విడాకుల గురించి జయం రవిపై భార్య సంచలన ఆరోపణ | Jayam Ravi Wife Aarthi Comments On Divorce | Sakshi

విడాకుల గురించి జయం రవిపై భార్య సంచలన ఆరోపణ

Sep 11 2024 11:35 AM | Updated on Sep 11 2024 1:39 PM

Jayam Ravi Wife Aarthi Comments On Divorce

కోలీవుడ్‌ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఈమేరకు ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

'ఇటీవల మా వైవాహిక జీవితం గురించి సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలు చూసి నేను ఆందోళన చెందాను.  నాకు తెలియకుండా, నా నుంచి అనుమతి లేకుండానే విడాకుల గురించి ప్రకటించారు. ఇలా చెప్పకుండా బహిరంగ ప్రకటన చేయడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురికావడమే కాకుండా చాలా బాధపడ్డాను. 18 సంవత్సరాలుగా కలిసి జీవించాం. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నాకు చెప్పకుండా ప్రకటించడం ఏంటి..? 

వ్యక్తుల మధ్య దయ, గౌరవంతో పాటు గోప్యతతో నిర్వహించాలని నేను నమ్ముతున్నాను. కొంతకాలంగా మేమిద్దరం దూరంగానే ఉంటున్నాము. మా కుటుంబాల మధ్య వచ్చిన గొడవలపై పరిష్కిరించుకుందామని అనేకసార్లు ప్రయత్నించాను. కానీ, ఫలితం లేదు. నా భర్తతో నేరుగా మాట్లాడటానికి అనేకసార్లు కోరుకున్నాను. ఇప్పటికీ కూడా నేను ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. కానీ,దురదృష్టవశాత్తూ, ఆ అవకాశం నాకు లభించలేదు.'

 ఇదీ చదవండి: సతీమణితో విభేదాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న జయం రవి

'ఈ ప్రకటనతో నాతో పాటు నా పిల్లలు కూడా షాకయ్యారు. విడాకుల విషయంపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం కుటుంబానికి ప్రయోజనం చేకూర్చదు. నేను గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకు బహిరంగంగా ఈ వివాదాల గురించి కామెంట్‌ చేయలేదు. అనేకమార్లు బాధ కలిగినా గౌరవం కాపాడాలనే చూశాను. కానీ, ఇప్పుడు నాపై అన్యాయంగా దారుణమైన నిందలు వేస్తున్నారు. 

ఈ క్రమంలో నాపై తప్పుగా వార్తలు వస్తున్నాయి. అవి చూసి భరించడం నావల్ల కావడం లేదు. అయితే, ఒక తల్లిగా ఎల్లప్పుడూ నా పిల్లల శ్రేయస్సు మాత్రమే కోరుకుంటాను. కాలక్రమేణా ఆ నిందలు వారిపై ప్రభావం చూపొచ్చు. దానిని తలుచుకుంటే బాధేస్తుంది. ఇన్నాళ్లు మాకు మద్ధతుగా నిలిచిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. భవిష్యత్‌లో మా పట్ల మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను.' అని ఆర్తి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement