rowdy
-
బన్నీకి రౌడీ హీరో సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ.. మన బన్నీకి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్‌కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్.తాజాగా విజయ్... తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ టీషర్ట్స్‌ను, పిల్లల కోసం కొన్ని బర్గర్లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ అని తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. కాగా.. గతంలోనూ అల్లు అర్జున్‌కు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపారు.మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జత కట్టనున్నారు. జవాన్ మూవీతో హిట్ అందుకున్ అట్లీ దర్శకత్వంలో నటించునున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. -
అల్లు అర్జున్‌కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్ 'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి కాగా.. చివరి దశ ప్రమోషన్లలో టీమ్ అంతా ఫుల్ హడావుడిగా ఉంది. ఇలాంటి టైంలో బన్నీకి ఎప్పటిలానే క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. గతంలో పుష్ప తొలి భాగం రిలీజ్ టైంలో ఇచ్చినట్లే ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ చేశాడు.(ఇదీ చదవండి: పుష్ప 2: ఐదు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్.. నిడివి ఎంతంటే?)తన సొంత 'రౌడీ' బ్రాండ్ కలెక్షన్స్ నుంచి అల్లు అర్జున్‌కి ఇప్పటికే పలుమార్లు విజయ్ దేవరకొండ డ్రస్సులు ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ కోసం మరో బహుమతి పంపాడు. 'పుష్ప' పేరుతో ఉన్న టీ షర్ట్‌లను ఇచ్చాడు. దీంతో వాటిని ఫొటో తీసిన అల్లు అర్జున్.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. 'నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు థ్యాంక్యూ' అని బన్నీ రాసుకొచ్చాడు. 'లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి' అని విజయ్ రిప్లై ఇచ్చాడు.డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. రూ.1000 కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ అనే టాక్ నడుస్తోంది. ఇందుకు తగ్గట్లే పాట్నా, చెన్నై, కోచిలో భారీ స్థాయిలో ఈవెంట్స్ పెట్టారు. ముంబైలో శుక్రవారం ప్రెస్‌మీట్ జరగనుంది. డిసెంబరు 1న బెంగళూరులో ఈవెంట్ ఉంది. మరి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఉందా లేదా అనేది ప్రస్తుతానికి సందేహంగా ఉంది.(ఇదీ చదవండి: 'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్) -
దాడి చేసింది టీడీపీ రౌడీలే
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆధారాలతో సహా రౌడీ మూకల ఫోటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ బుర్రలేని మాటలు మాట్లాడారని విమర్శించారు. దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుండగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్కరున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్ అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్ గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్ బాబు’ అనే బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. -
రౌడీ రాజకీయాలను ప్రేరేపిస్తున్న బాబు, లోకేశ్
తిరుపతి సిటీ: చంద్రబాబు, లోకేశ్ పాదయాత్రల పేరుతో చంపుతాం.. అంతు చూస్తాం.. అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రౌడీ రాజకీయాలను ప్రేరేపించడమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి మేలు చేస్తామని ఒక్క మాట కూడా లోకేశ్ తన పాదయాత్రలో మాట్లాడకపోవడం దారుణమన్నారు.పుంగనూరులో టీడీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కులపిచ్చి, వెన్నుపోటు రాజకీయాలు తప్ప ప్రజాప్రభుత్వం రావాలనే ఆకాంక్ష టీడీపీ వారికి లేదన్నారు. రామోజీ గ్రూపునకు చెందిన మార్గదర్శి సంస్థ మోసాలను సీఎం వైఎస్ జగన్ బయటపెట్టడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. పదవులు పోవడంతో మతిభ్రమించి బొండా ఉమ, అయ్యన్నపాత్రుడు రాక్షసుల్లాగా మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఉచ్చపోయిస్తాం.. అంటున్న లోకేశ్ లెట్రిన్, బాత్రూమ్లు కట్టే పనిలో ఉన్నారా.. అని ప్రశ్నించారు. లోకేశ్ అందుకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. -
అర్ధరాత్రి 70 మంది రౌడీలు న్యాయవాది ఇంట్లోకి చొరబడి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని ఉమెన్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి ఇంట్లోకి శుక్రవారం అర్ధరాత్రి 70 మంది భూకబ్జాదారులు, రౌడీలు చొరబడి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్లాట్ నం.85, 86లో వెయ్యి గజాల స్థలం 1990 నుంచి సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి, ఆయన భార్య సురేఖారెడ్డి ముదిగంటి ఆధీనంలో ఉంది. ఇందులో ఇల్లు కట్టుకొని కొడుకు భరత సింహారెడ్డితో కలిసి ఉంటున్నారు. ప్రభుత్వానికి క్రమబద్దీకరణ కోసం కూడా దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించారు. అయితే పరమేశ్వర్‌రామ్ అనే విశ్రాంత గ్రూప్–1 అధికారి ఈ స్థలం తనదేనంటూ వాదిస్తూ అదే ప్రాంతంలో ఉండే ప్లాట్ నంబర్ 91కి చెందిన పత్రాలతో విశ్వనాథ్‌రెడ్డి ప్లాట్‌ను మరొకరికి డెవలప్మెంట్ అగ్రిమెంట్‌కు రూ.15 లక్షలు తీసుకొని ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి అర్ధరాత్రి 70 మంది గూండాలను తీసుకొని కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించి కారంపొడి పొట్లాలు చల్లుతూ వీరంగం సృష్టించాడు. దీంతో తీవ్ర భయబ్రాంతులకు గురైన వాచ్‌మెన్‌తో పాటు విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డయల్ 100కు కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి రౌడీల్లో కొందరు పారిపోగా, మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. శనివారం బంజారాహిల్స్ ఏసీపీ శ్రీధర్, సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి 'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..' -
చెన్నైలో రౌడీలకు చెక్ పెట్టేందుకు పోలీసులు మాస్టర్ ప్లాన్!
సాక్షి ప్రతినిధి, చెన్న: చెన్నై మహానగరంలో పెచ్చుమీరి పోతున్న రౌడీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎగస్ట్రాలు చేస్తే ఎన్‌కౌంటర్‌కూ వెనుకాడకూడని నిర్ణయించినట్లు సమాచారం. చెన్నై ప్రజలను వణికించిన అయోద్దికుప్పన్, వీరమణి సహా పలువురు బడా రౌడీలను తుపాకీ తూటాలతో పోలీసులు మట్టుబెట్టారు. ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతున్నా.. కొత్త రౌడీలు పుట్టగొడుగుల్లా పుట్టుకుని వస్తూనే ఉన్నారు. వారిని అణిచివేసే చర్యలు చేపట్టడం పోలీసులకు దిన చర్యగా మారింది. పిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతూ చాలా మంది యువకులు రౌడీలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నారు. ఆ ఘటనతో అప్రమత్తం.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చెన్నై మడిపాక్కంలో డీఎంకే నేత సెల్వంను చుట్టుముట్టి కిరాతకంగా హతమార్చిన నిందితులంతా 20 ఏళ్లలోపు వారే కావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో మరింత అప్రమత్తమైన ఖ>కీలు.. చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ఆదేశాల మేరకు నగరంలోని వెయ్యిమందికి పైగా రౌడీల జాబితాను సిద్ధం చేశారు. వీరి నేర చరిత్రను బట్టి ఏ ప్లస్, ఏ, బీ, సీ లుగా విభజించారు. అంతేగాక అజ్ఞాతంలో ఉన్నవారు, ఇటీవలే జైలు నుంచి విడుదలైన రౌడీల జాబితా, వారి నేర చరిత్రపై పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. నేర ప్రవృత్తికి దూరంగా మెలుగుతూ జీవనం సాగించకుండా, పోలీస్ హెచ్చరికలను ఖాతరు చేయకుండా హద్దుమీరే వారిని ఎన్కౌంటర్ ద్వారా హతమార్చవచ్చని ఇన్స్పెక్టర్లకు పోలీస్ కమిషనర్ పూర్తి అధికారాలను ఇచ్చేసినట్లు విశ్వసనీయమైన సమాచారం. ఇందుకు సంబంధించి పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, చెన్నై నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అత్యంత కఠినమైన చర్యలను అమలు చేయనున్నామని తెలిపారు. రౌడీల అణచివేతతోపాటూ, రౌడీలకు ఆశ్రయం ఇచ్చినా, నేరాలకు సహకరించినా, పారిపోయేందుకు తోడ్పడినా.. అలాంటి వారిపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. సాధారణ, పేరొందిన రౌడీలతోపాటూ 325 మంది బడా దాదాలను కూడా గుర్తించామని అన్నారు. వీరంతా సమష్టిగా నేరాలకు పాల్పడుతూ గ్యాంగ్స్టర్లుగా చలామణి అవుతున్నట్లు నిర్ధారణ కావడంతో వీరిని ప్రత్యేక జాబితాలో చేర్చామని వివరించారు. -
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్ రాజు
‘‘ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ ‘రౌడీ బాయ్స్’. చాలా కాలం తర్వాత మా బ్యానర్లో వస్తున్న యూత్ ఫిల్మ్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేసిన అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ బాయ్స్’ సినిమాకి హీరో దేవిశ్రీ ప్రసాద్. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించాలంటే మొదట అందర్నీ మెప్పించేది సంగీతమే. ఆశిష్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నామని, మ్యూజిక్ చేయాలని అడిగితే వారం టైమ్ తీసుకుని ఓకే అన్నాడు. దేవిశ్రీ, నా జర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ ‘రౌడీ బాయ్స్’ వేరు. ఇద్దరి హీరోలకంటే అనుపమా పరమేశ్వరన్ పెద్దగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను బాగా చేసింది. దేవిశ్రీ తర్వాత ఈ సినిమాకి తనే సెకండ్ హీరో. దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవలే విడుదలైన మా సినిమా టైటిల్ సాంగ్, ఇప్పుడు విడుదలైన టీజర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు ఆశిష్. ‘‘రౌడీబాయ్స్’ లో మొత్తం 9 పాటలు ఉన్నాయి. పాటలన్నీ ఆడియన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి’’ అన్నారు హర్ష. ‘‘రౌడీ బాయ్స్’ కి మ్యూజిక్ అందించేందుకు ‘దిల్’ రాజుగారు అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఆశిష్ సినిమాకు మ్యూజిక్ అందించడం నా బాధ్యత. ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని ఉంటే నేను ధర్నా చేసేవాణ్ణి. ‘రౌడీబాయ్స్’ సినిమాతో కాలేజీ డేస్‌ను గుర్తుచేసుకుంటారు.. యూత్ అంతా కలిసి నవ్వుకుంటూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆశిష్ నటన చూస్తే తొలి సినిమాకే ఇంత బాగా యాక్ట్ చేశాడేంటి? అనిపించింది. ఆశిష్, విక్రమ్ పోటాపోటీగా నటించారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. చదవండి: కావ్య కోసం కొట్టుకున్న 'రౌడీ బాయ్స్' -
'కావ్య నా పిల్ల'.. కాలర్ పట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్
Rowdy Boys Teaser released: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్ కోసం ఇద్దరు గొడవ పడటం వంటివి టీజర్లో చూపించారు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'గల్లీరౌడీ'గా హీరో సందీప్ కిషన్..
‘గల్లీ రౌడీ’ ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్. కోన వెంకట్ సమర్పణలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘గల్లీ రౌడీ’. టీజర్‌కి మంచి ప్రశంసలు వచ్చాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: జి.వి, సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్. -
‘రౌడీ బేబీ’ చిత్రం ప్రారంభం
-
పోలీసులపై కాల్పులు జరిపిన రౌడీలు..
-
రౌడీషీటర్ల కాల్పులు.. 8 మంది పోలీసుల మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. డీఎస్పీతో పాటు 8 మంది పోలీసులను కాల్చి చంపారు. కాన్పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ కిరాతక ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని యూపీ ప్రభుత్వం తెలిపింది. కాన్పూర్ శివారులోని చౌబెపూర్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు పోలీసుల బృందం కాన్పూర్ వెళ్లింది. పోలీసులపై రౌడీషీటర్లు అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అదనపు డీజీపీ(శాంతి భద్రతలు), కాన్పూర్ ఎస్పీ, ఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల మృతి ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం), డీజీపీతో మాట్లాడిన ఆయన ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఏడీజీ జేఎన్ సింగ్ తెలిపారు. ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించామన్నారు. గాయపడిన నలుగురు పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా రౌడీషీటర్ వికాస్ దూబేపై 57 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2001లో శివలి పోలీస్ స్టేషన్లో సంతోష్ శుక్లాను హత్య చేసినట్లు దుబేపై ఆరోపణలు ఉన్నాయి. రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్లో శుక్లా మంత్రిగా పనిచేశారు. -
‘క్లబ్ రౌడీ..మేం రెడీ... ’
వ్యక్తిగత ఫ్యాషన్ లేబుల్ లాంచ్ చేసిన టాలీవుడ్ హీరోగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు విజయ్ దేవర కొండ. అలాగే తన రౌడీ లేబుల్‌ని ప్రమోట్ చేయడానికి కూడా వెరైటీ రూట్నిఎంచుకుంటున్నాడు. ఓ క్లబ్‌ని ఏర్పాటు చేసి దానిలో పూర్తిగా యువతకు అవకాశాలిస్తున్నాడు. నిఫ్ట్ వంటి కాలేజీల నుంచి క్రియేటివ్ థాట్స్ ఉన్న యువతని ఎంచుకుంటున్నాడు. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహణ కోసం రౌడీస్ క్లబ్‌కు ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సిటీలో రౌడీ స్టైల్స్ ఎంత క్రేజీయో.. ఈ క్లబ్లో మోడల్, ఫొటోగ్రాఫర్ లేదా మరేదైనా పోస్టుకు ఎంపికవడం అంతే క్రేజీగా మారింది. ఈ క్లబ్ నిర్వహిస్తున్న ఆన్లైన్,ఆఫ్‌లైన్ ఈవెంట్స్‌కు విజయ్ దేవర కొండ అటెండ్ అవుతుండడంతో యూత్‌కి క్లబ్ ఆసక్తిని పెంచుతోంది. దక్షిణాదిలో మంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్‌కి కూడా మంచి ఇమేజ్ వచ్చింది. యాప్ ద్వారా విక్రయాలతో గత 2018 జులైలో ప్రారంభమైన రౌడీ వేర్ యాప్‌కు డౌన్లోడ్స్ మోత మోగించాయి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన పలువురు యువతీ యువకులతో ఏర్పాటు చేసిన రౌడీక్లబ్ యూత్‌కి క్రేజీగా మారింది. ఈ క్లబ్ నిర్వహించే ప్రమోషనల్ ఈవెంట్స్ సిటీలో ఓ రేంజ్లో కాలేజీ యువతను ఆకట్టుకుంటున్నాయి. యూత్ బ్రాండ్... ‘‘మేం మా రౌడీ వేర్ని యువతకు చేరువ చేయాలనుకున్నాం కాబట్టి ఈ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ప్రధానంగా కళాశాల విద్యార్థుల మీద దృష్టి పెట్టాం. వారి నుంచే మోడల్స్ కావాలని కోరుకున్నాం. వాళ్లయితే మా బ్రాండ్‌ని అత్యుత్తమంగా రిప్రజెంట్ చేస్తారనేది మా ఉద్దేశ్యం’’ అని చెప్పారు ఈ క్లబ్ ప్రతినిధి పూజ. మోడల్స్‌తో పాటు తమకు అవసరమైన ఇతరత్రా టాలెంటెడ్ యూత్‌ని ఎంచుకోవడం కోసం ఈ బ్రాండ్ ఆధ్వర్యంలో ఒక టీమ్ కూడా ఏర్పాటైంది. యాటిట్యూడ్, ఆత్మవిశ్వాసంతో పాటు స్ట్రీట్వేర్ని ధరించి ప్రజెంట్ చేసే విధానాన్ని విశ్లేషించి మోడల్స్‌ని ఎంచుకుంటున్నామని పూజ చెప్పారు. ‘‘ఇప్పటిదాకా మా క్లబ్లో 20 మంది మోడల్స్ ఉన్నారు. వీరిలో హైదరాబాద్ వాసులే కాకుండా వేరే రాష్ట్రాల వారు కూడా ఉన్నారు’’ అని పూజ చెప్పారు. రౌడీ టీమ్ కార్యకలపాలలో నిఫ్ట్ నుంచి వచ్చిన యువత ఎక్కువగా పాలుపంచుకుంటున్నారు. నగరానికి చెందిన ఫ్యాషన్ బ్లాగర్స్ రక్ష , దివ్య బొప్పన, ఈషారావు, ధీరజ్, పాస్వెట్ తదితరులు ప్రస్తుతం వీరికి ప్రమోషన్ చేస్తున్నారు.. యూ ఆర్ ద ఫ్యూచర్... మా టీమ్‌లో జేర్చుకునేందుకు మోడల్స్ తో పాటుు గ్రాఫిటి డిజైనర్స్, ఫొటో/వీడియో గ్రాఫర్స్, స్టైలిస్ట్స్ల కోసం రెగ్యులర్ టాలెంట్ హంట్ చేస్తున్నాం. ఇదొక స్ట్రీట్ వేర్ బ్రాండ్. మా ట్యాగ్‌లైన్ యూ ఆర్ ద ఫ్యూచర్. దానికి తగ్గట్టే 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే మాకు మెయిన్ ఫోకస్. వీరికి ఇచ్చే రెమ్యునరేషన్ అసైన్మెంట్ లను బట్టి ఉంటుంది. – పూజ, రౌడీ క్లబ్ ప్రతినిధి జాబ్‌తో బ్యాలెన్స్ చేసుకుంటూ... నా ఫ్రెండ్ విష్ణు అనే ఫొటోగ్రాఫర్ ద్వారా ఈ ‘రౌడీ’ క్లబ్ పరిచయమైంది. మోడల్‌గా ఛాన్స్ వచ్చింది. అరడజను ప్రొడక్టŠస్కి మోడలింగ్ చేశా. సన్డోనర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి పెర్ఫార్మ్ చేయడం మరచిపోలేని జ్ఞాపకం. టీమ్ అందిస్తున్న సహకారం వల్ల జాబ్‌ని మోడలింగ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఏమీ లేదు. – సంజయ్ ఠాకూర్, అమెజాన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ‘రౌడీ’తో హ్యాపీ... ఇన్‌స్ట్రాగామ్ ద్వారా రౌడీ వేర్ ప్రతినిధులు నన్ను సంప్రదించి మోడల్‌గా ఎన్నుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న బ్రాండ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్‌లో ఉన్న వారంతా టాలెంటెడ్ యువత. వీరి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నా.– తన్మయి, మోడల్ -
పబ్‌లో ‘రౌడీ’ విజయ్ హంగామా
-
కటకటాల్లో టిక్‌టాక్
కర్ణాటక, బనశంకరి: పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లిన ఇద్దరు రౌడీలు పరప్పన అగ్రహార జైలులో టిక్‌టాక్ చేయడం జైల్లో లోపాలకు అద్దం పడుతోంది. పలు నేరాల్లో జైలులో శిక్ష అనుభవిస్తూ తన ప్రియురాలి ఫోటో పెట్టి రౌడీలు టిక్‌టాక్ వీడియో చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోంది. ఈ సంఘటనతో జైలులో భద్రత పట్ల అనుమానం వ్యక్తమౌతోంది. పోలీసుల కాల్పుల్లో గాయపడి జైలుకెళ్లిన రౌడీలు వసీం, ఫయాజ్ ఇద్దరు జైలు నుంచి తమ ప్రియురాళ్లతో టిక్‌టాక్ చేశారు. టిక్‌టాక్‌లో చాకు, కడ్డీ వంటివి ప్రదర్శిస్తూ వీరిద్దరూ రౌడీయిజం ప్రదర్శించారు. ఖైదీ వసీం శ్యాండల్‌వుడ్ నటుడు డైలాగ్‌తో వీడియో చేశాడు. జైలులో సిగరెట్ తాగుతూ కూర్చున్న ఫోటోకు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ డైలాగ్ తో టిక్‌టాక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫయాజ్ అనే ఖైదీ ఓ యువతితో ఫోటో పెట్టి తేరీమేరీ కహాని అంటూ టిక్‌టాక్ చేశాడు. జైలులోపలకు సెల్ఫోన్లు, సిగరెట్లు ఎలా వెళ్లాయి అనేది తేలాల్సి ఉంది. -
ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..
చెన్నై(తమిళనాడు): మదురైలో అతడో పేరుమోసిన రౌడి. అతడిపై రౌడీషీటేకాదు ఏకంగా 14 కేసులు ఉన్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం, దందా సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి పేరు వరిచియూర్ సెల్వం. మధురైలో అతడి పేరు చెబితే భయంతో జనం హడలిపోతారు. ఎంత పెద్ద రౌడి అయినప్పటికీ అతడికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి బంగారం, రెండోది దైవం. కేజీలకు కేజీల బంగారు నగలు వేసుకోవటమంటే సెల్వంకు పిచ్చి. అదే సమయంలో దేవుడంటే మహా భక్తి భయం కూడా. ఒంటి నిండా బంగారంతో కాంచిపురంలోని అత్తివరదర్ ఆలయాన్ని దర్శించుకోవాలనే కోరిక అతడికి కలిగింది. అనుకున్నదే తడవుగా మదురై పోలీసు కమిషనర్ ద్వారా కాంచిపురం ఎస్పీకి సమాచారం పంపించి అత్తివరదర్ దర్శనానికి వచ్చాడు. అంతే మనోడికి పోలీసులు రాచమర్యాదలతో స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించి జాగ్రత్తగా పంపించివేశారు. ఒంటినిండా బంగారంతో ఓ రౌడి సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడంపై స్థానికులు వింతగా చర్చించుకుంటున్నారు. రౌడీనా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఈయన ఎవరో గుర్తు పట్టారా?
-
సిటీలో స్టేట్ 'రౌడీ'
హైదరాబాద్ నగరంలో కొత్త రకం రౌడీలు హల్చల్ చేస్తున్నారు. మోడ్రన్ రౌడీలుగా మారాలని యువత ఉర్రూతలూగుతున్నారు. దీంతో ప్రతి బుధవారం వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వీళ్లు చొక్కాలే కాదు.. గళ్ల లుంగీలు కూడా ధరిస్తారు. అయినా సరే.. వీరు సూపర్ స్లైలిష్. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అర్జున్‌రెడ్డి ఫేం విజయ్‌దేవరకొండ లాంచ్ చేసిన రౌడీలే వీరంతా. సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో) :టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ నెల 15న జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ పబ్‌లో ఆయన తన అభిమానులకు, సన్నిహితులకు పార్టీ ఇచ్చాడు. అదే చేతితో రౌడీ వేర్ పేరుతో టెక్స్టైల్స్ లేబుల్‌ని, వెబ్సైట్ రౌడీ క్లబ్ డాట్ ఇన్ని లాంచ్ చేశాడు. వీటి ద్వారా ప్రతి బుధవారం పరిమిత శ్రేణిలో రౌడీవేర్ను ఆయన విడుదల చేస్తున్నాడు. ఓవర్‌నైట్ స్టార్... ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో యూత్‌లో టాప్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ లాగే.. ఆయన యాప్ కూడా ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. తొలి బుధవారం రోజున కేవలం 24 గంటల్లోనే వీటి సేల్స్ కోసం ఆయన రూపొందించిన యాప్ అత్యధిక డౌన్లోడ్స్ జరిగాయని సమాచారం. తాజాగా రెండో బుధవారం ఏకంగా లుంగీలను లాంచ్ చేశాడు. అవి కూడా కేవలం 2 గంటల్లోనే నో స్టాక్ అనిపించుకున్నాయి. ఈ దుస్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఈ హీరో ప్రకటించాడు. మనకు కొత్త... బాలీవుడ్‌కి పాత.. నిజానికి స్టార్స్ లేబుల్స్ స్టార్ట్ చేయడం అనేది టాలీవుడ్‌కి కొత్త గాని.. ఇది బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. సల్మాన్ ఖాన్, సోనమ్‌కపూర్, అలియాభట్ లాంటి తారలతో పాటు ఇటీవలే క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రాంగ్ పేరుతో లేబుల్ లాంచ్ చేశాడు. అయితే.. మన టాలీవుడ్ స్టార్స్ బిజినెస్ కోసం ఎక్కువగా రెస్టారెంట్స్, పబ్స్, జిమ్‌లు వంటివి మాత్రమే ఎంచుకున్నారు తప్ప సొంతంగా ఫ్యాషన్ లేబుల్ లాంచ్ చేసే సాహసం చేయలేదు. విజయ్.. రౌడీవేర్.. మరెంతమంది స్టార్స్‌ని ఇన్స్పైర్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి. -
అదే నంబర్ రవికి ఎలా వచ్చింది ?
యశవంతపుర : ప్రముఖ రౌడీ, సైకిల్ రవితో ప్రముఖు సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణలో మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు సీసీబీ పోలీసుల విచారణలో బయటపడింది. ఎంబీ పాటిల్ మంత్రిగా ఉన్నప్పుడే రౌడీ రవినే మంత్రికి 24 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలు లభించాయి. ఈ సందర్భంగా నిందితుడు ఉపయోగించిన 11 ఫోన్లతో పాటు 38 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సిమ్ నంబర్ ద్వారా మాత్రమే ఎంబీ పాటిల్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. రవి ఉపయోగించిన సిమ్‌కార్డు మండ్యకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సచ్చిదానంద పేరుతో ఉంది. అదే నంబర్ రవికి ఏలా వచ్చిందో పోలీసులకు అర్థం కావటంలేదు. 2009 నుండి తానే ఉపయోగిస్తున్నట్లు సచ్చిదానంద చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అదే నంబర్‌ను రవి ఉపయోగించి ఉండవచ్చని సీసీబీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో విచారణ చేపట్టారు. ఇదే సమయంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టనుండటంతో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు చిత్ర రంగ ప్రముఖల్లో భయం నెలకొంది. రవి ఎవరో నాకు తెలియదు : మాజీ మంత్రి ఎంబీ పాటిల్ రవి ఏవరో తనకు తెలిదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో వెల్లడించిన నెంబర్ తనదేనని, తన వాట్సాప్ నెంబర్ కూడా అదేనన్నారు. అయితే రవి అనే వ్యక్తితో తనకు ఎప్పుడు పరిచయం లేదని, అతడిని ఒక్కసారి కూడా చూడలేదన్నారు. -
విజయ్ దేవరకొండ.. రౌడీ బ్రాండ్
జూబ్లీహిల్స్: యువ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ’ పేరుతో సొంతంగా రూపొందించిన క్లొతింగ్ బ్రాండ్‌ను ఆదివారం జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ పబ్‌లో ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. అందరికీ అందుబాటులో ధరల్లో దుస్తులను అందించే లక్ష్యంతో సరికొత్త విభాగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. తనను చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో అందరూ రౌడీ అని ప్రేమగా పిలిచేవారని, ఈ రోజు తనకు నచ్చిన పని, వృత్తి చేయగలుగుతున్నానంటే కేవలం మొండితనంతో కూడిన రౌడీయిజమే కారణమన్నారు. రౌడీగానే జీవించాలనుంటున్నాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం ఇటీవల తాను పెళ్లిచూపులు చిత్రానికిగాను సాధించిన ఫిలిమ్‌ఫేర్ అవార్డును వేలం వేయగా దివీస్ ల్యాబ్స్‌కు చెందిన శకుంతల దివీ రూ.25 లక్షలతో దక్కించుకున్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం www.rowdyclub.in పేరుతో రూపొందించిన వెబ్సైట్, యాప్‌లను ఆవిష్కరించారు. -
రౌడీ సైకిల్ రవి అనుచరుల అరెస్ట్
యశవంతపుర : మీటర్ వడ్డీ, నెలమామూళ్లు వసూలు, రియల్ ఏస్టేట్ దందాలపై ఆరోపణలున్న రౌడీ సైకిల్ రవి కార్యకలపాలపై సీసీబీ పోలీసులు తీవ్రంగా విచారణను చేపట్టారు. అందులో భాగంగా రవి అనుచరులైన మూర్తి అలియాస్ బేకరి మూర్తి, నవీన్, రమణను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితులు ముగ్గురూ రవి చేసే ప్రతి అక్రమాల్లోనూ భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఎక్కడెక్కడ రియల్ ఏస్టేట్ సెటిల్మెంట్లు చేశారు, డబ్బు కోసం ఏవరేవరిని అపహరించి వేధించారు, మీటర్ వడ్డీ తదితర ఘటనపై ఆరా తీస్తున్నారు. గతంలో ఓ వ్యాపారవేత్తను బంధించి వేధించిన విషయాలను ముగ్గు రు నిందితులు పోలీసుల ముం దు అంగీకరించినట్లు తెలిసింది. సినీ ప్రముఖలను, అనేక మంది రియల్ఎస్టేట్ వ్యాపారులను కూడా సీసీబీ కార్యాలయానికి పిలిపించి విచారించాలని నిర్ణయించారు. 20 సిమ్ల ద్వారా చేసిన ఫోన్ కాల్ లిస్టును తెప్పించుకొని పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. గతంలో రవి ఇంటిలో స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా సీనియర్ పోలీసు అధికారులు పరిశీలీస్తున్నారు. రవి కుటుంబసభ్యుల పేరున ఆ రు ఖరీదైన ఇంటి స్థలాలున్నట్లు గుర్తిం చారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వరకు ఉండవచ్చని అంచన వేశారు. అక్రమాస్తులు అధికంగా ఉన్నట్లు తేలడంతో కేసును ఈడీ అప్పగించాలని సీసీబీ పోలీసులు యోచిస్తున్నారు. -
హీరోని హత్య చేయాలని కుట్ర
యశవంతపుర: పోలీసు కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు రౌడీ సైకిల్ రవి సీసీబీ పోలీసుల విచారణలో విస్తుగొలిపే సమాచారాన్ని బయటపెడుతున్నాడు. కన్నడ సినీ హీరో యశ్‌ను హత్య చేయాలని అతడు కుట్ర రచించినట్లు వెల్లడించినట్లు తెలిసింది. రెండేళ్ల క్రితమే ఈ కుట్ర పన్నాడు. అప్పట్లో ఈ విషయం తెలిసిన యశ్, నిర్మాత జయణ్ణ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీని తరువాత సీసీబీ పోలీసులు నగరంలోని అనేక మంది ముఖ్యమైన రౌడీలను అరెస్టు చేసి, మరి కొందరికి హెచ్చరికలు చేసి వదిలేశారు. అప్పట్లో రౌడీసైకిల్ రవి, త్యాగరాజనగర కోదండరామ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. కోదండరామ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియటం లేదు. తాజా విచారణలో రవి పాతకుట్రను సవివరంగా బయటపెట్టాడు. బెంగళూరుకు సమీపంలో జరిగిన ఒక మందు పార్టీలో హత్య విషయమై చర్చించినట్లు చెప్పాడు. ప్లాన్ వేసిన మాట నిజమేగాని హత్య చేసే వరకు వెళ్లలేదని తెలిపాడు. దీంతో ఇప్పుడు రౌడీ కోదండరామ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని పట్టుకుంటే మరింత సమాచారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. సినీ నిర్మాతతో గొడవకు సంబంధిం చి యశ్‌పై రౌడీ రవి పగ పెంచుకున్నాడు. పెద్ద విషయం కాదు: సీసీబీ యశ్ హత్యకు కుట్ర విషయాన్ని సీసీబీ ఉన్నతాధికారులు తీవ్రత తగ్గించి చూపుతున్నారు. ఇది పాత కథేనని అంటున్నారు. కేవలం సమాచారాన్ని మాత్రమే రవి నుండి సేకరిస్తున్నట్లు విచారణ అధికారి ఒకరు పేర్కొన్నారు. మద్యం తాగిన మత్తులో ఏదో కుట్ర పథకం వేశారని చెబుతున్నారు. సుమారు 20 సిమ్ కార్డుల ద్వారా సైకిల్ రవి పలు రంగాల ముఖ్యులతో మాట్లాడేవాడని విచారణలో బయట పడింది. చిన్న సంగతే: నటుడు యశ్ తనను హత్య చేయటానికి కుట్రపై నటుడు యశ్ స్పందిస్తూ, ఇది చిన్న విషయమని అన్నారు. రెండేళ్ల క్రితం దీనిని పోలీసు కమిషనర్‌కు దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. నిర్మాత జయణ్ణ కారుపై కొందరు రాళ్లు విసిరిన ఘటనపై పోలీసు కమిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మైసూరు, బెంగళూరు ప్రాంతాల్లో అనేక మంది రౌడీలను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. -
హాస్యనటున్ని ప్రశ్నించిన సీసీబీ
యశవంతపుర: రౌడీ సైకిల్ రవితో సంబంధాలపై పోలీసులు శ్యాండల్‌వుడ్ హాస్యనటుడు సాధుకోకిలను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు.ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రశ్నించారు. దీనిపై వివరాలను వెల్లడించటానికి సాధుకోకిల నిరాకరించారు. సైకిల్ రవికి సాధుకోకిల ఏడెనిమిదిసార్లు ఫోన్ చేసినట్లు కాల్ లిస్టులో తేలడంతో ఆయనను సీసీబీ పోలీసులు విచారించారు. కాల్ లిస్టు ఆధారంగా అనేకమందిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. -
రంజాన్ వేళ రౌడీ షీటర్ దారుణ హత్య
-
రౌడీ షీటర్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్),(వీఆర్సీసెంటర్): అందరూ సంతోషంగా రంజా న్ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్ వద్ద ఉన్న సప్తగిరి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్ సాయి(30) అనే రౌడీషీటర్‌పై పలు హత్యలు, దొంగతనాలు, బెదిరింపులకు సంబంధిం చి రూరల్, 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ కేసులో రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. గతేడాది ఫిబ్రవరి 20వ తేదీ ఆత్మకూరు బస్టాండ్ వద్ద బుజబుజనెల్లూ రుకు చెందిన కృష్ణయ్యను నగదు కోసం బండరాయితో కొట్టి హత్యచేసిన కేసులో కూడా సాయి ప్రధాన నిందితుడు. అయితే నెల్లూరు çనగరంలోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డి కాలనీలో గత కొంతకాలంగా సాయి ఓ మహిళతో సన్నితంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఆ మహిళతో గొడవ పడి దాడి చేశాడు. ఆ మహిళ నవాబుపేట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ వి.వి.రమణయ్య వద్దకు వచ్చి సాయి తనపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో సాయిని ఎస్ఐ మందలించి పంపేశారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వెంకటేశ్వరపురం సెంటర్‌కు వచ్చిన సాయి బార్లో మద్యం సేవించి బయటకు రావటాన్ని గమనించిన గణేష్, అమర్ అనే ఇద్దరు యువకులు పక్కాస్కెచ్‌తో తమ వెంట తెచ్చుకున్న కత్తి, బీర్ బాటిళ్లతో సాయిను అతి కిరాతకంగా అందరూ చూస్తుండగానే దాడి చేశారు. దీంతో సాయి అక్కడిక్కడే మృతిచెందాడు. సాయి మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు తమ నలు గురు అనుచరులకు చెందిన రెండు బైక్‌లపై వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీస్‌స్టేషన్ ఎస్ఐలు శ్రీహరిబాబు, వి.వి.రమణయ్య, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలతోనే హత్య బస్టాండ్ సాయి హత్య పాతకక్షల నేపథ్యంలోనే జరిగినట్లు తెలుస్తోంది. సాయి, హత్యకు పాల్పడిన గణేష్‌లు స్నేహితు లు. గతంలో ఇద్దరూ కలిసి పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయి ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి రావడంతో హత్యకు పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. సాయిపై దుండగులు దాడి చేస్తున్న సమయంలో కొందరు స్థానికులు తమ సెల్ఫోన్లలో హత్యకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారు. ఈ వీడియోల్లో హత్య చేసిన వారు గణేష్, అమర్‌లుగా గుర్తించగా, హత్య చేసి 2 బైక్‌లపై మరో నలుగురితో కలిసి వీరు వెళ్లడం చూస్తుంటే ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. -
చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకున్న యువతి
-
‘కత్తి’లాంటి బర్త్‌డే పార్టీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రౌడీ..బర్త్‌డే వేడుకకు అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాసన పసిగట్టిన పోలీసులు ఆఖరి నిమిషంలో ఎంటర్ కావటంతో కథ రివర్సయింది. చెన్నై సూలైమేడుకు చెందిన బిన్నీ (40)కి పెద్ద రౌడీ అనే పేరుంది. చెన్నైకి చెందిన ఓ మంగళవారం ఇతని పుట్టిన రోజు కావటంతో నగర శివార్లలోని ఓ లారీ షెడ్డులో వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాడు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన 150 మందికి పైగా రౌడీలకు ఆహ్వానాలు పంపాడు. రాత్రికల్లా అందరూ షెడ్డు వద్దకు చేరుకోగా బాణసంచాతో వారికి స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం బిన్నీ పిడికత్తితో కేక్ కూడా కోశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అంబత్తూరు డిప్యూటీ కమిషనర్ సర్వేష్రాజ్ నేతృత్వంలో 70 మంది పోలీసులు మెరుపుదాడి చేసి 75మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. బిన్నీతోపాటు మరో 50 మంది మాత్రం తప్పించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న మారణాయుధాలతోపాటు 50కి పైగా సెల్ఫోన్లు, 50 బైకులు, 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల ప్రణాళిక, సమాచారం చేరవేత, అమలు కోసం రౌడీలంతా సెల్ఫోన్లలో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును కూడా నడుపుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెన్నై పోలీస్ కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. రౌడీల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించను
నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగం రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరిక కాకినాడ క్రైం : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని హెచ్చరించారు. శనివారం కాకినాడ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు నిర్వహించిన పరివర్తన సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు శాంతికాముకులని, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన తూర్పు గోదావరి ప్రశాంతతకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సంఘ వ్యతిరేఖ కార్యకలాపాలు, సెటిల్మెంట్లు, దందాలు, కొట్లాటలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. చెడు అలవాట్లు , నేర ప్రవత్తిని విడిచిపెట్టి సమాజంలో మంచిగా జీవించడం నేర్చుకోవాలన్నారు. రౌడీషీటర్ల పై పీడీయాక్టు ఉపయోగించి ఉక్కుపాదం మోపుతానన్నారు. ప్రతి ఆదివారం రౌడీషీటర్లతో సంబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలో సమావేశం ఏర్పాటు చేసి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్క రౌడీషీటర్ల లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫోటో, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి వివరాలను తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాకినాడ ఎస్డీపీవో ఎస్.వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి,ట్రాఫిక్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐలు వి.దుర్గాప్రసాద్, ఏఎస్ రావు, మహ్మద్ ఉమర్, రూరల్ సీఐ వి.పవన్‌కిషోర్, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. వన్‌టౌన్, టూ, త్రీ టౌన్, పోర్టు, సర్పవరం, ఇంద్రపాలెం పోలీస్స్టేషన్ల పరిధిలోని 72 మంది రౌడీషీటర్లు పాల్గొన్నారు. పాదయాత్ర కోసం దరఖాస్తు రాలేదు ముద్రగడ పాదయాత్రకు అనుమతి కోసం ఎటువంటి దరఖాస్తు రాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ విశాల్ గున్ని సమాధానమిచ్చారు. ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం శాంతి భద్రతలను అదుపులో ఉంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమన్నారు. అందరూ చట్టానికి లోబడే పనిచేయాలన్నారు. ప్రశాంత వాతావరణానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించే ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
రౌడీకి పెత్తనమా?
- భయపెట్టడం ఆయన నైజం - ఓడిపోవడం ఆయన చరిత్ర - ఎదురూరుపై కొత్తకోట విమర్శ కోడుమూరు రూరల్: కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఒక రౌడీకి పెత్తనం అప్పజెప్పారని వైఎస్సార్సీపీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన కోడుమూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్వంత ఊరిని బాగు చేసుకోలేని ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటూ ప్రజలకు హామీలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లను, అధికారులను భయపెట్టి సుమారు రూ.10కోట్లకు పైగా కమిషన్లను దండుకున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. సొంత తల్లికి, తమ్ముడికి అన్నం పెట్టని విష్ణువర్ధన్‌రెడ్డి ప్రజలకు ఏమి మేలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికారంలో ఉండే పార్టీకి కొమ్ముకాయడం ఒక్క విష్ణుకే చెల్లుబాటవుతుందన్నారు. ఆరు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చర్రిత ఆయనకే దక్కుతుందన్నారు. విష్ణువర్దన్‌రెడ్డిపై 60కిపైగా కేసులున్నాయని, అటువంటి వ్యక్తికి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం అప్పజెప్పడం శోచనీయమన్నారు. నీటి సమస్యను పరిష్కరిస్తాం... కోడుమూరు మండలంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక రూ.65కోట్ల నాబార్డు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపారని కోత్తకోట తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఎంపీ ని«ధులు రూ. కోటి 25 లక్షలతో నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించామని, అలాగే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.. సమావేశంలో ఎంపీపీ కోట్ల వంశీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ముల్లా సలీం, కోడుమూరు, కర్నూలు మండలాల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు డీలర్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి సుభాకర్, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ మండలాల నాయకులు లింగారెడ్డి, గిడ్డయ్య, రామకృష్ణ, యోగీశ్వరరెడ్డి, రామగిడ్డి, నరసింహారెడ్డి, సుందరం, విట్టల్, రఘురెడ్డి, ఎర్రన్న, మధు, బాలముని తదితరులు పాల్గొన్నారు. -
జేసీ..నోరు అదుపులో పెట్టుకో
– ఎమ్మెల్యే సీటు కోసం జగన్ ఇంటి చుట్టూ తిరిగిన వైనాన్ని మరచిపోయావా? – తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నాయకులు కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరచిపోయి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు ఫైరోజ్ విమర్శించారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగిన రోజులను మరచిపోయావా అంటూ ప్రశ్నించారు. జేసీ బ్రదర్స్‌ను రాజకీయాల నుంచి వెలివేయాలని డిమాండ్ చేశారు. జేసీ సోదరులను వెనుకేసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పుతారన్నారు. -
రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు
భోజనం విషయంలో వివాదం - విద్యార్థులపై రౌడీలను ఉసిగొల్పిన వార్డెన్ - సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన - రాత్రి 10 గంటల వరకు ఉద్రిక్తత కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): భోజనం విషయంలో తలెత్తిన వివాదం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని విద్యార్థులను వార్డెన్ కిరాయి రౌడీలతో చితకబాదించాడు. బాధిత విద్యార్థులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ప్రజా సంఘాలతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలివీ.. స్థానిక డాక్టర్స్ కాలనీ శివారులోని బీసీ కాలేజీ హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం భోజనంలో కొడిగుడ్డు వడ్డించే విషయంలో ఇంటర్మీడియట్ విద్యార్థి రమేష్, డిగ్రీ విద్యార్థి గోపాల్ తదితరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కితే తన నిర్లక్ష్యం ఎక్కడ బయట పడుతుందోనని వార్డెన్ శ్రీనివాసరావు కిరాయి రౌడీలతో తమను చితకబాదించినట్లు విద్యార్థులు నాగరాజుగౌడ్, గోపాల్, నరేష్‌బాబు, జయచంద్ర, నాగార్జున తదితరులు వాపోయారు. వార్డెన్ తన సమీప బంధువైన విద్యార్థిని మెస్ ఇన్చార్జిగా నియమించి అక్రమాలకు పాల్పడుతున్నాడని.. ఇదేమని నిలదీయడంతోనే ఇలా చేశారన్నారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్‌కు తెలిపేందుకు బాధిత విద్యార్థులతో పాటు వసతి గృహ విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. కిరాయిరౌడీలను ఉసిగొల్పి హాస్టళ్లలో గ్యాంగ్‌వార్‌లకు ఊతమిస్తున్న వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ సంఘం నాయకులు లక్ష్మినరసింహ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు వార్డెన్‌కు, పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వార్డెన్‌కు బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఘటనతో రాత్రి 10గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో సీఐ మధుసూదన్, బీసీ సంక్షేమాధికారి సంజీవరాజు కలెక్టరేట్ వద్దకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
బెజవాడలోనే..‘వంగవీటి’ పాట
‘నువ్వు లోకల్ స్థాయి నుంచి స్టేట్ లెవల్‌కి ఎదగాలి.. అంటే రాజకీయాల్లోకి రావాలి’, ‘ఎంతపెద్ద రౌడీ అయితే ఏం?కత్తితో పొడిస్తే వాడికీ రక్తం వస్తుంది’... ఇవి ‘వంగవీటి’ చిత్రంలోని మచ్చుకు కొన్ని డైలాగులు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో స్వర్గీయ వంగవీటి రాధా, రంగా లాంటి నిజజీవిత పాత్రల జీవితాల నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 3న విజయవాడలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘విజయవాడలో గతంలో జరిగిన పలు సంఘర్షణలను ప్రత్యక్షంగా చూశా. అక్కడి రౌడీయిజంపై తీసిన ‘వంగవీటి’ నాకు చాలా ప్రత్యేకం. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 23న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విస్సు. -
బాలికల హాస్టల్ లోకి పోకిరీలు
♦ బాత్రూంలో వీడియో చిత్రీకరించే యత్నం ♦ ఒకరిని పట్టుకున్న సిబ్బంది ♦ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత బోధన్ టౌన్ : పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహంలోకి ప్రవేశించి సెల్ఫోన్లో వీడియోలు తీసిన పోకిరీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వెంకన్న తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముగ్గురు యువకులు బుధవారం ఉదయం పట్టణంలోని బాలికల వసతి గృహం గోడపైనుంచి లోపలికి ప్రవేశించారు. బాలికలు బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీనిని గమనించిన విద్యార్థినులు కేకలు వేయడంతో సిబ్బంది పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పోకిరీలు పారిపోవడానికి యత్నించారు. ఇద్దరు యువకులు పారిపోగా.. సాయిసిద్ధార్థ పట్టుబడ్డాడు. అతడికి దేహశుద్ధి చేసి ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. పారిపోయిన ఇద్దరు యువకులనూ అదుపులోకి తీసుకుని ముగ్గురికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సుమోటోగానే కేసునమోదు చేసుకున్నామని తెలిపారు. వసతి గృహనికి భద్రత కరువు నిరుపేద విద్యార్థుల కోసం పట్టణంలోని రాకాసీపేట్‌లో ఏర్పాటు చేసిన సమీకృత బాలికల వసతి గృహనికి భద్రత కరువయ్యింది. బాలికల వసతి గృహంలో వార్డెన్లు అందుబాటులో ఉండరు. భద్రత లేకపోవడంతో హాస్టల్ చుట్టూ పోకిరీలు చేరి బాలికలను ఆటపట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాత్రివేళలో వసతిగృహం లోకి రాళ్లు విసురుతున్నారని బాలికలు గతంలో పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వసతి గృహం గోడ ఎత్తులేకపోవడంతో పోకిరీలు తరచూ ఆమ్మాయిలను ఆటపట్టిస్తున్నారు. భద్రత కోసం హాస్టల్ వద్ద మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరినా ఫలితం లేదు. ముగ్గురు యువకులు మూడు రోజులుగా వసతి గృహం వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని తెలిసింది. అధికారులు స్పందించి హాస్టల్ వద్ద భద్రత పెంచాలని, బాలికలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
విలనే నా హీరో!
హ్యూమర్ హైనాలన్నా, విలన్లన్నా నాకు చిన్నప్పట్నుంచీ తెగ ఇష్టం. కాకపోతే ఈ విషయం బహిరంగంగా చెప్పుకోడానికీ, ఒప్పుకోడానికీ చాలా ఇబ్బంది. కారణం... దీన్ని లోకం ఒప్పదు. కానీ మనలోమనమైనా నిజాలు ఒప్పుకోక తప్పదు. హైనాలు పరమ నీచమైన జీవులే. జంతుప్రపంచంలో దాదాగిరి చేస్తుంటాయి. ఇతర జంతువులు న్యాయంగా వేటాడిన వాటిని పరమ జబర్దస్తీగా లాక్కుంటాయి. సాటి జీవుల పట్ల రౌడీల్లా వ్యవహరిస్తుంటాయి. ఇక విలన్లంటే సాక్షాత్తూ నరరూప హైనాలే కదా. హైనాలూ విలన్లలా నవ్వుతుంటాయట. మనిషిలాగే నవ్వు సౌండ్ వినిపించేలా చేస్తాయట. సాటి మనషేమోనని భ్రమింపజేస్తాయట. అలా వికటాట్టహాసంతో మనుషుల్ని మోసం చేస్తుంటాయట. మరిక విలన్ల గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. వాళ్లు ‘హహ్హహా’ అంటూ చేసే ఆ వికటాట్ట హాసానికి విలన్నవ్వు అన్న పేరు ఎప్పట్నుంచో ఫిక్సయి ఉంది. యాంగ్రీయంగ్ మేన్ అయిన హీరో ఎప్పుడోగానీ నవ్వడేమోగానీ విలన్ మాత్రం ఒక్క చివరి సీన్లో తప్ప ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. హీరోకు చిరు దరహాసం తప్ప అట్టహాసం తెలియదు. అది విలన్లకు మాత్రమే ప్రాప్తం. హీరో ఒక లక్ష్యం కోసం సినిమా ఆద్యంతమూ తెగ కష్టాలు పడుతూ ఉంటాడు. కానీ విలన్ మాత్రం పతాక సన్నివేశంలో తప్ప నిత్యం పకపకలాడుతూ ఉంటాడు. వాడికి నవ్వడం ఎంత తేలికంటే... ఒక గుండుసున్నా గీసి, అందులో నెలవంక లాంటి గీత గీస్తే అది స్మైలీ అయినంత తేలిక. ఈ మాత్రం చిత్రం ఎవ్వడైనా గీయగలడు. అలాగే సినిమా ఆద్యంతమూ విలన్ నవ్వగలడు. వాడివన్నీ హైనా వేషాలే. వాస్తవంగా వేటాడిన జంతువు ఎలా పోతేనేం? మన హైనాకు ఆహారం దక్కుతుంది. ఇక సినిమాలోనూ ఇదే న్యాయం కొనసాగుతుంటుంది. బియాండ్ ద మూవీ ఏం జరుగుతుందో కాస్త ఊహిద్దాం. ఆఖరి సన్నివేశం తర్వాతి సీన్లు మనకు కనిపించవు గానీ కాస్త ఆలోచిస్తే వాటిని ఊహించవచ్చు. సాధారణంగా సినిమా చివరన విలన్‌కు తీవ్ర పశ్చాత్తాపం కలుగుతుంది. దాంతో శుభం కార్డుకు ముందు అతడు తన కూతుర్ని హీరోకు ఇచ్చి పెళ్లి చేస్తుంటాడు. ఆదర్శవంతుడైన కారణాన హీరో అయిన వాడు పెళ్లాన్ని బాగా చూసుకోక తప్పుతుందా? కాబట్టి విలన్ కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాల్సిందే కదా. తన కూతురు హ్యాపీగా ఉండటం చూసి మళ్లీ సదరు విలన్ సంతోషంగా నవ్వుతూ ఉంటాడేమో కదా. కాబట్టి సాధారణంగా విలన్ అనేవాడు ఎల్లప్పుడూ సహజానంద గుణంతో నిత్యానందంగా ఉంటాడని అనుకునేందుకు పూర్తి ఆస్కారాలూ, గట్టి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మనం హీరో పక్షం వహించామనుకోండి. నిత్యం ఖేదం, ఆఖర్లోనే మోదం. ఒక్క క్లైమాక్స్ ఫైట్‌లో మాత్రమే మన హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకోడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ విలన్ పక్షం వహించామనుకోండి. ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు చెప్పండి... ఎప్పుడో ఆఖరి సన్నివేశంలో మాత్రమే మనం నవ్వడానికి పనికొచ్చే హీరో బెటరా? నిత్య వికటాట్టహాస విలన్ బెటరా? - యాసీన్ -
రౌడీ అంటే కేసులు పెట్టండి
నేరాల సమీక్షలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరు (అర్బన్): ఎవరైనా సరే తాను రౌడీనంటూ రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం చిత్తూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో గత అర్ధ సంవత్సరం జరిగిన నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గడిచిన రెండేళ్లకంటే ఈ సారి నేర తీవ్రత తగ్గిందన్నారు. కొన్ని సంఘటనలు పోలీసు శాఖ పనితీరును ప్రశ్నించాయన్నారు. ఇకమీదట అలాంటి పొరపాట్లు జరగకూడదన్నారు. గత ఏడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. పొరపాట్లు చేస్తూ వెళితే ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. జిల్లాలోని మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిం చాలన్నారు. కమ్యూనిటీ పోలీస్‌కు సంబంధించి ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వృత్తిపట్ల మరింత గౌరవంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఏస్పీలు అన్నపూర్ణారెడ్డి, రత్న పాల్గొన్నారు. -
ప్రాణాలకు తెగించిన కస్టమర్
-
పోకిరీకి చెప్పు దెబ్బలు
నల్గొండ : పది రోజుల నుంచి వేధిస్తున్న ఓ యువకున్ని మహిళా కండక్టర్ చెప్పుతో బుద్ధి చెప్పిన సంఘటన నల్గొండ బస్టాండ్ వద్ద సోమవారం జరిగింది. భువనగిరి ప్రాంతానికి చెందిన రాంబాబు అనే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న యువకుడు కొన్ని రోజుల నుంచి ఆమెను ఫాలో అవుతున్నాడు. ఏ రూట్లో డ్యూటీ వేస్తే ఆ రూట్లో ఆమెను అనుసరిస్తున్నాడు. విషయాన్ని గమనించిన మహిళా కండక్టర్ ఆ యువకుడ్ని నల్గొండ బస్టాండ్ వద్ద చెప్పుతో కొట్టింది. స్థానికులు కూడా జోక్యం చేసుకుని ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. -
పోకిరీలు చెయ్యేస్తే అంతే..
అమ్మాయిల దగ్గరికి వచ్చి టీజ్ చేసే పోకిరీల పని పట్టే ‘రోబో డ్రెస్’ ఇది. ఇష్టంలేని వ్యక్తులు దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి శ్వాస వేగంలో మార్పు, ఒత్తిడి స్థాయిలను పసిగట్టి వెంటనే యాక్టివేట్ కావడం దీని ప్రత్యేకత. ఓ ఎలక్ట్రానిక్ చిప్‌కు అనుసంధానమై ఉండే వైర్లెస్ బయో సెన్సర్లతో అమ్మాయిలో ఆందోళనను, ప్రాక్సిమిటీ సెన్సర్లతో పోకిరీలు ఎంత దూరంలో ఉన్నారన్న విషయాలను ఇది తెలుసుకుంటుంది. ఇంకేం.. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి ఆందోళనకు గురికాగానే.. పొడవాటి, పదునైన ముళ్లలాంటి కాళ్లను చాపుతుందన్నమాట. సాలీడు కన్నుల మాదిరిగా ఉండే నల్లటి ఎల్ఈడీ బల్బులు కాంతులు వెదజల్లి తొలుత హెచ్చరిస్తాయి కూడా. నెదర్లాండ్స్‌కు చెందిన అనౌక్ విప్రెచ్ అనే లేడీ డిజైనర్ రూపొందించిన ఈ డ్రెస్‌ను అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇటీవల జరిగిన సెస్-2015 ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. అన్నట్టూ.. పోకిరీలు చెయ్యేస్తే షాక్ కొట్టే డ్రెస్‌ను, మూడ్‌ను బట్టి పారదర్శకంగా మారిపోయే డ్రెస్‌ను కూడా ఇంతకుముందు విప్రెచ్ రూపొందించారు. -
టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు జంగారెడ్డిగూడెం: టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. హుద్‌హుద్ తుపాను బారినపడి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయూరని, వారికి నామమాత్ర సాయం అందించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తితే కె.అచ్చన్నాయుడు వాస్తవాలు కప్పిపుచ్చి జగన్మోహన్రెడ్డిపై దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే విధానాన్ని కొనసాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆరు నెలల్లో టీడీపీ చేసిన ఘన కార్యాలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరునెలల పాలనలో అర్హులను అనర్హులుగా గుర్తిస్తూ అవకాశం ఉన్నవారికి ప్రభుత్వ ఫలాలు అందకుండా చేయడమే టీడీపీ నాయకుల లక్ష్యం పెట్టుకున్నారని విమర్శించారు. జాబు కావాలంటే బాబు రావాలని గొప్పగా చెప్పిన నాయకులు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్న ఘనత మీదికాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని వాగ్దానాలు చేసి తీరా గద్దెనెక్కిన తరువాత రైతులను గందరగోళంలోకి నెట్టారని విమర్శించారు. డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం వారి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. ఆరు నెలల టీడీపీ పాలనలో ఏ వర్గం ప్రజలు సుఖంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఒక పక్క ఐకేపీ యానిమేటర్లు, మరోపక్క ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, రుణమాఫీతో మోసపోయిన రైతన్నలు, ప్రభుత్వం పరంగాఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకున్న రైతులు ఇలా ఎవరైనా మనశ్శాంతిగా జీవిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ హాల్లో మాట్లాడుతుంటే గొంతు నొక్కి వాస్తవాలను కప్పి పుచ్చడం అవివేకమన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలితే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. -
అనకాపల్లిలో తుపాకీతో రౌడీషీటర్ హల్ చల్
-
అనకాపల్లిలో తుపాకీతో రౌడీషీటర్ హల్ చల్
విశాఖపట్నం: రౌడీల ఆధిపత్య పోరు రోడ్డెక్కడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. రౌడీషీటర్ రాజేష్ అనకాపల్లి జంక్షన్ లో బుధవారం రాత్రి తుపాకీతో హల్ చల్ చేశాడు. తన ప్రత్యర్థి దాడి కృష్ణపై తుపాకీతో కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. తుపాకీ పేలకపోవడంతో దాడి కృష్ణ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా కృష్ణ వర్గీయులు అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రాజేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
బెజవాడలో రౌడీ అనేవాడు ఉండకూడదు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతున్న విజయవాడలో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బెజవాడలో రౌడీ అనేవాడే ఉండకూడదన్నారు. ఇక నుంచి తాను విజయవాడవాసినే అని, ఇక్కడే ఎక్కువ కాలం ఉండి పాలన సాగిస్తానని అన్నారు. ప్రపంచ టూరిజం డే సందర్భంగా ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఢిల్లీ నిర్భయ ఉదంతంతో టూరిస్టులు భయపడే పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే టూరిస్టులు సందర్శనలకు వస్తారని, దాంతో ఆదాయం పెరుగుతుందన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. మాఫీయాను క్షమించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పుడప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జరుగుతాయన్నారు. వినోదం కోసం కోడిపందాలు ఆడితే తప్పులేదని అయితే డబ్బు పెట్టి ఆడటం నేరమన్నారు. హైదరాబాద్ బిర్యానీని మించిన వంటకాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వీజీటీ వుడాను మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. -
ఇండస్ట్రీకి వస్తానంటే... వద్దనే చెబుతాను!
సంభాషణం చాలా సినిమాల్లో విలన్ గ్యాంగులో రౌడీగా కనిపిస్తాడతను. కానీ ముఖం అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. చేసే పనులూ, మాట్లాడే మాటలూ అమాయకంగానే ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. రౌడీ పాత్రలో కామెడీని పండించే ఆ నటుడి పేరు... ‘ఫిష్’ వెంకట్. ‘గబ్బర్‌సింగ్’లో ‘క్షందమామ రావే’ అంటూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన వెంకట్ చెప్పిన విశేషాలివి... ఆంధ్ర, తెలంగాణ సెగను కొందరు పరిశ్రమకు కూడా తగిలిస్తున్నారు. నాకది నచ్చడం లేదు. నేను తెలంగాణవాడినే. అయినా కూడా ఆంధ్రవాళ్లమీద నాకే అయిష్టమూ లేదు. ఇక్కడ పరిశ్రమను నెలకొల్పింది, నిలబెట్టింది, నాలాంటి వాళ్లందరికీ అవకాశాలూ కల్పించిందీ వాళ్లే. వాళ్లు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు పరిశ్రమ రెండు ముక్కలవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ ఆలోచనే నాకు బాధ కలిగిస్తుంది. విభేదాలు లేకుండా ఎప్పటిలా అందరం కలిసి ఒకేచోట, ఒక్కటిగా ఉండి పని చేసుకోవాలన్నదే నా కోరిక. మిమ్మల్ని ‘ఫిష్’ వెంకట్ అని ఎందుకంటారు? మేం బెస్తవాళ్లం. చేపల వ్యాపారం చేసేవాళ్లం. అందుకే అందరూ అలా పిలుస్తుంటారు. మరి ‘ఫిష్’ను వదిలి ‘ఫిల్మ్’ని ఎందుకు నమ్ముకున్నారు? మేం ముషీరాబాద్‌లో ఉండేవాళ్లం. 1980లో శ్రీహరిగారి కుటుంబం హైదరాబాద్ వచ్చి బాలానగర్‌లో స్థిరపడింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన సినిమాల్లోకి వెళ్లాక తన షూటింగులకు వెళ్లేవాడిని. ఆయనే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు. నేను రానన్నా బలవంతపెట్టి ‘ఒరేయ్ తమ్ముడు’లో నటింపజేశారు. బ్రేక్ ఎప్పుడు వచ్చింది? ‘ఆది’ సినిమాతో. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది శ్రీహరన్న అయితే... నిలదొక్కుకునేలా చేసింది వీవీ వినాయక్‌గారు. ఆయన నాకు గాడ్‌ఫాదర్. ఆది, బన్ని సినిమాల్లో మంచి పాత్రలిచ్చి నేనెవరో అందరికీ తెలిసేలా చేశారు. ఎన్ని జన్మలెత్తినా ఈ ఇద్దరి రుణం నేను తీర్చుకోలేను. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తున్నారు. బోర్ కొట్టడం లేదా? ఫిష్ వెంకట్ ఎలాంటి పాత్రలకు సూటవుతాడో, ఏం చేస్తే బాగుంటాడో రచయితలకి, దర్శకులకి తెలుసు. వారి నమ్మకమే నాకు బలం. నేను చిన్నతనం నుంచీ చాలా కష్టాలు పడ్డాను. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నాకు లభించిన పాత్రలే. అందుకే ఏ పాత్రనయినా చేస్తాను. రెమ్యునరేషన్ కూడా ఇంత కావాలి అని అడగను. ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. మిమ్మల్ని రౌడీ పాత్రల్లో చూసి మీ వాళ్లేమంటారు? నేను రౌడీ గ్యాంగ్‌లో ఉన్నా చేసేది కామెడీయే కదా. వాళ్ల మధ్య ఉండి వాళ్లమీదే సెటైర్లు వేస్తుంటాను. అది చూసి నా భార్యలు, పిల్లలు నవ్వుతుంటారు. మీరు భార్యలు అనే అన్నారా? అవునండీ... మీరు విన్నది నిజమే. నాకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్లి చేసేశాం. పెదబాబు యాదేష్ ‘వీడు తేడా’, ‘ప్రేమ ఒక మైకం’, ‘డి ఫర్ దోపిడీ’ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. తనని హీరోని చేయాలని నా కోరిక. మూడోవాడు ఇంకా చిన్నోడే. వాడి గురించి ఆలోచించడానికి చాలా టైముంది. వాళ్లనీ మీ దారిలోనే నడిపిస్తున్నారా? అవును. కానీ బయటివాళ్లెవరు ఇండస్ట్రీకి వస్తానన్నా వద్దంటాను. ఎందుకని? ఇక్కడ రోజూ రెండు వందల మంది వేషాల కోసం క్యూలో నిలబడతారు. ఓ పది మందికి మాత్రమే పని దొరుకుతుంది. మిగతా నూట తొంభై మందీ వెనుదిరగాల్సిందే. పని దొరికినా కంటిన్యుయస్‌గా ఉండదు. కొన్నాళ్లు ఖాళీగా ఉండాలి. వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రం. ఎలా బతుకుతారు? సినిమాల మీద ఆసక్తితో కండలు, జుట్లు పెంచుకుని వచ్చినంత మాత్రాన ఇక్కడ పిలిచి అవకాశాలెవరూ ఇచ్చేయరు. అదేదో నెలకు మూడు నాలుగు వేలు వచ్చే ఉద్యోగం చేసినా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. మీరిలా మాట్లాడ్డం ఆశ్చర్యంగా ఉంది... ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అందరికీ నాకు దొరికినట్టు ఓ శ్రీహరి, ఓ వినాయక్ దొరకరు. అవకాశాలు దొరికేలోపు యేళ్లకేళ్లు గడిచిపోతాయి. ఇండస్ట్రీ పట్ల అసంతృప్తి ఉన్నట్టుందే? లేదు. నన్ను నిలబెట్టింది, బతికిస్తోంది ఈ పరిశ్రమే. కాకపోతే అందరికీ అంత అదృష్టం దక్కదు. అందుకే దీనిమీదే ఆశలు పెంచుకుని జీవితాన్ని పాడు చేసుకోవద్దంటున్నాను. కావాలంటే ఏదైనా పని చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఈ పరిశ్రమ గొప్పది. ఇక్కడ ఎంతమందికైనా చోటుంటుంది. కాకపోతే ఆ చోటు సంపాదించుకోవడం కాస్త కష్టం. అందరికీ నా అంత అదృష్టం ఉండదుగా! - సమీర నేలపూడి -
వర్మ ఇచ్చిన షాకులు అన్నీ ఇన్నీ కావు
అయిదొందల పైచిలుకు చిత్రాల్లో నటన, యాభైకి పైచిలుకు చిత్రాల నిర్మాణం... అసాధారణమైన ట్రాక్ రికార్డ్ మోహన్‌బాబుది. ‘రెస్పెక్ట్’ ఇచ్చి పుచ్చుకోవడం, ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. ఆ నైజానికి దగ్గరగా ఉండే పాత్రను ‘రౌడీ’లో పోషించారాయన. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా మోహన్‌బాబుతో మాటామంతీ. తొలిసారిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించారు. ఆ అనుభవం ఎలా ఉంది? వర్మని అర్థం చేసుకునేవారికంటే... అపార్థం చేసుకునే వాళ్లే ఎక్కువ. నిజానికి వర్మ క్రమశిక్షణ గల వ్యక్తి. పని తప్ప వేరే ఆలోచన ఉండదు. నేటి దర్శకుల్లో అమోఘమైన ప్రతిభాశాలి తను. వర్మతో నాది ఇప్పటి పరిచయం కాదు. వాళ్ల నాన్న నాకు మంచి మిత్రుడు. వర్మ దర్శకుడైన కొత్తల్లో సినిమా చేద్దామని అడిగాను. అప్పుడు కుదర్లేదు. రెండు మూడు నెలల క్రితం సడన్‌గా వర్మను ఇంటికి తీసుకొచ్చాడు విష్ణు. ‘సినిమా చేద్దామా’ అని అడిగా. మూడ్రోజులు టైమ్ అడిగాడు. సరిగ్గా మూడ్రోజుల్లో వచ్చి ‘రౌడీ’ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. మళ్లీ రెండ్రోజులు టైమ్ తీసుకొని వచ్చి... నాకు ఇంత బడ్జెట్ కావాలి, ఆర్టిస్టులుగా వీళ్లు కావాలి, లొకేషన్లు ఇవి కావాలి.. అని లిస్ట్ చెప్పాడు. నేను షాక్. కథ ‘ఓకే’ అయ్యాక ఇంత పకడ్బందీగా ముందుకెళ్లే దర్శకులు ఈ జనరేషన్లో కూడా ఉన్నారని వర్మను చూశాక తెలిసింది. అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ సినిమాలు 27 - 30 రోజుల్లో తీశాం. ‘రౌడీ’ సినిమాను వర్మ 35 రోజుల్లో తీస్తానని చెప్పి, 30 రోజుల్లోనే తీసేశాడు. అనుకున్న బడ్జెట్ కంటే 50 లక్షల తక్కువలోనే నిర్మాణం ముగించాడు. ఈ సినిమా టైమ్‌లో వర్మ ఇచ్చిన షాకులు నాకు అన్నీ ఇన్నీ కావు. అతనిది బాలీవుడ్ కల్చర్. ఉదయం 9 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేయడం అతనికి అలవాటు. కానీ... నా కోసం నెల రోజుల పాటు ఉదయం 7.30 కల్లా తొలి షాట్ తీసేసేవాడు. ఒంటిగంటకు బ్రేక్ ఇచ్చేవాడు. నాక్కూడా తెలీకుండా దాసరిగారిని ఎడిటింగ్ రూమ్‌కి తీసుకెళ్లి సినిమా చూపించాడు. దాసరి, కె.రాఘవేంద్రరావు, బాపు లాంటి గొప్ప దర్శకుల్లో ఉన్న ప్రతిభ, సిన్సియారిటీ వర్మలో కూడా ఉన్నాయి. ఇందులో విష్ణు నాకు పోటీగా నటించాడంటే... కారణం వర్మ. విగ్, మేకప్ లేకుండా నేను నటించడం ఇదే ప్రథమం. ఈ సినిమా విజయానికి ప్రథమ కారకుడు వర్మ అయితే, రెండో స్థానం విష్ణుది. వర్మ సినిమాల్లో కనిపించని కుటుంబ బంధాలు ఈ చిత్రంలో కనిపించాయి. ఇది మీ ప్రభావమా? మా కుటుంబంలో ఉండే అనుబంధాలను చూసి స్ఫూర్తి పొంది ఈ సన్నివేశాలు తీశానని అతనే ఓ సందర్భంలో చెప్పాడు. ఆల్మోస్ట్ నా మెంటాలిటీకి దగ్గరగా ఉండే పాత్ర ‘అన్న’ పాత్ర. కొడుకుని మందలించే సన్నివేశం, భార్య చనిపోయిన సన్నివేశం... ఇలా ఇందులోని ప్రతి సన్నివేశం నాకు నచ్చింది. ముఖ్యంగా జయసుధ నటన అమోఘం. అన్ని తరగతుల వారూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. స్త్రీలు కూడా ఇష్టపడుతున్నారు. తొలిరోజే నాలుగు కోట్ల రూపాయల పై చిలుకు షేర్ వచ్చింది. ఈ కథలో ‘సర్కార్’ పోలికలున్నాయని కొందరంటున్నారు. ‘సర్కార్’ చూశాను. పొలికలు ఉండొచ్చేమో. నా అయిదొందల చిత్రాల్లో సన్నివేశాన్ని పోలిన సన్నివేశాలు ఎన్ని లేవు? తండ్రీ కొడుకుల సన్నివేశాలు మాత్రం ‘సర్కార్’ పోలికలతో ఉంటాయి. అంతే.. ‘సర్కార్’ చూసి కూడా అమితాబ్ బచ్చన్ ప్రభావం పడకుండా ఆ పాత్ర రక్తికట్టించడం కత్తి మీద సామే... హీరో, విలన్, కామెడీ విలన్, సపోర్టింగ్ యాక్టర్.. ఇలా ఏ పాత్రయినా, ఎంత కష్టతరమైన పాత్రయినా కానీయండి. ఆ పాత్ర పోషణలో దేశంలోని ఏ నటుణ్ణైనా నాకు పోటీగా రమ్మనండి. ఫస్ట్ మార్క్ నేను సాధించకపోతే చూడండి. ఇది నమ్మకంతో చెబుతున్న మాట. సినిమా చూశాక ప్రేక్షకులు బయటకొచ్చి నా పాత్ర గురించి మాట్లాడకపోతే ఇన్నాళ్ల నా నట జీవితం వ్యర్థం. ‘ఏ పాత్ర అయినా.. నేనే ఫస్ట్ అనిపించుకుంటాను’ అన్నారు. త్వరలో ‘రావణ’ చేయనున్నారు. ఆ పాత్ర అంటే... గుర్తొచ్చేది మహానటుడు ఎన్టీఆర్. మరి ఆయనను కూడా డామినేట్ చేస్తానంటారా? అన్నయ్యను అధిగమిస్తానని జోక్‌గా కూడా అనను. ఆ దరిదాపులకు వెళ్లగలనేమో ప్రయత్నిస్తా. ఆయన మహానటుడు. ఆ రూపం వేరు, నా రూపం వేరు. ఆ అభినయం వేరు, నా అభినయం వేరు. ప్రస్తుతం ‘యమలీల-2’లో యముడిగా చేస్తున్నాను. నా పాత్ర చిత్రణ పూర్తి కావొచ్చింది. మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మీరు, మీ మిత్రుడు రజనీకాంత్ కలిసి ఓ సినిమా చేయొచ్చుగా? అన్నీ కుదరాలి. అయినా ఈ పరిస్థితుల్లో అది తేలికైన విషయం కాదు. త్వరలో ‘కొచ్చడయాన్’ ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఆ కార్యక్రమాలన్నింటినీ మా లక్ష్మీప్రసన్న చూస్తోంది. మీ ఫ్రెండ్ రజనీకాంత్‌ని బాలీవుడ్ హీరోలు సైతం అభిమానించడంపై మీ కామెంట్? దాన్ని కాకా పట్టడం అంటారు. చాలా ఏళ్ళ క్రితం తమిళనాట బాలీవుడ్ చిత్రాలపై నిషేధం ఉండేది. తరువాత క్రమంగా పరిస్థితి మారింది. ఏమైనా, ఈ నేపథ్యంలో సౌత్‌లో నంబర్‌వన్ హీరోను కాకా పడితే.. మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురుకావ.ని వారి ప్లాన్. -
సినిమా రివ్యూ: 'రౌడీ
సినిమా రివ్యూ: 'రౌడీ' నటవర్గం: మంచు మోహన్ బాబు మంచు విష్ణు జయసుధ శాన్వీ శ్రీవాస్తవ వెన్నెల కిషోర్ తనికెళ్ల భరణి రవిబాబు సంగీతం: సాయి కార్తీక్ కెమెరా: సతీష్ ముత్యాల దర్శకత్వం: రాం గోపాల్ వర్మ పాజిటివ్ పాయింట్స్: మోహన్ బాబు, విష్ణు, జయసుధ యాక్టింగ్ రీరికార్టింగ్, డైలాగ్స్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, తనికెళ్ల భరణి (వేదం) క్యారెక్టర్ విలనిజం సెకండాఫ్ తెలుగులో రక్త చరిత్ర తర్వాత వర్మ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్ర విజయం తర్వాత మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రౌడీ చిత్రాన్ని రూపొందించారు. విడుదలకు ముందే ఆడియో, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచారు. ప్రేక్షకుల అంచనాలను రౌడీ చేరుకున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకుందాం! రాయలసీమలో సమాంతర ప్రభుత్వం నడిపించే అన్నగారు (మోహన్ బాబు) కు కృష్ణ (మంచు విష్ణు), భూషణ్ (కిశోర్) ఇద్దరు కుమారులు. ప్రజల కీడు చేసే నందవరం ప్రాజెక్టుకు అన్నగారు వ్యతిరేకం. ఎలాగైనా అన్నగారిని అడ్డు తప్పించి నందవరం ప్రాజెక్టును దక్కించుకోవాలని ప్రత్యర్థి వేదం (తనికెళ్ల భరణి) బృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే అన్నగారిని తప్పించడం తమ వల్ల కాదని తెలుసుకున్న వేదం బృందం భూషణ్ ను తమ వర్గంలో చేర్చుకోవడమే కాకుండా ఆయనపై పక్కా ప్లాన్ తో హత్యాయత్నం చేస్తారు. హత్యాయత్నం జరిగిన అన్నగారి పరిస్థితేమిటి? తండ్రిని కృష్ణ రక్షించుకున్నాడా? ప్రత్యర్ధి వర్గంతో కలిసిన భూషణ్ ఏమయ్యాడు. చివరికి నందవరాన్ని అడ్డుకోవడంలో అన్నగారు సఫలమయ్యారా అనే ప్రశ్నలకు 'రౌడీ' చూడాల్సిందే. అన్నగారి రూపంలో మోహన్ బాబుకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. ఈ పాత్రలో సరికొత్త మోహన్ బాబును ప్రేక్షకులు చూస్తారు. రౌడీ చిత్రంలో మోహన్ బాబు అన్నీ తానై ముందుండి చక్కటి రౌడీయిజాన్ని ప్రదర్శించారు. అన్నగారి పాత్రలో మోహన్ బాబు నుంచి ఉత్తమ ప్రదర్శనను రౌడీ చిత్రంలో చూడవచ్చు. మోహన్ బాబు డైలాగ్ డెలివరీలో కొత్తగా చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. గత కొద్దికాలంగా కామెడీని నమ్ముకుని విజయాలను సొంతం చేసుకున్న విష్ణుకి కృష్ణ పాత్ర విభిన్నమైందే. సెకండాఫ్ లో ముఖ్యంగా విష్ణు క్లైమాక్స్ లో విజృంభించాడు. నటుడిగా తనను తాను నిరూపించుకోడానికి కృష్ణ పాత్రను విష్ణు పూర్తిగా వినియోగించుకున్నాడు. గ్లామర్ పరంగా శాన్వీ పర్వాలేదనిపించింది. తల్లి పాత్రలో జయసుధ తన మార్కు నటనను చూపించారు. కొన్ని సన్నివేశాల్లో మోహన్ బాబు, జయసుధల కాంబినేషన్ లో వచ్చే సీన్లు బ్రహ్మండంగా ఉన్నాయి. తనికెళ్ల భరణి ప్రసంగాలు, ఉపన్యాసాలు ఆరంభంలో బాగానే అనిపించినా.. ఓవరాల్ గా విసిగించాడనే చెప్పవచ్చు. మిగతా ప్రాతలు వాటి పరిమితులకు అనుగుణంగా ఓకే అనిపించేలా ఉన్నాయి. విశ్లేషణ: గాడ్ ఫాదర్ స్ఫూర్తితో సర్కార్ అందించిన వర్మ.. ఇంకా ఆ ప్రభావం నుంచి బయట పడనట్టే కనిపిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు' గాఢ్ ఫాదర్', సర్కార్ లను జోడించి 'రౌడీ'ని అందించారు. తెలుగు ప్రేక్షకులకు (సర్కార్) చూడనివారికి రౌడీ నచ్చేలా ఉంటుంది. అయితే తొలిభాగాన్ని పకడ్భందీగా రూపొందించిన వర్మ రెండో భాగంలో అదే ఊపును కొనసాగించలేకపోయారు. మోహన్ బాబులో ఫైర్.. అన్నగారి పాత్రలో ఉండే ఇంటెన్సిటీని జోడించి వర్మ చేసిన ప్రయత్నం మెప్పించేలా ఉంది. వర్మ తన రెగ్యులర్ మేకింగ్ స్టైల్ భిన్నంగా రౌడీని రూపొందించారనే అనే ఫీలింగ్ కలిగించాడు. అయితే అన్నగారి పాత్రకు ధీటుగా విలనిజం లేకపోవడం ప్రధాన లోపం. పవర్ ఫుల్ గా ఉండే అన్నగారి పాత్ర ముందు వేదం(తనికెళ్ల భరణి) పాత్ర తేలిపోయింది. వేదం పాత్ర సెకెండ్ గ్రేడ్ విలన్ గా ఉండటం కారణంగా రక్తి కట్టించలేకపోయింది. ఫోటోగ్రఫీ, రీరికార్డింగ్, సింక్ సౌండ్ తరహా టెక్నికల్ అంశాలు 'రౌడీ'కి అదనపు ఆకర్షణ. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకు ప్రాణం పోసింది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బాగుంది. సెకండాఫ్ పై మరికొంత కేర్ తీసుకుంటే 'రౌడీ' తెలుగు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చేది. ముగింపుగా 'రౌడీ' చిత్ర విజయం మోహన్ బాబు, వర్మ మంచు విష్ణులపైనే ఆధారపడి ఉంది. మోహన్ బాబుపై అంచనాలు పెట్టుకుని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడికి 'రౌడీ' సంతృప్తిని ఇవ్వడం ఖాయం. -
రౌడీపై సాక్షితో రామ్‌గోపాల్ వర్మ
-
యూఎస్ లో 'రౌడీ' గ్రాండ్ ఎంట్రీ!
యూఎస్ లో 'రౌడీ' గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాంగోపాల్ వర్మ, మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ లో గురువారం విడుదల కానుంది. రౌడీ చిత్రం 50కు పైగా మల్టిప్లెక్స్ విడుదలయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టికెట్ విలువ 10 డాలర్లుగా నిర్ణయించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. పది డాలర్లకే టాప్ మల్టిప్లెక్స్ లో ఈ చిత్రాన్ని చూడవచ్చని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, కనువిందు చేసే పాటలున్నాయని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రతినిధులు వెల్లడించారు. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రంలో జయసుధ, వెన్నెల కిషోర్, రవిబాబు, శాన్వీ శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషించారు. -
మోహన్‌బాబు గురించి నెగిటివ్‌గా చెప్పారు..!
‘మైండ్‌లో ఫిక్స్ అయితే... బ్లైండ్‌గా వెళ్లిపోతా...’ అనే ‘దూకుడు’ సినిమా డైలాగ్ రామ్‌గోపాల్‌వర్మకు సరిగ్గా సరిపోతుంది. మనసులో ఏది అనిపిస్తే అది అనేయడం, ఏది అనిపిస్తే అది చేసేయడం వర్మ స్టయిల్. ఆయన మోహన్‌బాబుతో ‘రౌడీ’ సినిమా చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాలో ఆశ్చర్యపరిచేవి ఇంకా చాలా ఉంటాయని వర్మ నమ్మకంగా చెబుతున్నారు. ‘రౌడీ’ ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ... మోహన్‌బాబు, వర్మ.. ఊహించని కలయిక ఇది. అసలు మీ ఇద్దరూ కలసి సినిమా చేయడం ఎలా సాధ్యమైంది? ‘శివరంజని’ సినిమా చూసిన రోజుల నుంచే మోహన్బాబుగారంటే నాకిష్టం. నిజజీవితంలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని నేను ఇష్టపడతాను. చిత్రమైన వ్యక్తిత్వం, భిన్నమైన స్టయిల్, ముక్కుసూటితనం, దాపరికం లేకుండా మాట్లాడటం... ఆయనలోని ఈ లక్షణాలన్నీ నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయన స్పందించే తీరు గమనించాక ఆయన ఓ డైనమిక్ పర్సన్ అని నాకర్థమైంది. ఆయన్ను దృష్టిలో పెట్టుకొనే ‘రౌడీ’ కథ రాశాను. నిజజీవితంలో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే పాత్ర ఇది. ఇందులో ఆయన ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ చూస్తారు. ఇంతవరకూ నా సినిమాల్లో కనిపించని భావోద్వేగాలు ఇందులో ఉంటాయి. మీరు, మోహన్‌బాబు ఉత్తర దక్షిణ ధ్రువాలు. అలాంటి మీ మధ్య చిత్రీకరణ సమయంలో భేదాభిప్రాయాలు రాలేదా? షూటింగ్ జరిగిన 43 రోజుల్లో ఒక్కసారి కూడా మాకు అభిప్రాయ భేదాలు తలెత్తలేదు. షూటింగ్ మొదలు కాకముందు చాలామంది మోహన్‌బాబుగారి గురించి నెగిటివ్‌గా చెప్పారు. కోపిష్ఠి అనీ, నచ్చకపోతే కొట్టినంత పనిచేస్తారనీ ఏవేవో అన్నారు. అయితే.. ఒక్కసారి లొకేషన్‌కి వెళ్లాక నా అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి. నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి. విగ్ తీసేసి నటించమని అడిగితే... ఎవరూ తేలిగ్గా అంగీకరించరు. కానీ... ఆయన మారు మాట్లాడకుండా విగ్ తీసేశారు. నా కెరీర్లో ఇంత సాఫీగా పూర్తయిన సినిమా ఇదే. హిందీలో మీరు తీసిన ‘సర్కార్’ సినిమాకే రాయలసీమ నేపథ్యాన్ని జోడించి ‘రౌడీ’గా తీశారని బయట టాక్.. యాక్షన్ నేపథ్యానికి కుటుంబ విలువల్ని జోడించి తీసిన ఏ సినిమాలోనైనా.. ‘గాడ్‌ఫాదర్’, ‘సర్కార్’ చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ‘సర్కార్’లో ఉండే భావోద్వేగాలు వేరు, ఇందులోని భావోద్వేగాలు వేరు. అందులోని సమస్యలు వేరు, ఇందులోని సమస్యలు వేరు. తండ్రీ కొడుకుల కథ అనగానే.. అందరికీ ‘సర్కార్’ సినిమా గుర్తుకు రావడం సహజం. అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం, రౌడీ మొగుడు... ఇలా ‘రౌడీ’ అనే టైటిల్ ఉన్న మోహన్‌బాబు సినిమాలన్నీ హిట్లే. ఆ సెంటిమెంట్‌తోనే ఈ టైటిల్ పెట్టారా? ఓ సందర్భంలో విష్ణు... ఈ సినిమాల లిస్ట్ చెప్పాడు. నా కెందుకో ఆ ‘రౌడీ’ అనే పదం బాగా కనెక్ట్ అయ్యింది. ఆ పదం ఓ ధిక్కార గుణాన్ని సూచిస్తుంది. అందుకే వెంటనే ‘ఓకే’ చేశాం. ముందు వెళుతున్నవాళ్లను బలవంతగా వెనక్కులాగి ముందుకెళ్లడం నా దృష్టిలో రౌడీయిజం. కానీ, ఇందులో అయినవారి కోసం వెనక్కు వెళ్లడానికి కూడా వెనుకాడదు మోహన్‌బాబు పాత్ర. అంటే... మంచి రౌడీ అన్నమాట. రియల్‌లైఫ్‌లో కూడా మోహన్‌బాబుది ఇలాంటి క్యారెక్టరే. అందుకే... మోహన్‌బాబుని మంచి రౌడీగా అభివర్ణిస్తాన్నేను. ఇందులో విష్ణు పాత్ర ఎలా ఉంటుంది? పోస్టర్లపైనా, తెరపైనా హీరో అనవసరంగా నవ్వుతూ ఉంటే నాకు నచ్చదు. నా చిత్రాల్లో హీరోలు నవ్వినా అది సీరియస్‌గానే ఉండాలి. అదే చెప్పా. ఈ సినిమాలో నువ్వు నవ్వడానికి వీల్లేదని కండిషన్ పెట్టా. చెప్పినట్లే చేశాడు తను. అతనిలో మంచి నటుడున్నాడు. ఈ సినిమాలో అతని నటన చూసి, జనం ఆశ్చర్యపోతారు. రాజశేఖర్‌తో ‘పట్టపగలు’ సినిమా చేస్తున్నట్లున్నారు. ఉన్నట్టుండి ఆయనతో సినిమా చేయాలని ఎందుకనిపించింది? ఓ సందర్భంలో ఇద్దరం కలిశాం. అనుకోకుండా సెట్టయ్యింది. షూటింగ్ తొమ్మిదింటికి అంటే... ఎనిమిదిన్నరకే లొకేషన్లో ఉండేవారాయన. అందుకే 24 రోజుల్లో ఆ షూటింగ్ పూర్తి చేయగలిగాం. తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. ఇక మిగిలింది బాలకృష్ణే. మరి ఆయనతో ఎప్పుడు చేస్తారు? బాలకృష్ణగారిని డెరైక్ట్ చేసే స్థాయి నాకు లేదు. ఆయన అభిమానుల్ని ఆనందింప చేసేంత సామర్థ్యం నా దగ్గర లేదు. త్వరలో రాజకీయాల్లోకొస్తున్నారట. హైదరాబాద్‌లో ముస్లిమ్ రాజకీయ వేత్తకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారట? అది మీడియా సృష్టి. నాకు రాజకీయాలు బొత్తిగా తెలీవు. మోడీని కలవగానే పవన్‌పై ప్రజల అభిప్రాయం మారిపోయింది! పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రావాలని మీరెందుకు కోరుకున్నారు? బావుంటాడు కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో పెద్ద అందంగా ఉండేవాళ్లు ఎవరూ లేరు. పవన్‌కల్యాణ్ పాలిటిక్స్‌లోకొస్తే చూడటానికైనా రాజకీయాలు బావుంటాయని! రాజకీయంగా ఆయన సక్సెస్ అవుతాడని భావిస్తున్నారా? చెప్పలేం. తొలి సభలో అతను మాట్లాడిన తీరు నాకు నచ్చింది. రెండు గంటలు బాగానే కూర్చోబెట్టాడు. అయితే... నరేంద్రమోడీని ఎప్పుడైతే కలిశాడో... అప్పుడే అతనిపై జనాలకున్న అభిప్రాయం మొత్తంగా మారిపోయింది. ఇటీవల వైజాగ్‌లో జరిగిన బహిరంగ సభలో కూడా అతని మాటలు పూర్తిగా తేలిపోయాయి. అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే... తుస్సుమనిపించాడు! పవన్‌కల్యాణ్ ‘ఇజమ్’ పుస్తకం చదివారా? రెండు పేజీలు చదివాను. నాకేం అర్థం కాలేదు. అసలు రాసిన వాళ్లకైనా ఈ పుస్తకం అర్థమవుతుందా అని నా అనుమానం. నాకు తెలిసి ఈ పుస్తకం పవన్‌కల్యాణ్‌కి కూడా అర్థమై ఉండదు. ఈ పుస్తకం ద్వారా తాను ఏం చెప్పబోతున్నాడు? అసలు అతని ‘ఇజం’ ఏంటి? అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఆ పుస్తకంలో వాడిన ఇంగ్లిష్ పదాలు కానీ, రాజకీయ భావజాలం కానీ ఆంగ్ల సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలెన్నో చదివిన నాకే అర్థం కాలేదు. ‘చిరంజీవి హఠావో... దేశ్ బచావో’ ... ఆ వ్యాఖ్య మీరు ఎందుకు చేసినట్టు? (నవ్వేస్తూ...) చిరంజీవి హఠావో అంటే ఆయనను వ్యక్తిగతంగా అన్నానని ఎందుకనుకుంటున్నారు? ఇవాళ పార్టీ ప్రచార సారథిగా చిరంజీవి అంటే కాంగ్రెస్. కాంగ్రెసంటే చిరంజీవి. అందుకే చిరంజీవి ‘హఠావో’ అనేశా. మరి, ‘కాంగ్రెస్ హఠావో’ అన్న పవన్ కల్యాణ్ మాత్రం ఆ మాట అనలేకపోయారేం? (నవ్వేస్తూ...) నో కామెంట్! -
'రౌడీ' నన్ను పూర్తిగా మార్చేశాడు: విష్ణు
చెన్నై: 'రౌడీ' చిత్రం పూర్తి స్థాయి నటుడిగా మార్చిందని టాలీవుడ్ నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల కాలంలో ఓ మోస్తారు విజయాలను తన ఖాతాలో వేసుకున్న విష్ణు.. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'రౌడీ' చిత్రంలో తండ్రి మోహన్ బాబుతో కలిసి నటిస్తున్నారు. 'చాలా కాలం తర్వాత కామెడీ లేకుండా ఓ సీరియస్ చిత్రంలో నటించాను. పూర్తి స్థాయి నటుడిననే సంతృప్తి కలిగించింది. కమర్షియల్ హంగులతోపాటు ఈ చిత్రంలో ఉద్వేగానికి గురి చేసే సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో నాలో ఉన్న నటుడిని రాము వెలికి తీశారు' అని విష్ణు తెలిపారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన 'రౌడీ' చిత్రంలో మోహన్ బాబు, జయసుధ, శాన్వీ శ్రీవాస్తవ్, వెన్నెల కిషోర్, రవి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 4 తేదిన విడుదల కానుంది. -
'రౌడీ' సంగీతం ఇళయరాజాకు అంకితం: వర్మ
'రౌడీ' చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ స్కోరును సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు అంకితం ఇస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. గతకొద్ది సంవత్సరాలుగా ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నానని.. ఆయనకు అభిమానినని వర్మ తెలిపారు. శివ చిత్రంలోని సైకిల్ ఛేజ్ థీమ్ ను తీసుకుని రౌడీ ప్రధాన థీమ్ ను రూపొందించాలని దర్శకుడు సాయి కార్తీక్ ను కోరానని...అయితే ఆ ఐడియా బ్రహ్మండంగా వర్కవుట్ అయిందని వర్మ తెలిపారు. రౌడీ బ్యాక్ గ్రౌండ్ థీమ్ ను 'సైకిల్ రౌడీ'గా పేర్కొన్నారు. ఇళయరాజాకు అమితంగా అభిమానిస్తానని, ఆయనకు పెద్ద అభిమానినని, ఆయన శివ చిత్రానికి రూపొందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని వర్మ తెలిపారు. 1989లో శివ చిత్రంలో సైకిల్ ఛేజ్ కోసం ఇళయరాజా రూపొందించిన నేపథ్య సంగీతం ఇప్పటికి మర్చిపోలేనని ఆయన అన్నారు. ఇళయరాజాకు సెల్యూట్ అని వర్మ వ్యాఖ్యానించారు. వర్మ తొలి చిత్రం 'శివ'కు ఇళయరాజా సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
రౌడీ ఆడియో హైలెట్స్
-
రాం గోపాల్ వర్మ మారిపోయాడా?
బంధాలు, అనుబంధాలు, సెంటిమెంట్లకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరమని అభిమానులకు తెలిసిందే. అయితే అవన్ని రాంగోపాల్ జీవితంలో గతానికి మాత్రమే పరిమితమని తాజా సంఘటనలు చెబుతున్నాయి. రిలేషన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని రాంగోపాల్ వర్మ తాజాగా పూర్తిగా మారిన మనిషిగా కనిపిస్తున్నారు. మోహన్ బాబు నటించిన 'రౌడీ' చిత్ర ఆడియో అవిష్కరణ కార్యక్రమంలో వర్మ చాలా భిన్నంగా కనిపించారు... ప్రవర్తించారు కూడా.. ఎప్పుడూ ఎవరిని పొగిడిన దాఖలాలేని ఆయన దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులపై ప్రశంసల వర్షం కురిపించారు. టికెట్ కొనడానికి డబ్బులేని రోజుల్లో దాసరి నారాయణ రావు శివరంజని సినిమాను ఏడుసార్లు చూశాను అని.. దాసరి క్యారెక్టరైజేషన్ప్ స్టడీ చేయడం వల్లనే రియలిస్టిక్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తాననే పేరు తనకు వచ్చిందన్నారు. దాసరి నారాయణను చూసి తాను చాలా స్పూర్తి పొందానన్నారు. అంతేకాకుండా నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు .. నా మొట్టమొదటి ఫ్రెండ్ మోహన్ బాబు అని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో వర్మ మాట్లాడటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మోహన్ బాబు లుక్, ఫెర్మార్మెన్స్ నావెల్టీతో 'రౌడీ' చిత్రంలో అన్నగారి పాత్రలో జీవించారని.. నా డైరెక్షన్ లో గొప్పతనం ఏమి లేదని వర్మ అన్నారు. మోహన్ బాబు తనపై నమ్మకాని ఉంచినందుకు ధన్యవాదాలని ఎన్నడూ లేని విధంగా ఆడియో కార్యక్రమంలో ఓ కొత్త వర్మ కనిపించారు. వర్మ మనసులో దెయ్యాలు, గన్స్ ఉంటాయని ఫిక్స్ అయిన వారు ఆ ఒపినీయన్ మార్చుకోవాల్సిందే. ఎందుకంటే వర్మలో మానవత్వం కూడా ఉందనే కొత్త కోణం కనిపించింది. రౌడీ ఆడియో కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరుకావడం కూడా సినీ ప్రముఖులను ఆశ్చర్య పరిచింది. అవార్డులకు, సన్మానాలకు ఆమడ దూరముండే ఆయన రౌడీ ఆడియో కార్యక్రమంలో దండలు వేయించుకుని.. శాలువాతో సన్మానం చేసుకోవడం వర్మ ఆలోచన విధానంలో వచ్చిన మార్పే అని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. -
'తిరుమలలో రాజకీయాలు మాట్లాడను'
తిరుమల : సినీ నటుడు మోహన్‌బాబు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విష్ణుతో కలసి నటించిన 'రౌడీ' చిత్రం ఏప్రిల్‌లో అభిమానుల ముందుకు రానుందన్నారు. ఇద్దరిలో ఎవరి నటన బాగుంటుందో అభిమానులే తేల్చాలని మోహనబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని.. అవసరమైనపుడు మాట్లాడతానని ఆయన తెలిపారు. -
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రౌడీ
-
రౌడి-నీ మీద ఒట్టు సాంగ్
-
వర్మకు హేట్సాఫ్
‘‘సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ రషెస్ చూశాను. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వ ప్రతిభ, సాంకేతికంగా అతనికున్న అపారమైన అవగాహనకు హేట్సాఫ్. మంచి ఆరోగ్యంతో తను నిండు నూరేళ్లు బతకాలి’’ అని మోహన్‌బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ నటుడు ఎంత సంతృప్తి చెంది ఉంటే ఈ విధంగా అని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు నటించిన చిత్రం ‘రౌడీ’. ఇందులో విష్ణు కూడా నటించారు. భిన్న ధ్రువాల్లాంటి మోహన్‌బాబు, రామ్‌గోపాల్ వర్మ కలిసి ఓ సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించరు. అందుకే, ‘రౌడీ’ చిత్రం ప్రకటించినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసి, ఆశ్చర్యపోయారు. మోహన్‌బాబు సరికొత్త లుక్‌లో కనిపించడం, ఆయన కళ్లల్లో ఫైర్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. పైగా, ప్రచార చిత్రంలో ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది... వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది’ అనే డైలాగ్ ‘రౌడీ’పై మరింత హైప్ పెరిగేలా చేసింది. ఎప్పుడు ప్రారంభించారో ఎప్పుడు పూర్తి చేశారో ఎవరికీ తెలియనంత వేగంగా ఈ షూటింగ్ పూర్తి చేశారు. పార్ధసారథి, గజేంద్ర, విజయ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. పాటలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మోహన్‌బాబు సరసన జయసుధ, విష్ణు సరసన శాన్వీ నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: సతీష్. -
రామ్‌గోపాల్ వర్మ ''రౌడీ'' ట్రైలర్
-
రౌడీ ఫస్ట్ లుక్
-
రియలిస్టిక్ రౌడీయిజం
అసలు సిసలైన రౌడీయిజాన్ని తెలుగువాళ్లు తెరపై చూసింది ‘శివ’లోనే. జనాలు నాటకీయతను ద్వేషించడం, నిజాన్ని ఇష్టపడటం అప్పట్నుంచే మొదలైంది. గల్లీ రౌడీయిజం నుంచి ఢిల్లీ పేలుళ్ల వరకూ ఏదైనా సరే... రామ్‌గోపాల్‌వర్మ చూపిస్తే... అది వాస్తవానికి అద్దమే. అందుకే తెలుగువాడు గర్వించదగ్గ దర్శకుడయ్యారాయన. ‘నటనంటే... బిహేవ్ చేయడమే’ అంటారు వర్మ. అందుకే, అమితాబ్ లాంటి మహానటులు సైతం ఆయనతో పనిచేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. వర్మలో సత్తా ఇసుమంతైనా తగ్గలేదనడానికి ఆ మధ్య విడుదలైన ‘26/11’ సినిమానే ఉదాహరణ. సరైన కాన్సెప్ట్ పడితే... వర్మ మెరిసినట్లు ఎవరూ మెరవలేరు. ఇదిగో.. ఇక్కడున్న మోహన్‌బాబు ‘రౌడీ’ ఫస్ట్‌లుక్ చూడండి. మళ్లీ వర్మ మెరుపులు కనిపిస్తాయి. ‘రౌడీ’గా మోహన్‌బాబు కనిపించడం కొత్తేమీ కాదు కానీ... వర్మ సినిమాలో ఆయన రౌడీయిజం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. తన పాత్రను వర్మ తీర్చిదిద్దుతున్న తీరు అద్భుతమని మోహన్‌బాబు కూడా అంటున్నారు. మంచు విష్ణు మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకుంది. నిర్మాతలు పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘పెదరాయుడు, రాయలసీమ రామన్నచౌదరి తర్వాత మోహన్‌బాబు పూర్తిస్థాయి రౌద్రపూరితమైన పాత్ర చేస్తున్న సినిమా ఇది. విగ్ లేకుండా రియలిస్టిక్‌గా నటించారాయన. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మోహన్‌బాబుకు జోడీగా జయసుధ, విష్ణు సరసన శాన్వి నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీత దర్శకుడు. -
మోహన్ బాబుని రౌడీగా చూపిస్తోన్న రాము..?
-
వర్మ దర్శకత్వంలో రౌడీ
‘కలక్షన్ కింగ్’ అనే బిరుదుని డా. మోహన్‌బాబుకి స్థిరపడేలా చేసిన చిత్రాల్లో ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీగారి పెళ్లాం’కి ప్రముఖ స్థానమే ఉంటుంది. ఈ చిత్రాలు విడుదలై ఇరవయ్యేళ్లు పైనే అవుతున్నా, అందులో రౌడీ పాత్రలో మోహన్‌బాబు విజృంభించిన వైనం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. మరోసారి ఆయన రౌడీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి ఏ తరహా రౌడీగా రానున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు, విష్ణు కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఒట్టు’, ‘అన్నగారు’, ‘సీమ లెక్క’ తదితర టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారమైంది. కానీ, ఫైనల్‌గా ‘రౌడీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తండ్రీకొడుకుల అనుబంధంతో సాగుతుంది. మోహన్‌బాబు, విష్ణు తండ్రీకొడుకులుగా నిజజీవిత పాత్రలు పోషిస్తున్నారు. మంచి యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇదిలా ఉంటే, ఆల్రెడీ రౌడీ పేరుతో చేసిన రెండు బ్లాక్బస్టర్లను మోహన్‌బాబు సొంతం చేసుకున్నారు కాబట్టి, ఈ ‘రౌడీ’ కూడా ఆ ఖాతాలో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.