ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్.. | Abhishek Bachchan Divorce Rumours With Aishwarya Rai Goes Viral | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్.. అభిషేక్‌ వీడియో వైరల్!

Published Sat, Aug 10 2024 6:22 PM | Last Updated on Fri, Sep 20 2024 10:58 AM

బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. ఈ జంటకు ఆరాధ్య అనే ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఐశ్వర్యరాయ్ ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు. తన అభిషేక్ బచ్చన్‌తో కలిసి పెళ్లి వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి.

అయితే గత కొన్నేళ్లుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.  ఐశ్వర్యరాయ్ బర్త్‌ డే రోజు ఆలస్యంగా విష్ చేయడంతో అప్పట్లోనే.. వీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆరాధ్య పుట్టినరోజు సైతం ఇలాంటి రూమర్స్ బీటౌన్‌లో వైరలయ్యాయి.

తాజాగా ‍అభిషేక్‌ బచ్చన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐశ్వర్యరాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు అభిషేక్ మాట్లాడిన వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియోను డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల సినీతారలపై డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో మరోసారి విడాకుల చర్చ మొదలైంది. అయితే ఇది ఫేక్ వీడియో అంటూ ఐశ్వర్య, అభిషేక్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement