్యాయ సలహాదారు రాకెశ్ శెట్టితో కలిసి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘అదితి నేను నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాం. గతేడాది నవంబర్ 12న మేం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాం. ఏడాదిన్నరగా అదితి నాపై ఒత్తిడి తెవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఓకే చెప్పాను. పెళ్లి విషయం బయటకు తెలిస్తే తన కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని అదితి చెప్పడంతో మా ఇద్దరి ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకున్నాం. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి’ అని అభిషేక్ చెప్పారురూ.25లక్షలు డిమాండ్అదితి శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభిషేకే ఇప్పుడు విడాకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అపోలీనా కో స్టార్ సమర్థ గుప్తాతో సన్నిహితంగా ఉంటుందని, వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చూశానని ఆరోపించాడు. ఈ కారణంగానే తాను విడాకులు కోరానని అభిషేక్ చెప్పారు. అయితే విడిపోవడానికి అదితి శర్మ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తూనే రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని అభిషేక్ న్యాయ సలహాదారు రాకేశ్ తెలిపారు. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
అభిషేక్ - ఐశ్వర్యపై విడాకుల రూమర్స్.. ఇకపై తెరపడినట్లే!
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌పై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి సమయంలోనూ వీరిద్దరు విడిపోనున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ బర్త్ డే రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడంతో మరోసారి డివోర్స్ వార్తలు వినిపించాయి. అలా ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.విడాకుల వార్తల నేపథ్యంలో స్టార్ కపుల్ బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడి పెళ్లిలో జంటగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఓ శుభ కార్యానికి హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు పడుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి హాజరైన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కిరణ్ రావ్, గాయత్రీ ఒబెరాయ్, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్, విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి సినీతారలు హాజరయ్యారు. అశుతోష్ కుమారుడు కోణార్క్ మార్చి 2న నియతిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.అభిషేక్-ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరిద్దరికి 2011లో ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె జన్మించారు. జూలై 2024లో అనంత్ అంబానీ పెళ్లి నుంచి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌పై విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ జంట పెళ్లికి హాజరవ్వడంతో ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్లే. View this post on Instagram A post shared by Aishwarya Rai Team🇲🇺 (@aishwarya_raifan) -
రెండో భర్తతో బుల్లితెర నటి విడాకులు.. స్పందించిన భామ!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. పలువురు సినీతారలు తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగించేస్తున్నారు. గతేడాది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం తన భార్య సైరా భానుతో విడిపోయారు. దాదాపు 27 వారి వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడేళ్లకు వీరిద్దరు విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ప్రముఖ బుల్లితెర నటి దీపికా కకర్ ఆమె రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై బుల్లితెర జంట స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్ అన్ని కొట్టిపారేశారు. అవీ చూస్తుంటే తమకు నవ్వాలనిపిస్తోందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దీపికా ఆమె భర్త షోయబ్ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు.దీపిక కక్కర్, షోయబ్ ప్రముఖ బాలీవుడ్ సీరియల్ ససురల్ సిమర్ కా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు దీపిక కక్కర్ పైలట్ రౌనక్ శాంసన్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్‌ను పెళ్లాడగా..2023లో కుమారుడు రుహాన్‌ను స్వాగతించారు. -
గోవిందాతో విడాకులు.. అలాంటి వాళ్లు నా ముందుకు రండి: సునీత అహుజా
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు గోవింద పేరు తెలియని వారు ఉండరు. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. దీంతో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కూడా. కొద్దిరోజుల కిందట తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు.అయితే తమపై వస్తున్న విడాకుల వార్తలపై గోవింద భార్య సునీతా అహుజా కూడా స్పందించారు. గోవిందా, తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.ఎందుకంటే మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్‌లు ధరించి తిరుగుతూ ఉంటాం.. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆఫీస్ కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ ప్రపంచంలో నన్ను, గోవిందాను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే నా ముందుకు రండి అంటూ నవ్వుతూ మాట్లాడింది సునీత అహుజా. గతంలోనూ తామిద్దరం వేర్వేరు ఇళ్లలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. మాకు రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయని.. ఆయనకు మీటింగ్స్ ఉండటం వల్ల మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలోనే ఉంటారని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
50 ఏళ్లొచ్చాయి మళ్లీ మొగుడ్ని వెతుకు.. నటిపై కంగన ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) బాగా స్పెషల్. నటనా పరంగా ఎంచుకునే పాత్రలు మాత్రమే కాదు నిజజీవితంలోనూ ఫైర్ బ్రాండ్‌గానే కనిపిస్తుంది. తన వాగ్భాణాలతో ఆనేకసార్లు వార్తల్లో నిలిచిన కంగన ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో నడుస్తున్న విడాకుల ట్రెండ్ మీద విరుచుకుపడింది. తరచుగా భారతీయతను ప్రస్తుతిస్తూ మాట్లాడే కంగన... ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని వివరించడం విశేషం. మన దగ్గర భార్యాభర్తల బంధాలు ఎంత బలమైనవో చెప్పేందుకు ఆమె పాశ్చాత్య దేశాలతో పోల్చారు. దీని కోసం తాజాగా పాప్ స్టార్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez) విడాకులు తీసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు.జెన్నిఫర్ లోపెజ్ మరో హాలీవుడ్ (Hollywood) టాప్ స్టార్ బెన్ అఫ్లెక్‌ను 2022లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా విడాకులు (Divorce) తీసుకున్నారు. తమ రెండేళ్ల వివాహాన్ని ముగించాలని లోపెజ్ పిటిషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 21న విడాకులు అమలులోకి వచ్చాయి. జనవరిలో లాస్ఏంజెలస్ కోర్టు ఆమోదించిన తర్వాత జెన్నిఫర్ లోపెజ్ తన పేరు నుండి ‘అఫ్లెక్‘ని తొలగించింది. నిజానికి లోపెజ్ పిటిషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం ముందే వారు విడిపోయారు. అంటే వీరిద్దరూ పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అఫ్లెక్‌కు మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ (Jennifer Garner)తో ముగ్గురు పిల్లలు, లోపెజ్కు మార్క్ ఆంథోనీతో కవల పిల్లలు ఉన్నారు.వీరి ఉదంతాన్ని కంగన తన ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్ లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ పాప్ ఐకాన్లలో ఒకరైన జెన్నిఫర్ లోపెజ్– బోలెడంత కీర్తి, పుష్కలంగా సంపద జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్న విషయాన్ని కంగన ఎత్తి చూపింది. ఎందరో మగాళ్లతో సంబంధాలు పెట్టుకుని పలు మార్లు పెళ్లిళ్లు చేసుకున్న లోపెజ్ ఇప్పుడు వయసు యాభై దాటాక కూడా సరైన జీవిత భాగస్వామిని వెదుక్కుంటూనే ఉందనే విషయాన్ని కంగన ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె సాంప్రదాయ భారతీయ వివాహాలను పాశ్చాత్యులు ఎగతాళి చేయడాన్ని తప్పుపట్టిం. 'వారు భారతీయ వివాహాలను ఎగతాళి చేసినప్పుడల్లా ఇది గుర్తుంచుకోవాలి. అత్యంత తెలివైన/మంచిగా కనిపించే నటుడు/చిత్రనిర్మాత/రచయిత, భూమిపై అత్యంత హాటెస్ట్ మ్యాన్ అని ఎందరో పొగిడే బెన్ అఫ్లెక్... పిల్లలు పుట్టినా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ పరిపూర్ణ భార్య కోసం ఎదురుచూస్తున్నాడనీ, అలానే జెన్నిఫర్ లోపెజ్ కూడా స్వీయ నిర్మిత ధనవంతురాలు, గొప్ప పాప్ స్టార్లలో ఒకరైనా ఇప్పటికీ ఓ పరిపూర్ణ వ్యక్తి కోసం వెతుకుతున్నారనీ... వీరిద్దరూ ఎవరికి వారే గొప్ప కాబట్టి వారికి ఎవరూ సరిపోరు కాబట్టి కొంతకాలానికే కనపడే లోపాలతో విసిగిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రమాణాలు చేసి, కొన్ని నెలల వ్యవధిలోనే బ్రతుకు జీవుడా అంటూ వ్యతిరేక దిశల్లో పరుగెత్తారు' అంటూ కంగన ఎద్దేవా చేసింది.ఈ సందర్భంగా కంగన తన వ్యక్తిగత అనుభవాల నుంచి తన పరిశీలనలను కూడా పంచుకుంది, పాశ్చాత్య సమాజం తరచుగా ‘పరిపూర్ణ‘ మ్యాచ్ కోసం శాశ్వత అన్వేషణను ఎంచుకుంటుందని వెల్లడించింది. అక్కడ వ్యక్తులు సాహచర్యాన్ని కనుగొనడానికి డేటింగ్ యాప్‌లపై ఆధారపడతారనీ, అయితే భారతీయ ఆచారాలు దీనికి విరుద్ధమని చెప్పింది. మన దేశంలో అపరిచితులను వివాహం చేసుకున్నా కూడా వృద్ధాప్యంలో ఒకరినొకరు చేతులు పట్టుకుని కలిసి నడిచే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని ఆమె పొగడ్తలు గుప్పించింది. చదవండి: నటుడి లవ్ మ్యారేజ్.. పిల్లల కోసం ఆలోచించేలోపు విడాకుల దిశగా..‘‘పాశ్చాత్య దేశాలలో సంబంధాలు తరచుగా తాత్కాలికంగా మారతాయనీ అయితే, భారతదేశంలో బలమైన సంప్రదాయాల పునాదులపై నిర్మించిన వివాహాలు జీవితకాలం కొనసాగుతాయనీ అన్నారామె. 80 ఏళ్ల వయస్సులో కూడా వృద్ధ జంటలు చేతులు జోడించి విహరించడాన్ని చూస్తున్న మనం పాశ్చాత్య ఆదర్శాలను ఆరాధించే బదులు, కాలక్రమేణా కొంత బలహీనపడినా మన స్వంత సాంస్కృతిక విలువలను పునరుద్ధరించుకోవాలనీ పాశ్చాత్య దేశాల నుంచి మార్గదర్శకత్వం పొందడం మానుకోవాలనీ హితవు చెప్పింది. గతంలో కూడా కంగన బాలీవుడ్ సినిమాల్లో వివాహ చిత్రణ గురించి తన ఆందోళనలను వ్యక్తం చేసింది. వివాహ సంబంధాల సారాంశాన్ని బాలీవుడ్ ప్రేమకథలు తప్పుగా సూచిస్తున్నాయని ఆమె విమర్శించింది.చదవండి: కొన్నేళ్లుగా మాటల్లేవ్.. విడాకులకు కారణం ఇదేనా?కంగన చివరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ చిత్రం చలనచిత్ర విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె తన తదుపరి చిత్రంలో మాధవన్‌తో కలిసి నటిస్తోంది. -
కెరీర్లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!
బాలీవుడ్ హీరో గోవింద -సునీత దంపతుల విడాకుల పుకార్లు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టారన్నవార్తల్లో వాస్తవం లేదంటూ నటుడు ఈ ఊహగానాలను కొట్టిపడేశారు. అయితే, గోవిందతోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా మంది గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని మీకు తెలుసా? స్టాండ్-అప్ కమెడియన్ కృష్ణ అభిషేక్ , టీవీ టెలివిజన్ నటి రాగిణి ఖన్నా చాలామంది నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా టెలివిజన్‌లో తన తొలి సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నటి సౌమ్య సేథ్ గోవిందాకు మేనకోడలు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నప్పటికీ, ఏ అభిమాని ఆమెను మరచిపోలేరు. వైవాహిక జీవితంలోకి అడుగపెట్టాక అంతులేని కష్టాలు మొదలయ్యాయి. భరించలేని గృహహింస, విడాకులు ఇన్ని కష్టాల మధ్య తనను తాను నిలబెట్టుకుని రాణిస్తోంది? అయితే ఎందుకు గ్లామర్ ప్రపంచానికి దూరమైంది? సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.సౌమ్య సేథ్ 1989 అక్టోబర్ 17న బనారస్‌లో జన్మించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందింది. గోవింద మేనకోడలిగా సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగాయి. భాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలో ఆమె ఒక అతిధి పాత్రలో నటించింది. ఆ తరువాత 2011లో ‘నవ్య… నయే ధడ్కన్ నయే సవాల్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి, నవ్య పేరుతో పాపులర్ అయింది. మహిళా విభాగంలో ఆమె బిగ్ టెలివిజన్ అవార్డులను అందుకుంది. ఆమె తరువాత దిల్ కీ నజర్ సే ఖూబ్సూరత్ అనే షోలో టైటిల్ రోల్లో నటించింది. 2013లో MTV వెబ్‌బెడ్‌ను కూడా నిర్వహించింది, తరువాత చక్రవర్తి అశోక సామ్రాట్ అనే షోలో 'కరువాకి' పాత్రను పోషించింది. ఇలా కెరీర్లో పీక్‌లో ఉండగానే2017లో అమెరికాకు చెందిన నటుడు అరుణ్ కపూర్‌ను వెస్టిన్ ఫోర్ట్ లాడర్డేల్ బీచ్ రిసార్ట్‌లో వివాహం చేసుకుంది తరువాత అమెరికాలో స్థిరపడింది. వీరికి ఒక కొడుకు ఐడెన్ పుట్టాడు.ఇదీ చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?“నేను అద్దం ముందు నిలబడినపుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. ఒళ్లంతా గాయాలు.క డుపుతో ఉన్నా కూడా చాలా రోజులు తినలేదు. అసలు కొన్ని రోజులు అద్దం వైపు చూసే ధైర్యం చేయలేకపోయాను. ఒక దశలో చచ్చిపోదామనుకున్నా. కానీ నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి? తల్లి లేకుండా ఎలా బతుకుతుంది? నేను నన్ను నేను చంపుకోగలను కానీ.. బిడ్డ ఎలా? ఈ ఆలోచనే నాకొడుకు ఐడెన్, నా ప్రాణాన్ని కాపాడింది." అని తెలిపింది. చివరికి పెళ్లైన రెండేళ్లకు 2019లో విడాకులు తీసుకుని ఆ కష్టాల నుంచి బైటపడింది. మరోవైపు ఈ కష్టకాలంలో సౌమ్య సేథ్‌కు తల్లిదండ్రులు వర్జీనియాకు వెళ్లి అండగా నిలిచారు. అలా 2023లో, సౌమ్య ప్రేమకు మరో అవకాశం ఇచ్చి ఆర్కిటెక్ట్ , డిజైనర్ శుభం చుహాడియాను వివాహం చేసుకుంది. తరువాత 33 ఏళ్ల వయసులో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. వర్జీనియాలో లైసెన్స్ పొందిన రియల్టర్‌గా రాణిస్తోంది. తన తండ్రి, తాత వ్యాపార దక్షతను చూసి తాను కూడా వ్యాపారవేత్త కావాలనే కలలు కనేదాన్నని, చివరికి తన కల నెరవేరిందని ఒక సోషల్‌మీడియా పోస్ట్ ద్వారా చెప్పింది సౌమ్య.సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ ఆమె ధైర్యానికి, దృఢత్వానికి చక్కటి నిదర్శనం. కెరీర్ కోల్పోయినా, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన తలొగ్గక, తనను తాను ఉన్నతంగా నిలబెట్టుకుంది.తద్వారా లక్షలాది మందికి ప్రేరణగానిలిచింది. -
విడాకులు తీసుకుంటున్నామని ప్రచారం చేశారు: ఆది పినిశెట్టి
ఆది పినిశెట్టి- డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'శబ్దం'.. 'వైశాలి' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇందులో సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ కార్యక్రంలో భాగంగా మీడియాతో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) పలు విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో విడాకుల రూమర్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు.హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ మలుపు చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించారు. ఈ ప్రయాణంలో స్నేహం కాస్తా ప్రేమగా మారడం.. ఆపై నిక్కీనే ఆదికి ప్రపోజ్ చేయడం జరిగిపోయింది. అలా ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటి అయ్యారు.అయితే, విడాకుల రూమర్స్ గురించి ఆది పినిశెట్టి ఇలా రియాక్ట్ అయ్యారు. నిక్కీ తనకు స్నేహితురాలు కావడంతో పెళ్లి విషయంలో ఇంట్లో ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. అలా చాలాబాగా అందరితో ఆమె కలిసిపోయింది. 'మేము సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటే.. కొందరు విడాకులు తీసుకుంటున్నామని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్‌లో కథనాలు కూడా వచ్చాయి. అలాంటివి చాలానే మా వరకు వచ్చాయి. అలాంటి వారిని ఏం అనాలో కూడా అర్థం కాదు. ఒక్కోసారి బాగా కోపం కూడా వస్తుంది. వారి యూట్యూబ్ ఛానల్స్‌లలో పాత వీడియోలను చెక్ చేస్తే.. అన్నీ ఇలాంటి రూమర్స్ వార్తలే ఉన్నాయి. వ్యూస్ కోసం వాళ్లు ఈ దారి ఎంచుకున్నారని అర్థం అయింది. వాళ్లను పట్టించుకోకపోవడమే మంచిదని వదిలేశాను. కానీ, వాళ్ల బాగు కోసం ఇతరుల జీవితాలను రోడ్డున పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఒకసారి వారు ఆలోచించుకోవాలి.' అని ఆయన అన్నారు. -
ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే: గోవిందా మేనేజర్
బాలీవుడ్ పాపులర్ జోడీ గోవింద, సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 37ఏళ్ల వీరి వైవాహిక బంధం బీటలు వారిందని, విడాకులు తీసుకోనున్నారని కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, తాజాగా ఈ విషయంపై నటుడు గోవిందా రియాక్ట్ అయ్యారు.తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో గోవిందాకు విడాకుల ప్రశ్న ఎదురైంది. కొద్దిరోజుల నుంచి తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఆయన మేనేజర్ ఇలా చెప్పాడు. 'ఫ్యామిలీలో కొంతమంది చేసిన కామెంట్ల వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. వారి మధ్య విభేదాలు నిజమే. అయితే, విడాకులు తీసుకునేంత పెద్దవి మాత్రం కాదు. ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహజమే.. అవి వారిద్దరే పరిష్కరించుకుంటారు.' అని ఆయన పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితం గోవిందా సతీమణి సునీత అహుజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవింద, తాను వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. ఆపై తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నామని చెప్పడంతో విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. వచ్చే జన్మ ఉంటే ఆయనకు భార్యగా ఉండాలని కోరుకోవడం లేదని ఆమె చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా తన జీవితాన్ని పనికే అంకితం చేశారని ఆమె అన్నారు. గోవింద, సునీతలకు 1987లో వివాహం అయింది. వీరికి టీనా అహుజా, యశోవర్ధన్ అహుజా పిల్లలు ఉన్నారు. 37 ఏళ్ల తర్వాత వారిద్దరు విడిపోతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!
ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్, హీరో జయం రవి.. ఇలా తదితరులు ఏళ్లకు ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ నటుడు చేరినట్లు తెలుస్తోంది.అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న గోవిందా.. ప్రస్తుతం పెద్దగా లైమ్ లైట్ లో లేడు. ఇతడే తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడట. గోవిందా, ఇతడి భార్య సునీత అహుజా.. గత కొన్ని రోజుల నుంచి వేర్వురుగా ఉంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)కొంతకాలంగా గోవిందా దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయని, దీంతో ఇక విడాకులు తప్పనిసరి అనుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గోవిందా.. ఓ మరాఠీ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, భార్య నుంచి విడిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పటివరకైతే ఈ జంట.. విడాకుల అంశంపై స్పందించలేదు. కానీ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత కూడా.. భర్త గోవిందాతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి మాత్రమే ఉంటున్నానని పేర్కొంది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే విడిగా ఉంటున్నారని అర్థమైంది. త్వరలో విడాకుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి. 1987లో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోగా.. 1988లో కూతురు పుట్టిన తర్వాతే పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు సాంకేతికతా మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి మరింతగా మారుతోంది. దైనందిన వ్యవహారాలలో చిత్రవిచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనేవిధమైన అలవాట్లు, పద్ధతులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్లవలసిందే! ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్ డివోర్స్ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. అంటే మరేంటో కాదు... రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకుని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్ డివోర్స్ అంటారు.రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్ డివోర్స్‌తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. లాభనష్టాలు రెండూ ఉంటాయి!దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహబంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండు ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. ఎవరి వెర్షన్ వారిదే... నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజూ కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్‌పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరూ నష్టపోయే పని ఏం ఉండదని కొందరి వాదన. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్‌ఫోన్ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్‌గా టూర్లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు. ఈ స్లీప్ డివోర్స్ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్ర΄ోవడానికి విడివిడి గదులను లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య...భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకుల అంచనా. ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటినిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్‌ను బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్‌పై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా పడుకున్నట్టు అనేక జంటలు చెప్పారు. -
అమ్మానాన్న విడిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నా: నటి
పేరెంట్స్ విడాకుల వల్ల తను సంతోషంగానే ఉన్నానంటోంది నటి కావేరి కపూర్ (Kaveri Kapur). కాకపోతే అది తర్వాతి కాలంలో తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్తోంది. డైరెక్టర్ శేఖర్ కపూర్- నటి, సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi)ల కూతురే కావేరి. బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ అనే హిందీ సినిమాతో వెండితెరకు నటిగా పరిచయమైంది.విడాకులు తీసుకున్నప్పుడు హ్యాపీనేతాజాగా ఓ ఇంటర్వ్యూలో కావేరి మాట్లాడుతూ.. అమ్మానాన్న విడిపోయినప్పుడు నేనంతగా బాధపడలేదు. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ రానురానూ తేడా గమనించాను. పేరెంట్స్ విడాకులు నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి. పెద్దయ్యే కొద్దీ మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను.ఇప్పటికీ మానసికంగా..ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఇదొక ప్రక్రియలా కొనసాగుతోంది. అలాగే నాకు ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. ప్రస్తుతం వీటన్నింటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. పూర్తిగా బయటపడేందుకు ఇంకాస్త సమయం పడుతుందని భావిస్తున్నాను. శేఖర్ కపూర్- సుచిత్ర కృష్ణమూర్తి 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2001లో కావేరి జన్మించింది. 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2007లో విడాకులు తీసుకున్నారు.చదవండి: ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి -
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ విడాకులు.. తాజా పోస్ట్‌తో క్లారిటీ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మపై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన భర్త, టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలో నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన పోస్టులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన బామ్మ, తాతయ్యల ఇంటికెళ్లిన ధనశ్రీ నిజమైన ప్రేమ అంటే ఇదేనంటూ ఫోటోలను షేర్ చేసింది. అంతే చాహల్ సైతం తన భార్యతో దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించాడు. దీంతో ఈ జంట దాదాపు విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ వర్మ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. "ఒత్తిడి నుంచి ఆశీర్వాదం లభించింది. దేవుడు మన చింతలను, పరీక్షలను ఎలా ఆశీర్వాదాలుగా మార్చగలడనేది ఆశ్చర్యంగా లేదా? మీ జీవితంలో ఏ రోజైనా ఒత్తిడికి గురైతే.. మీకు మరో ఛాయిస్ ఉంటుందని తెలుసుకోండి. మీరు బాధలను అన్నింటినీ ఆ దేవునికి వదిలేయండి. అన్ని విషయాల గురించి కలిసి ఆ దేవుడిని ప్రార్థించండి. దేవుడు మీరు ఉంచిన విశ్వాసం మీకు ఎప్పుడు మంచి చేస్తుంది.' అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇటీవల యుజ్వేంద్ర చాహల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో భగవంతుడే మనల్ని రక్షిస్తాడంటూ పోస్ట్‌ను పంచుకున్నారు. నేను లెక్కించగలిగిన దానికంటే ఎక్కువ సార్లు ఆ దేవుడు నన్ను రక్షించాడు.. నాకు తెలియకుండా నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు దేవా అంటూ పోస్ట్ చేశారు. తాజా పోస్ట్‌లతో ధనశ్రీ వర్మ, చాహల్ విడిపోవడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. విడాకులపై అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీరిద్దరు డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు
న్యూఢిల్లీ: వివాహ బంధం ముగిసినంత మాత్రాన జీవితమే అయిపోయినట్లు కాదని, ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించాలని విడాకుల జంటను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను ఉద్దేశించి జస్టిస్ పీబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని బెంచ్(SC Bench) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘ఈ కేసులో విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటది(Divorce Couple) చిన్నవయసే. ఇలాంటి వాళ్లకు బోలెడంత భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్గు గురించి వాళ్లు ఆలోచించుకోవాలి. వివాహ బంధం ముగిసినంత మాత్రాన..వాళ్ల జీవితాలు అయిపోయినట్లు కాదు. వాళ్లు కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ముందుకు సాగాలి’’అని న్యాయమూర్తులు సూచించారు .ఈ కేసులో వివాహం జరిగినా ఏడాదిలోపే ఆమె తిరిగి పుట్టింటికి పెళ్లడం దురదృష్టకరం. విడాకుల తర్వాతైనా ప్రశాతంగా జీవించండి అని ఆ జంటకు సూచించింది ధర్మాసనం.కేసు నేపథ్యం..2020 మే నెలలో మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన యువకుడికి, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులతో కొన్ని నెలలకే తిరగకముందే ఆమె పుట్టింటికి చేరింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. బదులుగా ఆ భర్త కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. అలా.. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.అలా చేస్తే సాగదీయడమే!వీళ్ల విడాకుల వ్యవహారం సుప్రీం కోర్టు(Supreme Court)కు చేరింది. అయితే ఇలా పోటాపోటీగా కేసులు వేయడం.. విడాకుల వ్యవహారాన్ని సాగదీయడమే అవుతుందని ఇరుపక్షాల లాయర్లతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేసులు ఉపసంహరించుకుంటామని వాళ్లు తెలిపారు. అదే సమయంలో ఆ జంట కలిసి జీవించే పరిస్థితులు లేవని.. ఆర్టికల్ 142 ప్రకారం విస్తృత అధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆరు నెలలు కూడా ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఆ నిరీక్షణ గడువును ఎత్తేయొచ్చు. ఈ కారణం కింద వారి ఆ పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు సాధ్యమే. ఇందుకు ఆర్టికల్ 142 కింద కోర్టుకు అధికారం ఉంటుంది::: జనవరి 06 2025 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు -
తలాక్ అంటే..? ఈ వివరాలు తెలుసా?
దివ్య ఖుర్ఆన్ ఇలా చెబుతోంది...తమ భార్యలను ముట్టుకోము అని ఒట్టు పెట్టుకునే వారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. 2:226వివరణ: పండితుల ప్రకారం షరిఅత్ పరిభాషలో దీనిని ‘ఈలా’ అని అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సుహృద్భావ పూర్వకంగా ఉండవు. అపశ్రుతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఉభయలు చట్టబద్ధంగానైతే దాంపత్య బంధంలోనే ఉంటూ క్రియాత్మకంగా ఇద్దరు భార్యాభర్తలు కానట్టుగానే వేరుగా మసులుకునేటటువంటి విధానాన్ని దైవ శాసనం (షరిఅత్) ఇష్టపడదు. ఇలాంటి అపసవ్యత కొరకు అల్లాహ్ నాలుగు నెలలు గడువు నిర్ణయించాడు. ఈ మధ్యకాలంలో వారు తమ సంబంధాలను సరి చేసుకోవాలి లేదా దాంపత్య బంధాన్నైనా తెంచి వేయాలి. అప్పుడైనా ఆ ఇరువురు పరస్పరం స్వేచ్ఛ ఉంది తమకు కుదురుగా ఉన్న వారితో పెళ్లి చేసుకోగలరు. తన భార్యతో దాంపత్య సంబంధం కలిగి ఉండనని భర్త ఒట్టు పెట్టుకున్న సందర్భానికే ఈ ఆదేశం వర్తిస్తుంది. పోతే ఒట్టు పెట్టుకోకుండా భార్యతో సంబంధాలను తెంచుకునే సందర్భంలోనయితే– అలా ఎంత కాలం సాగినా ఈ ఆదేశం దానికి అతకదని ఈ (ఆయత్) వాక్యం ఉద్దేశం.మరొక విషయం ఏమిటంటే ప్రమాణం చేసినా, చేయకపోయినా రెండు సందర్భాల్లోనూ బంధాన్ని విరమించుకుంటే దానికి గడువు కాలం ఈ నాలుగు మాసాలే. ఈ ఆదేశం కేవలం ఏవైనా మనస్పర్ధల వల్ల ఏర్పడే సంబంధాల ప్రతిష్టంబనకు వర్తిస్తుంది. కానీ మరేదైనా కారణంగా భర్త భార్యతో శారీరక సంబంధాన్ని విరమించుకుంటే సాధారణ సంబంధాలు సుహృద్భావ పూర్వకంగా కొనసాగే పక్షంలో ఈ ఆదేశం వర్తించదు. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని తెంచివేసే ఏ ప్రమాణమైన సరే అది ఇలా పరిగణించబడుతుంది. ఇది నాలుగు నెలలకు పైగా నిలవరాదు. ఇష్టంలేని పక్షంలోనైనా ఇష్టపూర్వకంగానైనా సరే.ఒకవేళ వారు వెనక్కి మరలినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయ చూపేవాడు: 2:227కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గడువు లోపల తమ ప్రమాణాన్ని భగ్ననపరిచి తిరిగి దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే వారికి ప్రమాణ భంగం చేసినందుకు ప్రాయశ్చిత్తం లేదు. అల్లాహ్ అట్టే క్షమించి వేస్తాడు.మరికొంతమంది పండితుల అభిప్రాయంలో ప్రమాణభంగానికి ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటుంది. వారనేది ఏమిటంటే దేవుడు ‘గఫూరుర్రహీం’ (మన్నించేవాడు కరుణించేవాడు) అన్న విషయానికి భావం ప్రాయశ్చిత్తం మాఫీ జరిగిందని కాదు మీ ప్రాయశ్చితాన్ని స్వీకరిస్తాడని, సంబంధ విరామ కాలంలో ఇరువురు పరస్పరం చేసుకున్న అన్యాయాన్ని మన్నించి వేయడం జరుగుతుందని మాత్రమే.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
తను కేసు పెడితే... మీరే జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
నాకు ఇటీవలే పెళ్లయింది. నా భార్యకి నాకు పెళ్ళికి ముందు 7 నెలల పరిచయం ఉంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. కట్నంగా 5లక్షల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాను. పెళ్ళి వరకు అంతా బాగానే ఉంది కానీ, తర్వాత తన ప్రతి చిన్న దానికి గొడవ చేస్తుంది. తనకి అందం మీద ఉన్న శ్రద్ధ నా మీద, నా కుటుంబం మీద లేదు. ఊరికే ఫోటోలు దిగుతూ ఉంటుంది. స్కార్ఫ్ కట్టుకోమంటే కట్టుకోను అంటుంది. గొడవ పడిన ప్రతిసారి తలబాదుకుని నేను ఫిజికల్ అబ్యూస్ చేశాను అని వాళ్ళ కుటుంబ సభ్యులతో చెబుతుంది. అందంగా ఉంది, బాగానే సంపాదిస్తుంది అని పెళ్లి చేసుకున్నాను. అందం డబ్బు ఉంటే సరిపోదు, మాట వినే భార్య కూడా అయి ఉండాలి అని అర్థమైంది. మేమిద్దరం ఉద్యోగస్తులమే. నా జీతం 40,000. ఎం.బీ.ఏ చదివాను. తన జీతం 60,000. తను ఎం.సీ.ఏ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఇంట్లో ఖర్చులకు తన జీతం పైసా కూడా ఇవ్వను అంటుంది. తన పెత్తనమే నడవాలి అంటుంది. ఎప్పుడూ తనని పొగుడుతూ ఉండాలి. తనకి నేను కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేకపోతున్నాను. విడాకులు తీసుకోవాలి అంటే కనీసం సంవత్సరం ఆగాలి అని ఎక్కడో చదివాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.– ఆదినారాయణ, గుంటూరుఏమిటి? ఐదు లక్షలు వరకట్నం తీసుకున్న మీరు, మీ భార్య మంచిది కాదు, సద్గుణాలు లేవు, నన్ను హరాస్ చేస్తోంది అంటున్నారా? హాస్యాస్పదంగా లేదూ? పైగా కట్నం డబ్బులు ఫోన్‌పే ద్వారా తీసుకున్నారు కదా... తను కేసు పెడితే జైలుకు వెళ్తారేమో చూసుకోండి!ఇకపోతే... విడాకుల గురించి మీరు చదివింది నిజమే. హిందూ వివాహ చట్టం ప్రకారం కనీసం ఒక సంవత్సరం గడవకుండా విడాకుల కోరడం కుదరదు. పరస్పర ఒప్పందంతో విడిపోవాలి అనుకున్నా గాని కనీసం ఒక సంవత్సరం విడివిడిగా ఉంటున్నట్లు చూపించాలి.మీ భార్య ఫోటోలు ఎక్కువ దిగుతుంది, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోమంటే వినడం లేదు, తన పెత్తనం నడవాలి అంటుంది, జీతం కూడా నాకు ఇవ్వడం లేదు అని మీరు రాసిన ఈ–మెయిల్ చదివిన తర్వాత, కౌన్సెలింగ్ మీ భార్యకి కాదు మీకు అవసరం అనిపించింది. భార్య మీతో సమానం, మీరు చెప్పినట్లు వినడానికి తను మీ బానిస కాదు. ఇది మీకు తెలిసినట్లుగా లేదు. ఏ విధంగా చూసుకున్నా మీకన్నా తనకే మెరిట్ ఎక్కువ కదా... మీరెందుకు మీ జీతం ఆవిడకి ఇచ్చి ఇంటిని నడపమని చెప్పరు? ఇంటికి యజమాని పురుషుడు మాత్రమే అని అనుకుంటున్నారా? కనీసం మీ మాట తను వినట్లేదు, జీతం ఇవ్వడం లేదు అనకుండా ‘‘కుటుంబ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు పంచుకోవడం లేదు’’ అనివుంటే నేను బహుశా ఆవిడ వైపు నుంచి కూడా చాలానే తప్పు ఉంది అని అనుకునేవాడిని. చాలామంది పురుషులలో – పురుషుల తల్లిదండ్రులలో కూడా ఈ పురుషాధిక్య భావాలు ఇంకా వుండటం బాధాకరం. మీరు పంపిన ఈ–మెయిల్‌ని బట్టి చూస్తే అందులోని విషయాలు గృహహింస చట్టం – వరకట్న నిషేధ చట్టం కింద నేరాలే! తనది కూడా ఎంతో కొంత తప్పు ఉంది అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో మీకు నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే: ఇద్దరూ కలిసి మంచి ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకోండి. తప్పు ఎవరిదైనా సరిచేసుకొని హాయిగా వైవాహిక జీవనాన్ని సాగించండి. అప్పటికీ కుదరకపోతే సామరస్యంగా విడిపోండి. ఆౖన్‌లైన్‌లో కట్నం తీసుకున్నారు కాబట్టి కేసులు మీ మీద వేస్తే మీకే నష్టం! -
టెక్ బిలియనీర్ లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్‌తో లవ్? కానీ పెళ్లి మాత్రం!
ఆధార్ ఖర్చుపై సంచలన వ్యాఖ్యల్ని చేసిన హాట్‌మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో సబీర్ భాటియా ఆధార్ సహా టెక్నాలజీ అంశాలపై కీలక విషయాలు ప్రస్తావించారు. ఆధార్ కోసం చేసిన (1.3 బిలియన్ల ఖర్చును వృథా అని చెప్పడంతోపాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా అతని లవ్ స్టోరీ, పెళ్లి విడాకులు లాంటి అంశాలు నెట్టింట సందడిగా మారాయి. బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు, చాలామంది స్టార్లతో డేటింగ్ చేయడం మొదలు, చాలా మంది మహిళలు తన పట్ల ఆకర్షితులయ్యేవారని, పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండేవారని సబీర్ భాటియా చెప్పుకొచ్చాడు. అయితే వీటన్నంటికీ భిన్నంగా తన కుటుంబ స్నేహితురాలు, బైద్యనాథ్ గ్రూప్‌కు చెందిన తాన్యా శర్మతో ప్రేమలో పడినట్టు వెల్లడించాడు. (బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు)సబీర్ భాటియా చెప్పిన వివరాల ప్రకారం తాన్య శర్మ కుటుంబంతో తమ కుటుంబానికి ఎనిమిదేళ్లుగా పరిచయం. ఈ పరిచయంతోనే రెండు కుటుంబాలు తమ స్నేహాన్ని కుటుంబ సంబంధంగా మార్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే నిజానికి సబీర్ తాన్యను ప్రేమిస్తున్నప్పటికీ, ఆమెను కోడలిగా తెచ్చుకోవాలనే కోరిక మాత్రం తల్లిదే. తల్లి కోరిక మేరకు ఆమెతో మాట్లాడిన తరువాత, ఆమె ప్రేమలో పడటం, జీవితాంతం ఆమెతో గడపాలని భావించాడు.దీంతో వీరి పెళ్లి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. సబీర్ భాటియా, తాన్య శర్మ జంట 2007, డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు.ఆ తర్వాత మలేషియాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2008, మార్చి 9న, మలేషియాలోని ప్రసిద్ధ లంకావి ద్వీపంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. దాదాపు 270 మంది ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. ఈ పెళ్లి కోసం సబీర్ మొత్తం లంకావి ద్వీపాన్నే బుక్ చేసుకున్నాడట.పెళ్లైన కొన్నాళ్లకు వీరికి ఒక పాప పుట్టింది. ఈ పాపకు 'అరియాన్నా' అనే పేరు పెట్టారు. తాన్యా గుడ్‌కేర్ ఫార్మాకు డైరెక్టర్ (బైద్యనాథ్ గ్రూప్ సోదరి సంస్థ గుడ్‌కేర్ ఫార్మా)గా ఉన్నారు. తాన్యా ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి కోర్సును కూడా చదివింది.అయితే పెళ్లైన ఐదేళ్లకు వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. 2013లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కోర్టులో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అరియాన్నా చిన్నది కనుక ఆమె కస్టడీ హక్కులు తల్లి తాన్యా శర్మకు అప్పగించారు. ఐశ్వర్యారాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట!అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట సబీర్. ఈ విషయంలో నటుడు సల్మాన్ ఖాన్‌తో పెద్ద పోటీయే ఉండేదట. 2001లో ఒక పార్టీలో వీరిద్దరి మధ్యా ఘర్షణ జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ పుకార్లను మీడియా ఊహాగానాలుగా భాటియా తోసిపుచ్చాడు.కాగా సబీర్ భాటియా 1996లో హాట్‌మెయిల్‌ను సృష్టించడం ద్వారా ఇమెయిల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. తన వ్యాపార భాగస్వామి జాక్ స్మిత్‌తో కలిసి, భాటియా తొలి వెబ్ ఆధారిత ఇమెయిల్ సేవలలో ఒకదాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్థాపించిన 18 నెలలకే దీన్ని అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్‌కు విక్రయించాడు. దీంతో రాత్రికి రాత్రే వేలకోట్లకు అధిపతియ్యాడు. ఈసొమ్ముతో మరిన్ని కంపెనీలను నిర్మించాడు. ఇది టెక్నాలజీ రంగంలో అతిపెద్ద, గేమ్-ఛేంజింగ్ ఒప్పందాలలో ఒకటిగా టెక్ వర్గాలు భావించాయి. ఈ డీల్ ద్వారా సబీర్ రూ. 3300 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. దీన్నే ఇపుడు ఔట్‌లుక్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం సబీర్ భాటియా AI-ఆధారిత అభ్యాస వేదిక, షోరీల్కు నాయకత్వం వహిస్తున్నాడు. -
బలహీనపడుతున్న వివాహ బంధం
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది నిన్నటితరం వరకు దంపతులు అనుసరించిన జీవనమార్గం.. కానీ నేటి ఆధునిక కాలంలో ఈ సామెత దంపతులందరికీ వర్తించట్లేదని ఇటీవలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఏటేటా విడాకుల కేసులు పెరుగుతున్నాయని ఫ్యామిలీ కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది కేసులు చెప్పకనే చెబుతున్నాయి. జీవితాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోవాలన్న ఆలోచన, వివాహ బంధంలో అసంతృప్తి, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ వంటి కారణాలతో జంటలు విడిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జంటలైతే ఏడాది, రెండేళ్లలోపే వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నాయని అంటున్నారు. వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. గతేడాది ఏప్రిల్ వరకు అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే విడాకుల శాతంలో దేశంలోనే ఏడో స్థానంలో తెలంగాణ నిలిచింది.విడాకుల శాతం పెరగడానికి ప్రధాన కారణాలు...» దంపతుల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం» కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు» వైవాహిక బంధంలో భావోద్వేగాలు కొరవడటం» పరస్పర నమ్మకం సన్నగిల్లడం» జీవితంపై అసంతృప్తి, అభద్రతాభావం తీవ్రం కావడం» భిన్నమైన కుటుంబ నేపథ్యాలు కలిగి ఉండటం» స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడంè ఉద్యోగులైన భార్యాభర్తల పనివేళల్లో అంతరాలు ఉండటం» మద్యపానం, ధూమపానం అలవాట్లువిడాకుల కేసుల గణాంకాలు..» 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.» ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కేసులే. వాటిలోనూ 3 వేల కేసులు పెళ్లయిన ఏడాదిలో దాఖలైనవే.» 2018లో 2,250 కేసులు దాఖలవగా 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి.» గత పదేళ్లలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో విడాకుల శాతం 350 శాతం పెరిగింది. అదే సమయంలో పంజాబ్, హరియాణాలలో 150 శాతం విడాకుల కేసుల్లో పెరుగుదల కనిపించింది.» గత ఐదేళ్లలో ఢిల్లీలో డివోర్స్ల శాతం రెండింతలయ్యింది.‘కాబోయే వధూవరుల మధ్య హేతుబద్ధమైన చర్చలు, వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన అభిప్రాయాల మార్పిడి జరగకపోవడం విడాకుల కేసుల పెరుగుదల ప్రధాన కారణాల్లో ఒకటి. ఇద్దరి అభిప్రాయాలు, జీవనశైలి, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, జీతాలు వంటి వాటిపై వాస్తవ విషయాల గురించి విడమరిచి చర్చించుకోకపోవడం, కుటుంబాల స్థిరచరాస్తులు, వేతనాలు, చదువులు వంటి విషయాల్లో అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం వంటివి పెళ్లి అయ్యాక బయటపడుతున్నాయి. దీంతో ఇరు కుటుంబాలు, దంపతుల మధ్య ఘర్షణ మొదలవుతోంది. అమ్మాయి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నా కుటుంబానికి, భర్తకు ఎక్కువ సేవ చేయాలని అత్తామామలు ఆశించడం, ఆమె సంపాదనంతా తమకు ఇవ్వాలని పట్టుబట్టడం, ఆర్థిక విషయాల్లో భేదాభిప్రాయాలు పెరగడం ఘర్షణలకు కారణమవుతున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్అమ్మాయి, అబ్బాయి పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉండటం, వివాహ వ్యవస్థ గురించి స్పష్టమైన అవగాహన, అభిప్రాయాలు లేకపోవడం వంటివి విడాకుల శాతం పెరగడానికి కారణ మవుతోంది. జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చాక చోటుచేసుకోబోయే మార్పు చేర్పులపై భయాందోళనలు, ఇద్దరి మధ్య అపార్థాలు పెరగడం, కొత్త ప్రదేశంలో, కొత్త కుటుంబంలో అమ్మాయి కుదురుకోకపోవడం ప్రభావం చూపుతోంది. – కొండపాక సంపత్‌కుమార్, మీడియేషన్ సెంటర్, సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్2024 ఏప్రిల్ నాటికి వివిధ రాష్ట్రాలవారీగా అత్యధిక విడాకుల కేసులు (శాతాల్లో)మహారాష్ట్ర 18.7 కర్ణాటక 11.7యూపీ 8.8పశ్చిమ బెంగాల్ 8.2ఢిల్లీ 7.7తమిళనాడు 7.1తెలంగాణ 6.7కేరళ 6.3 -
ఏడాదిలోగా విడాకులివ్వలేం
ప్రయాగ్‌రాజ్: హిందూ వివాహ చట్టం ప్రకారం.. హిందూ మతంలో వివాహ బంధానికి ఎంతో పవిత్రత ఉందని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. హిందూ దంపతులకు పెళ్లయిన ఏడాదిలోనే విడాకులు మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప వారికి విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. పవిత్రమైన వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయలేమని వెల్లడించింది. తమకు విడాకులు మంజూరు చేయాలంటూ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ దోనాది రమేశ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హిందూ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేయాలంటే వివాహమైన తర్వాత కనీసం ఏడాదిపాటు ఆగాలని హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14 సూచిస్తున్నట్లు వెల్లడించింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందని సూచించింది. నిశాంత్ భరద్వాజ్, రిషికా గౌతమ్ అనే దంపతులు పెళ్లయిన సంవత్సరంలోగానే పరస్పర అంగీకారంతో విడాకుల కోసం తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వారి దరఖాస్తును కింది కోర్టు తిరస్కరించడంతో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కోసం సంవత్సరంలోగా దరఖాస్తు చేయడం చెల్లదని, దాన్ని తాము విచారించబోమని హైకోర్టు వెల్లడించింది. -
చంపేంత కోపం.. చచ్చేంత ప్రేమ.. పుకార్లకు ఒబామా దంపతుల ఫుల్స్టాప్ (ఫొటోలు)
-
విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్ ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కారు. సతీమణి మిషెల్లీ నుంచి ఆయన విడిపోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకు గత కొంతకాలంగా మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలే కారణం. కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు బలం చేకూర్చింది. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు. పైగా జనవరి 9వ తేదీన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల వాళ్ల సతీమణులంతా(మాజీ ప్రథమ మహిళలు) హాజరయ్యారు. అయితే ఒబామా(Obama) మాత్రం ఒంటరిగానే ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు. దానికి కొనసాగింపుగా.. జనవరి 20వ తేదీన వైట్‌హౌజ్(White House)లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి తాను హాజరు కావట్లేదని తన కార్యాలయం నుంచి మిషెల్లీ ఒక ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆ ఈవెంట్‌కు ఒబామా ఒంటరిగానే హాజరవుతారనే కథనాలు ఒక్కసారిగా విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చాయి.There are strong rumors circulating about a possible divorce between Michelle "Big Mike" Obama and Barack Obama. Speculation is growing as Michelle has already missed Jimmy Carter’s funeral and will once again be skipping Donald Trump’s upcoming inauguration, which Barack will… pic.twitter.com/qP3V7jqh14— Shadow of Ezra (@ShadowofEzra) January 16, 2025 I think Barack and Michelle Obama are heading for divorce. His letters talking about how he fantasizes about sex with men "every day" had to be the icing on the cake for her. What woman wants to deal with that, especially in the public eye?— Freedom Party! (@DavidJo1960) January 14, 2025వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో గత ఐదారు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్‌కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్ ఒబామా. జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి లవ్ యూ అంటూ సందేశం ఉంచారాయన. దానికి అంతే స్పీడ్‌గా లవ్ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్‌కు ఒకేసారి ఇద్దరూ చెక్ పెట్టారన్నమాట.Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life's adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4— Barack Obama (@BarackObama) January 17, 2025చికాగోలో ఓ పంప్ ఆపరేటర్-గృహిణి దంపతులకు జన్మించారు మిషెల్లీ. ఓ లా కంపెనీలో ఒబామా-మిషెల్లీ తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రేమను బయటపెట్టుకుని.. వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23). అమెరికా హైప్రొఫైల్ జంటల్లో.. వన్ ఆఫ్ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు. Happy anniversary, @MichelleObama! 32 years together, and I couldn’t have asked for a better partner and friend to go through life with. pic.twitter.com/04t41YYfN6— Barack Obama (@BarackObama) October 3, 2024అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాకు తెప్పించేదని.. ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషెల్లీ ఓ పాడ్‌కాస్ట్‌లో సరదాగా మాట్లాడడం చూసే ఉంటారు. అయితే ఎన్ని కష్టకాలమైనా.. ఆమె తన వెంటే నడిచిందని, బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తోందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదులిచ్చేవారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో తొలిసారి! -
ఒబామా దంపతులు విడిపోనున్నారా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్, ఆయన భార్య మిచెల్ ఒబామా(60) తమ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారా? సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బరాక్ ఒబామా ఒక్కరే హాజరురవుతారంటూ ఈ దంపతుల కార్యాలయం చేసిన ప్రకటనలే ఇందుకు బలం చేకూరుస్తోంది. అధికార కార్యక్రమానికి భర్త బరాక్ ఒబామాతో కలిసి మాజీ ప్రథమ మహిళ మిచెల్ గైర్హాజరవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నివాళి కార్యక్రమంలో సైతం మిచెల్ పాల్గొనలేదు. అమెరికా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు సతీసమేతంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, లారా బుష్ దంపతులు హాజరుకానున్నారు. కాగా, ఒబామా దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. జిమ్మీ కార్టర్ నివాళి, ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అందుకు ఆజ్యం పోశాయి. సామాజిక మాధ్యమ వేదికల్లోనూ వీరు విడిపోయారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. 1989లో డేటింగ్ ప్రారంభించిన బరాక్, మిచెల్‌లు 1992లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
భర్తతో కలిసి ఉండకపోతే భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్త నుంచి విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్న మహిళ అతడి నుంచి భరణం పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భర్తతో కలిసి ఉండలేకపోవడానికి తగిన కారణం ఉంటే భరణం కోరవచ్చని వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన యువతి, యువకుడికి 2014 మే 1వ తేదీన పెళ్లి జరిగిది. 2015 ఆగస్టులో వారు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. చివరకు ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టుకు చేరింది. వారిద్దరూ కలిసి ఉండొచ్చని, వివాహ సంబంధం ఎప్పటిలాగే కొనసాగించవచ్చని సూచిస్తూ ఫ్యామిలీ కోర్టు 2022 మార్చి 23న డిక్రీ జారీ చేసింది. అయితే, భార్య ఈ డిక్రీకి కట్టుబడి ఉండలేదు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెకు నెలకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ దేశాలను భర్త జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు. భార్య తన వద్దకు తిరిగి రాలేదు కాబట్టి భరణం చెల్లించే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. అతడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోయినా భార్య భరణం పొందవచ్చని తేల్చిచెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందడం భార్య హక్కు అని గుర్తుచేసింది. -
అకారణంగా వదిలేశాడు...న్యాయం చేయండి
సుభాష్‌నగర్: కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు..ఆపై బిడ్డను కన్నాడు..సన్నిహితంగా ఉంటూనే విడాకుల నోటీసు ఇచ్చాడు. ఇదేంటని అమ్మాయి తల్లిదండ్రులు, పెద్దమనుషుల సమక్షంలో ప్రశ్నస్తే నిష్కారణంగా నాకు వద్దు అంటున్నాడు. దీంతో ఆ అమ్మాయి తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. సూరారం పరిధిలోని లక్ష్మీనగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెల్పిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వనాథ్, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె శ్రీరమ్యకు సూరారం లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన మైనం భాస్కరరావు, విజయలక్ష్మిల కుమారుడు శ్రీ తేజతో 2023లో వివాహం జరిగింది. మొదట్లో 3 నెలల పాటు కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలో గర్భందాల్సిన రమ్యను అబార్షన్ చేయించుకోవాలని శ్రీతేజ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె అంగీకరించక పోవడంతో భార్యపైకి కోపం పెంచుకున్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళిన భార్యతో ప్రేమగా ఉంటూనే పథకం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేశాడు. ప్రసవం తర్వాత పుట్టిన బాబును చూడడానికి రాలేదు సరికదా..విడాకుల నోటీసు చేతిలో పెట్టాడు. దీంతో రమ్య 9 నెలల కొడుకును, తల్లిదండ్రులను తీసుకుని రెండురోజుల క్రితం భర్త ఇంటికి వచి్చంది. వీరిని శ్రీతేజతోపాటు కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వకుండా..తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో రమ్య తన గోడును కాలనీ వాసులకు చెప్పి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. శ్రీతేజపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రమ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు. -
పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"
ఢిల్లీ : వ్యాపార వేత్త పునీత్ ఖురానా ఆత్మహత్య ఘటనలో సంచలన ఆడియో,వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ వీడియోల్లో బ్రతికుండగానే భర్త పునీత్ ఖురానాకు భార్య మనీకా పహ్వా ఎలాంటి నరకం చూపించిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్లోనే భర్తకు ఎదురుగా కూర్చున్న పహ్వా చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్న ఆడియో,వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఢిల్లీలో ప్రముఖ వుడ్‌బాక్స్ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా(40) భార్య మనికా జగదీష్ పహ్వా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.2016లో పునిత్కు,పహ్వాకు వివాహం జరిగింది. ఇద్దరు ఉడ్‌బాక్స్ కేఫ్, ఫర్గాడ్ కేక్ పేరుతో బేకరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం జోరందుకుంది. అంతా సాఫిగా సాగుతున్న జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విడాకుల తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కోర్టు ద్వారా విడాకుల కోసం అప్లయ్ చేశారు.#PuneetKhurana did not commit suicide just because being humiliated on a late night phone call by his wife. This harassment and extortion was going on since long. Suicide is never easy. Suicide is never a choice for anyone. Its the extreme helplessness which turns people… pic.twitter.com/ip69yCS4Bd— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 1, 2025 పరస్పర అంగీకారంతో కోర్టు ఇద్దరికి విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది. నా డిమాండ్లను నెరవేరిస్తే విడాకులు ఇస్తానునని పహ్వా కోర్టుకు తెలిపింది. కోర్టు సైతం పహ్వా షరతులకు లోబడి ఆమె డిమాండ్లు నెరవేర్చాలని పూనిత్కు సూచించింది. అందుకు పునిత్ సైతం అంగీకరిస్తూ సంతకం కూడా చేశాడు. 180 రోజుల్లో కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.ఈలోగా భార్య,భర్తలు వ్యాపారాలు వేర్వేరుగా చేసుకుంటున్నారు. కానీ కోర్టు ఎదుట విధించిన షరతులు కాకుండా అంతకు మించి పహ్వా కుటుంబ సభ్యులు పునిత్ను వేధించడం మొదలు పెట్టారు. దీంతో తట్టుకోలేక 59 నిమిషాల వీడియోను రికార్డ్ చేసి డిసెంబరు 31న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియోలో తన భార్య పహ్వా, ఆమె కుటుంబసభ్యులు ఎంతలా వేధించారో చెప్పారు.ఆ వీడియోలో ‘నా భార్య నా తాహతకు మించి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఐదు డిమాండ్లను నెరవేర్చా. లాయర్ ఫీజు కింద నెలకు రూ.70వేలు ఇచ్చా. అవి సరిపోలేదని మరో రూ.10లక్షలు ఇవ్వాలని భార్య,అత్తమామలు వేధిస్తున్నారు. ఇంకా డబ్బులు కావాలని నన్ను పీక్కుతింటున్నారు. ఇంతుకు మించి ఇవ్వలేను. డబ్బులు కావాలని నా తల్లిదండ్రులను అడగలేను ’ అని తెలిపారు.పునీత్ ఖురానా ఆత్మహత్యపై డిసెంబరు 31న మధ్యాహ్నం 4:30 గంటలకు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పునీత్ ఖురానా ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చాయి. ఆ ఫుటేజీలు ఎప్పటివి అనేది తెలియాల్సి ఉండగా భార్య మనికా జగదీష్ పహ్వా భర్త పునీత్ ఖురానాను బ్రతికి ఉండగానే ఎంతటి నరకం చూపించిందో తెలుస్తోంది.ఆ సీసీటీవీ ఆడియో,వీడియో ఫుటేజీలో ఓ పది నిమిషాలు సమయం నీకు ఇస్తున్నా అంటూ ‘ఓ బిచ్చగాడ. నువ్వు ఏమి అడిగావో చెప్పు. నీ మొహం చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నా ముందుకు వచ్చావనుకో నీ రెండు చెంపలు వాయిస్తా. ఏంటి నీకు విడాకులు కావాలి. నన్ను వ్యాపారం చేసుకోనివ్వవా?అంటూ భర్తను,అతని కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అన్నది. అయినా సరే ఇవన్నీ పర్వాలేదు. నీకేం కావాలో చెప్పు’ అని భర్త బదులివ్వడం గమనించవచ్చు. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
హాలీవుడ్ స్టార్ జంటకు విడాకులు.. ఎనిమిదేళ్ల తర్వాత సెటిల్మెంట్!
ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ బంధానికి గుడ్ బై చెప్పేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. సెప్టెంబరు 2016లో ఎంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టును అశ్రయించారు. సుదీర్ఘమైన విచారణ తాజాగా వీరిద్దరు ఓ సెటిల్మెంట్కు వచ్చారు. దీంతో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఎంజెలీనా తరఫు న్యాయవాది ధ్రువీకరించారు.కాగా.. 2014లో ఎంజెలీనా, బ్రాడ్ పిట్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట దాదాపు 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ ఒకరు. కాగా... విడాకుల సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసు కోసం దంపతులు ఒక ప్రైవేట్ న్యాయమూర్తిని నియమించారు.2016లో జోలీ యూరప్ ట్రిప్ తర్వాత విడాకుల కోసం దాఖలు చేసింది. పిట్ తన పట్ల, తన పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. అయితే ఈ జంటకు న్యాయమూర్తి వారికి 2019లో విడాకులు మంజూరు చేశారు. కానీ పిల్లలు, ఆస్తుల విభజన, పిల్లల సంరక్షణ సెటిల్మెంట్ కోసం కోసం మరో ఐదేళ్లు పట్టింది. ఇక నుంచి వీరిద్దరు అధికారికంగా విడిపోయినట్లే. ఇక సినిమాల విషయానికొస్తే ఎంజెలీనా జోలీ చివరిసారిగా మారియాలో కనిపించింది. -
భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..
భారత్‌లోని తొలి విడాకులు కేసు లేదా విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ ఆమె. ఆమె విడాకుల కేసులో ఏకంగా బ్రిటన్ క్వీన్ జోక్యంతో తనకు అనుకూలంగా తీర్పు పొందింది. ఆ రోజుల్లో దీన్ని అందరూ విమర్శించినా..ఒంటరిగానే మహిళల హక్కుల కోసం పోరాడింది. పైగా పాశ్చాత్య వైద్యంలో సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి వైద్యురాలు కూడా ఈమెనే కావడం విశేషం. ఇంతకీ ఎవరామె..? ఆ కాలంలో అంతటి తెగువను ఎలా పదర్శించ గలిగిందంటే..?ఇది 1885లో జరిగిన ఘటన. చెప్పాలంటే భారత్లొని మొట్టమొదటి విడాకులు కేసు(Divorce Case) లేదా విడాకుల తీసుకున్న తొలి హిందు మహిళగా చెప్పొచ్చు. ఆ మహిళ పేరు రఖ్మాబాయి రౌత్. విడాకులు అనే పదం మన దేశంలో కనిపించే అవకాశం లేని రోజులవి. అలాంటి రోజుల్లో ధైర్యంగా కోర్టులో పోరాడి విడాకులు తీసుకుందామె. రఖ్మాబాయికి కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే దాదాజీ భికాజీ అనే 19 ఏళ్ల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే ఆమె మెడిసిన్ చదవాలనే తపనతో తన తల్లిదండ్రుల వద్దే ఉండేది. అక్కడే తన చదువుని కొనసాగించింది కూడా. అయితే ఇది ఆమె భర్తకు నచ్చక తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు. అందుకు రుఖ్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా కోర్టులో ధైర్యంగా తన వాదన వినిపించింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాని, అందువల్ల తనతో కలిసి జీవించలేనని నిర్భయంగా చెప్పింది. ఈ విషయం ఊరంతా దావానంలా వ్యాపించడమే గాక, చదువే ఆమెను భ్రష్టుపట్టించిందని ప్రజలంతా ఆమెను ఆడిపోసుకునేవారు. అయితే కోర్టు.. రుఖ్మాబాయిని భర్తతో కలిసి ఉండకపోతే జైలులో ఆరు నెలలు ఉండాల్సి వస్తుందని తీర్పు ఇచ్చింది. అయితే ఆమె ఆశ్చర్యకరంగా జైల్లో ఉండేందుకు మొగ్గు చూపింది. అలా ఆమె జైల్లో శిక్షను అనుభవిస్తూనే 'ఎ హిందూ లేడీ' అనే పేరుతో లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలు, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి రాశారు. ఆమె రచనలు క్వీన్ విక్టోరియా(Queen Victoria) దృష్టికి రావడమే గాక అవి ఎంతగానో ఆమెను ఆకర్షించాయి. దీంతో ఆమె రఖ్మాబాయి కేసులో జోక్యం చేసుకుని మరీ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. అలాగే విడాకులు కూడా మంజూరయ్యేలా చేశారామె. మహిళలను హేళనగా చూసే ఆ రోజుల్లో అత్యంత సాధారణ మహిళగా ఆమె సాధించిన మొట్టమొదటి విజయం. అయితే ఆ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్‌లో చదవాలని నిర్ణయించుకుంది. అలా 35 ఏళ్ల పాటు సూరత్‌లోని ఉమెన్స్ హాస్పిటల్ చీఫ్‌గా పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. చెప్పాలంటే పాశ్చాత్య వైద్యంలో హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ రుఖ్మాబాయి. అంతేగాదు ఆమె కారణంగానే భారత్‌లో బాల్యవివాహాలపై చర్చలు, వ్యతిరేకించడం ఊపందుకున్నాయి. అలాగే మహిళలు దీనిపై పోరాటం చేసేందుకు ముందుకొచ్చేలా ప్రేరణనిచ్చింది ఆమె గాథ. (చదవండి: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!) -
విడాకులు ఇవ్వడం లేదనే..
కంటోన్మెంట్: విడాకులు ఇవ్వడం లేదన్న కారణంతోనే బోయిన్‌పల్లికి చెందిన యువకుడు సమీర్‌ను అతడి భార్య కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించిన పోలీసులు, ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సోమవారం బోయిన్పల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాల్ వివరాలు వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన సమీర్ అనే యువకుడు గత జనవరిలో నాచారం ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ సదాఫ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నచ్చని అమ్మాయి తండ్రి, ఆమె బంధువులు సాంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేస్తామని ఆమెకు నచ్చజెప్పి పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సమీర్‌తో పెళ్లి రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఆమె తన భర్త సమీర్‌తో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేది. దీనిని జీర్ణించుకోలేని సదాఫ్ తండ్రి తన బంధువులతో కలిసి సమీర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా శనివారం ఇద్దరు రౌడీషీటర్లుతో కలిసి సమీర్ ఇంటికి వచి్చన సదాఫ్ కుటుంబ సభ్యులు అతడిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రాథమిక ఆధారాలతో సదాఫ్ తండ్రి మహ్మద్ షబ్బీర్ అహ్మద్‌తో పాటు మహ్మద్ ఓబర్, అబ్దుల్ మతీన్, సయ్యద్ సోహయిల్, షేక్ అబు బాకర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇబ్రహీం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు అబ్దుల్ మతీన్, సయ్యద్ సోహయిల్లపై రౌడీష్ట్లు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. -
అసద్ భార్య విడాకుల పిటిషన్
మాస్కో: పదవీచ్యుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ భార్య ఆస్మా(49) విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదార్లు అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యాకు కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే. రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే, వారిపై పలు ఆంక్షలను విధించింది. అసద్, ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ వద్ద దాచిన 270 కిలోల బంగారం, సుమారు రూ.17 వేల కోట్ల ధనంతోపాటు, మాస్కోలోని 18 అపార్టుమెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్మా అల్–అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులో 2000వ సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్‌తో ఆమె వివాహమైంది. ఆమెకు ద్వంద పౌరసత్వం ఉంది. ఇలా ఉండగా, అసద్ సోదరుడు మహెర్ అల్–అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి, ఆస్తుల్ని స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. -
రష్యాలో సిరియా మాజీ అధ్యక్షుడికి బిగ్ షాక్
మాస్కో: తిరుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో కుటుంబంతో సహా పారిపోయి.. మిత్రదేశం రష్యాను ఆశ్రయించాడు మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్. అయితే.. అక్కడా ఆశ్రయంలోనూ ఆయన స్థిమితంగా ఉండలేకుండా పోతున్నారని సమాచారం. ఈ క్రమంలో భార్య అస్మా రూపంలో ఆయన పెద్ద షాకే తగిలింది.తాజాగా.. బషర్ భార్య అస్మా ఆయన నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వరుస పరిణామాలు.. పైగా రష్యాలో ఆశ్రయం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో తన స్వస్థలం లండన్ వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. రష్యాలో వాతావరణం తనకు ఏమాత్రం నచ్చలేదని.. తాను దేశం దాటేందుకు అనుమతివ్వాలని.. ఈ క్రమంలోనే తనకు విడాకులు మంజూరు చేయాలని.. రష్యా కోర్టులో ఆమె ఓ పిటిషన్ వేశారు. దేశం విడిచేందుకు తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు.మరోవైపు.. రష్యాలో ఆశ్రయం పొందినప్పటికీ బషర్‌కు ఉపశనం కలిగే అవకాశం లేదు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండేలా ఆయనపై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన రష్యా విడిచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ అస్మా తన పిల్లలతో మాస్కో వీడేందుకే సిద్ధమైనట్లు టర్కీ,అరబ్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అస్మా.. బ్రిటిష్-సిరియా సంతతికి చెందిన వ్యక్తి. లండన్‌లో జన్మించిన అస్మాకు 2000లో అసద్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె సిరియాలో అడుగుపెట్టింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. సిరియా గత ఐదు దశాబ్దాలుగా బషర్ కుటుంబ పాలన గుప్పిట ఉంది. 1971 నుంచి చనిపోయేంత వరకు బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ సిరియాను పాలించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అయిష్టంగానే డెంటల్ డాక్టర్ అయిన బషర్ అల్ అసద్ అధ్యక్ష పీఠం ఎక్కారు. అయితే అధికారంలోకి రాగానే నియంత పోకడలను కొనసాగించాడు బషర్. దీంతో ఆయన్ని గద్దె దింపేందుకు 20 ఏళ్లుగా పోరాటాలు సాగాయి. ఈ క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో 5 లక్షల మంది ప్రాణాలు పోయాయి. అయితే.. బషర్ విముక్త సిరియా కోసం పోరాడిన తిరుగుబాటుదారులు.. ఎట్టకేలకు ఈ నెల ప్రారంభంలో రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారు. దీంతో ప్రాణభయంతో బషర్ కుటుంబ సభ్యులతో సహా రష్యాకు పారిపోయాడు. -
చిల్లర భరణం
-
నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్‌కు పెళ్లి కూడా అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్‌తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. -
తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!
బెంగళూరు టెకీ ఆత్మహత్మ, భరణం కేసు ప్రకంపనలు రేపుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విడాకుల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు ఒకటీ రెండూ కాదు, ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, కోట్ల రూపాయల భరణం చెల్లించిన ఉదంతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ పెళ్లి అయిన 44 ఏళ్ల తరువాత పట్టువీడకుండా, శాశ్వత భరణంగా రూ.3.01 కోట్లు చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.వివరాలు ఇలా ఉన్నాయి...హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సుభాష్ చంద్ 1980, ఆగస్టు 27వ తేదీన సంతోష్ కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అంతా బావుంది అనుకుంటున్న క్రమంలో ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో 2006, మే 8వ తేదీ నుంచి విడిగా జీవించడం ప్రారంభించారు. భార్యనుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా 2006లొనే కోర్టును ఆశ్రయించాడు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో అతని విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. అయినా పట్టువీడని సుభాష్ హైకోర్టులో అప్పీల్ చేశాడు.దాదాపు 11 సంవత్సరాల తరువాత రాజీ చేసుకోవాల్సిందిగా కోరిన హైకోర్టు, ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే వీరికి మంజూరైనాయి. అయితే భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించాడు సుభాష్. దీనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా అంగీకరించారు. అయితే ఈ భరణం ఎలా చెల్లించాడు అనేదే హాట్ టాపిక్ అంత భరణం ఎలా?తన వ్యవసాయ భూమిని అమ్మి మరీ డిమాండ్ డ్రాఫ్ట్‌గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో 50 లక్షల నగదు చెల్లించాడు. ఇక మిగిలిన 40 లక్షల రూపాయలను బంగారు, వెండి రూపంలో చెల్లించాడు. ముదిమి వయసులో , 18 ఏళ్ల సుదీర్ఘం న్యాయ పోరాటం తరువాత 44 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకడం చర్చకు దారి తీసింది. ఒప్పందం ప్రకారం చంద్‌కు చెందిన ఆస్తిపై భార్యాపిల్లలు అన్ని హక్కులను వదులు కున్నారని చంద్‌కు చెందిన రాజిందర్ గోయెల్ పేర్కొన్నారు. ఈ పరస్పర నిర్ణయాన్ని కోర్టు అంగీకరించి గత వారం విడాకులు ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు. -
మోడువారిన జీవితం గోరింట సాక్షిగా!
న్యూఢిల్లీ: అరచేతిలో గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడన్నది తెలుగిళ్లలో అనాదిగా ఉన్న నమ్మకం. కానీ తన సంసారం చట్టుబండలైన వైనాన్ని ఎర్రగా పండిన గోరింటాకు సాక్షిగా వినూత్నంగా చెప్పిందో మహిళ. తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలను, అనుభవించిన బాధలను మెహందీ ద్వారానే విడమరచి చెప్పింది. ‘విఫల వివాహ విషాద గాథ’ను వివరిస్తూ ఆ మహిళ తన చేతిపై వేసుకున్న మెహందీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు మహిళకు ‘విడాకుల మెహందీ’ వేసిన కళాకారిణి ఊర్వశీ ఓరా ఆ వీడియోను షేర్చేశారు. పెళ్లయ్యాక అత్తగారింట అడుగుపెట్టింది మొదలు ఇంట్లో బట్టలుతకడం, అత్తగారి దృష్టిలో పనిమనిషిలా పనులన్నీ చేయడం, భర్త నుంచి దేనికీ మద్దతు లేక దిగాలు పడటం, తరచూ మనస్పర్ధలు, గొడవలు, ఒంటరితనం... ఇలా చివరకు విడాకుల దాకా తన వ్యథను మెహందీ ద్వారా వ్యక్తీకరించారు. ప్రేమ, ఆనందమయ క్షణాల్లో సంబరాలకు ప్రతీకగా నిలిచే మెహందీ ద్వారా ఇలా అంతులేని బాధను వ్యక్తం చేయొచ్చని నిరూపించారు. Divorce Mehndi Design: महिला ने मेहंदी डिजाइन से बतायी शादी से लेकर तलाक तक की कहानी, pic.twitter.com/ZuYdTlT9Bl— Vikash Kashyap (@VikashK41710193) December 14, 2024 -
డివోర్స్ మెహిందీ : ఓ వివాహిత హృదయవిదారక గాథ వైరల్
శుభకార్యం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా చేతి నిండా మెహిందీ (హెన్నా) పెట్టుకుంటే ఆ వేడుకకు మరింత కళ. ఈ మెహిందీ కళలో అనేక రకాలను చూశాం. వాటిల్లో ప్రధానంగా బ్రైడల్ మెహిందీ. కానీ విడాకుల మెహిందీ గురించి ఎపుడైనా విన్నారా? తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలు, కన్నీళ్ల గురించి ప్రస్తావిస్తూ మొత్తానికి విడాకులు తీసుకున్నాను అంటూ తన బాధను నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట పలువురి హదయాలను కదిలిస్తోంది.ఊర్వశి వోరా శర్మ ఇన్‌స్టా వేదికగా విడాకుల స్టోరీని మెహిందీ డిజైన్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన విఫలమైన పెళ్లి, తన కలలు, భర్త చేసిన ద్రోహం, అనుభవించిన క్షోభను చాలా భావోద్వేగంతో ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా వివరించింది. కేవలం ఒక పనిమనిషిలాచూసిని అత్తమామలు, భర్త మద్దతు ఏమాత్రం లేక కుంగిపోయిన వైనం, ఒంటరితనంతో అనుభవించిన నరకం, భయంకరమైన ఒత్తిడి, చివరికి విడిపోవాలనే అంతిమ నిర్ణయంతో ముగుస్తుందీ మెహిందీ ఆర్ట్. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీ బాధను వ్యక్తం చేయడానికి ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీకు మరింత బలం చేకూరాలి’ అంటూ చాలామంది ప్రశంసించారు."మెహిందీలో నొప్పిని చూడటం హృదయ విదారకం. కానీ ఆమె సాధించిన స్వేచ్చ సంతోషానిస్తోంది’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు, కానీ ఈ మెహిందీ మళ్లీ మీ జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన శక్తినిస్తుంది’“ఇది కేవలం కళ కాదు; అది ఒక ఉద్యమం. స్త్రీలు తమ బాధలను పంచుకుంటున్నారు’’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ‘‘ఫైనల్లీ.. మెహిందీ ద్వారా వివాహాలకు ఆవల గాథలు. ఇవి పచ్చి నిజాలు, కఠోర వాస్తవాలు’’ అంటూ మరొకరు పేర్కొనడం గమనార్హం -
2024లో సెలబ్రిటీ జంటల షాకింగ్ నిర్ణయాలు
-
భరణం నిర్ణయించడానికి 8 సూత్రాలు
న్యూఢిల్లీ: విడాకుల అనంతరం మహిళకు ఇచ్చే ‘భరణం’ విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న వి వర్లేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ కుమార్ జైన్ తన భార్యకు భరణం కింద రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహిళకు జీవనభృతిని నిర్ణయించడానికి ముందు ఎనిమిది అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.కుమారుడి కోసం కోటి రూపాయలుప్రవీణ్ – అంజు జైన్ విడాకుల కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం తన పెద్ద కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం కోటి రూపాయలు కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పెళ్లయిన తర్వాత ఆరేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత 20 ఏళ్లు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు, విభేదాలు తలెత్తాయనే ఆరోపణలు వీరి పెళ్లికి కారణమయ్యాయి. అంజు హైపర్ సెన్సిటివ్ అని, ఆమె తన కుటుంబంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేదని ప్రవీణ్ ఆరోపించారు. మరోవైపు ప్రవీణ్ ప్రవర్తన తన పట్ల సరిగా లేదని అంజు ఆరోపించింది. ఇంతకాలం విడివిడిగా ఉంటున్న ఈ జంట కేసులో పెళ్లికి అర్థం, అనుబంధం, బంధం పూర్తిగా తెగిపోయాయని కోర్టు అభిప్రా యపడింది. ఆ తర్వాత షరతులను పేర్కొంటూ కో ర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. భార్య తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ భరణం ఆర్డర్ చర్చనీయాంశమైంది.కోర్టు సూచించిన ఎనిమిది సూత్రాలు1. భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులు2. భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు3. ఇరుపక్షాల అర్హత, ఉద్యోగం4. ఆదాయ మార్గాలు, ఆస్తులు5. అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు6. కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయపోరాటానికి సహేతుకమైన మొత్తం8. మెయింటెనెన్స్ అలవెన్స్‌తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు -
హరియాణాలో విడాకుల సంబరం
చండీగఢ్: ఆధునిక కాలంలో పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు చూస్తున్నాం. పెళ్లి వేడుకలు తిలకిస్తున్నాం. పెళ్లి తర్వాత రిసెప్షన్ పేరిట జరిగే విందు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇలా వివాహం చుట్టూ ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ, విడాకుల సంబరం ఎప్పుడైనా చూశారా? హరియాణాలో ఇటీవల నిజంగా ఇలాంటి ఉత్సవం జరిగింది. మంజీత్ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు చాలా సంతోషంగా తన బంధుమిత్రులకు విందు ఇచ్చాడు. కేక్ కట్ చేశాడు. డైవోర్స్ పార్టీ ఘనంగా నిర్వహించుకున్నాడు. ఈ సందర్భంగా వేదిక వద్ద తన పెళ్లి ఫొటో, పెళ్లి జరిగిన తేదీ, విడాకులు మంజూరైన తేదీ తదితర వివరాలతో ఒక ఫ్లెక్సీ ముద్రించి అతికించాడు. అంతేకాదు తన మాజీ భార్య విగ్రహం లాంటిది అక్కడే ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విడాకుల పారీ్టలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని సమాచారం. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి మొదలైట్లు తెలుస్తోంది. మంజీత్ 2020లో కోమల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయభేదాలతో నిత్యం కీచులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని నిర్ణయానికొచ్చారు. ఈ ఏడాదే వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తనకు అసలైన స్వాతంత్య్రం వచి్చందని మంజీత్ ఆనందంగా చెబుతున్నాడు. కానీ, ఇలాంటి విడాకుల వ్యవహారాలు, డైవోర్స్ పారీ్టలు మంచి పరిణామం కాదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Manjeet Dhakad Dhakad (@m_s_dhakad_041) -
ఎనిమిది మార్గదర్శకాల జారీ...
ఢిల్లీ: భార్యాభర్తల విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడం సాధారణమైన విషయం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భరణం గురించి సుప్రీంకోర్టు విధివిధానాలు వెలువరించింది. ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేల ధర్మాసనం.. భరణం కింద ఇచ్చే నగదు గురించి మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలని సూచించింది.ఎనిమిది మార్గదర్శకాలు ఇవే..1. భార్యాభర్తల సామాజిక ఆర్ధిక స్థితిగతులు.2. భవిష్యత్తులో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు.3. ఇరు పార్టీల ఉద్యోగ- విద్యార్హతలు, ఆదాయం-ఆస్తులు.4. ఆదాయం మరియు ఆస్తి సాధనాలు.5. అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం.6. కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?.7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం.8. భర్త ఆర్దిక పరిస్థితి అతడి ఆదాయాలు, భరణం సహా ఇతర బాధ్యతలు.ఇదిలా ఉండగా.. తన భార్య పెట్టిన వేధింపులు భరించలేక బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ బలవనర్మణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.భరణం విషయంలో ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడానికి ఇవి సాధారణమైనవి కాదని, చాలా కీలకమైనవని వ్యాఖ్యానించింది. తన భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో రూ.3 కోట్లు ఇవ్వాలని, నెలకు రూ. 2లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసినట్టు అతుల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడం గమనార్హం.ఇది కూడా చదవండి: భర్త సుభాష్ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..ఇది కూడా చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా?.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు -
లేటు వయసులో విడిపోతున్న జంటలు
భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపొమ్మనే సలహా ఇస్తారు. చాలా జంటలు అలాగే సర్దుకుపోతుంటాయి. అలా కుదరని వాళ్లు విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పరిస్థితులు మారాయి, మారుతున్నాయి. పాతికేళ్లు అన్యోన్యంగా కాపురం చేసినవాళ్లు, 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్. దీన్నే ‘గ్రే డివోర్స్’ అంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్–సైరాబాను విడాకులు గ్రే డివోర్స్‌పై విస్తృతమైన చర్చను రేకెత్తించాయి. అసలెందుకిలా జరుగుతోంది? లేటు వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? భారతీయ వైవాహిక వ్యవస్థ బీటలు వారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం. గ్రే డివోర్స్ ఎందుకు జరుగుతాయి?సమాజంలో మారుతున్న విలువలు, పెరుగుతున్న జీవితకాలం, వ్యక్తిగత సంతోషానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 1. వ్యక్తిగత ఎదుగుదలలో అసంతృప్తికొంతమంది చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తిగత ఆశయాలకంటే సామాజిక బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో, ఒకరు లేదా ఇద్దరూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. దానికి భాగస్వామిని అడ్డంకిగా భావించినప్పుడు విడాకులకు వెళ్తున్నారు. 2. ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్పిల్లలు పెద్దవారై ఇళ్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత, దంపతుల బాధ్యతలు తగ్గుతాయి. అప్పటివరకు పిల్లల కోసం అడ్జస్ట్ అయినవారు స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తారు. భాగ స్వామితో గతంలో పరిష్కరిం చుకోని సమస్యలు పెరుగుతాయి. దాంతో వారిద్దరి మధ్య ఉన్న బంధం బలహీనపడి విడాకులకు దారితీస్తుంది. 3. ప్రేమ, సహవాసంపై మారుతున్న అభిప్రాయాలుప్రేమ, పెళ్లి, సహజీవనంపై కాలంతో పాటు అభిప్రాయాలు మారుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన మాయమై, కలిసి ఉన్నన్నాళ్లు సంతోషంగా జీవించాలనే అభిప్రాయం పెరుగుతోంది. ఆధునిక వైద్యంతో జీవనకాలం పెరగడంతో ఏభైల తర్వాత కూడా నచ్చినవారితో జీవితం గడపాలనే భావన పెరుగుతోంది. 4. ఆర్థిక స్వాతంత్య్రంగతంలో భర్త పనిచేస్తుంటే భార్య ఇంటిపనులు చూసుకునేది. కానీ ఇప్పుడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. దీంతో బాధాకరమైన సంబంధాలను ఏమాత్రం సహించడంలేదు. గృహహింసను భరించేకంటే వైవాహిక బంధం నుంచి బయటపడటమే మంచిదని భావిస్తున్నారు. 5. విడాకులపై సామాజిక స్వీకారంఒకప్పుడు విడాకుల పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మారిపోయింది. సెలబ్రిటీలు గ్రే డివోర్స్ తీసుకోవడం ఇతరులకు మార్గదర్శకం అవుతోంది. దాంతో సామాన్యులు కూడా గ్రే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రే డివోర్స్‌తో సమస్యలు.. గ్రే డివోర్స్.. విముక్తి కలిగిస్తున్నట్టు అనిపించినా, వాటి వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ⇒ అస్తిత్వ సంక్షోభం: అనేక సంవత్సరాలపాటు ఒక భాగస్వామిగా ఉన్న తర్వాత, ఒంటరిగా జీవించడం ఒక పెద్ద మార్పు. ‘నా జీవితంలో భాగస్వామి లేకుండా నేను ఎవరు?’ అనే ప్రశ్నలతో బాధపడతారు.⇒ ఒంటరితనం: జీవితం చివరిలో ఏకాకిగా ఉండటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది.⇒ కుటుంబ సంబంధాలు: పెద్దయిన పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించలేకపోవచ్చు. కొన్నిసార్లు వారు తల్లిదండ్రులపై కోపంగా ఉండవచ్చు. ·గ్రే డివోర్స్ను తప్పించేందుకు సూచనలు1. ఏ బంధానికైనా సంభాషణ ముఖ్యం. అందుకే మీ భావాలు, అంచనాలు, ఆందోళనల గురించి భాగస్వామితో క్రమం తప్పకుండా చర్చించండి.2. వయసుతో పాటు భావోద్వేగ అవసరాలు కూడా మారుతాయి. ఆలోచనలు, కలలు, భయాలను పంచుకునే సమయాన్ని కేటాయించి బంధాన్ని బలోపేతం చేసుకోండి. 3. మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలు లేదా అభిరుచులను గుర్తించి, వాటిని తిరిగి ప్రారంభించండి. 4. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేయడం వంటి స్పర్శతో ప్రేమను గుర్తు చేస్తూ ఉండండి. 5. వ్యక్తిగత అభిరుచులకు ప్రోత్సాహం ఇవ్వడం, కలిసి ఎదగడం ద్వారా సంబంధాన్ని సజీవంగా ఉంచండి. 6. నిందించడం తగ్గించి, శ్రద్ధగా వినండి. ఇద్దరి అవసరాలను గౌరవించే పరిష్కారాలను కనుక్కోండి. 7. మీ భాగస్వామి చేసిన కృషిని గుర్తించడం, థాంక్స్ చెప్పడం వంటి చిన్న పనులు బంధాన్ని బలపరుస్తాయి. 8. సమస్యలను పరిష్కరించడానికి, సంభాషణను మెరుగుపరచడానికి, బంధాన్ని బలపరచడానికి కౌన్సెలింగ్ కూడా సహాయపడుతుంది. -
యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశాల్లో డైవర్స్ కేసు వేస్తే..!
నాకు పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలవుతోంది. నా భర్త అమెరికాలో ఉద్యోగి. పెళ్లి అయిన తర్వాత నేను కూడా అమెరికాకు వెళ్లాను. అమెరికాలోనే ఒక కొడుకు పుట్టాడు. తర్వాత మాకు మనస్పర్ధలు వచ్చాయి. నన్ను నానారకాల హింసలు పెట్టి అత్తింటి వాళ్లు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. అమెరికాలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. తప్పని పరిస్థితులలో తిరిగి భారతదేశానికి వచ్చేశాను. నా భర్త అమెరికాలో డైవర్స్ కేసు వేశారు అని నాకు నోటీసు వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కేసు వాదించే ఆర్థిక పరిస్థితులలో లేను. నాకు డైవర్స్ వద్దు. తగిన సలహా ఇవ్వగలరు. – సరళ, విజయవాడమీ పరిస్థితి నాకు అర్థం అయింది. మీరు అమెరికాకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీ పెళ్లి భారత దేశంలో జరిగింది అని చె΄్పారు. పెళ్లి తర్వాత కొంతకాలం అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో కూడా డైవర్స్ కేసు వేయవచ్చు అనేది సాధారణ చట్టం. కానీ ఆ డ్డైవర్స్ ఇండియాలో చెల్లాలి అంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీ కేసులో మీరు అమెరికా ΄పౌసత్వం తీసుకోలేదు అని అనుకుంటున్నాను. మీరు ఇరువురు భారతీయ ΄పౌరులు అయి ఉండి, భారతీయ చట్టాల ప్రకారం మీ వివాహం జరిగి ఉంటే, అదనంగా రిజిస్టర్ కూడా చేయబడి ఉంటే కనుక భారతదేశంలో తగిన చర్యలు తీసుకునే వీలు ఉంది. మీ దగ్గరలోని న్యాయవాదిని కలిసి ‘యాంటీ సూట్ ఇంజక్షన్’ వేయమని అడగండి. అయితే మీ కేసులో యాంటీ సూట్ ఇంజక్షన్ వేయవచ్చా లేదా అనేది కేసు పూర్వపరాలు చూసిన తర్వాత నిర్ణయించవలసి ఉంటుంది. ఆ కేసు ద్వారా, మీ భర్తపై భారతీయ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. అతను వేరే ఏ దేశంలో కూడా మీ వివాహానికి సంబంధించిన కేసులు వేయడానికి లేదు అని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. అయితే, తాత్కాలికమైన ఆదేశాలు లభించినప్పటికీ, శాశ్వతంగా మీరు కేవలం భారతదేశ కోర్టులో మాత్రమే కేసులు వేయాలి అని అన్నివేళలా కోర్టులు చెప్పకపోవచ్చు. అందుకే మీ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతానికి మీరు మీ భర్తని డైవర్స్ కేసు వేయకుండా ఆపడానికి, యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు వేయండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: టీన్ప్రెన్యూర్స్: తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగకపోయినా..!) -
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్‌గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్‌కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
ఏఆర్ రెహమాన్, సైరా మళ్లీ కలిసిపోయే ఛాన్స్!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 29 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి సిద్ధపడటాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో వీరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా.. వీళ్లు మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందంటూ హింటిచ్చారు. సుదీర్ఘ జర్నీ.. మళ్లీ కలిసే ఛాన్స్తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన మాట్లాడుతూ.. వాళ్లది సుదీర్ఘ వైవాహిక జర్నీ.. ఎంతో ఆలోచించుకున్నాకే విడిపోవడానికి సిద్ధపడుంటారు. పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు. తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలని డిసైడ్ చేసుకున్న హక్కు పిల్లలకు ఉంది. అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదని నేను ఎక్కడా కొట్టిపారేయలేదు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రెహమాన్ దంపతులు మళ్లీ కలిసుండే అవకాశం ఉందని పలువురూ అభిప్రాయపడుతున్నారు.కాగా ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. ఈ నెల ప్రారంభంలో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్‌లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్‌తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్‌లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్‌ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్‌లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
విడాకులకు గుడ్‌బై చెప్పి మళ్లీ కలవనున్న జయం రవి, ఆర్తి..?
కోలీవుడ్ నటుడు జయం రవి ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మళ్లీ తన భార్య ఆర్తితో కలిసి జీవించనున్నాడంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఇదే చర్చ జరుగుతుంది. కొన్నాళ్ల పాటు డేటింగ్ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్న జయం రవి, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జోడీ పలు విభేదాలు రావడంతో విడాకుల నోటీసుల వరకు వెళ్లింది.జయం రవి, ఆర్తి విడాకుల కేసు చెన్నై మూడో కుటుంబ న్యాయస్థానంలో జడ్జి తేన్మొళి విచారణ చేశారు. సయోధ్య కేంద్రంలో మధ్యవర్తిత్వానికి హాజరు కావాలని దంపతులను ఆదేశించారు. అక్కడ జయం రవి, ఆర్తి ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. మధ్యవర్తితో పాటు ఒక గంటకు పైగా సాగిన చర్చలో వారిద్దరూ కూడా సానుకూలంగా మాట్లాడినట్లు సమాచారం. ఎలాంటి ఆందోళన లేకుండా తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారట. పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని మధ్యవర్తి ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వారు కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. దీంతో మళ్లీ వారిద్దరూ కలుస్తారంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.ఘీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి మొదటసారి ప్రకటించాడు. అయితే, విడాకుల విషయంలో తన ప్రమేయం లేదని ఆర్తి తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. తన అనుమతి లేకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటి అంటూ జయం రవి నిర్ణయాన్ని తప్పుపట్టింది. కానీ, లాయర్ ద్వారా ఆర్తికి విడాకుల నోటీసు పంపించానని జయం రవి చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఆమె తండ్రికీ కూడా తెలుసని ఆ సమయంలో తెలిపాడు. ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్న తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నాడు. -
రెహమాన్ విడాకుల కారణం పై క్లారిటీ ఇచ్చిన మోహినిడే
-
విడాకుల రూమర్లు: హాట్ టాపిక్‌గా ఐష్-అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా
బాలీవుడ్లో అందమైన జంట అనగానే మొదటగా గుర్తొచ్చే పేర్లు అందాలతార స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, హీరో అభిషేక్ బచ్చన్. ఆర్థికంగా కూడా చాలా బలమైన జంట వీరిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఐష్, ఇంకా అభిషేక్ విడిపోతున్నారనే పుకార్ల మధ్య ఖరీదైన వారి దుబాయ్ విల్లా నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ లిస్ట్‌లో టాప్‌లో ఉండే ఐశ్వర్య.. కెరియర్ పీక్‌లో ఉండగానే 2007లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను వివాహమాడింది. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. విలాసవంతమైన కార్లు, బంగ్లాలు, వ్యాపారాలతో ఐశ్వర్యరాయ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ దేశంలో అత్యంత ధనిక జంట అని చెప్పవచ్చు. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం, ఐశ్వర్య నికర విలువ రూ. 776 కోట్లుగా ఉండగా, అభిషేక్ బచ్చన్ రూ. 280 కోట్లు . 2015లో కొనుగోలు దుబాయ్విల్లా ఇపుడు హాట్ టాపిక్. దుబాయ్ విల్లాదుబాయ్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లోని ఈ బంగ్లా సుమారు 16 కోట్ల రూపాయల విలువ చేస్తుంది ఈ లగ్జరీ బంగ్లా. అత్యాధునిక సౌకర్యాలతో శాంక్చురీ ఫాల్స్‌లో ఒక అందమైన విశాలమైన విల్లాను వీరు కొనుగోలు చేశారు. స్విమ్మింగ్ పూల్, ఆధునిక వంటగది, ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్, హోమ్ థియేటర్, విశాలమైన వాకింగ్ ట్రాక్ లాంటివి ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలో 5 విలాస వంతమైన బంగ్లాలు, ముంబైలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లలో అనేక ఖరీదైన అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. -
రెహమాన్ నాకు తండ్రి లాంటి వ్యక్తి: మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్, సైరా బాను దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వార్తలు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెహమాన్ టీమ్‌లో పనిచేస్తున్న మోహినిదే అనే యువతి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ నిర్ణయానికి లింక్ పెడుతూ రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా రిలేషన్ ఉందా అంటూ కోలీవుడ్‌లో భారీగా కథనాలు వచ్చాయి.రెహమాన్ గురించి ఎక్కువగా చెడు ప్రచారం జరుగుతున్న సమయంలో రెండు రోజుల క్రితం సైరా బాను రియాక్ట్ అయింది. రెహమాన్ చాలామంచి వ్యక్తి అంటూ ఎవరూ తప్పుగా ప్రచారం చేయకండి అని ఆమె కోరింది. ఈ క్రమంలో తాజాగా మోహినిదే కూడా మరోసారి స్పందించారు. ఆ రూమర్స్‌ను ఖండిస్తూనే రెహమాన్ గోప్యతను గౌరవించాలని కోరింది.మోహినిదే ఒక వీడియో సందేశాన్ని ఇలా పంపింది. 'నేను కొన్ని విషయాలను అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా జీవితంలో నాకు తండ్రితో పాటు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. నా కెరీర్ అభివృద్ధిలో వారందరూ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ఏఆర్ రెహమాన్ నాకు తండ్రిలాంటివారు. ఇంకా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ మా నాన్న కంటే చిన్నవాడు. అతని కూతురు నా వయసు దాదాపు సమానంగానే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయన టీమ్‌లో 8 సంవత్సరాలకు పైగా పనిచేశాను. అయితే, గత 5 సంవత్సరాల నుంచి అమెరికాలో ఒక పాప్ సంగీత కళాకారుడితో కలిసి పని చేస్తున్నాను. నాకు నా స్వంత బ్యాండ్ ఉంది. విడాకుల విషయంలో ఏఆర్ రెహమాన్‌పై వస్తున్న పుకార్లు చాలా బాధాకరం. ఆయన గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొన్నారు.#ARRahman is like my father❤️🔥- #MohiniDey 👍🏻pic.twitter.com/RtuYXF2lwi— Tharani ᖇᵗк (@iam_Tharani) November 26, 2024 -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా -
విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆరె రెహమాన్.. రీసెంట్గా విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇతడి భార్య సైరా భాను లాయర్ బయటపెట్టాడు. ఇద్దరు ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. కానీ రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈయన దగ్గర పనిచేస్తున్న మోహిని దే అనే అమ్మాయి కూడా భర్తకు డివోర్స్ ఇచ్చింది. దీంతో రుమార్స్ మొదలయ్యాయి.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)రెహమాన్-మోహిని దే మధ్య రిలేషన్ ఉన్నట్లు పలువురు ఆర్టికల్స్ రాశారు. యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవాలని, ఇలాంటివి ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏఆర్ రెహమాన్ టీమ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రకటన రిలీజ్ చేసింది.తన గురించి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు టీమ్ పేర్కొంది. ఇప్పటికే పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెహమాన్.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీస్తున్న సినిమా కోసం పనిచేస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రభుత్వం ఉద్యోగం సాధించిన సుకుమార్ ఇంట్లో పనిమనిషి)Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x— A.R.Rahman (@arrahman) November 23, 2024 -
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది. -
ఆమె కారణంగానే రెహమాన్ విడాకులు.. స్పందించిన మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్-సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పర్పస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు న్యాయవాది వందనా షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు రెహమాన్ విడాకుల విషయం బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ విడాకులకు మోహినిదే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు రెహమాన్-మోహినిదే మధ్య ఏదో సంబంధం ఉందన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై మోహినిదే సోషల్ మీడియా వేదికగా స్పదించారు. తనపై వస్తున్న రూమర్స్‌ని తీవ్రంగా ఖండించారు.‘నా విడాకుల ప్రకటన వెల్లడించిన తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారో నాకు తెలుసు. వారి అభ్యర్థనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి’అని మోహినిదే తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.కాగా, ఇదే ఇష్యూపై రెహమాన్ కొడుకు అమీన్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించాడు. ‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. -
మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి.దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులు సృష్టిస్తారు. తెలివితక్కువ వాళ్లు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికి రానివాళ్లు వాటిని అంగీకరిస్తారు. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి’’ అంటూ పోస్ట్ చేశారామె.ఇక ఈ నెల 19న ఏఆర్ రెహమాన్, సైరాల విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం రెహమాన్ బృందంలోని మోహినీ దే అనే అమ్మాయి కూడా తన భర్త, తాను విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో రెహమాన్, మోహినీ ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనక ఏదో కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే అమీన్, రహీమా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే?
సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే అతడి శిష్యురాలు మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్సచ్కు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రెండు విడాకులకు ఏమైనా సంబంధం?ఈ క్రమంలో ఈ రెండు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై సైరా భాను లాయర్ వందన షా స్పందించారు. ఈ రెండు జంటల విడాకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రెండు విడాకులు వేర్వేరు అని నొక్కి చెప్పారు. రెహమాన్-సైరా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఆస్తి పంపకాలుఅందుకు గల కారణాలను చెప్పే స్వేచ్ఛ తనకు లేదన్నారు. ఆస్తి పంపకాలు, భరణం వంటి వాటి గురించి ఇంకా ప్రస్తావన రాలేదని, ఒకవేళ వచ్చినా వాటి గురించి బయటకు చెప్పలేనని తెలిపారు. కాగా ఏఆర్ రెహమాన్, సైరా భానుల వివాహం 1995 మార్చిలో జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలు సంతానం.చదవండి: ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది! -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
కోలీవుడ్‌లో పెరుగుతున్న డైవోర్స్ కేసులు..
-
ఏఆర్ రెహమాన్, ధనుష్ సహా రీసెంట్గా విడాకులు తీసుకున్న స్టార్స్ (ఫొటోలు)
-
గురువు దారిలోనే శిష్యురాలు.. భర్తకు విడాకులు
దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. ఇతడి భార్య సైరా భాను.. తన లాయర్ల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన సైరా భాను.. భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని ఆమె లాయర్ వందనా షా పేర్కొన్నారు. రెహమాన్- సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు.ఇకపోతే రెహమాన్ దగ్గర బాసిస్ట్‌గా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహమాన్, అతడి సహాయకురాలు విడాకులు (వేర్వేరుగా) తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఏఆర్ రెహమాన్ విడాకులకు కారణం తెలిపిన అడ్వకేట్.. పిల్లల కామెంట్స్
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయారు. వారిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. 1995లో వారు పెళ్లి చేసుకున్నారు. సుమారు 29 ఏళ్లు కలిసి జీవించిన వారు ఇలా విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై వారి పిల్లలు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.ఎందుకు విడిపోయారంటే..ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోవడానికి ఉన్న కారణాలను వారి అడ్వకేట్ వందనా షా ఇలా చెప్పారు. 'భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే వారు విడిపోయారు. దంపతుల మధ్య సంబంధాల సమస్యలే ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట తమ మధ్య వచ్చే చిన్నచిన్న విభేదాలు, పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారు. అవి వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయ. శ్రీమతి సైరా చాలా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ గోప్యతను, గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరూ కోరారు.' అని న్యాయవాది తెలిపారు.విడాకులపై పిల్లల కామెంట్స్29 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తమ వివాహ బంధాన్ని ముగించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రెహమాన్, సైరా ఇద్దరూ కలిసే బాలీవుడ్ పార్టీలు, అవార్డులు, సెలబ్రిటీల వివాహాలకు హాజరవుతారు. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో వారు చివరిసారిగా కలిసి కనిపించారు.విడాకుల విషయంపై వారి పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 'మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో మీరందరూ గోప్యత పాటించి గౌరవంగా వ్యవహరించారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు' అంటూ రహీమా పోస్ట్ చేయగా..ఖతీజా ఇలా తెలిపింది. ' ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నాం. మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది. -
ఏఆర్ రెహ్మాన్ జంట విడాకులు
-
29 ఏళ్ల బంధానికి ముగింపు.. రెహమాన్-సైరా విడాకులు (చిత్రాలు)
-
ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు. ‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం. ఒకరిపై ఇంకొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాసరే అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కష్టమైన దశను వీళ్లిద్దరూ దాటగలరని భావిస్తున్నా’ అని లాయర్ వందనా షా ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రెహమాన్ కుమారుడు అమీన్ సైతం ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. -
జయం రవి విడాకుల కేసు.. కోర్టు కీలక ఆదేశాలు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత జయం రవి సతీమణి ఆర్తి అతనిపై ఆరోపణలు చేసింది. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ తర్వాత ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.అయితే తనకు విడాకులు కావాలని కోరుతూ జయం రవి ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా రవి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాజీ చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. కాగా.. ఈ రోజు జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ విచారణలో ఇరువురికి రాజీ కేంద్రంతో మాట్లాడి పరిష్కారం చూపాలని న్యాయమూర్తి ఆదేశించారు.(ఇది చదవండి: భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి)2009లో సినీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని జయం రవి పెళ్లాడారు. వీరిద్దరికి ఆరవ్, అయాన్ పిల్లలు సంతానం కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. మొదట జయం రవి సోషల్ మీడియాలో తన భార్య ఫోటోలను తొలగించారు. కాగా.. జయం రవి 1989లో బాలనటుడిగా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినిమా ద్వారా బాలనటుడిగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళ చిత్రసీమలో స్టార్‌గా ఎదిగారు. 2003లో విడుదలైన ‘జయం’ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్నారు. -
అందర్నీ సంతోషంగా ఉంచాలంటే... నేను వెళ్లి ఐస్ క్రీమ్ అమ్ముకోవాలి!
నటాషా స్టాంకోవిక్, హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జూలై 18న విడిపోయారు. అప్పట్నుంచి నటాషాకు ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఏమ్మాయ్, ముచ్చటైన జంట కదా మీది? ఎందుకు విడిపోయారు?’’‘‘భర్త ఏమైనా అంటే సర్దుకు΄ోవాలి కానీ, పెట్టే బేడా సర్దుకుని బయటికి వచ్చేయటమేనా?’’‘‘ఇప్పుడేమిటి? మీ దేశం వెళ్లిపోతావా? ఇక్కడే ఉండిపోతావా?’’. ‘‘కొడుకు పెద్దవాడౌతున్నాడు. వాడి భవిష్యత్తు ఆలోచించకుండా విడాకులకు నువ్వు కూడా ఎందుకు తొందరపడ్డావ్?’’. ‘‘అతనే విడాకులు కావాలని అడిగినా కూడా, కాళ్లా వేళ్లా పడి అతడితోనే ఉండిపోవాలి కానీ, పంతానికి పోతే ఇలా?’’ఇవీ ఆ ప్రశ్నలు! హార్దిక్‌కి మాత్రం సహజంగానే ఎలాంటి ప్రశ్నలూ లేవు. ఎప్పటిలాగే అతడు మిడిల్–ఆర్డర్లో రైట్ హ్యాండ్‌తో బ్యాటింగ్, ఫాస్ట్–మీడియంలో రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేసుకుంటూ, తన ఆట తను ఆడుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం 2020 మే 31న నటాషా, హార్ధిక్‌ల పెళ్లి జరిగింది. అదే ఏడాది జూలై 30న వాళ్లకు కొడుకు (అగస్త్య) పుట్టాడు. అప్పటికి ఎంతకాలంగా వాళ్లు డేటింగ్లో ఉన్నారో ఎవరికీ తెలియదు. అసలు వాళ్ల లవ్ స్టోరీనే పెద్ద రహస్యం. పెళ్లి కాగానే నటాషా కెరీర్‌కు బ్రేక్ పడింది. నటాషా చక్కటి డాన్సర్, మంచి నటి, పాపులర్ మోడల్. నటనలో తన కెరీర్‌ను మలుచుకోవటం కోసం 2012లో ఇరవై ఏళ్ల వయసులో సెర్బియా నుండి ఇండియా వచ్చారావిడ. ‘సత్యాగ్రహ’ ఆమె తొలి సినిమా. ఫిలిప్స్, క్యాడ్బరీ, టెట్లీ, జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు మోడలింగ్ కూడా చేశారు. అయితే పెళ్లి తర్వాత ఆమె డాన్స్, యాక్టింగ్, మోడలింగ్ అన్నీ మూలన పడ్డాయి. తిరిగి నాలుగేళ్ల తర్వాత మాత్రమే గత నెలలో ‘తేరే కర్కే’ అనే మ్యూజిక్ వీడియో విడుదలతో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించగలిగారు.ఈ పునరాగమనం సందర్భంగా ‘బాంబే టైమ్స్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో (ఆ ఇంటర్వ్యూ ఎక్కువగా ఆమె విడాకుల మీదే సాగింది) ఆమె ఎంతో దృఢంగా మాట్లాడారు. తను తిరిగి సెర్బియా వెళ్లేది లేదని, ముంబైలోనే ఉండిపోతానని, విడాకులు తీసుకున్నప్పటికీ ఆగస్త్య కోసం హార్దిక్, తను తరచు కలుసుకుంటూనే ఉంటామని చెప్పారు. చివరిగా ఒక ప్రశ్న దగ్గర ఆమె కొన్ని క్షణాలు మౌనం వహించారు. ‘‘మీరు విడాకులు తీసుకున్నందుకు మీ వైపు గానీ, హార్దిక్ వైపు గానీ ఎవరూ సంతోషంగా లేరనే మాట వినిపిస్తోంది?’’ అని అడిగినప్పుడు.. ఆ కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె నవ్వుతూ ... ‘‘అందర్నీ సంతోషంగా ఉంచాలంటే నేను వెళ్లి ఐస్‌క్రీమ్ బండిని నడుపుకోవాలి..’’ అన్నారు. ఆమె నవ్వుతూనే ఆ మాట అన్నా, ‘విడిపోవటం ఎవరికి మాత్రం సంతోషకరమైన విషయం..’ అని తన మనసులో అనుకునే ఉంటారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో.. ) -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
మంచానపడ్డవాణ్ని మామూలు మనిషిని చేస్తే.. మరో పెళ్లి చేసుకున్నాడు!
బొమ్మనహళ్లి: కష్టసుఖాలలో భర్తకు వెన్నంటి ఉండేది భార్య, భర్తకు ఏ కష్టం వచ్చినా తోడుండి ఊరడిస్తుంది. అదే రీతిలో భర్త తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనిని కళ్ళలో పెట్టుకొని చూసుకొన్న భార్యను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న సంఘటణ మంగళూరులో జరిగింది. వివరాలు.. స్థానిక యువతి సయాజ్ సైజ్వాని అనే యువతికి, మలేషియాలో నివాసం ఉంటున్న వ్యక్తితో 2016లో పెళ్లయింది. రెండేళ్ల తరువాత ఓ ప్రమాదంలో అతనికి పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు.ఈ సమయంలో సైజ్వాని భర్తకు సహాయంగా నిలిచింది. అన్నం తినిపించ డం, మందులు ఇవ్వడం తదితరాల సేవలు చేసే ది. భార్య చేసిన సేవల వలన పూర్తిగా కోలుకున్న భర్త అసలు బుద్ధిని చూపించాడు. భార్యకు విడాకులు ఇచ్చిన అతడు మరో మహిళను వివాహం చేసుకొన్నాడు. సైజ్వాని సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తకు రెండవ పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, అతని కథ తెలుసుకున్న నెటిజన్లు బంగారం లాంటి భార్యను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడని శాపనార్థాలు పెట్టారు. -
భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వారిద్దరూ విచారణ కోసం కోర్టులో హాజరుకాలేదు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయం నుంచి ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ వైవాహిక జీవితం ముగిసిందంటూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో రెండేళ్ల క్రితమే పిటిషన్ వేశారు. కానీ, ఇప్పటి వరకు కోర్టులో మాత్రం హజరవలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే న్యాయస్థానం ముందుకు రావాలని వారికి నోటీసులు కూడా కోర్టు పంపింది. ఈ క్రమంలో అక్టోబర్ 7న విచారణకు రావాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఇప్పుడు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి శుభాదేవి తెలిపారు.2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్య పలు విభేదాల వల్ల 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కోర్టు విచారణకు వారిద్దరూ హజరు కాకపోవడంతో మళ్లీ కలుస్తారంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
‘విడాకులు ఇవ్వలేను సార్’.. కోర్టు నుంచి భార్యను ఎత్తుకెళ్లిన భర్త
విడాకులివ్వడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. భార్యను ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ విచిత్ర ఘటన చైనాలో జరిగింది. లీకి, చెన్కి 20 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే తాగొచ్చిన భార్యను లీ హింసిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడం, భర్తలో ఎంతకీ మార్పు రాకపోవడంతో విడాకుల కోసం భార్య చెన్ కోర్టును ఆశ్రయించారు. గృహ హింస కింద కేసు పెట్టిన ఆమె విడాకులు ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే పిల్లల పోషణ బాధ్యతల దృష్ట్యా సయోధ్య సాధ్యమని భావించిన కోర్టు తొలుత విడాకులకు నిరాకరించింది. అయినా భర్త మారకపోవడంతో చెన్ మళ్లీ కోర్టును ఆశ్రయించారువిచారణకు వచ్చిన భార్యను ఎత్తుకుని కోర్టు హాల్ నుంచి లీ పారిపోయాడు. కోర్టు న్యాయాధికారులు వెంటనే జోక్యం చేసుకుని లీని మందలించారు. దీంతో లీ సెప్టెంబర్ 2న రెండో తేదీన కోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. మళ్లీ అలాంటి తప్పు చేయబోనని ప్రతిజ్ఞ చేశాడు. ‘విడాకులు ఇస్తున్నారని పొరపడ్డా. అందుకే ఆందోళనకు గురై భార్యను ఎత్తుకెళ్లా’’అని క్షమాపణ పత్రంలో రాశారు. ఎక్కడ దూరమైపోతుందోనని భర్త పడ్డ ఆవేదన చూసి భార్య మనసు కాస్తంత కరిగింది. ఇకనైనా మారతాడేమో చూద్దామని ఆయనకు మరో అవకాశం వచి్చంది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరుకాలేదు. మరోవైపు చైనాలో గృహ హింస పెద్ద సమస్యగా ఉంది. ఆల్–చైనా ఉమెన్స్ ఫెడరేషన్ ప్రకారం వివాహిత మహిళల్లో 30 శాతం గృహ హింసను ఎదుర్కొంటున్నారు. 60శాతం మంది మహిళల ఆత్మహత్యలకు గృహ హింసే కారణం. ‘జడ్జీలు, పోలీసుల ముందే కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన వ్యక్తి.. ఒంటరిగా ఉన్నపుడు భార్యను ఎంతైనా హింసిస్తాడు’అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జయం రవి విడాకులకు కారణం నేను కాదు.. సింగర్ క్లారిటీ!
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం ఒక సింగర్ అని టాక్ వినిపిస్తోంది. తాము విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక లేఖను కూడా జయం రవి విడుదల చేశారు. ఇదే విషయంపై ఆయన సతీమణి ఆర్తి కూడా తీవ్రమైణ ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఒక సింగర్ అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. జయం రవితో బెంగళూరుకు చెందిన కెనిషా ఫ్రాన్సిస్ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ కెనీషా స్పందించింది. జయం రవికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపింది. మా మధ్య ఉన్నది కేవలం బిజినెస్‌కు సంబంధించిన రిలేషన్ మాత్రమే అని అన్నారు. నాకు బిజినెస్‌లో ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంతే.. జయం రవి నాకు మంచి మిత్రుడని తెలిపింది. మీరంతా అనుకుంటున్నట్లు వారి విడాకులకు కారణం నేను కాదని తేల్చి చెప్పింది. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దంటూ సింగర్ కెనీషా కోరింది. -
సాక్ష్యాలన్నీ బయటపెడతా.. హీరో భార్యకు సింగర్ వార్నింగ్!
ప్రముఖ నటుడు జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ భార్త ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆరోపిస్తుంది. అంతేకాదు జయం రవి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమేనని జయం రవి కొట్టేశాడు. తాజాగా సింగర్ కెనిషా కూడా జయం రవి విడాకుల ఇష్యూపై స్పందిస్తూ అతని భార్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.సింగర్‌తో సహజీవనంజయం రవి గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో కలిసి ఉండడం లేదు. అతను ఒక్కడే వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగర్ కెనిషాతో ప్రేమలో పడ్డాడని..ఆమె కారణంగానే ఆర్తికి దూరంగా ఉంటున్నాడని కోలీవుడ్‌లో రూమర్స్ వచ్చాయి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అటు జయం రవి కానీ, ఇటు కెనిషా కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. తాము వృత్తిపరంగానే కలిశామని చెబుతున్నారు. అనవసరంగా మా విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. నా విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.సాక్ష్యాలన్నీ బయటపెడతా: సింగర్జయం రవి విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని చెబుతోంది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడు. ట్రీట్మెంట్ కోసం జూన్‌లో నా దగ్గరకు వచ్చాడు. ఆయనతో నాకు వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉంది. ఆయన స్నేహితుడు, క్లయింట్ కూడా. అంతకు మించి ఏమి లేదు. నా కారణంగానే విడాకులు తీసుకుంటున్నరనేది పచ్చి అబద్దం. రవి తన భార్యకు విడాకులు నోటీసులు పంపిన విషయం కూడా నాకు తెలియదు. నేను ఇచ్చిన ట్రిట్మెంట్, థెరపీకి సంబంధించిన నోట్స్‌తో పాటు అన్ని సాక్ష్యాలు కోర్టుకు ఇవ్వగలను. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదంటూ పరోక్షంగా ఆర్తికి వార్నింగ్ ఇచ్చింది. కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. ఈ నెల 9న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. -
భర్తతో విభేదాలు.. విడాకుల కోసం కోర్టుకు నటి ఊర్మిళ మటోండ్కర్!
-
'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!
రాంగోపాల్ వర్మ 'రంగీలా' సినిమాతో దేశవ్యాప్తంగా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈమెనే విడాకుల కోసం అప్లై చేసింది. భర్తకు ఇష్టం లేకపోయినా సరే ఈమె విడిపోవాలని అనుకుంటోందట. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)పెళ్లి-ఫ్యామిలీ విషయానికొస్తే.. 2014లో ఓ పెళ్లిలో కశ్మీరి బిజినెస్‌మ్యాన్ మోసిన్ అక్తర్‌ని కలిసింది. అలా మొదలైన వీళ్ల పరిచయం రెండేళ్లు తిరిగేసరికి పెళ్లి అనే బంధంగా మారింది. ముంబైలోని ఊర్మిళ ఇంట్లో అతికొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇప్పటివరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు బాగానే ఉన్నారు. గత కొన్నాళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం కోర్టులో విడాకుల కోసం ఊర్మిళ అప్లై చేసిందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటోందని, కానీ భర్త ఇది నచ్చకపోవడంతో విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. అక్కడ కూడా అచ్చిరాకపోవడంతో తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటోంది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్
ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ షాకింగ్ ట్వీట్ చేసింది. భార్యభర్తల అనుబంధం గురించి చాలా పెద్దగా రాసుకొచ్చింది. భర్త ఎలా ఉండాలి. భార్యని ఎలా చూసుకోవాలి అనే విషయాల్ని చాలా చక్కగా చెప్పింది. తలాతోక లేకుండా ఉన్న ఈ ట్వీట్ చూస్తే ఏం అర్థం కాదు. కానీ ఈ మధ్య జయం రవి విడాకులు తీసుకున్నాడు. తనకు కనీసం చెప్పుకుండా ఈ పనిచేశాడని అతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఖుష్బూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది.ట్వీట్లో ఏముంది?'తన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచాలనుకునే వ్యక్తి.. ప్రేమించిన వారి అవసరాలు, కోరికలు తీర్చేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్లి అనే బంధంలో ఎత్తుపల్లాలు సహజం. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అంతమాత్రాన బంధాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమ అనేది అప్పుడప్పుడు తగ్గొచ్చు. కానీ గౌరవం, మర్యాద చెక్కు చెదరకుండా ఉండాలి. పురుషుడు తన భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి'(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్)'స్వార్థంతో ఉండే వ్యక్తి తన పనుల వల్ల మిగతా వాళ్ల మనసులు ఎలా బాధపడతాయనేది చూడలేడు. ఇలాంటి ప్రవర్తన వల్ల కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుంది. జీవితం చాలా అందమైనది. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాల వల్ల పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం కావొచ్చు. తన భార్యని గౌరవించలేని వ్యక్తి.. జీవితంలో ఎదగడు. నిన్ను ప్రేమించిన, తోడుగా నిలబడిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరం. గౌరవం అనేది కుటుంబంలో ఉండాలి. ఈ విషయాన్ని మరిచిపోయిన వ్యక్తి ప్రేమ కంటే విలువైన బంధాన్ని, నిజమైన ఆనందాన్ని కోల్పోయినట్లే' అని ఖుష్బూ రాసుకొచ్చింది. ఇదంతా జయం రవిని ఉద్దేశించే పెట్టిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.జయం రవి సంగతేంటి?తమిళ స్టార్ జయం రవి చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. 'పొన్నియిన్ సెల్వన్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నిరోజుల క్రితం విడాకులు ప్రకటన చేశాడు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం అని చెప్పాడు. భార్య ఆర్తి మాత్రం తనకు తెలియకుండా ఇలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ప్రేమనే విడాకులకు కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌నే బూతులు తిడతావా? ఇంట్లో నుంచి వెళ్లిపో..)A true man stands tall, putting his family above all else. His needs, whims, desires, and freedoms all come second to the ones who love him unconditionally. In the journey of life, every marriage faces its ups and downs, and yes, mistakes happen. But these missteps never grant a…— KhushbuSundar (@khushsundar) September 21, 2024 -
వివాహ‘బంధం’ తెగతెంపులు!
సాక్షి, హైదరాబాద్: వివాహమైన ఏడాది, రెండేళ్లకే విడాకులకు సిద్ధమౌతున్న విచిత్రపరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. గతంలో భారత సెలబ్రిటీల్లోనే (సినిమా, క్రీడలు, వ్యాపార, ఇతర రంగాల వారు) ఈ ట్రెండ్ అధికంగా కనిపించగా, రానురాను దాదాపు అన్ని వర్గాల్లో ఈ ధోరణి సాధారణంగా మారుతోంది. గతంతో పోల్చితే... గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగినట్టుగా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. విడాకులంటేనే ఏదో చేయరాని నేరం అని ఏళ్లుగా పేరుకుపోయిన భావన నుంచి నేటితరం బయటపడడంతో జీవితంలో నూతన అధ్యాయం కోసం యువతరం మొగ్గుచూపుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి పెరగడానికి వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలోని వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురికావడం, సామాజిక–సంప్రదాయ విలువలు, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ తదితర కారణాలతో విడాకులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తే (2022 సంవత్సరం చివర్లో) దేశంలో విడాకుల శాతంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. విడాకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేశాక వివిధ దశలు దాటి తీర్పు వెలువడే నాటికి పదేళ్లకుపైగా పడుతున్న సందర్భాలు కూడా ఉండటంతో... అనధికారికంగా విడిపోతున్న జంటలు పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అత్యధికంగా ఇండోర్‌లో... 👉 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 👉 దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 715 ఫ్యామిలీ కోర్టులున్నాయి. 👉 ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కోసమే కాగా... వాటిలో పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులు 3,000. 2018లో 2,250 కేసులు ఫైల్ కాగా, 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి. 👉 గత పదేళ్లలో...అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో 350 శాతం పెరిగిన విడాకులు. ఇదే సమయంలో పంజాబ్, హరియాణాల్లో 150 శాతం ఈ కేసుల వృద్ధి 👉 గత ఐదేళ్లలో ఢిల్లీలో విడాకుల శాతం రెండింతలు పెరిగింది. 👉 ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి జాగ్రత్తలు తీసుకుంటే... ‘ఈ మధ్య వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వీరిలో 30 శాతం దాకా తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేందుకు మొగ్గుచూపుతుంటే, అధికశాతం మొండికేసి విడాకుల కోసం పట్టుపడుతున్నారు. తెగతెంపులకు 40 నుంచి 50 శాతం తల్లితండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటోంది. విడాకులు తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు. అదేదో డయోబెటిస్, థైరాయిడో వచ్చిందనేంత తేలికగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దంపతుల మధ్య ఒకరిపట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు చేసుకోలేక ఘర్షణ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరిలోనూ స్వార్థం పెరిగిపోవడం, సహానుభూతి కొరవడడం, అనుమానాలు పెరగడం ప్రభావం చూపుతున్నాయి. తల్లితండ్రులు కూడా సర్దుబాటు అవగాహన కలి్పంచకపోగా, చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేమీ తక్కువ అనేలా రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం తగ్గిపోయి, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేవకపోవడం, గొడవలకు తల్లితండ్రులను మధ్యలోకి తెచ్చి బాధ్యులను చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరి మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి. – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్ వివాహబంధం అక్కర్లేదనే అంచనాకు.. ‘మన దగ్గరా విడాకులు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే... దేశంలో అమ్మాయిలకు మంచి విద్యతోపాటు ఉద్యోగావకాశాలు పెరగడంతో ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. యూఎస్, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వృద్ధికావడంతో గిల్లికజ్జాలు, చికాకులు, సమస్యలతో వివాహబంధాన్ని తప్పక కొనసాగించాల్సిన అవసరం లేదనే అంచనాకు ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వస్తున్నారు. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు పెరిగిపోవడంతో ఇంటాబయటా మహిళలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రోజూ సమస్యలు ఎదుర్కొంటూ బతకడం కంటే విడిపోయి సంతోషంగా జీవించవచ్చనే అభిప్రాయానికి అమ్మాయిలు వస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ఇళ్లలోని పరిస్థితులు మారకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతోపాటు వారిద్దరి మధ్య ప్రతీ చిన్న విషయంలో తల్లితండ్రులు కలగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. సమాజంలో ఇంకా పురుషాధిక్యత అనేది ఏదో ఒక రూపంలో కొనసాగడం, పిల్లలుంటే వారి భారమంతా తమపైనే పడుతుందని సంతానం వద్దనే నిర్ణయానికి 10 నుంచి 15 శాతం యువతులు వస్తున్నారు. ఈ మేరకు పెళ్లికి ముందే ఒప్పందం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడటం, దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడంతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!
భార్యా భర్తలమధ్య విభేదాలు వచ్చినపుడు విడిపోవడం సహజం. ఇక ఇద్దరి మధ్యా సంబంధాలు ఒక కొనసాగలేవు అనుకున్నపుడు విడాకులకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వ్యవహారం ఒక్కోసారి పరస్పర అంగీకారంతో ఈజీగా అయిపోతుంది కూడా. అయితే విడాకులకు సంబంధించి కొన్ని విస్తుపోయే కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విడాకుల కేసు పలువురిని ఆలోచనలో పడేసింది. విషయం ఏమిటంటే..ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. తన భర్త రాజేష్ 40 రోజుల్లో ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడనీ, దీంతో అతని శరీరం నుంచే ఆ దుర్వాసనను భరించలేక పోతోంది. పైగా వారానికోసారి పవిత్రంగా భావించే గంగాజలాన్ని చల్లుకుంటాడట. ఇక అతనితో జీవించడం తన వల్ల కాదని కోర్టును ఆశ్రయించింది. పెళ్లయినప్పటి నుంచీ అదీ తాను బలవంతంగా చేయగా కేవలం ఆరు సార్లుమాత్రమే స్నానం చేశాడు. దీంతో రాజేష్ భార్య మహిళ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది విడాకులు కావాలని కోరింది.అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తరువాత డైలీ స్నానం చేసేందుకు పరిశుభ్రంగా ఉండేందుకు రాజేష్ ఒప్పుకున్నాడు. కానీ ఆ మహిళ అతడితో ఉండడానికి ఇష్టం పడటం లేదు. దీంతో మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సిలింగ్ కు రావాలని వెల్లడించారు అధికారులు.కాగా ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కాదు. భర్త కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని విడాకులు కోరిన ఘటన ఇటీవల ఆగ్రాలో వచ్చిన సంగతి తెలిసిందే. -
విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా?
పెళ్లయినప్పటినుంచి భర్త వేధింపులు తప్పడం లేదు. పిల్లలు పుట్టి వాళ్లు కాస్త పెద్దవాళ్లయినా మారలేదు సరి కదా, ఇంకా ఎక్కువైంది. ఇంక భరించలేక విడిపోతున్నాను. నాకు, నా పిల్లలకు ఆస్తిలో వాటా వస్తుందా? – పి. అనిత, నెల్లూరుసాధారణంగా స్థిరాస్తులు ఎవరి పేరుతో అయితే ఉంటాయో వారికి మాత్రమే చెందుతాయి వారి స్వార్జితం కిందనే పరిగణించ బడతాయి. కానీ అన్నివేళలా అదే నియమం వర్తించదు. భార్యకు భర్త ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే అంశం భర్త మతాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు వర్తించే చట్టాల ప్రకారం మీ భర్త పేరిట ఉన్న ఆస్తి వారసత్వం ద్వారా సంక్రమించింది అయితే గనక అందులో మీ పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. మీ పిల్లలు మైనర్లు అయితే వారి తరఫున మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ పిల్లలకి వారి వాటా వారికి దక్కుతుంది. అదే మీ భర్త స్వార్జితం అయితే మాత్రం తన తదనంతరం వీలునామా ప్రకారం, వీలునామా లేని పక్షంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం లేదా భర్త జీవితకాలంలో స్వయంగా ఇవ్వాలి అని తలిస్తే మాత్రమే భార్యకి హక్కులు ఉంటాయి.మరో విషయం... భార్యకు తన జీవితకాలం మొత్తం భర్త ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ లేదా విడాకులు తీసుకునే సమయంలో భర్త ఆస్తిలో భార్యకు వాటా వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం వాటా ఇవ్వాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ లా, ముస్లిం లా, క్రిష్టియన్ లా, ఇలా వేర్వేరు మతస్తులకు వేరే విధమైన హక్కులు ఉంటాయి.మీరు భర్త వేధింపులు తట్టుకోలేక విడి΄ోతున్నాను అని చె΄్పారు కాబట్టి, డీ.వీ.సీ. చట్టం (గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005) కింద కేసు వేసినట్లయితే, అందులో అనేక రకాల హక్కులను, ఉపశమనాలను పొందవచ్చు. కేసు తేలేంతవరకు మీ భర్త ఆస్తులను అమ్మకుండా కోర్టు వారు స్టే విధించే అవకాశం కూడా ఉంది. డీ.వీ.సీ. చట్టం సెక్షన్ 22 ప్రకారం అదనపు దరఖాస్తు చేసుకుంటే, మీరు కోరిన ఉపశమనాలతో పాటు మానసిక హింస, మానసిక క్షోభతో సహా మీకు కలిగిన గాయాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. డీ.వీ.సీ. చట్టం ప్రకారం భర్త ఆస్తి పై కేసు వేసే వీలుందా లేదా అన్నది ప్రతి కేసులోనూ విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లాయర్ని సంప్రదిస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల , హైకోర్టు న్యాయవాది -
విడాకుల గురించి జయం రవిపై భార్య సంచలన ఆరోపణ
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఈమేరకు ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.'ఇటీవల మా వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి నేను ఆందోళన చెందాను. నాకు తెలియకుండా, నా నుంచి అనుమతి లేకుండానే విడాకుల గురించి ప్రకటించారు. ఇలా చెప్పకుండా బహిరంగ ప్రకటన చేయడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురికావడమే కాకుండా చాలా బాధపడ్డాను. 18 సంవత్సరాలుగా కలిసి జీవించాం. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నాకు చెప్పకుండా ప్రకటించడం ఏంటి..? వ్యక్తుల మధ్య దయ, గౌరవంతో పాటు గోప్యతతో నిర్వహించాలని నేను నమ్ముతున్నాను. కొంతకాలంగా మేమిద్దరం దూరంగానే ఉంటున్నాము. మా కుటుంబాల మధ్య వచ్చిన గొడవలపై పరిష్కిరించుకుందామని అనేకసార్లు ప్రయత్నించాను. కానీ, ఫలితం లేదు. నా భర్తతో నేరుగా మాట్లాడటానికి అనేకసార్లు కోరుకున్నాను. ఇప్పటికీ కూడా నేను ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. కానీ,దురదృష్టవశాత్తూ, ఆ అవకాశం నాకు లభించలేదు.' ఇదీ చదవండి: సతీమణితో విభేదాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న జయం రవి'ఈ ప్రకటనతో నాతో పాటు నా పిల్లలు కూడా షాకయ్యారు. విడాకుల విషయంపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం కుటుంబానికి ప్రయోజనం చేకూర్చదు. నేను గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకు బహిరంగంగా ఈ వివాదాల గురించి కామెంట్ చేయలేదు. అనేకమార్లు బాధ కలిగినా గౌరవం కాపాడాలనే చూశాను. కానీ, ఇప్పుడు నాపై అన్యాయంగా దారుణమైన నిందలు వేస్తున్నారు. ఈ క్రమంలో నాపై తప్పుగా వార్తలు వస్తున్నాయి. అవి చూసి భరించడం నావల్ల కావడం లేదు. అయితే, ఒక తల్లిగా ఎల్లప్పుడూ నా పిల్లల శ్రేయస్సు మాత్రమే కోరుకుంటాను. కాలక్రమేణా ఆ నిందలు వారిపై ప్రభావం చూపొచ్చు. దానిని తలుచుకుంటే బాధేస్తుంది. ఇన్నాళ్లు మాకు మద్ధతుగా నిలిచిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. భవిష్యత్‌లో మా పట్ల మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను.' అని ఆర్తి తెలిపింది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
సతీమణితో విభేదాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్స్టాప్ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. 2009లో ఆర్తిని జయం రవి వివాహం చేసుకున్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట మధ్య పలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయం గురించి జయం రవి ఒక నోట్ విడుదల చేశారు.'మేము ఇద్దరం చాలా ఆలోచించి, అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఆర్తితో నా వైవాహిక జీవితం ముగిసింది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. నాకు తప్పడం లేదు. ఈ నిర్ణయం అంత తేలికగా తీసుకోలేదు. నాపై ఆధారపడిన వారి సంక్షేమం, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తీసుకున్నాను. ఈ సమయంలో నా ప్రైవసీతో పాటు నా సన్నిహితుల గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మీలో చాలామంది నన్ను ఆదరించి మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో పాటు మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను.ఈ నిర్ణయం నా సొంత నిర్ణయం మాత్రమే. ఈ విషయం నా వ్యక్తిగత విషయంగానే అందరూ భావిస్తారని ప్రార్థిస్తున్నాను. జీవితం అనేది విభిన్న అధ్యాయాలతో కూడిన ప్రయాణం. ఎప్పుడూ కూడా అనేక సవాళ్లు, అవకాశాలతో ముగుస్తుంది. నేను ఎప్పటికీ మీ జయం రవిగానే ఉంటానని అభిమానులను కోరుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ కృతజ్ఞతగా భావిస్తున్నాను.' అని జయం రవి పేర్కొన్నారు.Grateful for your love and understanding. Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024జయం రవి- ఆర్తి దంపతులకు అర్వ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలీవుడ్ మీడియా అనేకసార్లు ప్రచురించింది. దీంతో కొంత కాలంగా వారిద్దరూ కూడా వేరువేరుగానే జీవిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోనే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. -
ముస్లిం వివాహాలు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: అసెంబ్లీలో బిల్లు
ముస్లిం వివాహాలు, విడాకుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును అస్సాం కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.‘అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్యేజ్ అండ్ డివర్స్ బిల్లు-2024’ను ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టగా.. మెజార్టీ సభ్యుల అంగీకరంతో ఆమోదం పొందింది. దీని ద్వారా బ్యాల వివాహాలను నిషేధించడం వీలవుతుందని సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఖాజీలు లేదా మతపెద్దలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని, ఇకపై అలా కుదరదని తెలిపారు. కొత్త బిల్లు ప్రకారం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరుగుతుందన్నారు.కాగా, వధువు 18 ఏళ్లు నిండకపోయినా.. వరుడికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అయితే కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ముస్లిం మైనర్ బాలికలు తమ వివాహాన్ని నమోదు చేసుకోలేరని సీఎం తెలిపారు.ఇంతకముందు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేసింది. అయితే ఖాజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అస్సాంలోని పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిని అభ్యర్థించాయి. -
భారీగా భరణం.. భార్యకు షాకిచ్చిన జడ్జి
సాధారణంగా భారతదేశంలో భర్త నుంచి విడాకులు తీసుకున్నాక మహిళలకు కొన్ని హక్కులుంటాయి. వీటి ద్వారా మాజీ భర్త ఆస్తిని ఆమె అడగవచ్చు. ఆర్థిక సాయంగా భరణం పొందవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ భరణం కావాలని కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఒకటి కాదు రెండు కాదు తన భర్త నుంచి నెలవారీ భరణం రూ.6 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో జడ్జి ముందు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఓ దంపతులు తమకు విడాకులు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ సందర్భంగా సదరు వివాహిత.. తన భర్త నుంచి నెలకు భరణంగా రూ. 6.16 లక్షలు ఇప్పించాలంటూ న్యాయమూర్తిని కోరారు.మోకాలినొప్పికి ఫిజియో థెరపీ చేయించుకునేందుకు నెలకు రూ.4 నుంచి 5 లక్షలు, దుస్తులు, షూలకు రూ.15 వేలు, ఇంట్లో భోజనానికి రూ.60 వేలు, హోటల్లో భోజనానికి వెళితే మరికొంత ఖర్చు అవుతుందని మొత్తం లెక్కలు చెప్పింది.😱Wife ask for ₹6,16,300 per month as #MaintenanceAnd her advocate is trying to justify.Judge-"If she want to spend this much, let her earn, not on the husband"pic.twitter.com/XexRGe5hUb— ShoneeKapoor (@ShoneeKapoor) August 21, 2024అవన్నీ విలాసవంతమైన ఖర్చులుఅయితే వివాహిత డిమాండ్లు విన్న మహిళా జడ్జి షాక్‌కు గురైంది. ఒక్క మహిళకు నెలకు రూ. 6 లక్షలు ఎక్కువ అని, అవన్నీ విలాసవంతమైన ఖర్చులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా? మీరు మీ కోసం అంత మొత్తం ఖర్చు చేయాలనుకుంటే మీరు సంపాదించుకోండి. భర్త నుంచి కోరడం కాదు. మీకు వేరే బాధ్యతలు లేవు. పిల్లలను చూసుకునే పని లేదు. ఇవన్నీ మీకోసం మాత్రమే అడుగుతున్నారు. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 24 ఉద్దేశం ఇది కాదు. భర్తతో గొడవల కారణంగా విడాకులు అడుగుతున్నారు. కానీ రూ. 6,16,000 అడగటం సరి కాదు. మీ కారణాలు సహేతుకంగా ఉండాలి. భర్తకు ఇది శిక్ష కాకూడదు.’ అంటూ మహిళను హెచ్చరించింది. భర్త నుంచి ఆరు లక్షలు ఇప్పించేందు న్యాయమూర్తి నిరాకరించారు. వాస్తవ ఖర్చులతో మళ్లీ కోర్టుకు రావాలని తెలిపారు. -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
మరోసారి విడాకుల రూమర్స్.. అభిషేక్ రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిలోనూ వీరిద్దరు విడివిడిగా ఫోటోలకు ఫోజులివ్వడంతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అయితే తాజాగా అభిషేక్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో తమపై వస్తున్న విడాకాల రూమర్స్‌పై చివరికీ అభిషేక్ బచ్చన్ స్పందించాల్సి వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం. నాకు పెళ్లయింది క్షమించండి' అన్నాడు అతను తన ఉంగరాన్ని చూపించాడు. దీంతో తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. అభిషేక్, ఐశ్వర్య 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించారు. వీరిద్దరూ జంటగా ధాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, గురు, ధూమ్- 2, రావణ్ లాంటి చిత్రాల్లో నటించారు. -
ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్..
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. ఈ జంటకు ఆరాధ్య అనే ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఐశ్వర్యరాయ్ ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు. తన అభిషేక్ బచ్చన్‌తో కలిసి పెళ్లి వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి.అయితే గత కొన్నేళ్లుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ బర్త్ డే రోజు ఆలస్యంగా విష్ చేయడంతో అప్పట్లోనే.. వీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆరాధ్య పుట్టినరోజు సైతం ఇలాంటి రూమర్స్ బీటౌన్‌లో వైరలయ్యాయి.తాజాగా అభిషేక్ బచ్చన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐశ్వర్యరాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు అభిషేక్ మాట్లాడిన వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల సినీతారలపై డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో మరోసారి విడాకుల చర్చ మొదలైంది. అయితే ఇది ఫేక్ వీడియో అంటూ ఐశ్వర్య, అభిషేక్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by aishwaryafan (@aishwaryaraireall) -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
అత్తామామల కళ్లెదుటే.. భార్యను సజీవదహనం చేసిన భర్త
ఓదెల(పెద్దపల్లి): అదనంగా రూ.5 లక్షల కట్నం తేవడం లేదనే ఆగ్రహంతో భర్త, బావ, తోటికోడలు, అత్తామామ కలిసి వివాహిత యాట లావణ్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసినట్లు నేరం రుజు వు కావడంతో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి హేమంత్‌కుమార్ శనివారం తీర్పు వెలువరించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీ పీ గజ్జి కృష్ణ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామానికి చెందిన యాట కుమారస్వామి పెద్దకూతురు యాట లావణ్యను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనూర్ గ్రామానికి చెందిన వీర్ల రవీందర్‌కు 2013లో ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.10లక్షల కట్నం, పది తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంఛనాలు అప్పగించారు. మూడు నెలల తర్వాత అదన ంగా రూ.ఐదు లక్షల కట్నం కావాలని భర్త రవీందర్, అత్తామామలు రాజమ్మ, కొమురయ్య, బావ కు మారస్వామి, తోటికోడలు భారతి కలిసి లావణ్య ను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభిమచారు. ఈక్రమంలో 2014 మే 16వ తేదీన లా వణ్యపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలు తల్లితండ్రులతో కలిసి కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ చేశారు. లావణ్యను ఇకనుంచి బాగా చూసుకుంటామని చెప్పడంతో తల్లితండ్రులు ఆమెను అత్తగారింటికి పంపారు. కొద్దికాలం త ర్వాత తనకు విడాకులు కావాలని భర్త కోర్టుకు వె ళ్లాడు. ఈక్రమంలోనే 25 సెప్టెంబర్ 2014న అదనపు కట్నం తేవాలని ఐదుగురు కలిసి లావణ్యను కొట్టారు. ఈవిషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తన తల్లిదండ్రుకు చెప్పింది. వారు వెంటనే కొలనూరు గ్రామానికి చెరుకున్నారు. ఇక్కడుంటే లావణ్య ప్రాణానికి ముప్పు ఉంటుందని భావించి, త మతో రావాలని కూతురుకు తల్లిదండ్రులు సూచించారు. లావణ్య బట్టలు తీసుకుని వచ్చేందుకు ఇంట్లోకు వెళ్లగానే భర్త, అత్తామామ, బావ, తోటికోడలు కలిసి ఇంట్లోకి వెళ్లి లావణ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే ఈ అఘాయిత్యం జరిగింది. అయితే, తీవ్రంగా గాయపడిన లావణ్యను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందు తూ 28 సెప్టెంబర్ 2014న మృతిచెందింది. మృతురాలి లావణ్య తండ్రి యాట కుమారస్వామి ఫిర్యా దు మేరకు అప్పటి ఏసీపీ వేణుగోపాల్‌రావు కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాహలు చేశా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి, డీసీపీ చేతన, ఏసీ పీ కృష్ణ పర్యవేక్షణలో కోర్టులో సాక్షలను ప్రవేశ పె ట్టారు. నేరం రుజువు కావడంతో భర్త, అత్తామామ, బావ, తోటికోడలుకు పదేళ్ల కారగారా శిక్ష, ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పు మొత్తం రూ.30వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సాక్షులను ప్రవేశపె ట్టడానికి సహకరించిన సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై అశోక్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీని వాస్‌ను రాంగుండం సీపీ శ్రీనివాస్ అభినందించారు. -
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?
పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది.. పెళ్లి అనేక మధురానుభూతులకు, జ్ఞాపకాలకు వేదిక.. ఇలాంటి పదాలన్నీ తరుచూ వింటుంటాం.. ఒకప్పుడు పెళ్లంటే గౌరవం, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దంపతుల మధ్య అపార్థాలు, చిన్న సమస్యలనే పెద్దదిగా చూడటం.. ఇలా అనేక కారణాలతో పెళ్లైన వెంటనే విడాకుల బాట పడుతున్నారు.తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడు అంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. వినడానికి కాస్తా ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్ దేశంలో జరిగింది. అయితే ఈ సంఘటన 2019 జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్‌గా మారింది. కువైట్‌లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానా అంటూ పరుష పదజాలానికి దిగాడు.తనకు సాయం చేయాల్సింది పోయి, పరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడిగింది. దీని న్యాయమూర్తి అంగీకరించి వెంటనే విడాకులు మంజూరు చేేశాడు.అయితే పెళ్లైన మూడు నిమిషాలకే ఆ జంట విడాకులు తీసుకోవడంతో.. దేశ చరిత్రలో అతి తక్కువ సమయం వివాహంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉండగా గతంలో దుబాయ్‌లో ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. -
విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల క్రితం వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ 'లాల్ సింగ్ చద్దా' ఘోరమైన డిజాస్టర్ కావడంతో తాత్కాలికంగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలోనే భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా సరే కిరణ్ ఇంకా ఆ జ్ఞాపకాల్లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డివోర్స్ తీసుకున్నా కానీ తను సంతోషంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)'మనం ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాం. అలానే బంధాలు అనేవి కొత్త రూపు సంతరించుకోవాలి. ఆమిర్ నా జీవితంలోకి రాకముందు నేను చాలా ఏళ్లపాటు ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనాన్ని నేను ఎంజాయ్ చేశా. కానీ ఇప్పుడు నాకు ఆజాద్ (కొడుకు) తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఒంటరి కాదు. చాలామంది విడాకులు తీసుకున్నా తర్వాత ఒంటరిగా ఉండలేక సతమతమవుతుంటారు. నాకు ఆ విషయంలో భయం లేదు. ఎందుకంటే ఇరు కుటుంబాలు నాకు ఇప్పటికీ అండగా ఉన్నాయి. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు' అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చింది.కిరణ్ రావ్ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. 'యానిమల్' రిలీజ్ టైంలో పరోక్షంగా మూవీపై సెటైర్ వేశారు. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈమెకు కౌంటర్ ఇచ్చేశాడు. దీంతో ఈమె సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్'.. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి, భర్త నుంచి తప్పిపోతే ఏం జరిగిందనేదే స్టోరీ. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మరోసారి తన విడాకులు గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
బిగ్‌బాస్ ఎంత పనిచేసింది.. యూట్యూబర్ విడాకులు!?
బిగ్‌బాస్ షో వల్ల పచ్చని కాపురం చెల్లాచెదురైపోయేలా ఉంది. ఇప్పుడు చెబుతుంది తెలుగు బిగ్ బాస్ గురించి కాదు. హిందీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న ఓటీటీ మూడో సీజన్ గురించి. ఇద్దరు భార్యలతో కలిసి అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్ ఇందులో పాల్గొనగా.. ఓ భార్య ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమెనే విడాకులు తీసుకుంటానని అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)అర్మాన్ మాలిక్ అనే యూట్యూబర్.. కృతిక-పాయల్ అనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అలా ఫేమస్ అయిన అర్మాన్.. రీసెంట్గా మొదలైన బిగ్‌బాస్ ఓటీటీ 3లోకి భార్యలతో కలిసి వచ్చాడు. కాకపోతే పాయల్ తొలి వారమే ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె ఇంట్లో పిల్లల బాగోగులు చూసుకుంటోంది. అయితే ఈమెని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వ్లాగ్‌లో దీని గురించే బాధపడుతూ విడాకులు తీసుకుంటానని అంటోంది.తనని కృతికని లెస్బియన్స్ అంటున్నారని, అలానే ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు ఉండటం తప్పులా చూస్తూ, అందరూ తననే నిందిస్తున్నారని పాయల్ చెప్పుకొచ్చింది. అలానే ఈ విమర్శలు వల్ల ఒత్తిడికి బాగా లోనవుతున్నానని.. బిగ్ బాస్ హౌస్ నుంచి అర్మాన్-కృతిక బయటకొచ్చిన తర్వాత విడాకులు గురించి మాట్లాడుతానని పాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా నిజంగానే చెబుతోందా? లేదంటే వ్యూస్ కోసమే చేసిన స్టంటా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?) -
అనుకున్నదే అయ్యింది.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన హార్దిక్-నటాషా..
-
#Hardhikpandya: అయ్యో హార్దిక్.. నీకే ఎందుకిలా! నీకు మేము ఉన్నాము
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు ప్రొఫెషనల్‌గాను హార్దిక్ గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలకడంతో భారత తదుపురి టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అంతా భావించారు.కానీ బీసీసీఐ మాత్రం పాండ్యాకు ఊహించని షాకిచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా టీ20 కెప్టెన్‌గా పాండ్యాను కాదని స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను నియమించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.అయితే శ్రీలంక పర్యటనకు జట్టు ప్రకటించిన కొద్ది సేపటికే హార్దిక్ మరో బాంబు పేల్చాడు. గత కొన్ని నెలలగా తమ వైవాహిక జీవితానికి సంబంధించి వస్తున్న రూమర్స్‌ను హార్దిక్ పాండ్యా, అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ నిజం చేశారు. హార్దిక్ పాండ్య- నటాషా తామిద్దరూ విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన ద్వారా తెలియజేశారు. "మా 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసిండేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశాము. కానీ విడిపోవడమే ఉత్తమమని మేమిద్దరం భావించాము. పరస్పర గౌరవం, ఆనందంతో కలిసి ఒక కుటంబంగా ఎదిగిన తర్వాత విడిపోవడం నిజంగా కష్టమే. కానీ ఈ కఠినమైన నిర్ణయం తీసుకొక తప్పట్లలేదు. మా ఇద్దరి జీవితాల్లోనూ అగస్త్య భాగంగా ఉంటాడు. అగస్త్యకు కో పెరెంట్‌గా మేము కొనసాగుతాం. అతని ఆనందం కోసం మేం ఏమైనా చేస్తాం. ఈ క్లిష్టమైన సమయంలో మాకు మీ మద్దతు కావాలి. మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని ప్రకటనలో హార్దిక్, నటాషా పేర్కొన్నారు. అయితే ఈ క్టిష్టసమయంలో హార్దిక్‌కు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. కమాన్ హార్దిక్.. నీకు మేము ఉన్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. మరి కొందరు అయ్యో హార్దిక్.. నీకేందుకు ఇన్ని కష్టాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐపీఎల్-2024 సమయంలోనూ పాండ్యా దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పాండ్యా అటు సారథిగా, ఇటు ఆటగాడిగా విఫలయ్యాడు. దీంతో పాండ్యాను దారుణంగా ట్రోలు చేశారు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024లో పాండ్యా దుమ్ములేపడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. తిట్టిన నోళ్లే అతడిని ప్రశించాయి. Stay strong 🥺💔 #HardikPandya pic.twitter.com/aByDFMkRqH— rj facts (@rj_rr1) July 18, 2024 -
నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... స్టార్ ప్లేయర్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించాడు. తన భార్య నటాషా స్టన్కోవిచ్తో వివాహ బంధం ముగిసినట్లు అతను అధికారికంగా ప్రకటించాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. వీరిద్దరికి 2020లో వివాహం కాగా...అగస్త్య అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. సెర్బియాకు చెందిన స్టన్కోవిచ్ మోడలింగ్, సినిమాల్లో నటిస్తూ ముంబైలో స్థిరపడిన సమయంలో పాండ్యాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గత కొంత కాలంగా పాండ్యా, స్టన్కోవిచ్ మధ్య విభేదాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇద్దరూ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు విడాకుల తర్వాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని, అతని కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని పాండ్యా స్పష్టం చేశాడు. -
ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా?
బాలీవుడ్ జంట ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారట! కొన్ని నెలల నుంచి ఈ వార్త జోరీగలా సోషల్ మీడియా అంతటా తిరుగుతోంది. కలిసి కనిపించకపోతే విడాకులనేస్తారా? మా కాపురంలో నిప్పులు పోస్తున్నారేంటని హీరో అభిషేక్ బచ్చన్ ఎప్పటిలాగే ఇటీవల సైతం మండిపడ్డాడు. తాము బాగానే ఉన్నామని తెలియజేస్తూ.. ఒకరి బర్త్‌డేకి మరొకరు ఆలస్యంగానైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.ఫంక్షన్‌కు వేర్వేరుగాఅయినా ఎక్కడో తేడా కొడుతుంది అని ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు. వీరి అనుమానాలను నిజం చేస్తూ ఐశ్వర్య తన కూతురు ఆరాధనను తీసుకుని అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లింది. అలా అని అభిషేక్ వెళ్లలేదా? అంటే వెళ్లాడు. తన తల్లిదండ్రులు జయ- అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. కుటుంబమంతా కలిసి రాకుండా ఇలా సెపరేట్‌గా వచ్చారేంటి? వీళ్లు కలిసి లేరని ఇక్కడే అర్థమవుతోందోని ఎవరికి వారే అనుకున్నారు. విడాకుల పోస్టుపై అభిషేక్ ఆసక్తిపెళ్లికి కలిసి వెళ్లలేదు, కలిసి ఫోటోలూ దిగలేదు.. కానీ లోపలికి వెళ్లాక మాత్రం ఐష్- అభిషేక్ పక్కపక్కనే కూర్చుని కబుర్లాడినట్లు ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. దీంతో వీరి వ్యవహారం ఎవరికీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఇంతలోనే తాజాగా అభిషేక్ ఓ విడాకుల పోస్టును లైక్ చేశాడు. అందులో ప్రేమ కష్టంగా మారితే.. అని రాసుంది.50 ఏళ్ల తర్వాత కూడా..ఇంకా ఏమని ఉందంటే.. విడాకులు తీసుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదు. కానీ కొన్ని సార్లు జీవితం మనం అనుకున్నట్లు సాగదు. దశాబ్దాలపాటు కలిసుండి వేరుపడితే ఆ బాధను ఎలా తట్టుకుంటున్నారు? 50 ఏళ్ల తర్వాత కూడా విడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలున్నాయని అందులో రాసుకొచ్చారు. పత్రికలో వచ్చిన వ్యాసాన్ని దీనికి జత చేశారు. ఈ పోస్టును అభిషేక్ లైక్ చేయడంతో.. మళ్లీ విడాకుల చర్చ మొదలైంది.చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్ -
అందం ప్లస్ తెలివి ప్లస్ ధైర్యం.. ఇన్‌స్టా విడాకుల దుబాయ్ యువరాణి షైకా మహ్రా (ఫోటోలు)
-
ఇన్‌స్టాలో దుబాయ్ యువరాణి ఇన్స్టంట్ విడాకులు
దుబాయ్: దుబాయ్ యువరాణి షైఖా మహ్రా మహమ్మద్ రషీద్ అలీ మక్తూమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తన భర్త షేక్ మనాబిన్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌కు విడాకులిచ్చారు. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యంలో ఉన్నందున మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఐ డివోర్స్ యూ.. ఐ డివోర్స్ యూ.. ఐ డివోర్స్ యూ. జాగ్రత్తగా ఉండండి. ... మీ మాజీ భార్య’’ అంటూ జూలై 16న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. యువరాణి పోస్ట్ చేసిన వెంటనే ఆమె శ్రేయోభిలాషుల నుంచి సందేశాలు వెల్లువలా వచ్చాయి. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా తొలగించారు. షైఖా మహర్రా ప్రస్తుత దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. 2023 మేలో పారిశ్రామికవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ను వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత వారికి కుమార్తె జన్మించింది. ఆ భర్త, కూతురుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ‘మేం ముగ్గురం’ అని జత చేసి పోస్ట్ చేశారు. జూన్ 4న ‘మేమిద్దమే’ కూతురుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడు విడాకుల ప్రకటన సంచలనమైంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.షేఖా మహ్రాకు దుబాయ్‌లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్‌స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్) రాసుకొచ్చారామె. View this post on Instagram A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra) దుబాయ్ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాఖ్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు. -
మూడేళ్లుగా ఇబ్బందులు.. మళ్లీ రాకూడదని కోరుకుంటున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. మెల్లమెల్లగా సినిమాల్లోకి వచ్చేస్తోంది. చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో కనిపించింది. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లు నటనకు దూరమైన సమంత ఇటీవల ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం పేరుతో కొత్త సినిమాని ప్రకటించారు. అంతే కాకుండా వరుణ్ ధావన్‌తో కలిసి సిటడెల్: హనీ- బన్నీతో అలరించేందుకు వస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్యతో విడాకుల విషయంపై కూడా నోరు విప్పారు. ఈ ప్రతి ఒక్కరు తమ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నారని సమంత తెలిపారు. విభిన్న కథలను ప్రేక్షకులకు అందించడమే తన లక్ష్యమని అన్నారు. గతం వెనక్కి తిరిగి చూస్తే.. నాకు ఎలాంటి మార్గం కనిపించలేదని.. నా స్నేహితులతో ఇదే విషయంపై చాలాసార్లు చర్చించినట్లు వివరించారు. గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. గడిచిన రోజులు మళ్లీ నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. మునుపటి కంటే బలంగా తయారయ్యానని సమంత వెల్లడించారు. ఆ చీకటి రోజుల నుంచి బయటపడితేనే జీవితంలో విజయం సాధిస్తామని అన్నారు. ఆధ్యాత్మికత చింతన నాలో మంచి మార్పు తీసుకొచ్చిందని తెలిపింది.కాగా.. నాగచైతన్య, సమంత 2021లో తమ వివాహ బంధానికి గుడ్‌బై చెప్పారు. ఏ మాయ చేసావే మూవీతో జంటగా కనిపించిన వీరిద్దరు 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్‌తో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. -
ముస్లిం మహిళలకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సీఆర్పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. -
విడాకుల డబ్బా లొల్లి
-
స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?
మరో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి కంటే విడాకులు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మిగతా వాళ్ల గురించి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల న్యూస్ గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్లు ఇతడి భార్య చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ప్రముఖ ఎడిటర్ మోహన్ కొడుకే జయం రవి. చాలా ఏళ్ల నుంచి తమిళంలో హీరోగా చేస్తున్నాడు. ఈ మధ్య 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీలోనూ కీలక పాత్ర చేశాడు. ఇతడు ఆరతి అనే అమ్మాయిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇన్నేళ్లుగా బాగానే ఉన్నారు గానీ ఈ మధ్య ఎందుకో కలతలు వచ్చినట్లు ఉన్నాయి.మనస్పర్థల్ని తొలగించుకోవాలనుకున్నారు గానీ వర్కౌట్ కాలేదని, దీంతో గత కొన్నాళ్ల నుంచి జయం రవి, ఆరతి విడివిడిగా ఉంటున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్. ఇప్పుడు దీన్ని నిజం చేసేలా భర్తతో ఉన్న ఫొటోల్ని ఆరతి ఇన్ స్టా నుంచి తీసేసింది. దీంతో విడాకుల వార్త నిజమేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్పితే అసలు విషయం బయటపడదు.(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
విడాకులంటూ ప్రచారం: మనీష్ పాండే- ఆశ్రిత శెట్టి ఫొటోలు వైరల్
-
పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే..
చందన్ శెట్టి, నివేదిత గౌడ.. కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీళ్లిద్దరూ కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక భార్యాభర్తలయ్యారు. 2020 ఫిబ్రవరి 6న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కరోనాను సైతం లెక్క చేయకుండా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయారు. ఇకపై నీకు, నాకు ఏ సంబంధమూ లేదంటూ విడాకులు తీసుకున్నారు.నో 'ఇగో'తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎటువంటి ఇగో లేదు. కాకపోతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటు ఉండేది. అలాంటప్పుడే కరోనా నాకు గుణపాఠం నేర్పింది. డబ్బును ఎలా వాడాలో తెలిసొచ్చేలా చేసింది. అప్పటివరకు పైసా అంటే లెక్క లేకుండా పోయింది. నేను చేసిన ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్న సమయంలో ఈ మహమ్మారి వచ్చింది. అలా కోవిడ్ టైంలోనే నా పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.50-60 లక్షలు ఖర్చు పెట్టాను. తెలిసొచ్చిందిఉన్నదంతా ఖర్చయ్యాక డబ్బు అవసరం తెలిసొచ్చింది. మళ్లీ చాలా కష్టపడ్డాను. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కాను. ఎప్పుడేమవుతుందో తెలియని అయోమయంలో ఉండేవాడిని. నేను కంపోజ్ చేసిన ఏ పాట హిట్టవుతుందో? ఏది ఫ్లాప్ అవుతుందో? అని భయంభయంగా ఉండేది. ఒకటి మాత్రం నిజం.. జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
విడాకుల తరువాత హ్యాపీగా ఉన్నాను - బిల్ గేట్స్ మాజీ భార్య
మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ఇటీవల మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి తాను విడాకులు తీసుకోవడానికి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించారు. 2021లో విడాకులు తీసుకున్న మెలిందా అంతకు ముందు పరిస్థితులను గురించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.2021 కంటే ముందే తాను బిల్ గేట్స్ నుంచి విడిపోయినట్లు, ఆ తరువాత 2021లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. మెలిందా విడాకులను భయంకరమైనవిగా వివరించారు. విడాకులు తీసుకున్న తరువాత జీవితం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.ఇప్పుడు నేను నా పనులను నేనే చేసుకుంటున్నాను. మెడికల్ స్టోరుకు వెళ్లడం, రోజూ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, నచ్చిన చోట తినడం వంటివి హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను విడాకుల తరువాత పొందుతున్నాని మెలిండా అన్నారు.27ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన మెలిండా గేట్.. విడాకుల తరువాత 'బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్' నుంచి కూడా బయటకు వచ్చేసారు. ప్రస్తుతం మెలిండా తన ముగ్గురు పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారత కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
సంక్షోభంలో శాండల్‌వుడ్
సాక్షి, బెంగళూరు: కన్నడ చలనచిత్ర పరిశ్రమ శాండల్‌వుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రేక్షకులు థియేటర్లకు ముఖం చాటేస్తుండడంతో వాటిని మూసేయాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు నటీనటుల జీవితాల్లో సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. హీరో హీరోయిన్లే కాకుండా కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, నిర్మాతలు పలు వివాదాల్లో చిక్కుకుంటూ శాండల్‌వుడ్‌కు ఏమైంది అనేలా తయారయ్యారు. హత్యలు, విడాకులు, కుమ్ములాటలతో చందనసీమ నలిగిపోతోంది. ఒకప్పుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, రెబెల్ స్టార్ అంబరీష్, సాహససింహ విష్ణువర్ధన్, శంకర్‌నాగ్ వంటి మహామహులతో విరాజిల్లిన శాండల్‌వుడ్ ఇప్పుడు సంక్షోభాన్నే చవిచూస్తోంది.థియేటర్లు వెలవెలఈ ఏడాది ప్రారంభం నుంచి కన్నడ కళాకారులు, సాంకేతిక నిపుణులు వ్యక్తిగత జీవితాలతో పాటు అనేక నెగెటివ్ వార్తలతో చిత్రపరిశ్రమ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గడిచిన ఆరునెలల్లో వందకు పైగా సినిమాలు విడుదల కాగా అందులో భారీ స్థాయిలో హిట్ అయిన సినిమా ఒక్కటీ లేకపోవడం చందనవనాన్ని కలవరపరుస్తోంది. అంతేకాకుండా నేటితరం ప్రేక్షకులు థియేటర్లకే రావడం లేదు. అలాగే సినిమాలను ఏ టీవీ చానెల్ కానీ, ఓటీటీ సంస్థలు కానీ కొనుగోలు చేయడం లేదని కన్నడ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి మీద పుట్రలా దర్శన్ వంటి బడా హీరోలు హత్య కేసుల్లో ఇరుక్కోవడంతో చిత్రపరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో చాలెంజింగ్ స్టార్, నటుడు దర్శన్, నటి పవిత్ర, మరో 12 మందికి పైగా అనుచరులు అరెస్టు అయ్యారు. ఒక స్టార్ నటుడు హత్య కేసులో భాగం కావడం ఇంతవరకు జరగలేదు.గోవాలో నిర్మాతల గొడవఇటీవల కన్నడ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్‌తో పాటు తదితర చిత్రరంగ ముఖ్యులు గోవాకు వెళ్లారు. కొందరు అక్కడ గొడవ పడ్డారు. ఈ గొడవలో నిర్మాత గణేశ్‌పై దాడి కూడా జరిగింది.కాపురాల్లో కలతలుశాండల్వుడ్లోని ప్రముఖులు ఇటీవల ఒక్కొక్కరే విడాకుల పేరుతో రచ్చకెక్కుతున్నారు. రియాల్టీ షో కలసికట్టుగా కనిపించిన చందన్ శెట్టి–నివేదిత ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ చకచకా తమ నిజజీవితంలో అడుగులు వేశారు. అయితే మూణ్నాళ్ల ముచ్చటే అన్నట్లు పెళ్లి అయిన మూడేళ్లకే వీరిద్దరూ విడిపోతామని కోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరికీ పొసగక విడాకులకు సిద్ధమయ్యారు. కన్నడ కంఠీరవ దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో కూడా విడాకుల ఉదంతం వెలుగు చూసింది. కొన్నేళ్ల క్రితం ప్రేమించి, ఇంట్లో పెద్దలను ఒప్పించి యువ రాజ్‌కుమార్, శ్రీదేవీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కలతలు రావడంతో విడిపోతామని శ్రీదేవి ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో పెద్ద ఇంటిగా పేరుగాంచిన రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల పేరు వినిపించడం కలకలం రేపింది. మరో స్టార్ నటుడు దునియా విజయ్ సంసారంలో కూడా అలజడులతో సాగుతోంది. ఇటీవల ఆయన దాఖలు చేసిన విడాకులు కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మొదటి భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వకుండానే కీర్తి గౌడను దునియా విజయ్ మరో పెళ్లి చేసుకున్నాడు. -
‘బంధం’ తెగిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట అని, దంపతులు జీవితాంతం కలిసి ఉండటమే లక్ష్యమనేది ఎన్నాళ్లుగానో ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోతోంది. ఎన్నో జంటలు పెళ్లయిన ఏడాది, రెండేళ్లకే విడాకులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు సెలబ్రిటీలు, సంపన్నవర్గాల్లోనే కొంతవరకు కనిపించిన ఈ ట్రెండ్.. ఇప్పుడు అన్నివర్గాల్లోనూ సాధారణమైపోయింది. గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విడాకులు అనగానే అదేదో మంచి పద్ధతి కాదని చాలా మందిలో తొలుత అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారికంగా జీవించడమనే భావన దానిని అధిగమిస్తోంది. పరస్పర అంగీకారానికి దూరమై.. వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం.. ఇతర మార్గాలను అన్వేíÙంచకుండానే కోర్టు మెట్లు ఎక్కడం.. ఆధునిక సమాజంలో మారుతున్న కాలంతో వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురవడం.. సామాజిక–సంప్రదాయ విలువలు, భావాల మధ్య సంఘర్షణ వంటివి విడాకులు పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. గణాంకాలను బట్టి 2022 చివరినాటికి విడాకుల శాతంలో.. మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. కోర్టులో ఏళ్లకేళ్లు సాగుతున్న కేసుల నేపథ్యంలో.. అనధికారికంగానే విడిగా ఉంటున్న జంటలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారని నిపుణులు చెప్తున్నారు. విడాకులు పెరగడానికి ప్రధాన కారణాలివీ» దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం.. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు » వివాహ బంధంలో భావోద్వేగం కొరవడటం » ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం, నమ్మకం సన్నగిల్లడం.. జీవనం సాగిస్తున్న తీరుపై అసంతృప్తి, అభద్రతా భావం, కుంగుబాటు » భిన్నమైన కుటుంబ నేపథ్యం, విలువలు కలిగి ఉండటం.. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం » ఇద్దరు పనిచేసే వేళల్లో అంతరాలు ఉండటం » మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు విడాకుల లెక్కలివీ.. » 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. » ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 5,500 విడాకుల కోసం వచి్చనవే. ఇందులోనూ మూడు వేల కేసులు పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులే. » దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో గత పదేళ్లలో విడాకులు 350 శాతం పెరిగాయి. » పంజాబ్, హరియాణా, ఢిల్లీల్లోనూ విడాకులు బాగా పెరిగాయి. » ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విడాకుల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.ఆర్థిక స్వేచ్ఛ, బాధ్యతల భారంతో.. కొన్నేళ్లుగా దేశంలో ఉద్యోగవకాశాలు పెరిగాయి. మహిళలకూ ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు, గిల్లికజ్జాలు, చికాకులు, ఇబ్బందులు, సమస్యలతో వివాహ బంధాన్ని కొనసాగించడం కంటే.. విడిపోవడమే మేలనే భావనకు వస్తున్నారు. పాత, సంప్రదాయ పద్ధతుల్లో ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటుండటం, కొన్నిసార్లు ప్రతీ చిన్న విషయంలో కలుగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడడం.. దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడం విడిపోవడానికి దారితీస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ విడిపోవడానికే మొండి పట్టు ఈ మధ్యకాలంలో వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వారిలో కొందరు కౌన్సెలింగ్‌తో వెనక్కి తగ్గుతుంటే.. చాలా మంది మొండిగా విడిపోవడానికే పట్టుపడుతున్నారు. విడాకులకు కారణాల్లో తల్లితండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటోంది. చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేం తక్కువ అంటూ వారు రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. కుటుంబ విలువలు, సంబంధాలు తగ్గిపోవడం, పరస్పర అవగాహన, ఆకర్షణ లేకపోవడం, అనుమానాలు పెరగడం వంటివి విడాకులకు దారితీస్తున్నాయి. పరస్పరం తప్పులను ఎత్తిచూపకుండా ఉండటం, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేకపోవడం, గొడవల్లోకి తల్లితండ్రులు, తోబుట్టువులను తీసుకురాకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే.. దంపతుల మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి. – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్ -
అపుడేమో కోపంతో విడాకులు : పుష్కర కాలానికి మళ్లీ ప్రేమ,కన్నీళ్లు.. కట్ చేస్తే!
సాధారణంగా ఇక కలిసి జీవించడం అసాధ్యం అనుకున్నపుడు మాత్రమే భార్యభర్తలు విడిపోయేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఎపుడైనా, ఎక్కడైనా తారసపడినా కూడా ఒకర్నొకరు పట్టించుకోరు. అంటీ ముట్టనట్టే ఉంటారు. కనీసం పలకరించు కోరు కూడా (అయితే భార్యభర్తలుగా విడిపోయిన తరువాత కూడా, హుందాగా, స్నేహంగా ఉంటున్నజంటలు కూడా చాలానే ఉన్నాయి). కానీ విడాకులు తీసుకున్న పుష్కరకాలం తరువాత కలిసి మళ్లీ ఒక్కటయ్యారు. యూపీలోని రాంపూర్‌లో ఈ ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది.యూపీలోని ఇమ్రతా గ్రామానికి చెందిన అధికారి అలీకి రాంపూర్‌కు చెందిన అమ్మాయితో 2004లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు పుట్టారు. అయితే వీరి మధ్య తలెత్తిన విబేధాలు తారా స్థాయికి చేరడంతో పెళ్లయిన 8 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. అమ్మాయి తల్లి వద్ద, కొడుకులిద్దరూ తండ్రి వద్ద పెరుగుతున్నారు. ఇద్దరూ మరో పెళ్లి చేసుకోకుండా, పిల్లలే ప్రాణంగా జీవితాన్ని సాగిస్తున్నారు.అయితే దాదాపు 12 ఏళ్ల తరువాత, ఒక పెళ్లి వేడుక వారి జీవితాన్నే మార్చేసింది. ఈ పెళ్లిలో అనుకోకుండా ఒకరినొకరు ముఖాముఖి కలుసు కున్నారు. అలీ, అతని భార్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో తెలియని భావోద్వేగానికి లోనయ్యారు. భర్త కళ్లలో నుంచి నీళ్లు కారడం చూసిన భార్య కూడా చలించిపోయింది. తర్వాత ఇద్దరూ మాట కలిపారు. ఒకరి నంబర్లు మరొకరు తీసుకుని ఫోన్లో మాట్లాడుకోవడంమొదలెట్టారు. ఒకరి బాధల్ని మరొకరు మనస్ఫూర్తిగా పంచుకున్నారు.తమ మధ్య ప్రేమ పదిలంగాగానే ఉందని, క్షణికావేశంతో వేసిన అడుగు తప్పని తొందర పడ్డామని పశ్చాత్తాపపడి మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఒక శుభముహూర్తాన ఇద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు. అంతే కాదు ‘స్వీట్ ఫ్యామిలీ’ అనుకుంటూ ఉత్తరాఖండ్ పర్యటనకు చెక్కేసారు. -
ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ జంట.. మళ్లీ కలవడమేంటి?
ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దాదాపు కలవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా పొరపాటున బయట ఎదురుపడినా పలకరించడం లాంటివి కూడా జరగవు. చాలా జంటలు విడాకుల తర్వాత కలిసి మాట్లాడుకోవడం జరిగే అవకాశం చాలా తక్కువ. మరీ విడాకుల తర్వాత ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అంతే కాదు ఏకంగా ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది. అలాంటిదే తాజాగా జరిగింది. ఓ స్టార్ జంట తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.శాండల్‌వుడ్ జంట నివేద గౌడ, చందన్ శెట్టి ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఏడాది క్రితమే వీరిద్దరూ విడాకులకు పిటిషన్ వేయగా.. ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాండల్‌వుడ్‌లో క్యూటెస్ట్ కపుల్‌గా పేరున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ డివోర్స్ గల కారణాలపై తెగ ఆరా తీస్తున్నారు. చందన్ శెట్టి, నివేద గౌడ ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఏమిటి? ఇలాంటి విషయాలపై ప్రతిరోజూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా విడిపోయిన తర్వాత కూడా నివేద గౌడ, చందన్ శెట్టి సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ బెంగళూరులోని ఓ మాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో తాము విడిపోవడానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సమావేశంలో చందన్ శెట్టి, నివేద గౌడ పాల్గొని విడాకులపై మాట్లాడనున్నారు. ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇవ్వనున్నారు.కాగా.. టిక్‌టాక్ స్టార్ నివేదా గౌడ బిగ్ బాస్ సీజన్- 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత రాపర్‌గా రాణిస్తున్న చందన్ శెట్టి.. నివేదా గౌడపై బొంబే బొంబే అనే పాట రాసి అందరినీ అలరించాడు. మైసూర్‌లోని జరిగిన దసరా వేడుకల్లో నివేద గౌడకు ప్రపోజ్ చేశాడు. అప్పట్లోనే అతని తీరు వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. -
ప్రముఖ సింగర్‌పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు హాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్ తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?
మరో హీరోయిన్ విడాకులు తీసుకోనుందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య ఇలా జరుగుతుందంటే నేరుగా చెప్పకుండా ఇన్ స్టాలో పెట్టుకున్న భర్త ఇంటి పేరు తీసేయడమో లేదంటే భర్తతో కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలానే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ నితీ టేలర్ కూడా చేయడంతో ఈమె కూడా భర్త నుంచి విడిపోనుందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరు?దిల్లీకి చెందిన నితీ టేలర్.. 15 ఏళ్ల వయసులోనే నటిగా మారింది. 'ప్యార్ కా బందన్' అనే సీరియల్లో తొలుత నటించింది. అయితే ఎమ్టీవీలో చేసిన 'కైసీ హే యారియన్' అనే సీరియల్ దెబ్బకు ఈమె ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. అప్పటినుంచి ఓవైపు టీవీ ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు మూడు సినిమాలు కూడా చేసింది. అవన్నీ తెలుగువే కావడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: కెమెరామెన్తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్)'మేం వయసుకు వచ్చాం' అనే మూవీతో హిట్ కొట్టింది. ఆ తర్వాత చేసిన 'పెళ్లి పుస్తకం', 'లవ్ డాట్ కామ్' మాత్రం ఈమెని నిరాశపరిచాయి. దీంతో సినిమాల్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. ఇక నితీ వ్యక్తిగత జీవితానికొస్తే 2020లో పరీక్షిత్ బవా అనే ఆర్మీ అధికారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు సడన్‌గా తన భర్త ఇంటి పేరుని ఇన్ స్టాలో తన పేరు పక్క నుంచి తొలగించింది. అలానే ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోల్ని కూడా డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే నితీ టేలర్ విడాకులు తీసుకోనుందా అనే సందేహం వచ్చింది.ఇలా ఇన్ స్టాలో ఫొటోలు డిలీట్ చేయడం, ఇంటి పేరు తీసేయడం అనేది గత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. విడిపోతున్నాం అని ఒకేసారి చెప్పకుండా ఇలా చేసి కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. మరి నితీ టేలర్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నటి బ్రేకప్.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి!) -
విడాకుల మహోత్సవం
‘మా అమ్మాయి పెళ్లి’ అని చెప్పడానికి సంతోషించే తల్లిదండ్రులు విడాకుల విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనిల్ కుమార్ మాత్రం ‘నరకప్రాయమైన సంసారం కంటే విడాకులే సో బెటర్’ అంటున్నాడు.అనిల్ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం రకరకాల బాధలకు గురి చేస్తుంటే తట్టుకోలేక అనిల్ కుమార్తె ఉర్వీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. బ్యాండ్ బాజాలతో నిర్వహించిన ఉర్వీ విడాకుల మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. Kanpur man celebrates his daughter's divorce, brings her home with Band-Baja.అత్తారింట్లో వేధింపులు తాళలేక ఎన్ని సార్లు పేరెంట్స్‌కి చెప్పినా "సంసారమన్నాక ఇవన్నీ మామూలే" అని సముదాయిస్తూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకూ తీసుకెళ్ళేది తల్లిదండ్రులే! తమ కూతురికి కష్టం వస్తే ఓదార్చి… pic.twitter.com/lZAaVk9Mly— Harish R.M (@27stories_) May 1, 2024 -
నటితో విడాకులు.. లిమిట్స్ దాటిపోయిందన్న భర్త!
సినీ ఇండస్ట్రీలో మరో జంట తమ బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. బాలీవుడ్ నటి దల్జీత్ కౌర్, నిఖిల్ పటేల్ విడిపోతున్నారంటూ ఇటీవల రూమర్స్ వచ్చాయి. అంతే కాదు.. నిఖిల్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించింది. దల్జీత్ తన కుమారుడు జేడాన్తో కలిసి ఇండియాకు వచ్చాక.. ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.అయితే దల్జీత్ కౌర్ భర్త నిఖిల్ పటేల్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. నటితో విడిపోయారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఆమెతో విడిపోయినట్లు నిఖిల్ పటేల్ ధృవీకరించాడు. సోషల్ మీడియాలో పెద్దఎత్తున డైవర్స్ రూమర్స్ రావడంతో ఎట్టకేలకు నోరువిప్పాడు.నిఖిల్ పటేల్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తలెత్తాయి. మా వివాహానికి పునాది తగినంత బలంగా లేదు. ఇద్దరికి చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కెన్యాలో ఉండడం వల్ల ఇండియాతో పాటు తన కెరీర్‌ను కోల్పోతోంది. తనకి కెన్యా వాతావరణం నచ్చలేదు. మార్చి 2023లో ముంబయిలో మా పెళ్లి జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగినప్పటికీ చట్టబద్ధంగా రిజిస్టర్ కాలేదు. కెన్యాలో జీవించడం ఆమెకు సవాలుగా మారిందని' తెలిపాడు. మా కుమారుడు పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న రోజున ఆమె కెన్యాకు తిరిగి వెళ్లే ఆలోచన లేదని దల్జీత్ తేల్చిచెప్పిందన్నాడు. దల్జీత్ ఇండియాకు తిరిగి వెళ్లడంతో మా బంధానికి ముగింపు పలికింది. ఆమెకు భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు శుభాకాంక్షలు తెలిపారు.అయితే ఇటీవల సోషల్ మీడియాలో దల్జీత్ చేసిన పోస్ట్‌లు నా మిత్రులు, బంధువులకు బాధను కలిగించాయని అన్నారు. తను నా జీవితంలోకి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేసింది.. కానీ ఇప్పటికే హద్దులు దాటిందని తెలిపాడు. ఆమె చేసిన పోస్ట్‌లు తప్పుగా అర్థం చేసుకోవడంతో సంబంధం లేని మా కుటుంబం, స్నేహితులను బాధపడ్డారని అన్నాడు. త్వరలోనే ఇలాంటి ప్రవర్తనను ఆపేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు -
హిందూ వివాహ చట్టప్రకారం ఎస్టీలు విడాకులు ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: హిందూ వివాహ చట్టప్రకారం వివాహం చేసుకున్న ఎస్టీలకు అదే చట్టప్రకారం విడాకులు ఇవ్వవచ్చని.. అయితే పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన ఓ గిరిజన (లంబాడ) దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కామారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్టీకి చెందిన వారికి హిందూ వివాహ చట్టం సెక్షన్ 2(2) వర్తించదని కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిపై దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు పూర్తిగా హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారని.. పెళ్లి కార్డు సహా ఇతర ఆధారాలన్నీ పరిశీలించాల్సిన ట్రయల్ కోర్టు ఆ పని చేయలేదన్నారు. హిందూ లంబాడా వర్గానికి చెందిన వారని.. హిందూ వివాహ చట్టం వారికి వర్తించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు లంబాడా వర్గానికి చెందిన వారైనా వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున ట్రయల్ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి ఆ మేరకు విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 2(2).. ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్సీలకు వర్తించదని, ఈ కేసుకు మాత్రమే పరిమితమని చెప్పారు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తున్నామన్నారు. -
పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది
ఈ మధ్య ఎక్కడ చూసినా విడాకుల వార్తలే కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ విడాకులు తీసుకున్నాడు. మరోవైపు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య కూడా విడాకులు తీసుకోబోతున్నాడని తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ నటి దివ్య అగర్వాల్ కూడా ఇలానే చేయబోతుందని అన్నారు. ఇప్పుడు దీనిపై దివ్య ఘాటుగా స్పందించింది. పుకార్లు సృష్టిస్తున్న వాళ్లకు ఇచ్చిపడేసింది.హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్, నటి దివ్య అగర్వాల్.. దాదాపు నాలుగేళ్ల పాటు సహనటుడు వరుణ్ సూద్‌ని ప్రేమించింది. కానీ మనస్పర్థల కారణంగా 2022లో వీళ్లు విడిపోయారు. కోరుకున్న విధంగా, సొంతంగా బతకాలని అనుకుంటున్నానని 2022 మార్చి 6న బ్రేకప్ వార్తని బయటపెట్టింది. ఇది జరిగిన కొన్నాళ్లకు వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో ప్రేమలో పడింది. అదే ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)రీసెంట్గా ఓ షోలో పాల్గొన్న దివ్య అగర్వాల్.. తనని అర్థం చేసుకునే భర్త దొరికాడని చెబుతూ పొంగిపోయింది. కానీ ఇంతలోనే సడన్ షాకిచ్చింది. పెళ్లయి మూడు నెలలు కాలేదు. ఇన్ స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేసింది. దీంతో ఈమె విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై ఆమె స్వయంగా ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చేసింది.'దీని గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. 2500 పోస్టుల్ని నేను డిలీట్ చేశాను. కానీ మీడియా మాత్రం వాటిలో నా పెళ్లి గురించి మాత్రమే స్పందించింది. ఇదంతా చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చాలామంది ఊహించని విషయాల్ని నేను చేశాను. ఇప్పుడు వాళ్లు నా నుంచి పిల్లలు లేదా విడాకుల్ని కోరుకుంటున్నారా? అది అస్సలు జరగదు' అని దివ్య అగర్వాల్ ఫుల్ ఫైర్ అయింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.. రీసెంట్ టైంలోనే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ నమిత కూడా భర్త నుంచి విడిపోనుందనే రూమర్స్ వస్తున్నాయి. వీటిపై ఇప్పుడు స్వయంగా ఆమెనే స్పందించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)గుజరాత్‌కు చెందిన నమిత.. 'సొంతం' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడ సెటిలైపోయింది. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు పుట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న నమిత.. తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో నమిత స్పందించాల్సి వచ్చింది.'ఈ మధ్యే భర్తతో కలిసి ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నటిగా నేను ఈ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నాను. ఇప్పుడొచ్చిన దానితో నేను-నా భర్త ఏం బాధపడట్లేదు. ఫుల్లుగా నవ్వుకున్నాం' అని నమిత చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)
-
చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి
మరో నటి విడాకులు తీసుకుంది. మూడు నెలల క్రితం ఈమె గురించి వచ్చిన వార్తలు నిజమని ఇప్పుడు తేలిపోయింది. స్వయంగా సదరు నటి పోస్ట్ పెట్టడంతో అందరికీ దీని గురించి క్లారిటీ వచ్చేసింది. రెండో భర్త తనని చీటింగ్ చేస్తున్నాడని ఆధారాలతో సహా బయటపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఎవరా నటి? ఏం జరిగింది?'చూపులు కలిసిన శుభవేళ' అనే డబ్బింగ్ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి దల్జీత్ కౌర్.. 2009లో షాలిన్ బానోత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జైడన్ అనే కొడుకు ఉన్నాడు. మనస్పర్థలు కారణంగా 2015లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొడుకుతో కలిసి ఉంటున్న ఈమె ఓసారి దుబాయిలో జరిగిన ఓ పార్టీకి వెళ్లగా అక్కడ నిఖిల్ పటేల్ అనే వ్యక్తి ఈమెకు పరిచయమయ్యాడు.(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)దల్జీత్ పరిచయం అయ్యేటప్పటికే నిఖిల్ విడాకులు తీసుకుని జీవిస్తున్నాడు. ఓ కూతురు ఇతడి దగ్గర పెరుగుతోంది. అలా పిల్లల గురించి మాట్లాడుకున్న వీళ్లిద్దరూ కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. గతేడాది మార్చిలో లండన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఈ ఏడాది ఫిబ్రవరిలో దల్జీత్, కొడుకుని తీసుకుని తిరిగి ఇండియాకు వచ్చేసింది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై దల్జీత్ అప్పుడేం స్పందించలేదు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసింది.భర్త నిఖిల్ పటేల్ తనని మోసగించాడని, వేరొకరితో రిలేషన్లో ఉన్నాడని ఈమె ఆరోపించింది. స్క్రీన్ షాట్ కూడా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీనిబట్టి చూస్తే వీళ్లిద్దరి విడాకులు తీసుకున్నారని తేలింది. (ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు)
-
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దర పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ జంటపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శిస్తున్నారు.తాజాగా తమపై వస్తున్న ట్రోల్స్‌పై సింగర్ సైంధవి స్పందించింది. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్‌లో కొందరు వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను.. ప్రకాశ్ ఆలోంచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ మా నిర్ణయాన్ని గౌరవించాలని అభ్యర్థించారు. ఇలా ఒకరిపై ఆరోపణలు చేయడం దారుణమని వాపోయారు. మేమిద్దరం 24 ఏళ్లుగా మంచి స్నేహితుల్లా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహా బంధాన్ని కొనసాగిస్తామని సైంధవి పేర్కొన్నారు. కాగా.. అంతకుముందే ట్రోల్స్ పట్ల జీవీ ప్రకాశ్ సైతం స్పందించారు. దయచేసి తమ పట్ల ట్రోల్స్ చేయడం సరైంది కాదని హితవు పలికారు. -
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
ఇటీవలే కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్, అతని భార్య, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రైవసీకి గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే దీనిపై జీవీ ప్రకాశ్ రియాక్ట్ అయ్యారు. తమ విడాకుల విషయంలో కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు కలవడం, విడిపోవడంపై సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం మంచిది కాదు. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు రావడం దురదృష్టకరం.. ఇవీ తమకు చాలా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం, వారి గురించి కామెంట్స్ చేయడం ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహాజనిత కథనాలు ఆ వ్యక్తులపై ప్రభావం చూపుతాయని గ్రహించలేనంతగా తమిళుల సద్గుణాలు దిగజారిపోయాయా?" అని జీవీ ప్రకాశ్ ప్రశ్నించారు. దీనిపై తమిళంలో సుదీర్ఘమైన నోట్‌ను తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.జీవీ ప్రకాశ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. మా ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా మీరు చేసే కామెంట్స్ బాధ కలిగించేవిగా ఉన్నాయని చెప్పడానికే ఈ పోస్ట్ చేస్తున్నా. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) -
భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలైపోయాయి. కానీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటేనే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. మొన్నే కోలీవుడ్ హీరో, సంగీత దర్శకుడు జీవీ సైంధవ్.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. తాజాగా ఓ తెలుగు బుల్లితెర నటి అదే బాట పట్టింది.మా మధ్య బంధం ముగిసిపోయిందిసీరియల్ నటి శిరీష భర్త నవీన్‌తో విడిపోయినట్లు వెల్లడించింది. 'నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.తనపై గౌరవముందివీలైతే సపోర్ట్ చేయండి, కానీ విమర్శించకండి. నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.ఆ సీరియల్‌తో పాపులర్కాగా శిరీష.. అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్‌లో నటించారు. కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు సీరియల్‌తో బాగా పాపులర్ అయింది. స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం. . ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది. View this post on Instagram A post shared by It's-me-Sireesha Actor- Official (@its_me_sireesha_actor) చదవండి: జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ.. -
11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన సినీ ఇండస్ట్రీ కపుల్ (ఫొటోలు)
-
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోనుందా? అవును సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా ఈ చర్చే నడుస్తోంది. ఎందుకంటే సదరు హీరో ఇన్ స్టాలో ఉండాల్సిన పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. దీంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఏమై ఉంటుందబ్బా అని అభిమానులు, నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే వీళ్లలో కొందరు కలిసి ఉంటుంటే.. మరికొందరు మాత్రం మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ కపుల్ రణ్వీర్ - దీపిక చేరబోతున్నారా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే రణ్వీర్ తన ఇన్ స్టా ఖాతాలోని పెళ్లి ఫొటోల్ని డిలీట్ చేశాడు. దీంతో లేనిపోని అనుమానాలు వచ్చాయి.దీపిక ఇన్ స్టాలో ఉన్నాయి కానీ రణ్వీర్ ఖాతాలో మాత్రం పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. అయితే దీపికతో కలిసున్న మిగతా ఫొటోలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదన్నట్లు దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో విడాకులు రూమర్ అనేది నమ్మేలా అనిపించట్లేదు. పెళ్లి పిక్స్ కనిపించకుండా పోవడం బహుశా ఏదో పొరపాటు వల్ల అయ్యిండొచ్చని వీళ్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాలంటే రణ్వీర్ స్పందించాల్సిందే. (ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ విడాకులు తీసుకుంది. తన భర్త సామ్ అస్గారితో అధికారికంగా విడిపోయింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతేడాది జూలైలో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట .. ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే పెళ్లికి ముందే దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.కాగా.. బ్రిట్నీ స్పియర్స్‌కి ఇది మూడో వివాహం కాగా.. ఆమె రెండో భర్త కెవిన్ ఫెడెర్‌లైన్‌తో ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. వీరిద్దరు 2004 నుంచి 2007 వరకు కలిసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. బ్రిట్నీ స్పియర్స్ మొదట చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే విడిపోయింది. ఆ తర్వాత 2016లో నటుడు అస్గారితో డేటింగ్ చేయడం ప్రారంభించింది. 2021 సెప్టెంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. -
పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి
ప్రముఖ నటి ఇంద్రజ శంకర్.. సోషల్ మీడియా దెబ్బకు బలైపోయింది. తమిళ నటుడు రోబో శంకర్ కూతురు ఈమె. దళపతి విజయ్ 'విజిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసింది. నెల క్రితం చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తున్నా గానీ వివాదాలు మాత్రం ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్తతో కలిసి పాల్గొన్న ఇంద్రజ.. ఆ వివాదాలపై క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్)కార్తీక్ అనే వ్యక్తిని ఇంద్రజ శంకర్ పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకలకు తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల దగ్గర చాలామంది సెలబ్రిటీల వరకు హాజరయ్యారు. అయితే పెళ్లిలో ఇంద్రజ తన తండ్రికి ముద్దు పెట్టడం, కార్తీక్.. ఇంద్రజ తల్లితో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే వాటిని దురుద్దేశంతో చూడొద్దని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది.అలానే భర్తతో కలిసి తాను ఓ ఫొటోని పోస్ట్ చేయగా.. దానికి అసహ్యకరమైన కామెంట్స్ వచ్చాయని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది. 'నా మీద ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతడి పేరు సరిగా గుర్తులేదు. 'ఇప్పుడు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఎక్కువరోజులు కలిసుండలేరు. కొన్నిరోజులు ఆగితే విడివిడిగా ఇంటర్వ్యూ ఇస్తారు. త్వరలో విడాకులు తీసుకుంటారు' అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇలా కామెంట్స్ పెట్టడంతో నేను చాలా బాధపడ్డాను. అయినా వేరొకరి గురించి అలా ఎలా కామెంట్ చేస్తారు?' అని ఇంద్రజ తన ఆవేదనని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే) -
విడాకులిచ్చి ఏడాది కాలేదు.. కమెడియన్‌తో డేటింగ్ చేస్తున్న స్టార్ నటి
బాలీవుడ్ నటి 'కుషా కపిల' సోషల్ మీడియాతో విపరీతమైన స్టార్డమ్ తెచ్చుకున్నారు. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు. (మాజీ భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో కుషా కపిల) బాలీవుడ్ జంట కుషా కపిల, జొరావర్ సిగ్ అహ్లువాలియా విడిపోయిన తర్వాత వారి అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆమెపై కొందరు తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. ఆమె క్యారెక్టర్‌ను తప్పు పడుతూ అసభ్య రీతిలో కామెంట్లు కూడా చేశారు. దీంతో అదే సమయంలో ఆమె భర్త జొరావర్ సిగ్ అహ్లువాలియా కలుగచేసుకుని ఆమెపట్ల ఇలాంటి కామెంట్లు వద్దని వారించాడు. ఇద్దరం కలిసే విడిపోయాం. ఇందులో ఆమెది మాత్రమే తప్పు కాదు అంటూ చెప్పడంతో ఆమెపై వస్తున్న విమర్శలకు ఫుల్స్టాప్ పడింది. (కుషా కపిల, బాలీవుడ్ కమెడియన్ అనుభవ్ సింగ్ బస్సీ) తాజాగా ఆమె గురించి బాలీవుడ్ వర్గాల్లో ఒక రూమర్ క్రియేట్ అయింది ఇటీవల, ఆమె ప్రముఖ బాలీవుడ్ కమెడియన్‌తో డేటింగ్‌పై పుకార్లు వచ్చాయి. ఆమె హాస్యనటుడు అనుభవ్ సింగ్ బస్సీతో ప్రేమాయణం సాగిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విహారయాత్రలో భాగంగా గోవాలో చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. అనుభవ్ స్టాండ్-అప్ కమెడియన్, యూట్యూబర్ నుంచి నటుడి స్థాయికి చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉంటే యూట్యూబ్‌లో 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అతని వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ ఉంటాయి. దీంతో అతని సంపాదన కూడా భారీగానే ఉంది. అతను ఇటీవల 'తు ఝూతీ మైన్ మక్కార్' చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్లతో కలిసి నటించాడు. కుషా, బస్సీ మధ్య రిలేషన్‌పై నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో చాలా సందర్భాలలో వారిద్దరూ కలిసి కనిపించారని ఒక నెటిజన్ చెప్పారు. భర్తకు విడాకులిచ్చి సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే మరోకరితో రిలేషన్ పెట్టుకుని ఎంజాయ్ చేయడం ఏంటి..? కొంచమైనా సిగ్గుగా లేదా..? అంటూ పదునైన విమర్శలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kusha Kapila (@kushakapila) -
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లకు కోర్టు ఉత్తర్వులు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా వారి పిటిషన్‌ను న్యాయమూర్తి సుభాదేవి విచారించారు. అక్టోబరు 7న చెన్నై ఫ్యామిలీ కోర్టులో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ విచారణకు హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్న ఈ జంట పలు సినిమా నిర్మాణంలో బిజీగానే ఉంటున్నారు. వారి కుమారులు యాత్ర, లింగ మాత్రం ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. కానీ వారిద్దరూ కూడా అప్పడప్పుడు ధనుష్ వద్దకు వెళ్లి వచ్చేవారు. ఏదేమైనా సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ స్టార్ కపుల్స్ ఈ సంవత్సరంలో విడాకులు తీసుకుని తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారనే విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.