రౌడీల ఆధిపత్య పోరు రోడ్డెక్కడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది.
విశాఖపట్నం: రౌడీల ఆధిపత్య పోరు రోడ్డెక్కడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. రౌడీషీటర్ రాజేష్ అనకాపల్లి జంక్షన్ లో బుధవారం రాత్రి తుపాకీతో హల్ చల్ చేశాడు. తన ప్రత్యర్థి దాడి కృష్ణపై తుపాకీతో కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. తుపాకీ పేలకపోవడంతో దాడి కృష్ణ ప్రాణాలతో బయటపడ్డాడు.
కాగా కృష్ణ వర్గీయులు అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రాజేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.