విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే? | Actress Niti Taylor Divorce Rumours With Husband Parikshit | Sakshi
Sakshi News home page

Niti Taylor: ప్రముఖ హీరోయిన్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది?

Published Sat, Jun 1 2024 2:25 PM | Last Updated on Sat, Jun 1 2024 2:58 PM

Actress Niti Taylor Divorce Rumours With Husband Parikshit

మరో హీరోయిన్ విడాకులు తీసుకోనుందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య ఇలా జరుగుతుందంటే నేరుగా చెప్పకుండా ఇన్ స్టాలో పెట్టుకున్న భర్త ఇంటి పేరు తీసేయడమో లేదంటే భర్తతో కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలానే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ నితీ టేలర్ కూడా చేయడంతో ఈమె కూడా భర్త నుంచి విడిపోనుందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరు?

దిల్లీకి చెందిన నితీ టేలర్.. 15 ఏళ్ల వయసులోనే నటిగా మారింది. 'ప్యార్ కా బందన్' అనే సీరియల్‌లో తొలుత నటించింది. అయితే ఎమ్‍‌టీవీలో చేసిన 'కైసీ హే యారియన్' అనే సీరియల్ దెబ్బకు ఈమె ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. అప్పటినుంచి ఓవైపు టీవీ ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు మూడు సినిమాలు కూడా చేసింది. అవన్నీ తెలుగువే కావడం ఇక్కడ విశేషం.

(ఇదీ చదవండి: కెమెరామెన్‌తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్‌)

'మేం వయసుకు వచ్చాం' అనే మూవీతో హిట్ కొట్టింది. ఆ తర్వాత చేసిన 'పెళ్లి పుస్తకం', 'లవ్ డాట్ కామ్' మాత్రం ఈమెని నిరాశపరిచాయి. దీంతో సినిమాల్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. ఇక నితీ వ్యక్తిగత జీవితానికొస్తే 2020లో పరీక్షిత్ బవా అనే ఆర్మీ అధికారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు సడన్‌గా తన భర్త ఇంటి పేరుని ఇన్ స్టాలో తన పేరు పక్క నుంచి తొలగించింది. అలానే ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోల్ని కూడా డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే నితీ టేలర్ విడాకులు తీసుకోనుందా అనే సందేహం వచ్చింది.

ఇలా ఇన్ స్టాలో ఫొటోలు డిలీట్ చేయడం, ఇంటి పేరు తీసేయడం అనేది గత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. విడిపోతున్నాం అని ఒకేసారి చెప్పకుండా ఇలా చేసి కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. మరి నితీ టేలర్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ నటి బ్రేకప్‌.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement