
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ.. మన బన్నీకి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు విజయ్.
తాజాగా విజయ్... తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ టీషర్ట్స్‌ను, పిల్లల కోసం కొన్ని బర్గర్‌లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ అని తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. కాగా.. గతంలోనూ అల్లు అర్జున్‌కు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపారు.

మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జత కట్టనున్నారు. జవాన్ మూవీతో హిట్ అందుకున్ అట్లీ దర్శకత్వంలో నటించునున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది.