
హార్దిక్ పాండ్యా విడాకుల ప్రకటన
న్యూఢిల్లీ: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించాడు. తన భార్య నటాషా స్టన్‌కోవిచ్‌తో వివాహ బంధం ముగిసినట్లు అతను అధికారికంగా ప్రకటించాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు.
వీరిద్దరికి 2020లో వివాహం కాగా...అగస్త్య అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. సెర్బియాకు చెందిన స్టన్‌కోవిచ్ మోడలింగ్, సినిమాల్లో నటిస్తూ ముంబైలో స్థిరపడిన సమయంలో పాండ్యాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గత కొంత కాలంగా పాండ్యా, స్టన్‌కోవిచ్ మధ్య విభేదాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఇద్దరూ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు విడాకుల తర్వాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని, అతని కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని పాండ్యా స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment