వర్మ దర్శకత్వంలో రౌడీ | Ram Gopal Varma - Mohan Babu Film Titled as 'Rowdy' | Sakshi
Sakshi News home page

వర్మ దర్శకత్వంలో రౌడీ

Published Thu, Feb 6 2014 12:04 AM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM

వర్మ దర్శకత్వంలో రౌడీ - Sakshi

వర్మ దర్శకత్వంలో రౌడీ

 ‘కలక్షన్ కింగ్’ అనే బిరుదుని డా. మోహన్‌బాబుకి స్థిరపడేలా చేసిన చిత్రాల్లో ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీగారి పెళ్లాం’కి ప్రముఖ స్థానమే ఉంటుంది. ఈ చిత్రాలు విడుదలై ఇరవయ్యేళ్లు పైనే అవుతున్నా, అందులో రౌడీ పాత్రలో మోహన్‌బాబు విజృంభించిన వైనం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. మరోసారి ఆయన రౌడీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి ఏ తరహా రౌడీగా రానున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు, విష్ణు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
 
  ఈ చిత్రానికి ‘ఒట్టు’, ‘అన్నగారు’, ‘సీమ లెక్క’ తదితర టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారమైంది. కానీ, ఫైనల్‌గా ‘రౌడీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తండ్రీకొడుకుల అనుబంధంతో సాగుతుంది. మోహన్‌బాబు, విష్ణు తండ్రీకొడుకులుగా నిజజీవిత పాత్రలు పోషిస్తున్నారు. మంచి యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇదిలా ఉంటే, ఆల్రెడీ రౌడీ పేరుతో చేసిన రెండు బ్లాక్‌బస్టర్లను మోహన్‌బాబు సొంతం చేసుకున్నారు కాబట్టి, ఈ ‘రౌడీ’ కూడా ఆ ఖాతాలో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement