
గంగవ్వ (Milkuri Gangavva).. ఎరుకనే కదా! అమాయకత్వం, బోలాతనం, గడబిడ మాట్లాడే వైఖరితో అందరికీ సుపరిచితమైంది. యూట్యూబ్ ఆమెను అందరికీ చేరువ చేసింది. తెలంగాణ యాసతో ఆమె మాట్లాడుతుంటే మనింట్లో బామ్మ ముచ్చటచెప్పినట్లే ఉంటది. మై విలేజ్ షో ద్వారా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవల్‌లో ఫేమస్ అయింది. ఆ మధ్య తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లోనూ పాల్గొని తన హుషారుతో అందర్నీ నవ్వించింది.

గంగవ్వ కొత్త లుక్
ప్రస్తుతం మళ్లీ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్న ఆమె తాజాగా కొత్త లుక్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన ఆమె బిగ్‌బాస్ 5 విన్నర్ వీజే సన్నీ ప్రారంభించిన టీబీసీ సెలూన్‌కు వెళ్లింది. ఇంకేముంది.. సన్నీ దగ్గరుండి గంగవ్వ జుట్టు కడిగించి, దానికి నల్ల రంగు వేయించాడు. పనిలో పనిగా కొత్త హెయిర్ స్టైల్ కూడా ట్రై చేసింది గంగవ్వ. జుట్టు స్ట్రెయిటినింగ్ చేయించుకుని వదిలేసింది. అవసరమైతే తలకు నూనెంటకుండా ఈ హెయిర్ స్టైల్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తానంది. కాలికి పెడిక్యూర్ కూడా చేయించుకుంది.

సినిమాలు
ఫైనల్‌గా గంగవ్వ కొత్త లుక్ చూసిన అభిమానులు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు. గంగవ్వ యూట్యూబ్ స్టార్ కాకముందు ఓ వ్యవసాయ కూలీ. తనకు ముగ్గురు పిల్లలు. రెక్కల కష్టంతో ముగ్గురు పిల్లల పెళ్లి చేసింది. మలి వయసులో యూట్యూబర్‌గా మారడమే కాకుండా సినిమాల్లోనూ అడుగుపెట్టింది. మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, స్వాగ్, గేమ్ ఛేంజర్ వంటి పలు చిత్రాల్లో నటించింది.
చదవండి: 'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు