మరోసారి విడాకుల రూమర్స్‌.. అభిషేక్ రియాక్షన్‌ ఇదే! | Abhishek Bachchan Finally Breaks Silence On Divorce Rumours With Aishwarya Rai, Deets Inside | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: 'మీరెందుకు ఇలా చేస్తున్నారో తెలుసు'.. రూమర్స్‌పై స్పందించిన అభిషేక్!

Published Sun, Aug 11 2024 7:06 PM | Last Updated on Mon, Aug 12 2024 1:04 PM

Abhishek Bachchan Finally Breaks Silence On Divorce Rumours With Aishwarya Rai

బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిలోనూ వీరిద్దరు విడివిడిగా ఫోటోలకు ఫోజులివ్వడంతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అయితే తాజాగా అభిషేక్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో తమపై వస్తున్న విడాకాల రూమర్స్‌పై చివరికీ అభిషేక్ బచ్చన్‌ స్పందించాల్సి వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్‌ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం. నాకు పెళ్లయింది క్షమించండి' అన్నాడు అతను తన ఉంగరాన్ని చూపించాడు. దీంతో తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా అనే విషయం తెలియాల్సి ఉంది. 

కాగా.. అభిషేక్, ఐశ్వర్య 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించారు. వీరిద్దరూ జంటగా ధాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, గురు, ధూమ్- 2, రావణ్ లాంటి చిత్రాల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement